Karthika Deepam విశ్వరూపం చూపించిన వంటలక్క.. దీప దెబ్బకు మోనిత విలవిల

కార్తీక్ కుటుంబాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్న మోనిత కుట్రలకు దీప అడ్డుకట్ట వేయడంతో కార్తీకదీపం సీరియల్‌ మరో మలుపు తిరిగింది. అక్రమంగా గర్భం దాల్చిన విషయం దీప బయటపెట్టడంతో మోనిత నీళ్లు నమిలింది. దాంతో బారసాల జరగకుండానే ఆగిపోయింది. అయితే సినిమా ఇంకా ఆగిపోలేదంటూ కార్తీక్ కుటుంబాన్ని మోనిత హెచ్చరించింది. తాజా ఎపిసోడ్ నవంబర్ 25వ తేదీన ప్రసారమైన ఎపిసోడ్‌ 1206‌లో ఏం జరిగిందంటే..

చిట్టి చెల్లికి ఎన్ని విద్యలో అంటూ దీప

చిట్టి చెల్లికి ఎన్ని విద్యలో అంటూ దీప

దొంగ పనులు, దొంగ సాక్ష్యాల సృష్టించడం, దొంగతనంగా ల్యాబ్ నుంచి శాంపిల్స్ కొట్టేయడం ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తావు అంటూ మోనితను కడిగిపడేసింది. అబ్బో మా చిట్టి చెల్లిలికి ఎన్ని విద్యులు తెలుసో అంటూ దీప బండారం బయటపెట్టింది. ఏంటి దీపక్క.. ల్యాబ్ ఏంటి? దొంగతనం ఏమిటి? అన్నీ అబద్దాలు చెబుతున్నావు అంటూ మోనిత కంగారు పడిపోయింది. మంగళ సూత్రం నేనే కట్టుకొన్నాను. సమాజంలో గౌరవం కోసం నేనే కట్టుకొన్నాను. ల్యాబ్‌లో దొంగతనం అనేది అబద్దం. కార్తీక్ వల్లే తల్లిని అయ్యాను. ఒక రోజు బాగా తాగి వచ్చి అని మోనిత అంటే.. నోర్మూయ్ అంటూ దీప చేయి లేపింది.

బస్తీకి వెళ్తానని అనుకొంటున్నావా?

బస్తీకి వెళ్తానని అనుకొంటున్నావా?

మోనిత అబద్దాలు చెప్పడంతో సహించలేని దీప ఆగ్రహం వ్యక్తం చేసింది. మోనిత అబద్దాలు చెప్పడం ఆపు. డాక్టర్ బాబుపై నిందలు వేయకు. అలా చేస్తే ఊరుకొనేది లేదు. ఏమనుకొంటున్నావు? బారసాలకు పిలిస్తే.. బాబును ఆశీర్వదించి.. నీవు పెట్టిన స్వీట్లు తిని.. చాటుకువెళ్లి కళ్ల నీళ్లు పెట్టుకొని.. నా బతుకు ఇదే అని బస్తీకి వెళ్తానని అనుకొన్నావా? నేను అబద్దాలు చెబుతున్నానా? ఇప్పడే నేను నిజమేమిటో నిరూపిస్తా.. ప్రియమణి ఆ బ్యాగ్ తీసుకురా అంటూ దీప ఆర్డర్ వేసింది.

నీకు కొత్త శిక్షలు అనుభవించాల్సిందే..

నీకు కొత్త శిక్షలు అనుభవించాల్సిందే..

మోనితను కడిగిపడేస్తూ.. మోనిత నీవు అబద్దం.. నీ జీవితం అబద్దం.. జైలుకు వెళ్లి వచ్చినా నీ బుద్ది మారలేదు. అయినా నీకు శిక్ష మిగిలే ఉంది కదా.. దానికి తోడు కొత్త తప్పులు కలిపి శిక్ష అనుభవించేదుకు రెడీ అవ్వు అంటూ మోనిత వార్నింగ్ ఇచ్చింది. అంతలోనే ప్రియమణి బ్యాగ్ తీసుకురావడంతో తీసుకొని.. బ్యాగ్‌తో వచ్చింది.. ఇటు నుంచి బస్తీకి వెళ్లిపోతావని అనుకొన్నావా? ల్యాబ్ ఓనర్ రాజారావు ఇచ్చిన లెటర్ ఇది అంటూ మోనితకు దీప చూపించింది. కార్తీక్‌తో సహజ గర్భం దాల్చాను. ల్యాబ్ నుంచి శాంపిల్స్ తీసుకోలేదు. రాజారావు చెప్పినదంతా అబద్దం అని మోనిత బుకాయించింది.

