twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam కార్తీక్ కోసం మోనిత గొంతు పిసికి చంపబోయిన దీప.. సీరియల్‌లో మరో హై డ్రామా

    |

    దీప, మోనిత ఇద్దరు గొడవపడుతుంటే.. కార్తీక్ జోక్యం చేసుకొంటూ.. ఆవిడ ఎవరు? నువ్వెవరు? నేను ఎవర్ని అని అంటే.. పేరు పెట్టి పిలిచినంత మాత్రాన తెలిసి ఉంటారా? మన గురించి తెలుసుకొని డబ్బు లాగేందుకు ఇలాంటి వాళ్లు వస్తుంటారు అని మోనిత అంటే.. ఏంటే డబ్బు కోసం ఎవరు వచ్చారు? నా భర్త కోసం, నా మాంగళ్యం కోసం నేను వచ్చాను అంటూ తాళిని చూపించింది.

    డాక్టర్ బాబు.. నేను దీపను. మీ వంటలక్కను. నేను గుర్తుకు రావడం లేదా? మన పిల్లలు.. హిమ, శౌర్య, అత్తయ్య, మామయ్య ఎవరూ గుర్తుకు రావడం లేదా? అని దీప ఆవేదన వ్యక్తం చేసింది. మోనితను చూస్తూ. మా డాక్టర్ బాబుకు ఏ మందు పెట్టావే.. ఆయనను అలా చేశావు అని దీప ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్తీకదీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్ 1445‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    విహార యాత్రకు వస్తే ప్రమాదం

    విహార యాత్రకు వస్తే ప్రమాదం

    దీప, మోనిత వాదనలు వింటూ కార్తీక్ కంగారుపడుతుంటే.. డాక్టర్ బాబు మనం ఇక్కడికి విహారయాత్రకు వచ్చాం. అయితే కారుకు యాక్సిడెంట్ అయింది. ఆ ప్రమాదంలో మనం పోయామని పిల్లలు, అత్త,మామ బాధపడుతున్నారు. పదండి డాక్టర్ బాబు.. పిల్లల వద్దకు వెళ్దాం అని దీప అంటే.. ఏమే.. ఎవరి పిల్లలను నా భర్తకు పిల్లలను చేయాలనుకొంటున్నావు అని మోనిత అంటే.. ఏం మాట్లాడుతున్నావే.. అంటూ మోనిత గొంతు పిసికి చంపబోయింది.

     గొంతుపట్టుకొని మోనితపై ఆగ్రహం

    గొంతుపట్టుకొని మోనితపై ఆగ్రహం

    మోనితపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నా పిల్లలను ఒక్క మాట అన్నావంటే.. చంపేస్తాను అని దీప అలాగే గొంతు పట్టుకొంటే.. అక్కడ పనిచేసే వాళ్లు వచ్చి విడిపించారు. పరాయి భర్తను కోరుకొంటున్నావేమిటి? అన్యోన్యంగా ఉండే దంపతులను విడదీస్తావా? అని పనివాళ్లు అంటే.. ఇతను నా భార్త.. మాది అన్యోన్యమైన బంధం అని దీప అంది. దాంతో శివ ఆమెను బయటకు లాగిపడేయ్ అంటూ మోనిత అరిచింది. దాంతో దీపను ఇంట్లో నుంచి బయటకు శివ తీసుకెళ్లాడు. అయితే డాక్టర్ బాబు అంటూ దీప దీనంగా అరుస్తూ ఉండిపోయింది.

