Karthika Deepam లో మరో ట్విస్టు.. బిగ్‌బాస్ ఫేమ్ మానస్ ఎంట్రీ.. కొత్త పాత్రలతో షాకింగ్‌గా

హిమ ఇంటిలోకి రావడాన్ని శౌర్య సహించలేకపోయింది. హిమ లేదా తానో ఒకరే ఇంటిలో ఉండాలని శౌర్య బెట్టు చేసింది. తన తల్లిదండ్రులు కార్తీక్, దీప మరణానికి కారణమైన హిమను సహించని పరిస్థితుల్లో శౌర్య ఇంటి నుంచి బయటకు వచ్చింది. పుట్టెడు దు:ఖంలో ఉన్నాం. హిమను నీ మాటలతో హింస పెట్టకు అంటూ చెప్పిన విషయాలను రోడ్డుపై నడుస్తూ ఎక్కడికి వెళ్లాలో గమ్యం తెలియని శౌర్య గుర్తు చేసుకొన్నది. అయితే హిమను బయటకు పంపిస్తే బయట అది బతకలేదు.

అలా అని అమ్మా, నాన్నలను చంపిన హిమను చూస్తూ ఇంటిలో ఉండలేను. అందుకే నేను బయటకు వచ్చాను అని శౌర్య మనసులో అనుకొన్నది. అంతలోనే ఓ వ్యక్తి బైక్ మీద వస్తుంటే.. లిఫ్ట్ అడిగి హయత్ నగర్‌కు వెళ్లే ప్రయత్నం చేసింది. కార్తీకదీపం సీరియల్‌లోని తాజా ఎపిసోడ్ 1305 లో ఏం జరిగిందంటే?

నా కోసం వెతుకొద్దు అంటూ లెటర్

నా కోసం వెతుకొద్దు అంటూ లెటర్

శౌర్య జాడ తెలియన కార్తీక్ కుటుంబ సభ్యులకు ఇంట్లో ఒక లెటర్ లభించింది. ఆ లెటర్‌లో.. నానమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను. నన్ను వెతుకవద్దు. అమ్మ, నానల్ని చంపిన హిమ ఉన్న ఇంట్లో నేను ఉండలేను. అందుకే నేను వెళ్లిపోతున్నాను. అమ్మ, నాన్నల్ని నా కళ్ల ముందే చంపేసింది. హిమను చూస్తూ ఉండలేను. హిమను చూస్తుంటే అమ్మా, నాన్నలే గుర్తుకొస్తున్నారు.

అందుకే నేను వెళ్లిపోతున్నాను. నా కోసం వెతుకవద్దు. నా కోసం వెతికితే నా మీద ఒట్టే అని లెటర్ రాసింది. అయితే నీవు వెళ్లిపోవడం ఏమిటి శౌర్య.. కారు నడిపింది నేను. నేను చేసిన తప్పకు శౌర్య ఇంటి నుంచి వెళ్లిపోవడం ఏమిటి.. అయ్యె నా ఖర్మ అంటూ హిమ బాధపడింది. శౌర్య లెటర్ చూసి సౌందర్య, ఇంటి సభ్యులు, హిమ భోరున విలపించారు.

అనాథ పిల్లల కోసం..

అనాథ పిల్లల కోసం..

శౌర్యను వెతికేందుకు కార్తీక్ కుటుంబ సభ్యులు కారులో బయలు దేరారు. బైక్ మీద వెళ్తుంటే.. అనాధపిల్లలు ఆపారు. బైక్ మధ్యలో దిగి.. అనాధ పిల్లలతో కలిసి వెళ్లేందుకు దిగింది. అయితే అనాథ పిల్లల్ని కలిసి నేను మీలాగే అనాథను. . మీతో వస్తాను అని శౌర్య అంటే.. మేము అనాథ పిల్లలం కాదు.

