Guppedantha Manasu దేవయానికి జగతి జబర్దస్త్ షాక్.. ఊహించిన విధంగా రిషితో!

రిషి ఫోటోను చూస్తూ అందమైన అనుభూతులు, అందమైన జీవితం అంటూ వసుధార మురిసిపోయింది. రిషి ఫోటోతో మాట్లాడుతూ.. రిషి సార్ ఏం చేస్తున్నారు అని మనసులో అనుకోగానే.. రిషి తన ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న కర్ఛిఫ్‌ను చూస్తూ.. వసుధార అనుక్షణం వెంటాడే అనుభూతివి. నాకు ఇలాంటి అనుభూతులు ఎందుకు ఇచ్చావు అని మనసులో అనుకొన్నాడు. అయితే కొత్తగా చేయించిన VR తో కూడిన ఉంగరాన్ని చూసి.. నీకు ఎప్పటికైనా చేరాలి అని వసుధార అన్నది. అయితే డీబీ కాలేజ్ ఫేర్‌వెల్ అంటూ ఓ తేదీని మార్క్ చేశాడు. ఫేర్ వెల్‌ ఎవరికి? నాకా? వసుధారకా? అంటూ రిషి ఎమోషనల్ అయ్యారు. గుప్పెడంత మనసు సీరియల్‌ తాజా ఎపిసోడ్ 537 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

డీబీఎస్టీ కాలేజ్ ఫేర్‌వెల్ గురించి జగతి, మహేంద్ర మాట్లాడుకొంటుంటే. ఏంటి ఫేర్‌వెల్ గ్రాండ్‌గా చేయిస్తున్నారా దేవయాని అంటే.. లేదు అని మహేంద్ర సమాధానం ఇచ్చారు. ఎవరో వెళ్లిపోతున్నారు కదా?? అదే వసుధార అంటే కాలేజ్.. కాలేజ్ అంటే వసుధార అనే బిల్డప్ క్రియేట్ చేశారు. అందుకోసం స్వీట్ చేయించాను అనగానే.. జగతి, మహేంద్ర ముఖాలు చూసుకొన్నారు. దేవయానికి సమాధానం చెబుతూ.. మనసులో విషం పెట్టుకొని స్వీట్స్ పెట్టడం ఎందుకు అని జగతి సమాధానం ఇచ్చింది.

 Twist in Guppedantha Manasu Serial Today Episode 537 of August 24th

అయితే నీవు రిషిని సార్ అని మాత్రమే పిలుస్తావు. రిషి అని కూడా పిలువలేవు. రిషి నీ కొడుకు అయినా నీవు నాలాగ నాన్న అని పిలువలేవు. నీకు ఉన్న అర్హత అది అని దేవయానికి దురుసుగా మాట్లాడింది. అంతలోనే రిషి రావడం, ధరణి చేతిలో కాఫీ కప్పు ఉండటం జగతి చూసింది. వెంటనే కాఫీ కప్పు తీసుకొని.. రిషి అని పిలిచింది. కాఫీ తాగు అంటూ కప్పును రిషి చేతిలో పెట్టింది. దాంతో దేవయాని, ధరణి షాక్ తిన్నారు. వెంటనే తేరుకొని జగతి ముఖంపై రిషి కాఫీ కప్పుతో కొట్టడం ఖాయం అనుకొన్నది. కానీ రిషి ఏ మాత్రం కోపం ప్రదర్శించకుండా కాఫీ తాగేందుకు ప్రయత్నించాడు. అంతలోనే ఫోన్ మోగితే.. రిషి ఫోన్ మోగుతుందని చెప్పింది. దాంతో ఏం చేయాలో తెలియక అటు ఇటు రిషి చూస్తుంటే.. చేతిలో కాఫీ తీసుకొన్నది. దాంతో ఫోన్ మాట్లాడుతూ.. బయటకు వెళ్లాడు. ఆ తర్వాత దేవయానిని చూసి.. ఇదన్న మాట అని జగతి షాకిచ్చింది.

 Twist in Guppedantha Manasu Serial Today Episode 537 of August 24th

అయితే ఫేర్‌వెల్ పార్టీకి కాలేజీలో హడావిడి జరిగింది. అయితే రిషిని వసుధారను కలిపేందుకు మహేంద్ర, గౌతమ్ ప్రయత్నించారు. ఫేర్‌వెల్ సభలో రిషి మాట్లాడుతూ.. జీవితంలో మీరు ఎక్కడికి వెళ్లినా మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఆలోచించండి. మీరు ఇతరులకు సహాయం చేయండి. మన బంధం తెగిన గాలిపటంలా ఉండకూడదు. మీకు క్లాస్‌లు చెప్పినప్పుడు మిమ్మల్ని కోపం చేసి ఉంటానేమో.. అరిచి ఉంటానేమో. కానీ అందంతా మీ మంచి కోసమే అని రిషి ఎమోషనల్ అయ్యారు. రిషి, జగతి, మహేంద్ర.. అందరూ మీరంతా మంచి స్థాయికి చేరుకోవాలి. పరీక్షలు బాగా రాయండి అని చెప్పారు. ఎవరైనా స్టూడెంట్స్ మాట్లాడాలనుకొంటే మాట్లాడవచ్చు అని అంటే.. అందరూ వసుధార అంటూ అరిచారు. దాంతో వసుధార స్టేజ్ పైకి వెళ్లి.. మాట్లాడేందుకు ప్రయత్నించింది. రిషిని చూసి ఎమోషనల్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X