     కార్తీక్ ఇక నా సొంతం

    కార్తీక్ ఇక నా సొంతం

    కార్తీక్‌ను ఇంట్లోకి పంపించి.. దీప వద్దకు మోనిత వచ్చింది. శివను అక్కడి నుంచి పంపిస్తూ.. నీవు వెళ్లి కార్తీక్‌కు మందులు తీసుకురా అంటూ పంపించింది. దాంతో మా డాక్టర్ బాబును ఏం చేస్తున్నావు. కార్తీక్‌కు ఏమైంది అని దీప అంటే.. కార్తీక్ ఇక నా సొంతం. హిమ, శౌర్య, అత్త,మామల్ని ఎవరిని గుర్తుపట్టడు. ఇక మోనితే కార్తీక్ ప్రపంచం అని మోనిత అంటే.. చంపేస్తాను అంటూ దీప ఆగ్రహం వ్యక్తం చేసింది. నీవు ఆవేశపడుకు.. నీవు అరిస్తే నీ అత్త రాదు. ఇక నన్ను ఏం చేయలేవు. కార్తీక్‌ వదిలేసి వెళ్లి నీ అత్త, మామల సేవ చేసుకో అంటూ మోనిత హేళన చేసింది. నేను వదిలేసి వెళ్లడం కాదు.. కార్తీక్ నా కోసం వస్తాడు అని దీప సవాల్ విసిరింది.

    ఈ జన్మలో కార్తీక్ నా వాడే

    ఈ జన్మలో కార్తీక్ నా వాడే

    కార్తీక్ నిన్ను గుర్తుపట్టడు. నీ వెంట వస్తే తీసుకెళ్లు. నిన్ను ఎప్పుడో మరిచిపోయాడు. ఇక కార్తీక్ నా సొంతం. దీప అప్పుడెప్పుడో నీవు అన్నావు. ఈ జన్మలో కార్తీక్ నాకు.. వచ్చే జన్మలో నీకు అని మనం అనుకొన్నాం. గుర్తుందా. యాక్సిడెంట్‌తో కార్తీక్ ఒక జన్మ ముగిసింది. మరో జన్మ ఎత్తిన కార్తీక్ ఇక నా సొంతం. నా కార్తీక్ శకం మొదలైంది. నీకు కార్తీక్‌కు ఎలాంటి సంబంధం లేదు అని మోనిత అంటే.. అప్పుడు ఇలానే ఎగిరావు. చివరకు ఏమైంది. నీ కుళ్లు బయటపడి కార్తీక్ నా వద్దకు వచ్చాడు. కార్తీక్‌తో దేవుడి బలపరిచిన బంధం. కార్తీక్ నా సొంతం. నీ గురించి ఆలోచనలు, జాపకాలు మరిచిపోయేలా చేస్తాను. ఎప్పటికీ కార్తీక్ నీకు దక్కడు. ఇక కార్తీక్ నా సొంతం అని మోనిత అంది.

    నీ నక్క జిత్తులు చెల్లవు అంటూ

    నీ నక్క జిత్తులు చెల్లవు అంటూ

    మోనిత మాటలకు అడ్డు పడుతూ మా అనుబంధమే అన్నీ గుర్తుకు తెచ్చేలా చేస్తుంది. ఇన్నాళ్లు డాక్టర్ బాబు ఉన్నారో లేదోనని టెన్షన్ పడ్డాను. అది నీ వల్లే అని తెలిసిన తర్వాత ఆ భయం కూడా పోయింది. నీ నక్క జిత్తులు చెల్లవు. డాక్టర్ బాబు కోసం మళ్లీ వస్తాను అని దీప అంటే. నీవు ఎన్నిసార్లు వచ్చినా కార్తీక్ నీకు దక్కడు అని మోనిత సమాధానం చెప్పింది. దాంతో నీవు ఇక్కడే ఉండు.. మళ్లీ వస్తాను. కార్తీక్‌ను తీసుకెళ్తాను అంటూ దీప సవాల్ విసిరి వెళ్లింది.

    నీవు నా భార్యవని చెబితే నమ్మాను కదా..

    నీవు నా భార్యవని చెబితే నమ్మాను కదా..

    దీప, మోనిత గొడవపడటం చూసిన తర్వాత కార్తీక్ ఆలోచనల్లో పడ్డాడు. కార్తీక్ ఆలోచనల్లో ఉంటే.. మోనిత వచ్చి.. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. అయితే నీకు ఆమె తెలియదా.. నీ పేరు మోనితేనా అని అంటే.. అవును నా పేరు మోనితే. శివతో ఎంక్వైరీ చేశాను. డబ్బు కోసం ఆమె అలాంటి పనులు చేసింది. ఇంకోసారి నీ వద్దకు వస్తే లాగిపట్టి కొట్టు అని మోనిత అంటే.. నేను అలా చేయలేను.