అనాథ పిల్లల కోసం ఫండ్ వసూలు చేస్తున్నాం. స్కూల్‌లో మాకు అసైన్‌మెంట్ ఇచ్చారు అంటూ వెళ్లిపోయారు. అలా నడుచుకొంటూ వెళ్తుంటే.. ఇంద్రుడు భార్య చంద్రమ్మ ఓ ఆవిడ బ్యాగ్‌లో నుంచి డబ్బు కొట్టేస్తుంటే.. శౌర్య పట్టుకొన్నది. తనకు వంద రూపాయలు ఇస్తే ఎవరికి చెప్పను అని వెళ్లింది.

శౌర్య కోసం బస్సులో వెతుకుతూ

శౌర్య కోసం బస్సులో వెతుకుతూ

అంతలోనే ఇంద్రుడు, చంద్రుడును పోలీసులు వెంటాడుతుండటం వారిద్దరూ పరుగు పెట్టారు. సౌందర్య, ఆదిత్య, హిమకు శౌర్య కనిపించడంతో ఆమె పట్టుకోవడానికి పరుగులు పెట్టారు.

దాంతో ఇంద్రుడు, చంద్రుడు, శౌర్య అందరు బస్సులోకి ఎక్కి పారిపోయారు. అయితే బస్సును వెంటాడి.. మధ్యలో ఆపి వెతికితే.. శౌర్య కనిపించలేదు. దాంతో సౌందర్య కంటతడి పెడుతూ..మన మధ్య ఉండకూడదనే శౌర్య ఇంటి నుంచి పారిపోయింది. మనకు దూరంగా వెళ్లిపోయింది అని బాధపడింది.

డాక్టర్‌గా మారిన హిమ..

డాక్టర్‌గా మారిన హిమ..

ఇదిలా ఉండగా.. కట్ చేస్తే.. అమెరికాలో హిమ డాక్టర్ చదువు చదివి ఇండియాకు వచ్చింది. డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నది. బర్త్ డే రోజున పెద్ద పెరిగిన హిమను ఇంట్రడ్యూస్ చేశారు. తల్లిదండ్రులు ఆశీర్వాదం, తాత,అమ్మమ్మల దీవెనలు తీసుకొన్నది. తల్లిదండ్రుల ఫోటోల ముందు నిలబడి.. మమ్మి, డాడీ మిమ్మల్ని నేనే చంపుకొన్నాను అని కంటతడి పెట్టింది. శౌర్యను గుర్తు చేసుకొని బాధపడింది.

నా మీద కోపంతో నీకు నీ శిక్ష వేసుకొన్నావు. మేము అమెరికాలో ఉన్నప్పటికీ.. నీ కోసం వెతిక్కిస్తున్నాం. మనం కలిసి ఉండాలన్న అమ్మ, నాన్న కోరికను తీర్చేందుకు నీ కోసం వెతుకుతున్నాం అని హిమ మనసులో అనుకొన్నది. శౌర్య ఎప్పుడు దొరుకుతుంది అని హిమ అడిగితే.. మనం ఎప్పటి నుంచి వెతుకుతున్నాం. మనకు దొరకకుండా శౌర్య తప్పించుకు తిరుగుతున్నది అని సౌందర్య అంది.

ఆటో డ్రైవర్‌గా శౌర్య

ఆటో డ్రైవర్‌గా శౌర్య


కార్తీకదీపం సీరియల్‌లో రకరకాల ట్విస్టులు కొనసాగుతున్నాయి. హిమ కోసం నిరుపమ్ ( బిగ్‌బాస్ ఫేం మానస్) వచ్చి.. హ్యాపీ బర్త్ డే హిమ అంటూ విషెస్ తెలిపారు. నేను ఇక్కడ బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకొంటున్నాను. కానీ శౌర్య ఎక్కడ ఉందో అని హిమ అంటే.. నేను చిన్నప్పటి ఫోటో పట్టుకొని వెతుకుతున్నాను అని నిరుపమ్ చెప్పాడు. శౌర్య ఎక్కడున్నదో అంటూ హిమ తలచుకోగానే.. ఆటో డ్రైవర్ రూపంలో ఒకడిని చితక బాదుతూ ఎంట్రీ ఇచ్చింది.

