Karthika Deepam డాక్టర్ బాబుకు మళ్లీ పెళ్లి.. పెళ్లిమంటపంలో ట్విస్టు ఇచ్చిన మోనిత

కార్తీకదీపం సీరియల్‌లో చకచకా అనేక మలుపులు తిరిగాయి. రుద్రాణి వేధింపులకు గురవుతున్న సమయంలో కార్తీక్ తల్లి సౌందర్య ఎంట్రీ ఇచ్చి వారిని ఆదుకొన్నది. తన కొడుకు ఫ్యామిలీకి నచ్చ చెప్పి తాడికొండ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చింది. తాడికొండలోని డాక్టర్ అంజలి ఇంటిలో ఫంక్షన్‌కు వెళ్లిన మోనిత.. కార్తీక్‌ను చూసిన తర్వాత వెతకడం ప్రారంభించింది.

ఇక తన ఇంటిలో ఆనంద క్షణాలను ఆస్వాదిస్తున్న సమయలో కార్తీక్, దీప వివాహాదినోత్సవం కావడంతో ఇంటిలో వేడుకలకు ఏర్పాటు చేశాడు. తన చేతుల మీదుగా తన కొడుకు పెళ్లి కాలేదని భావించిన సౌందర్య.. కార్తీక్, దీప పెళ్లిని ఇంటిలో ఏర్పాటు చేసింది. ఇంకా సోమవారం నాటి 1275 ఎపిసోడ్‌లో ఇంకా ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయంటే?

మోనితకు ఆ విషయం చెప్పిన మహేష్

మోనితకు ఆ విషయం చెప్పిన మహేష్

ఇంటి నుంచి వెళ్లిపోతూ కార్తీక్ పడేసిన ఫోన్‌ను తీసుకొన్న తాగుబోతు మహేష్.. మోనిత ఇంటిలో పనిచేసే బస్తీ మహిళకు సొదరుడు కావడంతో అక్కడకు వెళ్లాడు. మోనిత ఇంటిలో కార్తీక్ ఫోటోను చూసిన మహేష్ ఇతను మీకు తెలుసా? అంటూ ప్రశ్నించడంతో తనకు జరిగిన అనుభవాలను చెబితే.. తాను ఫోన్‌లో మాట్లాడిన విషయాన్ని మహేష్‌కు చెప్పింది. అంతేకాకుండా నీ అకౌంట్‌లో డబ్బులు వేసేది కూడా నేనే అంటూ మోనిత చెప్పడంతో.. కార్తీక్ తన ఇంటికి వచ్చాడు అని చెప్పగానే.. మోనిత ఎగిరి గంతేసినంత పనైంది. వెంటనే కార్తీక్ ఇంటికి బయలు దేరింది.

పెళ్లి రోజున అందంగా ముస్తాబైన దీప

పెళ్లి రోజున అందంగా ముస్తాబైన దీప

పెళ్లి రోజు కావడంతో సౌందర్య ఇంటిలో ఆనందం వెల్లువెత్తింది. కార్తీక్, దీపను అందంగా ముస్తాబు చేశారు. దీప, కార్తీక్‌ను పెళ్లి కొడుకు, పెళ్లికూతురు మాదిరిగా అలంకరించారు. ఇంటిలో పెళ్లి మంటపాన్ని అందంగా తీర్చిద్దారు. వేదపండితుల సమక్షంలో తన చేతులు మీదుగా పెల్లి జరగలేదనే కోరికను తీర్చుకొనేందుకు కార్తీక్, దీప పెళ్లి తంతును మరోసారి సౌందర్య జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ పెళ్లికి తన సన్నిహితులను ఆహ్వానించారు.

డాక్టర్‌బాబుకు పెళ్లి చేసి ముచ్చట తీర్చుకొన్న సౌందర్య

డాక్టర్‌బాబుకు పెళ్లి చేసి ముచ్చట తీర్చుకొన్న సౌందర్య

తమ ఇంటిలో ఆహ్లాదకరంగా పెళ్లిని జరిపించేందుకు ఏర్పాట్లు చేసిన సౌందర్య హడావిడిని చూసి డాక్టర్ భారతీ దంపతులు ముచ్చటపడ్డారు. పెళ్లిపీటలపై కార్తీక్, దీప సిగ్గుపడుతూ కనిపించారు. అతిథులు, కార్తీక్, దీప పిల్లలు హిమ, శౌర్య ఆనందంలో మునిగిపోయారు.

పెళ్లి జరుగుతుండగా.. దీప కోసం ప్రత్యేకంగా చేయించిన మంగళసూత్రాన్ని పండితుడికి ఇచ్చి.. కార్తీక్‌తో తాళి కట్టించమని అడిగారు. పండితుడు మంత్రాలు వల్లిస్తుండగా దీప మెడలో కార్తీక్ తాళి కట్టారు. అదే క్షణంలో మోనిత అక్కడికి ఎంట్రీ ఇచ్చింది. కార్తీక్ తాళి కట్టడం పూర్తి కాగానే చప్పట్లు కొడుతూ అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకొన్నది. దాంతో అందరూ దిగ్బ్రాంతికి గురయ్యారు.

