Don't Miss!
- News
అదే జాబితాలో అక్కినేని నాగార్జున కూడా- కేటీఆర్‌కు థ్యాంక్స్..!!
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Karthika Deepam కార్తీక్‌పై మోనిత బ్రహ్మాస్త్రం.. వంటలక్క మాస్టర్ ప్లాన్
తన తల్లి దీప ఎక్కువ రోజులు బతకదని మోనిత చెప్పిన విషయాలతో కూతురు హిమ ఆందోళన చెందింది. మీ అమ్మ బతకాలంటే.. మీ నాన్న నేను చెప్పినట్టు చేయాలి. ఆ విషయం మీ నాన్నకు చెప్పాను. మీ అమ్మ కోసం మీ నాన్న ఆ పని చేస్తాడా? అనే విషయంపై ఆమె బతుకుతుంది అని మోనిత చెప్పిన మాటలు హిమను ఆలోచింపజేశాయి. మోనిత మాటల గురించి ఆలోచించుకొంటూ.. గుడి వద్దకు రాగానే దీప కిందపడిపోవడంతో హిమ కంగారుపడిపోయింది. అమ్మా ఏమైంది అంటూ ఏడవడం మొదలుపెట్టింది. అది చూసి అమ్మకు ఏం కాదు అని కార్తీక్ అంటే.. అంతా నాకు తెలుసు.. మోనిత నాకు అన్నీ చెప్పిందని హిమ అనగానే కార్తీక్ షాక్ అయ్యాడు. కార్తీకదీపం సీరియల్‌లో ఇంకా ఏం జరిగిందంటే?
అమ్మ ఆరోగ్యం గురించి నాకు మోనిత చెప్పింది. అమ్మ బతకాలంటే.. నీవు ఆమె చెప్పినట్టు చేయాలటగా. అమ్మను బతికించుకోవడానికి మోనిత చెప్పినట్టు చేయవచ్చుగా అని తండ్రి కార్తీక్‌ను హిమ నిలదీసింది. అయితే నీవు మోనిత చెప్పిన మాటలకు నమ్మకు అని కార్తీక్ అంటే.. లేదు.. నీకు అమ్మ బతకడం ఇష్టం లేదా అంటూ హిమ ప్రశ్నించింది. దాంతో నాకు అమ్మ తప్ప మరోకరు నా జీవితంలో లేదు. దీపతోనే నా జీవితం అని కార్తీక్ అంటే.. మరీ మోనిత చెప్పినట్టు ఎందుకు చేయడం లేదు అని మళ్లీ అడిగింది. దాంతో మోనిత మాటలు అసలు నమ్మకు. దీపను బతికించుకోవడానికి నేను ఉన్నాను కదా అని కార్తీక్ చెప్పాడు.

దీప అనారోగ్యం గురించి మోనిత చెప్పిందనే విషయం తెలుసుకొన్న కార్తీక్ కుటుంబ సభ్యులు ఆగ్రహంతో ఊగిపోయారు. మా కుటుంబాన్ని ఇక వదలదా అనే కోపాన్ని దీప ప్రదర్శించింది. దీపకు తగిన బుద్ది చెప్పాల్సిందే అంటూ దీప కోపంతో ఊగి పోయింది.
హిమకు దీప ఆరోగ్యం గురించి చెప్పిన విషయం తెలుసుకొని... ఇంకా అక్కడి నుంచి రెస్పాన్స్ రాలేదంటి? అని ఆలోచనల్లో పడింది. హిమకు ఈ విషయం తెలిసిన తర్వాత కంపల్సరి ఆ ఇంటి నుంచి నాకు ఫోన్ వస్తుంది కదా.. సరే.. ఫోన్ రాకపోతే.. నా వద్ద ఉన్న బ్రహ్మాస్త్రాన్ని వదిలేస్తాను. ఇక ఆ కుటుంబం నా దారిలోకి ఎలా రాదో చూస్తాను అంటూ మోనిత మరో కుట్రకు తెరలేపింది.

అయితే మోనిత నిద్ర లేచేసరికి నడి రోడ్డు మీద ఉంది. దాంతో తాను ఏమిటి? రోడ్డు మీద ఉండటం అని చూసే సరికి తన ముందు దీప కనిపించింది. దీప పక్కనే వారణాసి కూడా ఉన్నాడు. దాంతో నేను రోడ్డుపైకి వచ్చానేంటి? నన్నెందుకు తీసుకొచ్చావంటూ.. మోనిత అంటే.. ఇక నిన్ను నడిరోడ్డుపై నిలబెడుతాను అని దీప అంది. గత 12 ఏళ్లుగా నన్ను నా కుటుంబాన్ని పీడిస్తున్నావు. నీకు ఎలా బుద్ది చెప్పాల్లో నాకు తెలుసు అంటూ. దీప ఫైర్ అయింది. మోనితను ఇక వదల వద్దు అక్కా అని వారణాసి అంటే.. అరేయ్ నిన్ను చంపేస్తాను అంటూ లేచింది. దాంతో మోనిత గొంతును దీప పిసికేందుకు ప్రయత్నించింది. దాంతో వారణాసి ఆపాడు. అయితే మోనిత తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పరాయి మొగాడి వెంటపడటం సరికాదు అని బుద్ది చెప్పేందుకు ప్రయత్నించారు.