మరదలితో బిగ్‌బాస్ ఫేమ్ మానస్ లవ్ ట్రాక్.. అలా ముగ్గులొకి దింపి.. కొత్త ట్విస్టుతో మరింత ఆసక్తిగా..

కార్తీక్, దీప మరణం తర్వాత కుటుంబంతో కలిసినప్పటికీ ఒంటరిగా ఫీలవుతున్న తన సొంత బావ నిరుపమ్‌కు చేరువైంది. తన బర్త్ డే రోజున శ్రావ్య కోసం వెతికి నిరాశకు గురైన హిమను నిరుపమ్ తన ఇంటికి తీసుకువచ్చాడు. అయితే అత్తమ్మ తన గురించి ఏమన్నా అనుకొంటుందేమో అంటూ హిమ సందేహించింది. అయితే అలాంటి భయం అవసరం లేదు అంటూ నిరుపమ్ ధైర్యం చెప్పి ఇంటిలోకి తీసుకెళ్లాడు. నిరుపమ్‌తో కలిసి ఇంట్లోకి అడుగుపెట్టిన హిమకు అత్తమ్మ షాక్ ఇచ్చింది. హిమను ఎందుకు తీసుకొచ్చావు అంటూ హిమను కోపంగా చూసింది. కార్తీకదీపం తాజా ఎపిసోడ్‌ 1308లో ఇంకా ఏం జరిగిందంటే?

కారు డ్రైవ్ చేసి చంపేస్తారు అంటూ

కారు డ్రైవ్ చేసి చంపేస్తారు అంటూ

నిరుపమ్‌ను చూస్తూ ఎందుకు లేట్ అయింది అంటూ తల్లి ప్రశ్నించింది. హిమను కలవడం వల్ల ఆలస్యం అయింది అని సమాధానం చెప్పగానే.. వచ్చేటప్పుడు కారు నీవు నడిపావా? హిమ నడిపిందా అంటూ నిరుపమ్‌ను తల్లి ప్రశ్నించింది. దాంతో అదేం ప్రశ్న మమ్మీ.. కారు నేనే నడిపాను అంటూ నిరుపమ్ జవాబిచ్చాడు. దాంతో కొందరు అత్యుత్సాహానికి వెళ్లి కారు డ్రైవ్ చేసి మనుషులను చంపేశారు.

చాలా మందికి చాలా హాబీలు ఉంటాయి. సరదాగా కారు డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలు తీసేవాళ్లున్నారు నిరుపమ్ అంటూ తల్లి అనడంతో.. ఏమిటి మమ్మీ.. అలా మాట్లాడుతున్నావు అంటూ నిరుపమ్ ప్రశ్నించాడు. దాంతో తోడ పుట్టిన వాళ్లను పొగొట్టుకొన్నాను. ఇంకా ఏం మాట్లాడాలి అంటూ హిమను చూస్తూ ఘాటుగా స్పందించింది.

నీ డ్రైవింగ్ సరదా కొనసాగుతుందా?

నీ డ్రైవింగ్ సరదా కొనసాగుతుందా?

అంతలోనే మాట మారుస్తూ.. ఏమమ్మా.. హిమ బాగున్నావా. బాగానే ఉంటావులే.. అందరిలా నీకు ఉన్నట్టు అదృష్టం ఉండదులే అంటూ ప్రేమగా పలకరించేందుకు నిరుపమ్ తల్లి ప్రయత్నించింది. దాంతో ఏమిటి మమ్మీ అంటూ ప్రశ్నించాడు. దాంతో ఏం లేదు. జాగ్రత్తగా ఉండమని చెబుతున్నాను. హిమను చూస్తూ.. ఏమిటమ్మా.. ఇంకా నీ డ్రైవింగ్ సరదా కొనసాగిస్తున్నావా? నీకు సరదాగానే ఉంటుంది. కానీ బంధాలు తెంచుకొన్న మాకే కష్టంగా ఉంటుంది అని నిరుపమ్ తల్లి వెటకారంగా కామెంట్ చేసింది.

 హిమపై అత్త మాటల దాడి

హిమపై అత్త మాటల దాడి

నిరుపమ్ తల్లి మాటల దాడి చేస్తుండటంతో.. అత్తమ్మా.. నీవు అలా అనకు. జరిగిన దానికి అప్పుడప్పుడు చనిపోవాలని అనిపిస్తుంది అని హిమ ఏడుస్తూ అంటే.. నీవు చనిపోవడమేందుకు.. నీవు చేయాల్సింది ఇంకా చాలా ఉంది కదా అని నిరుపమ్ తల్లి వెటకారం ప్రదర్శించింది. దాంతో అత్తయ్యా.. ఆ రోజు చేసిన దానికి ప్రతీ రోజు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాను. నా తప్పుకు రోజు ఏడ్చేలా చేస్తూ శౌర్య ఇంటి నుంచి వెళ్లిపోయింది అని హిమ అంటే.. శౌర్య మంచి పనే చేసింది. మళ్లీ నీవు డ్రైవ్ చేస్తావని భయపడి ఇంటి నుంచి పారిపోయింది అని నిరుపమ్ తల్లి అంది. దాంతో అలా అనకు అత్తమ్మా అని హిమ అంటే.. మా జీవితాలు అతంత మాత్రంగానే ఉన్నాయి. విడివిడిగా ఉన్నా.. ఆనందంగానే బతికే ఉన్నాం అని ఎత్తి పొడిచేలా మాట్లాడింది.