చప్పట్లు కొడుతూ మోనిత ఎంట్రీ

చప్పట్లు కొడుతూ మోనిత ఎంట్రీ

మోనిత చప్పట్లు కొడుతుంటే.. కార్తీక్, దీప నివ్వెరపోయి చూశారు. సౌందర్యలో కోపం, ఆందోళన కనిపించింది. డాక్టర్ భారతీ దంపతులు ఈవిడ ఇక్కడికి ఎందుకు వచ్చిందారా అన్నట్టు చూశారు. ఏంటి భారతీ.. మోనిత వచ్చింది? మళ్లీ గొడవ చేస్తుందా అంటూ భారతీ భర్త అడిగితే.. అవును.. నాకు అదే భయం కలుగుతున్నది అని భారతీ సమాధానం చెప్పింది. ఇలాంటి పరిస్థితుల మధ్య పెద్దవాళ్లు, అందరూ ఆశీర్వదించండి అంటూ పండితుడు చెప్పాడు. ఈ పరిస్థితిని నుంచి బయటకు వచ్చి.. అందరూ భోజనం చేయండి.. అంటూ సౌందర్య చెప్పింది.

డాక్టర్‌గా పనిచేయవచ్చని మెడికల్ అసోసియేషన్

డాక్టర్‌గా పనిచేయవచ్చని మెడికల్ అసోసియేషన్

కార్తీక్, దీప దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. నీకు నా తరఫు నుంచి గిఫ్ట్ ఇది అని డాక్టర్ భారతీ భర్త రవి ఓ కవర్‌ను అందించారు. అయితే ఏంటి ఈ ఫార్మాలిటీ అంటూ కార్తీక్ అంటే.. లేదు.. ఈ గిఫ్ట్ ఏమిటంటే.. నీవు ఈ రోజు నుంచి డాక్టర్‌గా పనిచేయడానికి ఇచ్చే లెటర్ ఇది అంటూ రవి చెప్పాడు. దాంతో కార్తీక్, దీప సంతోషంలో గురిఅయ్యారు. డాక్టర్‌గా మీరు పనిచేయడానికి ఇస్తున్న ఆర్డర్ ఇది అని రవి అంటే.. నిజమేనా అంటే.. అవును డాక్టర్ కార్తీక్ అంటూ రవి చెప్పారు.

మోనిత వల్లే నీకు నీవు డాక్టర్‌గా

మోనిత వల్లే నీకు నీవు డాక్టర్‌గా

అయితే గుండె ఆపరేషన్ సందర్భంగా పేషెంట్ మరణించడం వెనుక మీ తప్పు లేదని రుజువైంది. నీ తప్పు లేదని మెడికల్ అసోసియేషన్‌ వద్ద డాక్టర్ మోనిత బలంగా వాదించింది. ఆమె నీ కోసం చాలా పోరాటం చేసింది అని డాక్టర్ రవి చెప్పగానే.. అప్పటి వరకు కార్తీక్, దీప ముఖంలో ఉన్న ఆనందం చప్పున చల్లారిపోయింది. ఆ పరిస్థితి నుంచి బయటకు తెచ్చేందుకు.. రవి మాట్లాడుతూ.. ఏది ఏమైనా.. కంగ్రాట్స్ అంటూ రవి అన్నాడు. పక్కనే ఉన్న కార్తీక్ వద్దకు వచ్చి మోనిత కంగ్రాట్స్ కార్తీక్.. మెడికల్ అసోసియేషన్ హార్టీ వెల్‌కమ్ చెబుతున్నది. ఈ డాక్టర్ మోనిత కార్తీక్ కూడా హార్టీ వెల్‌కమ్ చెబుతున్నది అంటూ మోనిత స్వాగతించింది.

కార్తీక్ రెండొందల సార్లు తాళి కట్టినా..

కార్తీక్ రెండొందల సార్లు తాళి కట్టినా..

ఇక కార్తీక్‌తో మాట్లాడుతూ.. నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతావని అనుకొంటున్నావా? అసలు చెప్పను. నీవు దీప మెడలో ఒకటికి రెండు సార్లు తాళి కట్టావని బాధపడను. రెండుసార్లు కాదు. రెండొందల సార్లు తాళి కట్టిన నాలో ప్రేమ తగ్గదు.. మరింత పెరుగుతుంది అని కార్తీక్‌కు మోనిత షాక్ ఇచ్చింది. పక్కనే ఉన్న డాక్టర్ రవితో మాట్లాడుతూ.. కార్తీక్‌కు డాక్టర్‌గా పనిచేయడానికి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలియదా? ఆ విషయాన్ని చెప్పు రవి. అంటే.. అవును.. నేను చెప్పాను కదా.. డాక్టర్‌గా పనిచేయడానికి ఆమోదం లభించిందని ఎవరికి చెప్పకూడదని అనుకొన్నాం అంటూ రవి బదులిచ్చాడు.

క్రూర మృగం అహింస గురించి అంటూ దీప

క్రూర మృగం అహింస గురించి అంటూ దీప

డాక్టర్ రవి మాటలకు దీప అడ్డు పడింది.. అన్ని దార్లు మూసుకుపోయాక.. కొత్త నాటకం మొదలైందా? రవి గారు అంటూ రవిని దీప ప్రశ్నించింది. దాంతో నేను నిజాయితీగా కార్తీక్ మంచి కోసమే కష్టపడ్డాను అని మోనిత అంటే.. అవునా? నీవు నిజాయితీ, మంచి అంటే.. క్రూర మృగం అహింస గురించి చెప్పినట్టు ఉంది అని దీప ఎద్దేవా చేసింది. అంతలోనే సౌందర్య జోక్యం కలుగించుకొంటూ.. పిలువని పేరంటానికి వచ్చావు.. భోజనం చేసి కామ్‌గా వెళ్లిపో అని చెప్పింది. నాటకాలు ఆడటం నీకు కొత్త కాదుగా.. నిన్ను ఎవరూ నమ్మరు గానీ.. అత్తగారు చెప్పినట్టు భోజనం చేసి వెళ్లమని మోనితపై దీప సెటైర్ వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X