Brahmamudi April 11th episode: అపర్ణకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చిట్టి.. భార్యని ఇంట్లోంచి వెళ్లిపోమన్న రాజ్

ఇంట్లో వాళ్ళందరూ వెన్నెలకు, రాజ్‌కు పుట్టిన బిడ్డ అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజ్‌పై తల్లి, భార్య కావ్య అనుమానాలు పెరిగిపోయాయి. రుద్రాణి తన కొడుకును కంపెనీ ఓనర్ చేయాలని ప్లాన్ వేసింది. రాజ్ కళ్యాణ్ కి పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వటంతో కంపెనీకి ఎండి అవుతాడు కళ్యాణ్. రాజ్ చేసిన పనికి అపర్ణని సూటికోటి మాటలు అంటూ ఉంటారు ధాన్యలక్ష్మి, రుద్రాణి. వెన్నెలని పట్టుకునే ప్రయత్నంలో శ్వేత సహాయం తీసుకుంటుంది కావ్య.
ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 11వ తేదీ ఎపిసోడ్ 381 లో ఏం జరిగిందంటే..

రాజ్ మాటలు విని నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించు అంటుంది శ్వేత. నన్ను కావాలని బాధ పెట్టినట్లయితే నాకు ఈ సాయం చేయవు కదా, పర్వాలేదు కానీ ముందు అనుకున్నపని జాగ్రత్తగా జరిగే లాగా చూడాలి అంటుంది కావ్య.ఇప్పటినుంచి నేను ఈ పని మీదే ఉంటాను అంటుంది శ్వేత.మరోవైపు కొడుకు గురించి ఆలోచిస్తున్న భర్త దగ్గరికి వచ్చి నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదు.

Brahmamudi April 11th 2024

అయినవాళ్లు అంటే ధైర్యం ఉండాలి కానీ ఇలా సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టకూడదు, ఎవరు అయిన వాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో తెలియటం లేదు అంటుంది అపర్ణ. రాజ్ చేసిన పని వల్ల మనం ఏం మాట్లాడటానికి లేకుండా పోయింది అంటాడు సుభాష్. మీరు చూస్తూ ఊరుకోగలరేమో కానీ నేను ఊరుకోను అంటూ కోపంగా బయటికి వస్తుంది అపర్ణ. అప్పుడే కొడుకుని తీసుకొని వస్తున్న రాజ్ ని చూసి ఇంట్లో నా స్థానము, స్థాయి పడిపోయాయి నన్నేం చేయమంటావు అని అడుగుతుంది.

కుదిరితే క్షమించు లేదంటే భరించడం తప్పితే ఏమీ చేయలేము అని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజ్. ఆ తరువాత అప్పుడే ఇంటికి వచ్చిన కావ్యని గుమ్మం దగ్గరే ఆపి ఏం జరిగింది అని అడుగుతుంది చిట్టి. జరిగిందంతా చెప్తుంది కావ్య. నువ్వు అనుకున్నది సాధించే లోపు ఇల్లు ప్రశాంతంగా ఉండేటట్టుగా లేదు అపర్ణని సూటిపోటి మాటలతో ధాన్య లక్ష్మి, రుద్రాణి వేదిస్తున్నారు అంటుంది చిట్టి. బాధపడుతున్న అత్తగారి దగ్గరికి టీ, టాబ్లెట్ తీసుకొని వెళుతుంది కావ్య.

టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది కానీ ఏం చేస్తే ఈ ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది, నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇల్లు ముక్కలైపోవడం ప్రారంభించింది. అయినా ఈ ఇల్లు పట్టుకొని ఎందుకు వేలాడుతున్నావు నీకు నీ పుట్టింట్లో దిక్కులేదా అని కేకలు వేస్తుంది అపర్ణ. ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు, మీ తోటి కోడలు మీద, నీ ఆడపడుచు మీద నీ కోపాన్ని చూపించలేక ఏమీ అనదు కదా అని ఆ కోపాన్ని నీ కోడలు మీద చూపిస్తున్నావా.. అసలు అన్యాయం జరిగింది తనకి అయినా ఆమె భరిస్తుంది.

Twist in Brahmamudi serial April 11th Episode of 381 Here is full story

అలాంటి కోడల్ని అనటానికి నీకు ఎంత ధైర్యం ఇకమీదట అంటే ఊరుకునేది లేదు అని చెప్పి అపర్ణని అక్కడి నుంచి పంపించేస్తుంది చిట్టి. మరోవైపు కొడుకుల కోసం ఎదురుచూస్తున్న ధాన్య లక్ష్మీ, రుద్రాణి దగ్గరికి వస్తారు స్వప్న,అనామిక. ఆఫీసులో జరిగిందంతా చెప్పి ఎలాంటి కొడుకుల్ని కన్నారు ఇకమీదట వాళ్లకి క్యారేజీ కాదు కదా కాఫీ కప్పు కూడా ఇచ్చేది లేదు అని అత్తలకి చివాట్లు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

మరోవైపు గదిలోకి వచ్చిన భార్యతో నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళిపో, నేను మంచి వాడిని కాదు అంటాడు రాజ్. ఉన్నట్టుండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటుంది కావ్య. కింద మా అమ్మ నీతో మాట్లాడింది అంతా విన్నాను, అనమిక వాళ్లు కూడా నిన్ను ఎంతో అవమానిస్తున్నారు ఇదంతా ఎందుకు బ్రహ్మముడి విప్పుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని బాధగా చెప్తాడు.

వెళ్ళిపోతాను కానీ ఇలా కాదు, ఇప్పుడు కాదు, అనుకున్నది జరిగిన తర్వాత అప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోతాను. వెళ్లిన తరువాత ఈ ఇంటి గుమ్మం కూడా తిరిగి చూడను అని చెప్పి వెళ్ళిపోతుంది కావ్య. మరోవైపు ముస్తాబు అవుతున్న అనామిక భర్తని ఎలాగైనా బుట్టలో వేసుకొని తను అనుకున్నది సాధించాలి అనుకుంటుంది ఇంతలోనే తల్లి ఫోన్ చేసి డాడీ మీద ప్రెషర్ పెరిగిపోతుంది అప్పుల వాళ్ళు ఇంటి మీదికి వస్తున్నారు నువ్వు మాత్రం హాయిగా అత్తారింట్లో కాపురం చేసుకుంటున్నావా అని కేకలు వేస్తుంది.

Twist in Brahmamudi serial April 11th Episode of 381 Here is full story

ఇదేమైనా బొమ్మలాట అనుకున్నావా అనుకున్న వెంటనే అయిపోవడానికి, కళ్యాణ్ కి ఏమాత్రం అనుమానం వచ్చినా ఇకమీదట నన్ను నమ్మడు అంటుంది అనామిక. డాడీ ప్రెజర్ లో ఉన్నారని అలా మాట్లాడాను, నువ్వు చెప్పింది కూడా నిజమే కానీ పని త్వరగా అయ్యేలాగా చూడు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అనామిక తల్లి. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X