Guppedantha Manasu: రిషిని అవమానించిన వసుధార.. ముఖం మీదే తలుపులు దడేల్‌మని కొట్టేసి!
రిషికి వసుధార ఫోన్‌లో మెసేజ్ చేసి మీ పెళ్లి ఎప్పుడూ అని అడుగుతుంది. అయితే వసుధార చేసిన మెసేజ్ వెనుక ఏంటి అర్ధం అని రిషి తికమక పడుతాడు. మళ్లీ వసుధారకు ఫోన్ చేస్తే స్విచ్చాఫ్ ఉండటంతో ఏం జరిగింది? ఎందుకు ఇలా మెసేజ్ చేసింది? అని రిషి ఆలోచనల్లో పడుతాడు. ఇలాంటి మరికొన్ని ఆసక్తికర విషయాలతో గుప్పెడంత మనసు సీరియల్ ఆగస్టు 19 తాజా ఎపిసోడ్ 846లో ఇంకా ఏం జరిగిందంటే?
దేవయాని తన భర్త వద్దకు వచ్చి ఏదో చెప్పడానికి ట్రై చేసి.. చెప్పలేకపోతుంది. దాంతో దేవయాని నీవు ఏదో చెప్పాలని అనుకొంటున్నావు. కానీ చెప్పలేకపోతున్నావు. నీ మనసులో ఉన్నదేదో చెప్పకూడదు అని దేవయానిని భర్త అడుగుతాడు. దాంతో శైలేంద్ర మన అబ్బాయి. అలాంటి అబ్బాయిని మీరు ముఖం మీదే తిట్టేయడం బాగాలేదు. మీరు అలా తిట్టినందుకు చాలా బాధపడుతున్నాడు. శైలేంద్రకు కాలేజీ, డీబీఎస్టీ వ్యవహారాలు తెలియవు కదా అని దేవయాని సర్ది చెప్పింది.

అయితే ఇక నుంచి నేను శైలేంద్రను ఏమీ అనను. కానీ ధరణి మన ఇంటి కోడలు. ఆమెకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలి. ఒకవేళ ధరణికి ఇబ్బంది వస్తే నేను సహించను. ఇంట్లో కొడుకు, కోడలు సుఖంగా ఉండే.. ఆ ఇళ్లు ఆనందంగా ఉంటుంది అని భర్త అంటే.. ఇక నుంచి శైలేంద్ర మంచి పనులు చేస్తాడు. చాలా మంచి పనులు చేస్తాడు అంటూ మనసులో వెటకారంగా అనుకొన్నది. ఇక నీవు మా వైపు ఉంటే.. డీబీఎస్టీ కాలేజీ మన గుప్పిట్లోకి వస్తుంది అని దేవయాని ప్లాన్ చేసింది. నీ వల్ల నా కల, నీ కొడుకు కల నెరవేరుతుంది.
వసుధార తన ఇంట్లో తన తల్లి ఫోటోను చూస్తూ ఉండటంతో తండ్రి వచ్చి.. ఏంటమ్మా అలా చూస్తున్నావు అంటే.. రుషి మనసులోకి ఏంజెల్ వచ్చినప్పటి నుంచి నేను ఈ ఫోటోను అక్కడి నుంచి తీసేద్దామని అనుకొంటున్నాను. ఎప్పటికప్పడు మరిచిపోతున్నాను. అదృష్టవశాత్తు డిస్ట్రబెన్స్‌లో అమ్మ ఫోటో చూడలేదు. చూసుంటే ఏం జరిగేదో అని వసుధార అంటే.. ఏమయ్యేది? నీ తల్లి లేదనే నిజం తెలిసేది. నీ తల్లి దూరమైందనే విషయాన్ని తెలుసుకొనే వాడు అని వసుధార తండ్రి అన్నాడు.

