Guppedantha Manasu సాక్షిని పెళ్లి చేసుకోవడమేంటి? రిషిని నిలదీసిన వసుధార

సాక్షిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్న రిషి నిర్ణయంపై వసుధార కంగారు పడింది. రిషిని కలిసిన వసుధార మాట్లాడుతూ.. సార్ మీకు నేను సలహాలు ఇవ్వడానికి రాలేదు. కానీ మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోమని చెప్పాలని అనుకొంటున్నాను. సాక్షితో పెళ్లి ఎందుకు చేసుకోవాలని అనుకొంటున్నారో అర్ధం కావడం లేదు అని వసుధార చెప్పింది. అయితే కొన్ని విషయాల గురించి మాట్లాడకుంటేనే మంచిది అంటూ రిషి వెళ్లడానికి బయలుదేరాడు. అయితే కాఫీ తాగకుండానే వెళ్తున్నారు అంటే.. కాఫీ తాగాలనే వచ్చాను. కానీ తాగాలని అనిపించడం లేదు. అయితే జీవితంలో మనం అనుకొన్నవి అన్నీ జరగవు. నేను చెప్పేది కాఫీ గురించి అని రిషి అన్నాడు. గుప్పెడంత మనసు సీరియల్ తాజా ఎపిసోడ్ 524లో ఏం జరిగిందంటే..

తనను పెళ్లి చేసుకొంటానని చెప్పిన రిషికి చాలా థ్యాంక్స్ చెప్పింది. అయితే పెళ్లికి చాలా షాపింగ్ చేయాలి. మనమిద్దరం షాపింగ్ చేద్దాం అని సాక్షి అడిగింది. అయితే తనకు షాపింగ్ ఇష్టం లేదని రిషి తెగేసి చెప్పాడు. అయితే నీ పేరులో మొదటి అక్షరం.. R తో ఒక ఉంగరం.. నా పేరులోని మొదటి అక్షరం S తో మరో ఉంగరం చేయిస్తాను అని సాక్షి అంటే.. సరే.. నీవు చేయిస్తానని అంటే నేను కాదనను అని రిషి సమాధానం చెప్పాడు.

Twist in Guppedantha Manasu Serial Today Episode August 9th

అయితే వసుధార విషయంలో తర్జనభర్జన పడుతూ ఇంట్లో ఒంటరిగా ఉంటే.. తండ్రి మహేంద్ర వచ్చి.. మనం స్నేహితులుగా ఉండేవాళ్లం అని అంటే.. ఇప్పుడు కూడా స్నేహితులమే కదా.. అని అన్నాడు. అయితే ఇప్పుడు మన మధ్య దూరం పెరిగిపోయింది. నీవు సాక్షిని పెళ్లి చేసుకోవడం ఏమిటి? ఒకప్పుడు సాక్షి పేరు చెబితే మండిపడే వాడివి. ఇప్పుడు నీవు పెళ్లి చేసుకోవడం ఏమిటి.. నీవు ఎవరికి భయపడుతున్నావు. సాక్షి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకోవడం ఏమిటి అని మహేంద్ర అంటే.. మీరు అనుకొనివి జరగకపోతే .. ఏదో జరిగినట్టు బాధపడవద్దు. నా ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకొంటున్నాను అని రిషి చెప్పాడు. అయితే వసుధార సంగతి ఏమిటి? పెళ్లి పీటల మీద నుంచి పారిపోయి వచ్చి చదువుకోవాలనే లక్ష్యంతో వచ్చింది అని అన్నాడు.

అయితే నేను చాలా ప్రశ్నలు అడగాలని వచ్చాను. కానీ అడగకుండానే వెళ్లిపోతున్నాను అని మహేంద్ర అన్నాడు. అయితే నేను పెట్టుకొన్న అగ్ని పరీక్షలో విజయం సాధిస్తాను అనే నమ్మకం ఉంది అని రిషి తన మనసులో అనుకొన్నాడు.

Twist in Guppedantha Manasu Serial Today Episode August 9th

అయితే మరోవైపు అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్లి.. నేను ఏమి కోరుకొన్నాను. నీవు ఏం చేస్తున్నావు. నీకు పూజలు చేసత్.. నా కష్టాలన్నీ చెప్పుకొన్నాను. కానీ నీవు నా మొర ఆలకించలేదు. ఎవరు ఎన్ని పరీక్షలు పెట్టినా నేను ధీటుగా ఎదుర్కొంటాను. ఇందులో నేను ఎలా గెలువాలో నాకు తెలుసు. రిషి సార్ నన్ను దూరంగా పెడుతున్నాడని అనుకోను. కానీ పరిస్థితులే నన్ను కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి అని వసుధార ఆవేదన చెందింది.

అయితే రిషి తన ఫోన్‌కు సమాధానం ఇవ్వకపోవడంతో సాక్షి నేరుగా అతడి రూమ్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో వసుధార ఫోటోను తన ఫోన్‌లో చూస్తూ సాక్షికి కనిపించాడు. సరాసరి అతడి వద్దకు వెళ్లి సాక్షి ఫోన్ లాక్కొన్నది. అయితే నా ఫోన్ లాక్కోవడం ఏమిటి అంటే.. మన పెళ్లి జరుగుతున్నది. నీవు వసుధార ఫోటోను చూడటం ఏమిటి సాక్షి అంటే.. నువ్వెవరు నన్ను వార్నింగ్ చేయడమేమిటి? నా రూమ్‌లోకి పర్మిషన్ లేకుండా వస్తావా? ఎవరైనా పర్మిషన్ లేకుండా నా రూమ్‌లోకి రావొద్దు.. వెంటనే బయటకు వెళ్లు అంటూ రిషి వార్నింగ్ ఇచ్చాడు. దాంతో రూమ్ బయటకు వెళ్తుంటే.. వసుధార ఎదురు పడింది. దాంతో నీవు ఎందుకు వచ్చావు. నీవు వచ్చాకే మా మధ్య సమస్యలు వచ్చాయి. అంతా నీవల్లే జరుగున్నది. వెళ్లిపో వసుధార అంటూ సాక్షి కోపంతో ఊగిపోయింది. అంతలోనే రిషి అక్కడకు వచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X