For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam దీప కొట్టిన దెబ్బకు.. బొక్కాబోర్ల పడ్డ మోనిత.. బిడ్డను కన్నడం వెనుక కుట్రలు బట్టబయలు

  |

  కార్తీకదీపం సీరియల్‌లో మోనిత పట్ల దీప ప్రవర్తిస్తున్న తీరు అందర్నీ కన్ఫ్యూజన్‌కు గురిచేస్తున్నది. మోనితతో వ్యవహరిస్తున్న తీరు చూసి డాక్టర్ భారతీ కూడా కంగారుపడిపోయింది. తన కుమారుడికి బారసాల చేయించే వేడుక చేసిన ఏర్పాట్లను చూసి .. మోనిత అరెంజ్‌మెంట్స్ బాగా చేశావు అని దీప అంటే.. ఏదో అంతా నీ చలువ వల్లే అంటూ మోనిత సమాధానం ఇచ్చింది. పక్కనే ఉన్న డాక్టర్ భారతీని చూసి.. ఏ డాక్టరమ్మ... మోనితకు డెలివరీ చేసింది నువ్వే కదా అంటూ దీప చలాకీగా ప్రశ్నించింది. పక్కనే ఉన్న ప్రియమణిని చూసి.. బాగున్నావా? మోనితను బాగా చూసుకోవాలి.

  ఈ బ్యాగ్‌ను జాగ్రత్తగా చూసుకో.. నేను అడిగినప్పుడు ఇద్దువు గానీ అంటూ తన చేతిలోని బ్యాగ్‌ను ప్రియమణికి ఇచ్చింది. బారసాల వేడుకలో మోనితను కంగారు పెడుతూ దీప అమలు చేసిన ప్లాన్ ఏమిటనే విషయం తాజా ఎపిసోడ్ 1205లో చూద్దాం..

  కార్తీక్‌, అత్తమామలను ఇంప్రెస్ చేయి అంటూ

  కార్తీక్‌, అత్తమామలను ఇంప్రెస్ చేయి అంటూ

  మోనితతో మాట్లాడుతూ.. ఏర్పాట్లు, వంటలు అన్నీ పూర్తయ్యాయా? అనీ దీప అడిగితే.. ఏర్పాట్లనీ బాగానే ఉన్నాయి. కానీ కేటరింగ్ వాడే హ్యాండ్ ఇచ్చాడు. దాంతో కొన్ని వంటలు కాలేవు అని మోనిత సమాధానం ఇచ్చింది. అయ్యో.. వంటల కాకపోతే ఎలా.. నీ కార్తీక్ వస్తున్నాడు. మీ అత్తగారు సౌందర్య వస్తున్నారు. వాళ్లకు ఇష్టమైన వంటలు చేసి పెట్టి వారిని ఆకట్టుకోవాలి.

  దానినే ఇంగ్లీష్‌లో ఏదో అంటారు అని ఆలోచిస్తుండగా.. పక్కనే ఉన్న డాక్టర్ ఇంప్రెస్ అంటారని చెప్పింది. అవును వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించు అని వంటలక్క సెటైర్ వేసింది. కేటరింగ్ రాకపోతే ఎందుకు టెన్షన్ పడిపోతావు మోనిత.. నేను వంట చేస్తాను అని దీప చెప్పింది. అయితే నీవు వంట చేస్తావా? అని మోనిత ఆశ్చర్యపోయింది. దాంతో వంట గది ఎక్కడో చెప్పు. నేను క్షణాల్లోచేసి పెడుతా. నీవు దీపక్క.. అక్క అంటావు కదా.. అలాంటి అక్కను నీకు సహాయం చేయవద్దా అంటూ మోనితను వంటగదిలోకి తీసుకెళ్లింది.

  దీప మీద ప్రేమతో రా అంటూ సౌందర్య

  దీప మీద ప్రేమతో రా అంటూ సౌందర్య

  బారసాల జరుగుతున్న మోనిత ఇంటి వద్దకు కార్తీక్, సౌందర్య, ఆనందరావు చేరుకొన్నారు. కారు ఆగిన తర్వాత కార్తీక్ అసహనంతో.. అమ్మా.. మనం మోనిత ఇంటికి వెళ్లడం ఏమిటి? వెనక్కి తిరిగిపోదాం. మోనిత చేసే కుట్రలను చూస్తూ భరించలేం అని కార్తీక్ అంటే.. మనం వచ్చింది కేవలం దీప కోసమే. దీప రమ్మని చెప్పింది. మనం వచ్చాం. ఇది దీపకు మనం ఇస్తున్న గౌరవం లేదా నా పెద్ద కోడలు మీద ఉన్న ప్రేమ అనుకో.