అయితే రిషికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం వల్లే అమ్మ దూరమైందనే విషం తెలుసుకొంటే.. ఇంకా అతడు బాధపడుతాడు. అందుకే ఈ ఫోటోను తీసేద్దామని అనుకొన్నాను. అమ్మతో రుణం తీరిపోయింది. అమ్మలేదని తెలిస్తే.. సానుభూతి పెరుగుతుంది. ఆ ప్రేమ వల్ల నా ప్రేమ ఫలిస్తుంది. కానీ సానుభూతి, దయ వల్ల ప్రేమ నిలబడదు. అందుకే నేను అమ్మ ఫోటోను దూరంగా పెడుతాను అని వసుధార చెప్పింది.
అయితే నీ ప్రేమను అర్ధం చేసుకోలేదు. బలవంతంగా మూర్ఖుడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకొన్నాను. ఆ దారుణం అప్పుడు జరుగలేదు అని తండ్రి అంటే.. అదే జరిగితే అమ్మకంటే ముందే నేను వెళ్లిపోయేదానిని అని వసుధార అంది. అంటే అలా అనకు. మీరు మరోలా అనకూడదు. వసుధార రషి గుండె చప్పుడు. మీరు ఈ విషయంలో కంగారు పడకండి. రిషి అంతా అర్ధం చేసుకొంటాడు అని తండ్రిని వసుధార ఓదార్చింది.

రిషిని విడిపోవడానికి కాలమే కారణమైంది. ఆ తర్వాత రుషిని కలువడానికి ఆ కాలమే కారణమైంది. ఇప్పుడు కూడా కాలమే మమ్మల్ని కలుపుతుంది అని వసుధార అని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దాంతో ఫోటోకు నమస్కరిస్తూ.. వసు, రిషి కలిసిపోయేలా ఆశీర్వదించు అంటూ వసుధార తండ్రి కంటతడి పెట్టింది.
ఫోన్ మెసేజ్ చూసి తికమకపడిన రిషి నేరుగా వసుధార ఇంటికి వచ్చాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే మీరు ఎలా పెళ్లి చేసుకొంటారని అడుగుతావు అని రిషి మనసులో అనుకొన్నాడు? దాంతో ఏదో ధైర్యంగా నిలదీయాలని వచ్చి ఉంటాడు అని వసుధార అనుకొన్నది. దాంతో మేడమ్ ఇంటిలోపలికి రావొచ్చా? అంటూ గడియారం చూస్తుంటే.. దిక్కుల చూడకుండా ఇంటిలోకి రావొచ్చా? అంటే దిక్కులు చూడటం లేదు. ఇప్పుడు సమయం ఎంత అని చూస్తున్నాను అని వసుధార ప్రశ్నించింది. దాంతో నేను టైమ్ చూసుకొని రాలేదు అని రిషి సమాధానం ఇచ్చాడు.
అయితే ఏదైనా పని ఉంటే కాలేజ్‌లో మాట్లాడుకొందాం అంటే.. నేను కాలేజీ విషయాలు మాట్లాడుకోవడానికి రాలేదు. మన విషయం మాట్లాడుకొవడానికి వచ్చాను అంటే.. ఏ విషయమైనా కాలేజ్‌లోనే మాట్లాడుకొందాం. మన గురించి ఏదేదో మాట్లాడుకొంటున్నారు. అందుకే వెళ్లమని చెబుతున్నాను. ముఖంపై తలుపు వేసే పరిస్థితి రావొద్దు అని వసుధార అంటే.. తలుపు బద్దలు కొట్టుకొని వచ్చైనా నేను మాట్లాడుతాను అంటుంటే.. ఏకంగా రిషి ముఖంపైనే వసుధార తలుపులు దడేల్ మనికొట్టింది. దాంతో చాలా పొగరు అంటూ కోపంతో రిషి వెళ్లిపోయాడు.

రిషి ఒక చోట ఆగి.. నా బాధను ఎవరికి చెప్పాలి? అంటూ తనలో తాను అనుకొంటుంటే.. నాకు చెప్పండి అంటూ వసుధార అక్కడికి వచ్చింది. దాంతో నీవు ఆ మెసేజ్ ఎందుకు చేశావు. ప్రపంచం తెలియని నాకు ప్రపంచాన్ని చూపించావు. ప్రేమ తెలియని నాకు ప్రేమను పంచావు. కానీ బాధ తెలియని నాకు ఇప్పుడు బాధలు చూపిస్తున్నావు. నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలా? గతాన్ని మరిచి మరొకరితో ఉండాలా? అంటూ వసుధారను రిషి నిలదీశాడు.


Click it and Unblock the Notifications