    ఆమె చెప్పిన విషయాలు నమ్మేలా ఉన్నాయి. నీవు నా భార్యవని చెబితే నమ్మాను కదా.. ముందు ఆమె వచ్చి నేను నీ భార్యను అంటే నమ్మేవాడిని. నీవు తర్వాత వచ్చి ఇలా అంటే.. నీకు ఇలాంటి గతే పట్టేది. నా గతం మరిచిపోయాను. నా మీద నాకే అనుమానాలు ఉన్నాయి అని కార్తీక్ షాక్ ఇచ్చాడు. దాంతో కార్తీక్ నన్ను భార్యగా నమ్మడం లేదని విషయం మోనితకు షాక్ గుర్తు చేసింది.

    నాపై కార్తీక్‌కు ప్రేమ ఉందా?

    నాపై కార్తీక్‌కు ప్రేమ ఉందా?

    మోనితతో జరిగిన గొడవను చిక్‌మంగళూరు డాక్టర్ ఫ్యామిలీకి దీప చెప్పి బాధపడింది. అయితే నీ ప్రేమ గొప్పదైతే.. మోనిత ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం లేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిన్ను గుర్తుపడుతాడు అని డాక్టర్ అన్నాడు. దాంతో నేను కార్తీక్‌ వద్దకు వెళ్లి నా ప్రేమను గుర్తు చేస్తే దారిని వెతుక్కొంటానని దీప బలంగా చెప్పింది. ఇదిలా ఉండగా, కార్తీక్ వద్దకు మోనిత వచ్చి.. నేను చెప్పిన మాటలు నమ్మాడు. కానీ భర్తగా ఒక్క రోజు కూడా ప్రవర్తించలేదు. అసలు నాపై కార్తీక్‌కు ప్రేమ ఉందా అని మోనిత ఆలోచనల్లో పడింది. అప్పుడు దీప ఉన్నప్పుడే కార్తీక్‌ను నా వాడిని చేసుకొన్నాను. ఇప్పుడు దీప గుర్తులు లేవు. దీప లేదు. కాబట్టి నేను ఏదో ఒకటి చేయాలి అంటూ చేతి తెగినట్టు అరిచింది. అయితే దానిని పెద్దగా పట్టించుకోకుండా ఏమైంది అంటూ కార్తీక్ అడిగాడు. దాంతో మెడ చుట్టూ చేతులు వేసి ఏదో చేయబోయింది.

    సీరియల్‌లో మరో ట్విస్టు

    సీరియల్‌లో మరో ట్విస్టు

    కార్తీకదీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్‌లో మరో ట్విస్టు కనిపించింది. డ్రైవర్ శివతో మాట్లాడుతూ.. మీ మేడమ్‌కు మంచి వంట మనిషిని చూసిపెట్టాలి అన్నాడు. దాంతో పక్క నుంచి మంచి వాసన వస్తుంటే... వాసన ఇంత ఘుమఘుమలాడుతుంటే.. రుచి ఎలా ఉంటుందో అని మోనిత పిలిచాడు. ఎవరో మంచి వంట చేస్తున్నది. ఆమెను వంట మనిషిగా పెట్టుకొంటే ఎలా ఉంటుందో అని కార్తీక్ అంటే.. సరే పద అంటూ హోటల్ వద్దకు వెళ్లగానే.. దీప కనిపించడంతో మోనిత షాక్ తిన్నది. దీపను చూసి నువ్వా అంటూ కార్తీక్ గట్టిగా అరిచాడు. దాంతో గుర్తుపట్టాడా ఏంటి అని మోనిత కంగారు పడింది.

    English summary
    Karthika Deepam 31st August Episode number 1445.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X