  నాతో వచ్చేయ్.. నా మీద గౌరవం ఉంటే రా.. లేకపోతే వెనుక్కి వెళ్లిపో అంటూ సౌందర్య ఎమోషనల్‌గా చెప్పింది. దాంతో కార్తీక్ తప్పనిసరి పరిస్థితుల్లో మోనిత ఇంట్లోకి అడుగుపెట్టారు. మోనిత ఇంట్లోకి వెళ్తూ ఉంటే.. డ్రైవర్ వారణాసిని కార్తీక్ చూసి.. ఏం వారణాసి.. దీప వచ్చిందా అంటే..అవును డాక్టర్ బాబు.. బ్యాగ్‌తో సహా వచ్చింది. దీపక్క ఎక్కడికో వెళ్లిపోయేలా ఉంది. అదే నాకు చాలా భయంగా ఉందంటూ ఏడుస్తూ వారణాసి చెప్పాడు. దాంతో ఊరుకో వారణాసి.. ఏం జరుగదు అంటూ కార్తీక్ ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించాడు. దీప ఎక్కడికి వెళ్తుందో నేను చూస్తాను అంటూ మోనిత ఇంట్లోకి అడుగుపెట్టాడు.

  కార్తీక్‌ను చూసి షాక్ అయిన డాక్టర్ భారతీ

  కార్తీక్‌ను చూసి షాక్ అయిన డాక్టర్ భారతీ

  తన ఇంట్లో జరిగే బారసాల వేడుకకు వచ్చిన సౌందర్య, కార్తీక్, ఆనందరావును చూసి మోనిత, ప్రియమణి, డాక్టర్ భారతీ షాక్ గురయ్యారు. అయితే మీరు రారని మోనిత కంగారు పడుతున్నది అని దీప సమాధానం చెప్పింది. అయితే వారు గుమ్మంలో నిలబడి ఉండటంతో ఆహ్వానించు మోనిత అంటూ చేతిలో గరిటెతో దీప కనిపించింది.

  చేతిలో గరిటే ఉండటంతో కార్తీక్ కోపంతో ఊగిపోయాడు. నీవు వంట చేయడం ఏమిటి అంటూ దీప చేతిలోని గరిటేను కార్తీక్ కిందకేసి కొట్టాడు. దీప నీకు ఏమైంది. నీవు ఇక్కడికి రావడం ఏమిటి అంటూ కోపగించుకొన్నాడు. అయితే దీపను చూసి.. మోనిత మనసులో అనుకొంటూ.. దీప వెళ్లిపోవడానికి డిసైడ్ అయినట్టు ఉంది. పాపం దీపక్క నాకోసం చాలా త్యాగం చేస్తున్నది అనుకొంటూ మోనిత నిలబడింది.

  ఉయ్యాలలో బిడ్డను వేసిన మోనిత

  ఉయ్యాలలో బిడ్డను వేసిన మోనిత

  అయితే మోనిత.. బాబుకు బారసాల ఫంక్షన్ జరిపించు. వచ్చిన వాళ్లు అందరూ వెయిట్ చేస్తున్నారు. బాబును తీసుకొచ్చి ఉయ్యాలలో వేయండి అని అంటే.. పెద్దవాళ్లు అత్తయ్య చేతుల మీదుగా వేస్తే బాగుంటుందని మోనిత చెప్పింది. అయితే ప్రియమణి బిడ్డను తీసుకొచ్చి మోనితకు ఇవ్వడంతో.. సౌందర్య వద్దకు వెళ్లి అత్తయ్య అంటూ చూసింది. దాంతో సౌందర్య కోపంగా చూడటంతో మోనిత వెళ్లి బాబును ఉయ్యాలలో వేసింది. దాంతో మీరు అనుకొనే పేరును చెవిలో చెప్పండి అంటే.. ఆనందరావు అంటూ మోనిత చెప్పింది. అంతలోనే మోనిత మెడలో తాళి కనిపించడంతో అందరూ షాక్ గురయ్యారు.

  నేను నీకు అక్కను ఎలా అవుతా?

  నేను నీకు అక్కను ఎలా అవుతా?

