Karthika Deepam జీవితంలో ఇదే చివరి రోజైనా ఫర్వాలేదు.. ప్రమాదం అంచున కార్తీక్, దీప ఫ్యామిలీ
మోనితకు ఆనంద్‌ను ఇచ్చిన తర్వాత కార్తీక్ కుటుంబం భావోద్వేగానికి గురైంది. ఆ తర్వాత చిక్‌మంగళూరుకు పిల్లలతో కలిసి దీప, కార్తీక్ ట్రిప్ వెళ్లారు. అయితే వారు విహార యాత్రకు వెళ్లడంపై పూజారి కీడు శంకించాడు. సౌందర్య, ఆనందరావుతో మాట్లాడుతూ.. ఎక్కడైతే కార్తీక్, దీప మధ్య అనుమానాలు మొదలయ్యాయో.. ఎక్కడైతే వారి అనుబంధం బీటలు వారిందో.. అదే చిక్‌మగ్‌ళూరుకు వెళ్లి పొరపాటు చేశారనిపిస్తుందమ్మ.
పోయిన జన్మలో చేసిన పాపాలు వెంటాడుతుంటాయి అంటారు అని పూజారి అన్నాడు. దాంతో సౌందర్యలో భయాలు మొదలయ్యాయి. హిమ కూడా అదోరకంగా మాట్లాడటంతో దీప కూడా కంగారుపడిపోయింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్‌లో 1294 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే..

కార్తీక్, దీప సరదాగా..
చిక్‌మంగళూరులో కార్తీక్, దీపతోపాటు పిల్లలు సరదాగా విహారయాత్రను గడుపుతున్నారు. కార్తీక్, దీప రొమాంటిక్‌గా గడుపుతూ దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. కార్తీక్ కళ్లు మూసి ఎవరో చెప్పుకో అంటూ కవ్వించారు. ఇక్కడకు వచ్చి నా కళ్లు మూసేదెవరు అంటూ చెప్పింది. అయితే తనకు నా ప్రాణాలకు అడ్డు వేస్తానని హిమ చెప్పడంపై దీప దిగులుపడింది.
అయితే హిమ అనడం నాకు ఏదో బాధగా ఉందని అని దీప అంటే.. మనం ఇలాంటి కష్టాలను మరిచిపోవడానికి ఇక్కడికి ట్రిప్‌కు వచ్చాం. కష్టాలన్నీ మరిచిపోయి ఇంటికి వెళ్లాలి అని కార్తీక్ చెప్పి.. దీపను ట్రిప్‌ను ఎంజాయ్ చేయమని చెప్పాడు. నీవు ధైర్యవంతురాలివి అని కార్తీక్ అంటే.. నేను ధైర్యవంతురాలిగా కనిపిస్తానే కానీ పిరికిదాన్ని. మీకు దూరంగా ఉన్న సమయంలో చాలాసార్లు చనిపోవాలని అనిపించేది అని దీప అంటే.. ప్రపంచంలో ఏ భార్యభర్త పడని కష్టాలు మనం పడ్డాం అని కార్తీక్ అని ఊరడించారు.

వచ్చే జన్మలో కూడా నీవే నా భార్యగా
ఇక చిక్‌మంగళూరులోని రిసార్టులో దీప వంటల కార్యక్రమం మొదలుపెట్టింది. దీప వంట చేస్తుంటే.. మంచి వాసన వస్తుందని పిల్లలు ఆనందపడిపోయారు. ఈ వంట చూస్తుంటే.. వచ్చే జన్మలో కూడా నీవే నా భార్యవు కావాలని కార్తీక్ అంటే.. నాలో వంట తప్పు మరో టాలెంట్ లేదా అని దీప అడిగింది. అయితే వంటలు గుమగుమలాడుతున్నాయి. వంటలక్క త్వరగా వంట పూర్తి చేసేయ్ అని హిమ అంటే.. నన్ను వంటలక్క అంటావా? అని హిమను సరదాగా కొట్టబోయింది. అయిడాక్టర్ బాబు తప్ప మరోకరు వంటలక్క అని పేరు పెట్టి పిలువకూడదు అంటూ సరదాగా ఆడుతూపాడుతూ ఎంజాయ్ చేశారు.

