Guppedantha Manasu నాటకాలు ఆడేవారంటే నాకు చికాకు.. పెద్దమ్మకు రిషి షాక్
సాక్షితో రిషి ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ తర్వాత జగతి, మహేంద్ర, గౌతమ్ పార్టీ చేసుకోవడానికి రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడికి వసుధార వెంటపెట్టుకొని రిషి రావడంతో షాక్ అయ్యారు. అయితే మీరు ఇక్కడికి రావడం ఏమిటి అంటే.. కేక్ కోసం అంటూ గౌతమ్ నోరు జారాడు. దాంతో కేక్ ఏమిటి అంటూ రిషి ప్రశ్నిస్తే.. కేకే రావు అనే ఫ్రెండ్‌ను కలువడానికి వచ్చాం అని మహేంద్ర అంటే.. కేకే రావు అనే ఫ్రెండ్ ఎవరూ లేరు కదా.. అంటూ రిషి ప్రశ్నించాడు. దాంతో ఇటీవలే ఫ్రెండ్ అయ్యాడు అని మహేంద్ర సర్దిచెప్పబోయాడు. అయితే గుప్పెడంత మనసు సీరియల్ 532 ఎపిసోడ్‌లో ఇంకా ఏ జరిగిందంటే..

పెద్దమ్మ కోసం భోజనం
ఇంటిలో భోజనం చేస్తుంటే.. డైనింగ్ టేబుల్ వద్ద పెద్దమ్మ దేవయాని కనిపించకపోవడంతో రిషి ఆమె ఎక్కడ అని అడిగారు. అయితే తన ఆరోగ్యం బాగా లేదని చెప్పడంతో.. నేను భోజనం తీసుకెళ్తానని చెప్పి ప్లేట్ తీసుకొని దేవయాని గదిలోకి రిషి వెళ్లాడు. రిషిని చూసి దేవయాని కంగారు పడిపోయింది. అయితే నీవు ఎందుకు భోజనం తెచ్చావు.. అంటే.. వేళకు భోజనం చేయాలి అంటూ అన్నం తినిపించాడు.

నాటకాలు ఆడే వారంటే..
అయితే నిజజీవితంలో నాకు నాటకాలు ఆడటం నచ్చవు. ఎవరైనా నాటకాలు ఆడితే నాకు చాలా కోపం వస్తుంది అని రిషి అంటే.. దేవయానికి కంగారు పడిపోయింది. ఇప్పుడు నాటకాల గురించి ఎందుకు రిషి అని దేవయాని ఏదో సర్ది చెప్పబోయింది. నేను నాటకాలు ఆడుతున్నానని గ్రహిస్తే.. నన్ను ఇంటి నుంచి తరిమివేస్తాడేమో అని దేవయానికి మనసులో భయం పెట్టుకొన్నది.

అమ్మ బంధం.. నీ హక్కు
ఇక దేవయానికి రిషి అన్నం తినిపించడం చూసి జగతి బాధపడింది. అలా బాధ పడుతుంటే మహేంద్ర వచ్చి ఊరడించారు. ఏదో ఒక రోజు మీ మధ్య బంధం దగ్గరవుతుంది. రిషితో నీ అమ్మ బంధం వరం కాదు. నీ హక్కు అని మహేంద్ర అంటే.. అది ఈ జన్మలో జరుగుతుందా అని అనుమానం వ్యక్తం చేసింది. దాంతో త్వరలోనే తప్పకుండా జరుగుతుంది అని మహేంద్ర అనడంతో జగతి ఆనందంలో మునిగిపోయింది.

రిషి సార్ అనకండి.. రిషి అని పిలవండి
ఇక వంటగదిలోకి వచ్చిన రిషి.. ధరణి అంటూ కాఫీ కోసం అడిగాడు. అయితే ధరణి లేదు.. అని కిచెన్‌లో జగతి సమాధానం చెప్పింది. రిషి సార్.. కావాలంటే నేను కాఫీ పెట్టిస్తాను అని అంటే..ఇక నుంచి మీరు నన్ను సార్ పిలవడం అపేయండి. రిషి అని పిలువండి అని చెప్పాడు. కొన్ని విషయాల్లో మీరు కరెక్ట్.. కొన్ని విషయాల్లో నేను కరెక్ట్. ఒకే విషయంలో తప్ప అన్ని విషయాల్లో మన అభిప్రాయాలు కలుస్తాయి. ఆ విషయం గురించి నేను మాట్లాడవద్దు అని నిర్ణయించుకొన్నాను. నేను మాట్లాడను కూడా అని రిషి ఎమోషనల్ అయ్యారు.

రిషి ప్రేమను చూసి జగతి హ్యాపీగా
జగతితో రిషి మాట్లాడుతూ.. మీకు ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఏం నచ్చుతుందో లేదో అనే విషయం మీకు తెలుసు అని నాకు తెలియదు. వసుధార కోసం ఎంతో చేశారు. తను తన చివరి లక్ష్యం అందుకోబోతున్నది. అప్పుడు కూడా మీరు సహకరించాలి. మీరు సహకరిస్తారని నాకు తెలుసు. ఇంతకంటే నేను ఏమీ చెప్పలేను అని రిషి అన్నాడు. రిషి చూపిన ప్రేమను చూసి జగతి హ్యాపీగా ఫీల్ అయింది. రిషి. నేను కాఫీ పెట్టిస్తాను అంటూ సంతోషంగా చెప్పింది. ఈ సంభాషణ చూసి మహేంద్ర కూడా సంతోషంగా ఫీలయ్యాడు.


Click it and Unblock the Notifications