  అంతలోనే మోనితను చూస్తూ.. నీ ఫ్యామిలీని అందరికి పరిచయం చేయమని దీప చెప్పింది. దాంతో సౌందర్యను చూసి అత్తయ్య.. కార్తీక్‌ను చూసి మా ఆయన.. ఆనందరావును చూసి మామయ్య గారు అంటూ సమాధానం చెప్పింది. దాంతో అందర్నీని పరిచయం చేశావు కానీ.. నన్ను పరిచయం చేయలేదు అని దీప అంటే.. మా అక్క అని మోనిత సమాధానం చెప్పింది. దాంతో అక్కని ఇంత సింపుల్‌గా అంటే ఎలా.. మా పెద్దమ్మ కూతురివా? చిన్నమ్మ కూతురివా? నా తోడపుట్టిన దానివా? లేదా ఇంకా ఏదైనా వరుసలో అక్కనా? నీకు అక్కను ఎలా అయ్యాను అంటూ దీప తనదైన శైలిలో ప్రశ్నలు వేసింది. అని దాంతో దీపక్క ఏంటి సడెన్‌గా గేర్ మార్చిందని ఆశ్చర్యపోయింది.

  మోనిత కృత్రిమ గర్బధారణ కుట్రలు

  మోనిత కృత్రిమ గర్బధారణ కుట్రలు

  అయితే దీపను చూస్తూ.. పూజారి ఇంతకు ఎవరు ఈవిడ అని అడిగితే.. కార్తీక్ సమాధానం ఇస్తూ.. దీప నా భార్య, నా అర్ధాంగి, నా జీవితం అంటూ కార్తీక్ చెప్పాడు. దాంతో నీవు ఆమెకు భర్త అయితే.. ఈమె ఎవరు అంటూ మోనితను చూసి పూజారీ అడిగాడు. దాంతో మోనిత కంగారు పడింది. ఇంతకు మోనిత ఎవరో నేను చెబుతా? అని దీప అంటే.. ఇప్పుడు అవన్నీ ఎందుకు అంటూ మోనిత అడ్డుపడింది. దాంతో దీప వెళ్లి మోనిత కృత్రిమ గర్బధారణ విషయం గురించి పూజారి చెవిలో ఏదో చెప్పింది.

  దొంగతనంగా శాంపిల్స్ కొట్టేసి..

  దొంగతనంగా శాంపిల్స్ కొట్టేసి..

  పూజారితో చెబుతూ అలా జరిగింది అని దీప చెప్పింది. ఇంకా చాలా మలుపులు ఉన్నాయి. చాలా విషయాలు బయటకు రావాల్సినవి చాలా ఉన్నాయి. జరిగినవి ఇలా ఉంటే.. జరుగుతున్నవి చాలా ఉన్నాయి. 30 రూపాయలు పెట్టి పసుపు తాడు కొని మెడలో తాళిగా వేసుకొన్నది. అది తాళి ఎలా అవుతుంది పూజారి గారు.. దొంగ సాక్షాలు సృష్టించడం, దొంగతనం చేయడం, దొంగతనంగా శాంపుల్స్ కొట్టేయడం అంటూ మోనిత బండారాన్ని బయటపెట్టింది. దాంతో అందరూ షాక్ గురయ్యారు.

  Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
  దొంగ సాక్ష్యాలను బయటపెట్టిన దీప

  దొంగ సాక్ష్యాలను బయటపెట్టిన దీప

  తాజా ప్రోమోలో మోనితను దీప మరింత ఇబ్బందుల్లో పడేసింది. కార్తీక్ వల్ల తల్లిని అయ్యాను. ఓ రోజు కార్తీక్ బాగా తాగి వచ్చి అంటూ మోనిత చెప్పబోగా దాంతో నోర్మూయ్ అంటూ దీప ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడే నీ చెంప పగలగొడుతాను. ఏది నిజమో.. ఏది అబద్దమో బయటపెడుతాను. దొంగ గర్బానికి కారణం ఇవే అంటూ ప్రియమణి తెచ్చిన బ్యాగులో నుంచి రిపోర్టులను బయటపెట్టింది. దాంతో అందరూ షాక్ గురయ్యారు. రేపటి ఎపిసోడ్‌లో మోనిత కుట్రలను సాక్ష్యాలతో బయటపెట్టే అవకాశం ఉండటంతో కార్తీకదీపం సీరియల్ మరింత ఆసక్తిగా మారింది.

  English summary
  Highest rated Telugu serial Karthika Deepam's November 24th Episode number 1205
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X