రాజారావు వీడియో సాక్ష్యంతో బట్టబయలు

రాజారావు వీడియో సాక్ష్యంతో బట్టబయలు

అయితే నీకు దిమ్మతిరిగే సాక్ష్యం ఇస్తానంటూ.. ఫోన్‌లో ల్యాబ్ ఓనర్ రాజారావు చెప్పిన వీడియో సాక్ష్యాన్ని వినిపించింది. మోనిత లక్షలు ఇస్తానంటే నేను శాంపిల్ ఇచ్చాను అంటూ రాజారావు చెప్పాడు. దాంతో ఇప్పుడు చెప్పు చిట్టి చెల్లి.. ఇది అబద్దమా? నిజమా. కార్తీక్ నీకు శ్రీవారు.. వీళ్లు నీకు అత్తమామాలు అని దీప కడిగేసింది. దాంతో అవమాన భారాన్ని భరించలేక వచ్చిన గెస్టులందరిని వెళ్లిపోమని కేకలు వేసింది. దాంతో బారసాలకు వచ్చిన అతిథులు అందరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు.

నేను మోనిత.. ఏం చేస్తానో ఊహించలేరు అంటూ

నేను మోనిత.. ఏం చేస్తానో ఊహించలేరు అంటూ

ఆపై దీపతో మోనిత మాట్లాడుతూ.. ఇంతటితో అయిపోయిందని అనుకోకు.. నా ప్రేమ అనంతం. అందరూ కలిసిపోయారని సంబరపడకండి.. సినిమా అయిపోలేదు. నేను ఏం చేస్తానో మీరు ఊహించలేదు అంటూ మోనిత హెచ్చరించింది. దాంతో. పక్కనే ఉన్న సౌందర్య వచ్చి మోనిత చెంప పగలకొట్టింది. ఏం చేస్తావే.. నా కోడలిని ఏమీ చేయలేదు. నా కోడలు బంగారం. నీ క్రిమినల్ ఆలోచనలతో ఎన్ని వెధవ వేషాలు వేసిన అన్నింటిని కనిపెట్టింది. ఇకనైన మనిషిలా బతుకు అంటూ హెచ్చరించింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Sarayu ఎలిమినేషన్.. జంటల రొమాన్స్ అదుర్స్ !! || Filmibeat Telugu
మీ ఖేల్ ఖతం... లాయర్‌తో కుట్రలు

మీ ఖేల్ ఖతం... లాయర్‌తో కుట్రలు

బారసాల వేడుక నుంచి వెళ్లిపోతున్న కార్తీక్, దీప కుటుంబ సభ్యులను మరోసారి మోనిత హెచ్చరించింది. ఇక్కడ మోనిత.. మోనిత ఇక్కడ ఇదిగో మీ జీవితాలు తలకిందులు అయిపోతాయి. మీ ఖేల్ ఖతం. వారం రోజుల్లో మీ పని అయిపోతుంది అని మోనిత హెచ్చరించింది.

దాంతో మోనితను చూసి సౌందర్య, మోనిత నవ్వుకొని అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే అవమాన భారాన్ని భరించలేక మోనిత పిచ్చిగా కేకలు వేసింది. ఇక బారసాల వేడుకలో దీప ఇచ్చిన స్ట్రోక్‌కు మోనిత మరో కుట్రకు తెరలేపింది. లాయర్‌ను పిలిచి ఏదో కుట్రకు మరోసారి సిద్ధమైంది. లాయర్ ఇంటికి రావడంతో మోనితపై ప్రియమణి అసహనం వ్యక్తం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X