Bigg Boss Telugu week 11th elimination..నాగిని డ్యాన్సర్‌‌‌కు ఎలిమినేషన్ ముప్పు..టాప్ ఓటింగ్ ఎవరికి జరిగిందంట

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో కీలకమైన ఎలిమినేషన్ ప్రక్రియ జరుగబోతున్నది. టాప్ 5 కంటెస్టెంట్ జాబితాలో చోటుచేసుకొనే అవకాశాలపై తాజా ఎలిమినేషన్ తర్వాత 12వ వారం క్లారిటీ రాబోతున్నది. వచ్చే వారం బిగ్‌బాస్ షోలో కీలకంగా మారడంతో తమ అభిమాన కంటెస్టెంట్లను కాపాడుకోవడానికి ఫ్యాన్స్ భారీగా ఓటింగ్‌కు పాల్పడ్డారు. దీంతో ఈ వారం కంటెస్టెంట్ ఎలిమినేషన్‌లో కీలక పరిణామం చోటుచేసుకొన్నదనే విషయం బయటకు వచ్చింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 11వ వారం నామినేషన్‌లో 8 మంది

11వ వారం నామినేషన్‌లో 8 మంది

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో 11వ వారం నామినేషన్ విషయానికి వస్తే. ప్రస్తుతం వారంలో 8 మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్‌లో ఉన్నారు. కెప్టెన్ యాంకర్ రవి తప్ప మిగితా వారందరూ నామినేషన్‌లోకి వచ్చారు. మానస్, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంతు, ప్రియాంక సింగ్, సింగర్ శ్రీరామచంద్ర, అనీ మాస్టర్, ఆర్జే కాజల్ నామినేషన్‌లో ఉన్నారు.

టాప్ కంటెస్టెంట్లు బరిలో ఉండటంతో

టాప్ కంటెస్టెంట్లు బరిలో ఉండటంతో

బిగ్‌బాస్ షోలో నామినేషన్ ప్రక్రియలో టాప్ కంటెస్టెంట్లు ఉండటంతో భారీగా ఓటింగ్ నమోదైందని తెలిసింది. గత వారాలతో పోల్చుకంటే ఈసారి అత్యధికంగా ఓట్లు వచ్చాయి. హాట్ స్టార్ యాప్‌లో ఓటింగ్, మిస్డ్ కాల్ డేటాలోనే భారీగా పెరుగుదల కనిపించింది. దాంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠకు తెరలేపింది.

11వ వారం భారీగా ఓటింగ్

11వ వారం భారీగా ఓటింగ్

అయితే తాజా సమాచారం ప్రకారం.. 11వ వారంలో అత్యధికంగా ఓట్లు సంపాదించుకొన్న జాబితాలో వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్ ఉన్నట్టు సమాచారం. అయితే దాదాపు వీజే సన్నీ 80వేలకు పైగా ఓట్లు సంపాదించకొన్నట్టు అనధికార లెక్కలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో మిగితా కంటెస్టెంట్లు నిలిచారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది.

టాప్‌ రేంజ్‌లో కంటెస్టెంట్లు

టాప్‌ రేంజ్‌లో కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ తెలుగు 5 షో 11వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన ఓటింగ్ ప్రకారం.. వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంతు, సింగర్ శ్రీరామచంద్ర, మానస్, ఆర్జే కాజల్, ప్రియాంక సింగ్ టాప్ ఓటింగ్‌లో ఉన్నారు. శుక్రవారం డేటా ప్రకారం అనీ మాస్టర్ అతి తక్కువ ఓటింగ్‌ను నమోదు చేసుకొన్నారనే విషయం తెలిసింది.

అనీ మాస్టర్‌కు పొంచి ఉన్న ముప్పు

అనీ మాస్టర్‌కు పొంచి ఉన్న ముప్పు

ఇక తాజా ఓటింగ్ ప్రకారం.. బిగ్‌బాస్ నుంచి 11వ వారం అనీ మాస్టర్‌ ఎలిమినేట్ కావడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆమె ఇంటి నుంచి వెళ్లడానికి అంతా సిద్దమైందనే వార్తలు విశ్లేషకుల నుంచి వినిపిస్తున్నాయి. అయితే ఒకవేళ అనీ మాస్టర్ ఈ ఎలిమినేషన్ నుంచి తప్పించుకొంటే టాప్ 5లో చేరడానికి అవకాశాలు భారీగా ఏర్పడుతాయనే వాదన వినిపిస్తున్నది.

Recommended Video

Pushpa లో Samantha ఐటెం సాంగ్.. కండిషన్స్ అప్లై..! || Filmibeat Telugu
 11వ వారంలో కూడా మిస్డ్ కాల్ డేటా కీలకంగా

11వ వారంలో కూడా మిస్డ్ కాల్ డేటా కీలకంగా

అయితే 11వ వారం ఎలిమినేషన్‌ విషయానికి వస్తే.. చివరి నిమిషంలో ఏదైనా జరుగవచ్చు. ప్రతీ వారం జరిగినట్టే ఎలిమినేషన్ ప్రక్రియలో మిస్డ్ కాల్ డేటా కీలకంగా మారనున్నది. మిస్డ్ కాల్ డేటాలో అనీ మాస్టర్ భారీగా ఓట్లు సంపాదించుకొంటే ఆమె సేఫ్ అయి.. మరొకరు ఎలిమినేషన్ అయ్యే అవకాశం లేకపోలేదనే వాదనను తెరపైకి తెచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X