Guppedantha Manasu డబ్బు దాచుకొన్నట్టు ప్రేమను దాచొద్దు.. వసుధారతో మహేంద్ర

రిషి కారు ముందు నిలుచొని నాకు ఎదురు వస్తే నిలదీస్తానని వసుధార అంటుంటే.. పక్క నుంచి రిషి రావడంతో వసుధార కంగారు పడింది. ఎదురుగా వస్తే నిలదీస్తానని చెప్పావుగా.. ఏమని నిలదీస్తావు అని రిషి ప్రశ్నించాడు. కారు పక్కన రిషి ఉండటం చూసి.. మీరు దాని వెనుక ఎందుకు ఉన్నారు? అని వసుధార అడిగితే.. నా కారు వద్ద నేను ఉన్నాను అని రిషి కౌంటర్ వేశాడు. గుప్పెండంత మనసు తాజా ఎపిసోడ్ 536 లో ఇంకా ఏం జరిగిందంటే..

డీబీ కాలేజ్‌లో పరీక్షలు వస్తుండటంతో రిషి అధ్వర్యంలో మీటింగ్ జరిగింది. పరీక్షల్లో గత సంవత్సరం కంటే ఎక్కువ ఫలితాలు రావాలంటే.. స్టడీ హవర్స్ ఎక్కువ చేస్తే బాగుంటుదేమో అంటే.. ఎక్కువ చదిపిస్తే.. ఎక్కువ మార్కులు వస్తాయని అనుకోవడం తప్పు అని జగతి చెప్పింది. ఆ తర్వాత రిషి రావడంతో ఇదే పాయింట్‌పై చర్చ జరిగింది. అయితే ఎక్కువ గంటలు చదివితే.. ఎక్కువ మార్కులు రావు. విద్యార్థులను ఎక్కువ ప్రశాంతంా ఉండేలా చూడాలి. కాబట్టి ఫేర్‌వెల్ పార్టీ అరెంజ్ చేయమని రిషి చెప్పడం సరే అన్నారు.

ఇక వసుధారతో రిలేషన్‌ గురించి రిషిని గౌతమ్ నేరుగా ప్రశ్నించాడు. ఆమెను నీవు ప్రేమిస్తున్నావు కదా.. అంటే.. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు అని రిషి సమాధానం చెప్పాడు. వసుధార విషయంలో నీవు చేసేది సరికాదు అని గౌతమ్ అంటే.. ఒక సమస్య వచ్చింది. దాని అంతటా అదే సాల్వ్ అవుతుంది. మా విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం అక్కర్లేదు అంటూ రిషి చెప్పాడు. దాంతో దయచేసి వసుధారను వదులుకోవద్దు. ఆమె చాలా మంచిదిరా అంటూ గౌతమ్ చెప్పాడు. అయితే రిషి మౌనంగా ఉన్నాడు. అయితే ఈ ఇద్దరి సంభాషణ విన్న వసుధార బాధతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Twist in Guppedantha Manasu Serial Today Episode 536 of August 23th

అయితే గౌతమ్, రిషి సంభాషణ విన్న తర్వాత నేరుగా అమ్మవారి వద్దకు వెళ్లి.. ఎవరు లేని వారికి నీవే దిక్కుగా నిలుస్తారు కదా.. నేను అందరిని వదులుకొని వచ్చాను. కాబట్టి నాకు కొంత ధైర్యం ఇవ్వు. నాకు అండగా ఉండమ్మా.. రిషి సంగతి నాకు తెలుసు. నాకు ఏ కష్టమొచ్చినా నీవద్దకే వస్తున్నా అని వసుధార అమ్మవారి ముందు ప్రార్థిస్తుంటే.. అక్కడికి వచ్చిన మహేంద్ర అంతా విన్నారు. దాంతో మహేంద్రను చూసి కంగారు పడిన అంతా విన్నారా అంటే.. కొంత విన్నాను.. కొంత వినలేదు అని అన్నారు. డబ్బు దాచుకొన్నట్టు కొన్ని విషయాలు మనసులో దాచుకోవద్దు. నీ గురించి నేను, జగతి ఆలోచిస్తున్నాం. మౌనం అన్ని సార్లు కరెక్ట్ కాదు అని మహేంద్ర అన్నారు.

అయితే ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను చూసుకొంటూ వసుధార ఆలోచనల్లో పడింది. పరీక్షలు ముగిసిన తర్వాత వసుధారను కలువడం కష్టమే. మీ బంధానికి బ్రేక్ పడుతుంది అని గౌతమ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకొని రిషి ఆలోచనల్లో పడ్డాడు. ఒకవేళ పరీక్షల తర్వాత వసుధార వెళ్లిపోతే ఎలా అని రిషి మదనపడటం కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X