కార్తీక్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన దీప
చిక్‌మంగళూరు ట్రిప్‌కు రావడంతో పిల్లలు హ్యాపీగా ఉన్నారంటూ కార్తీక్ అంటే.. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అంటూ దీప చెప్పింది. అయితే నేను హ్యాపీగా ఉన్నానా అనే విషయం శ్రీమతిగారు తెలుసుకొన్నారా? అంటే.. ఇప్పుడే ఉండండి అంటూ లోనిక వెళ్లి లిక్కర్ బాటిల్ తీసుకొచ్చి కార్తీక్‌ను సర్‌ప్రైజ్ చేసింది. అయితే దీప ఇచ్చిన సర్‌ప్రైజ్‌తో కార్తీక్ ఆనందంలో మునిగిపోయాడు.
ఇది ఎక్కడి నుంచి తెచ్చావు అంటే.. మా ప్లాన్స్ మాకుంటాయి అని దీప చెబుతూ వారణాసితో తెప్పించాను అని చెప్పింది. అయితే నీ ప్రేమ చూస్తుంటే ఈ రోజే చివరి రోజు అయినా పర్వాలేదు అంటూ కార్తీక్ అంటే.. దీప కంగారుపడిపోయి.. అలాంటి మాటలు అనకు అని దీప భర్త నోటికి చేతిని అడ్డుపెట్టింది.

స్థల ప్రభావంతో కార్తీక్, దీపకు ముప్పు
అయితే కార్తీక్, దీప, పిల్లలు లేకపోవడం వల్ల ఇంట్లో సందడి తగ్గిందని ఆదిత్య, శ్రావ్య, ఆనందరావు అన్నారు. అంతలోనే సౌందర్య వచ్చి.. ఆదిత్య ఎయిర్‌పోర్టులో డ్రాప్ చేయమని అడిగింది. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా అంటే.. కార్తీక్, దీప వద్దకు వెళ్తున్నాను. ఫ్లైట్ టికెట్స్ కూడా తీసుకొన్నాను. నేను కార్తీక్, దీప వద్దకు వెళ్లి వారిని అక్కడి నుంచి మరో చోటికి తీసుకెళ్తాను. స్థలప్రభావం వల్ల వారికి కీడు జరిగే ప్రమాదం ఉందని పూజారి హెచ్చరించారని సౌందర్య అంటే.. ఆమె చేతిలో ఉన్న ఫ్లయిట్ టికెట్ తీసుకొని ఆనందరావు చింపేశారు.
నీవు వెళ్లనవసరం లేదు. వారిని ఏకాంతంగా ఉండనివ్వండి. మనం పూజారిని కలవడం వల్ల ఆయన చెప్పారు. మన రాతను ఎవరు కూడా మార్చలేరు. వారిని ఆనందంగా ఉండవనివ్వండి అని ఆనందరావు చెప్పారు. అయితే కార్తీక్, దీపకు ఏమౌవుతుందోననే భయం వెంటాడుతున్నది అని సౌందర్య అంటే.. ఆ ఫ్లయిట్ టికెట్ క్యాన్సిల్ చేసి.. నీవు వారి ఏకాంతంలో జోక్యం చేసుకోకు అని ఆనంద్ రావు, ఆదిత్య చెప్పారు.

కార్తీక్‌కు ఎలాంటి కష్టాలు రావొద్దని
తన కుమారుడు కార్తీక్‌కు ఎలాంటి కష్టం వస్తుందోననే ఆందోళనతో మునిగిన సౌందర్యకు ఉపశమనం కలిగించే విషయాలను ఆనందరావు చెప్పారు. కార్తీక్, దీపకు ఏమీ కాదు.. పద హాస్పిటల్‌కు వెళ్లి డాక్టర్‌కు చూపిస్తాను అంటూ ఆనందరావు అంటే.. ఏం జరిగిందంటే అని శ్రావ్య అడిగింది. అయితే ఆమె మానసిక పరిస్థితి బాగాలేదు. కాస్త చూపిస్తే బాగుంటుందని ఆనందరావు సమాధానం ఇచ్చాడు. అయితే నాకు ఎలాంటి బాధలు, సమస్యలు లేవు. అయితే ఇప్పటికే ఎన్నో కష్టాలు పడిన కార్తీక్‌కు మళ్లీ ఎలాంటి కష్టం వస్తుందని బాధపడుతున్నాను అని సౌందర్య చెప్పింది.

షాకింగ్‌గా కారు యాక్సిండెట్?
అయితే చిక్‌మంగళూరులో అందరూ భయపడినట్టే కార్తీక్‌కు షాకింగ్ సంఘటన ఎదురైంది. ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా.. ఫోన్ రావడంతో కార్తీక్ కారు ఆపి మాట్లాడుతుండగా.. హిమ కారును స్టార్ట్ చేసి ముందుకు స్పీడ్‌గా తీసుకెళ్లింది. అయితే ఈ సంఘటనతో కారులో దీప.. బయట రోడ్డు మీద కార్తీక్ షాక్ తిన్నాడు. తాజా ప్రోమోలో ఈ ట్విస్ట్ మరింత ఆసక్తిని రేపింది. కారును హిమ కరెక్ట్‌గా నడిపించాదా? కార్తీక్ ఆ కారును ఆపి ప్రమాదం నుంచి రక్షించారా అనేది తదుపరి ఎపిసోడ్‌లో చూడాల్సిందే..


Click it and Unblock the Notifications