నచ్చని పదాలు అక్కా, చెల్లెలు అంటూ

నచ్చని పదాలు అక్కా, చెల్లెలు అంటూ

ఓ పోకిరి తనను వేధిస్తుంటే.. ఏరా ఏమన్నావు.. వస్తావా అంటావా? ఏంటిరా వస్తావా అంటే.. అమ్మాయి ఆటో నడిపితే ఇంత చులకనా అని శౌర్య చితకబాదింది. నీవు ఏ ఉద్దేశంతో అన్నావో తెలుసు అంటే.. అడ్డంగా మాట్లాడితే.. ఆటో ఎక్కిస్తాను అని కొట్టింది. అయితే నన్ను వదిలేయ్ అక్క అంటూ ప్రాధేయపడింది. అయితే ఏమన్నావు అంటూ మళ్లీ కొట్టింది. అక్క, చెల్లి అన్నా కొట్టడం ఏమిటి? అని పోకిరి ప్రశ్నిస్తే.. నాకు తెలుగులో నచ్చని పదాలు అక్కా, చెల్లెలు అని శౌర్య ఘాటుగా సమాధానం ఇచ్చింది. అక్కా అంటే.. అప్యాయతకు మారుపేరు. చెల్లెలు అంటే చెరగని ప్రేమకు సాక్ష్యం అంటారు అని పోకిరి అన్నాడు.

వదిలేదిలే అంటూ శౌర్య

వదిలేదిలే అంటూ శౌర్య

అయితే అక్కా, చెల్లెలు అని పదాలు తీయడంతో మళ్లీ పోకిరిని కొట్టింది. మళ్లీ ఎందుకు కొడుతున్నావు అక్క అంటే.. అక్కా, చెల్లెలు అనే బంధాలు నాకు నచ్చవు అంటూ కోపంతో శౌర్య ఊగిపోయింది. ఆటో మీద వదిలేదెలే అని రాయించుకొని వదలకుండా కొడుతున్నది అని అనుకొంటుండగానే.. ఫోన్ మోగింది. ఇక్కడ ఒకడిని బెండు తీస్తున్నాను. ఆటో స్టాండ్‌కు వస్తాను అంటూ ఆటోలో బయలు దేరగానే.. మళ్లీ పోకిరి ఓ ప్రశ్న అడిగాడు. మీ ఆటో మీద వొదిలేదెలే అని రాశారు కదా.. మీరు ఎవరిని వదలరా అంటే.. ఓ రకమైన లుక్‌తో చూసింది.

మరోసారి టాప్ రేటింగ్‌తో కార్తీకదీపం

మరోసారి టాప్ రేటింగ్‌తో కార్తీకదీపం

ఇక కార్తీకదీపం సీరియల్ ఎప్పటి మాదిరిగానే టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్నది. ఈ ఏడాది తొమ్మిదో వారంలో రూరల్ ప్రాంతంలో 13.84 రేటింగ్ నమోదు కాగా.. 10వ వారం 15.56 రేటింగ్‌తో దుమ్మురేపింది. ఇక అర్బన్ ప్రాంతంలో 9వ వారం 13.05 రేటింగ్ నమోదు కాగా.. 10వ వారం 14.29 రేటింగ్ నమోదు చేయడం విశేషంగా మారింది. కార్తీక్, దీప మరణించిన నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఎమోషన్స్ పండుతున్న నేపథ్యంలో మరోసారి ఈ సీరియల్ టాప్ రేటింగ్‌ను నమోదు చేసుకొంటున్నది అనే విషయం స్పష్టమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X