Brahmamudi April 9th episode: పెద్దల మాట పెడచెవిన పెట్టిన రాజ్.. కావ్య ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

రాజ్, కల్యాణ్ కుటుంబంలో కంపెనీలో అధిపత్య పోరాటం వారి మధ్య విభేదాలకు దారి తీసింది. ఇదిలా ఉండగా, ఓ చిన్నారిని ఇంటికి తీసుకు రావడంతో అందరూ రాజ్ కొడుకే అని ఫిక్స్ అయ్యారు. వెన్నెలకు, రాజ్‌కు పుట్టిన బిడ్డ అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజ్‌పై తల్లి, భార్య కావ్య అనుమానాలు పెరిగిపోయాయి. రుద్రాణి తన కొడుకును కంపెనీ ఓనర్ చేయాలని ప్లాన్ వేసింది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి.ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలెట్‌గా మిగిలాయి. ఇక ఏప్రిల్ 9వ తేదీ ఎపిసోడ్ 379 లో ఏం జరిగిందంటే..

మీరు ఆ బిడ్డ కోసం ఎంత గొప్ప కుటుంబాన్ని కోల్పోతున్నారు ఆలోచించుకోండి. ఆ బిడ్డ తల్లిని తీసుకొని రండి. మీరు చెప్పింది నిజమైతే నేనే పక్కకు తప్పుకుంటాను. అప్పుడు మీ స్థానం మీకు దక్కుతుంది, ఈ బిడ్డ కూడా దుగ్గిరాల వారసుడు అవుతాడు అని చెప్తుంది కావ్య.అప్పుడు రాజ్ తల్లీ మాట్లాడుతూ నాకు నీ భార్య నచ్చదు.

Brahmamudi serial April 9th

కానీ ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు చాలా కరెక్ట్.ఆ బిడ్డ కోసం మీ స్థాయిని నువ్వు దిగజార్చుకుంటున్నావు, ఇప్పటికైనా నిజాన్ని బయట పెట్టు లేదంటే ఆ బిడ్డని వదిలిపెట్టు అప్పుడు నీ స్థానం, నీ స్థాయి నీకు దక్కుతాయి అంటుంది. నేను నా స్థానం కోసం స్థాయి కోసం నా రక్త సంబంధాన్ని వదులుకోలేను, వాడిని అనాధను చేయలేను అంటాడు రాజ్. లాయర్ దగ్గర పేపర్లు తీసుకొని సంతకం చేయబోతూ ఉంటే సీతారామయ్య అడ్డుపడతాడు.

నీకు ఏమంత వయసు అయిపోయిందని బాధ్యతలు నుంచి తప్పుకుంటున్నావు, మన కంపెనీ కీ పేరు ప్రతిష్టలు ఉన్నాయి నువ్వు చేసే ఈ ఒక్క సంతకం వల్ల ఎంత అనర్థం జరుగుతుందో ఆలోచించావా.. కళ్యాణ్ కూడా నా మనవడే కానీ వాడికి అంత అనుభవం, వయసు లేదు. ఇంత పెద్ద బాధ్యతని చిన్న కుర్రవాడి మీద మోపడం భావ్యం కాదు అని మందలిస్తాడు. కళ్యాణ్ కూడా రాజ్ కి సంతకం పెట్టొద్దని చెప్తాడు నీ స్థాయి నీకు ఉండాలి అని చెప్తాడు.

కానీ రాజ్ నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు నాకు నా బిడ్డ ముఖ్యం అని చెప్పి ఫైల్స్ మీద సంతకం పెట్టి ఆ పేపర్స్ తీసుకొని కళ్యాణ్ దగ్గరికి వెళ్లి ఇది కవిత్వం కాదు,ఈ వ్యాపారంలో రసజ్ఞత గురించి వెతకొద్దు. ఇది వ్యాపారం మన చుట్టూ ప్రత్యర్ధులు మాటువేసి ఉంటారు మనం ఏమాత్రం రిలాక్స్ అయి ఉన్నా మనల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి జాగ్రత్త పడు అని చెప్పి తమ్ముడికి వ్యాపార మెలకువలు చెప్పి నీ మీద నమ్మకం లేని వాళ్ళకి నమ్మకం కలిగించు అని పేపర్స్ కళ్యాణ్ చేతిలో పెట్టి ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత కావ్య రాజ్ టెన్త్ క్లాస్ స్కూల్ ప్రిన్సిపల్ కి ఫోన్ చేసి అతనిని బ్రతిమాలి ఆ బ్యాచ్ అందరి ఫోన్ నెంబర్ల లిస్టు తీసుకుంటుంది. చాలామందికి ఫోన్ చేస్తుంది ఎవరు లిఫ్ట్ చేయరు. అందులో శ్వేత అనే నెంబర్ చూసి ఈమె నాకు తెలిసిన శ్వేత నేనా అనుకుంటూ ఆమెకి ఫోన్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేసిన శ్వేత తనకు తెలిసిన శ్వేత కావడంతో ఆనందపడుతుంది కావ్య. ఆమెకి విషయం చెప్పి త్వరలోనే నిన్ను కలుస్తాను అని చెప్తుంది.

అందుకు శ్వేత కూడా ఒప్పుకుంటుంది. మరోవైపు ఆఫీసుకు వచ్చిన కళ్యాణ్ ని ఎండి సీట్ల కూర్చోమంటాడు రాహుల్. ఇది ఎప్పటికీ నా సీటు కాదు, అన్నయ్య సీటే అని చెప్పి మరొక చైర్ తీసుకొని ఎండి సీట్ పక్కనే వేసుకుని కూర్చుంటాడు కళ్యాణ్. మీరు ఏం డి అయితే రాజ్ సార్ ఏమయ్యారు అంటుంది డిజైనర్. వస్తాడు కొంచెం పనిమీద ఆఫీసుకు రావడం కుదరటం లేదు అని చెప్తాడు కళ్యాణ్.

నాకు పనిలో అనుభవం లేదు కాబట్టి ప్రతి పని ముందుగానే చెప్పండి అని చెప్తాడు అలాగే అని స్టాఫ్ అక్కడినుంచి వెళ్ళిపోవటంతో రాహుల్ కళ్యాణ్ తో కబుర్లు చెబుదామని చూస్తాడు. మనం ఇక్కడికి వచ్చింది పనిచేయటానికి నువ్వు కూడా వెళ్లి నీ పని కానివ్వు అని చెప్పటంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాహుల్. నువ్వు పని చేస్తావంటే నేను నమ్మను, అనామిక మాట కాదనలేక ఆఫీసులో పెట్టుకున్నాను అనుకుంటాడు కళ్యాణ్. తరువాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X