నీవు ఇంటికి రాకపోతేనే మంచిది అంటూ

నీవు ఇంటికి రాకపోతేనే మంచిది అంటూ

హిమ ఏడుస్తుంటే.. టైమ్ చాలా అయిపోయింది. జాగ్రత్తగా వెళ్లి రావమ్మా. అయినా నా పిచ్చి గానీ.. నీకు జాగ్రత్తలు చెప్పడం ఏమిటి? నాకు మనసులో ఒకటి పెట్టుకొని.. మరొకటి మాట్లాడటం రాదు. ఇంకోసారి నీవు ఇంటికి రాకపోతే సంతోషిస్తాను అని హిమతో నిరుపమ్ తల్లి తీవ్రంగా కామెంట్ చేసింది. హిమ నొచ్చుకొనేలా చేసినందుకు బాధపడుతూ.. ఏమిటి అమ్మా.. అలా మాట్లాడుతావు అని నిరుపమ్ అంటే.. హిమ వెళ్తుంది.. గుమ్మం దాక వెళ్లి పంపించిరా అంటూ ఆర్డర్ వేసింది. దాంతో హిమను సాగనంపేందుకు వెనుకే వెళ్తాడు. సారీ హిమ.. మమ్మీ ఇలా మాట్లాడుతుందని ఊహించలేకపోయా. తన తల్లి మాటలను పట్టించుకోవద్దు అని సాగనంపాడు.

 శౌర్య కళ్లలోకి నిరుపమ్ ప్రేమగా

శౌర్య కళ్లలోకి నిరుపమ్ ప్రేమగా

ఇదిలా ఉండగా, కార్తీకదీపం తాజా ప్రోమోలో ఆసక్తికరమైన సన్నివేశాలు కనిపించాయి. మళ్లీ ప్రేమ్, శౌర్య మధ్య గొడవ జరిగింది. వంట చేసిన పదార్థాలను ఆటోలో తీసుకొస్తావా అంటూ ప్రేమ్ ప్రశ్నించాడు. దాంతో కోపం తెచ్చుకొన్న శౌర్య.. వెంటనే ప్రేమ్ కాలర్ పట్టుకొన్నది. తన కాలర్ పట్టుకోవడంతో శౌర్యను గట్టిగా వెనక్కి నెట్టాడు. దాంతో ఒక్క ఊదుటన వెళ్లి నిరుపమ్‌పై పడింది. కిందపడిపోతున్న శౌర్యను పట్టుకొన్నాడు. ఇద్దరు ఒకరి కళ్లలోకి మరొకరు ప్రేమగా చూసుకొన్నారు. అంతలోనే ఏమిటి గొడవ అంటూ హిమ అక్కడికి వచ్చింది.

శౌర్య యాటిట్యూడ్ నచ్చింది అంటూ

శౌర్య యాటిట్యూడ్ నచ్చింది అంటూ

హాస్పిటల్‌లో హిమను చూసిన శౌర్య.. ఏమిటి తింగరి అంటూ ప్రశ్నించింది. దాంతో ప్రేమ్ మధ్యలో జోక్యం చేసుకొంటూ అమ్మాయిలు ఇలా మాట్లాడుతారా. మన డాక్టర్ అమ్మాయిలా.. పద్దతిగా, సాఫ్ట్‌గా ఉండాలి అని అన్నాడు. దాంతో హిమ హ్యాపీగా ఫీలయ్యింది. ప్రేమ్ మాటలకు అడ్డుపడుతూ.. నీ మొహం.. అమ్మాయిలు ఇలానే ఉండాలి రా అంటూ శౌర్యను చూపించాడు. తన యాటిట్యూడ్ నచ్చింది అంటూ నిరుపమ్ అనగానే.. డాక్టర్ సాబ్.. అంటూ నిరుపమ్ చేయిపట్టుకొని షేక్ హ్యాండ్ ఇచ్చింది.

నానమ్మను చూసి శౌర్య షాక్‌లో

నానమ్మను చూసి శౌర్య షాక్‌లో

ఇలా శౌర్య, నిరుపమ్ ఆనందంలో ఉండగా.. సీరియల్‌లో మరో భారీ ట్విస్టు కనిపించింది. హాస్పిటల్‌లో రాసుకొంటూ ఉన్న సౌందర్యను చూసి శౌర్య షాక్ తిన్నది. తన నాన్నమ్మను చూడగానే ప్రేమ, భావోద్వేగంతోపాటు ఆశ్చర్యం కలిగింది. ఇలా కొత్త ట్విస్టును తాజా ఎపిసోడ్‌లో కనిపించడంతో సీరియల్‌పై భారీ అంచనాలు, ఆసక్తి పెరిగింది. వచ్చే ఎపిసోడ్‌ ఎప్పుడెప్పుడా అనే ఫీలింగ్ కలిగించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X