Karthika Deepam వంటలక్కను తీసుకొస్తా..మోనితకు కార్తీక్ షాక్.. దీప మరో బంపర్ ప్లాన్‌తో!

దీప ఉన్నప్పుడే కార్తీక్‌ను నావాడిని అప్పుడు చేసుకొన్నాను. ఇప్పుడు దీప లేదు. దీప ఆలోచనలు లేవు. ఇప్పుడు కార్తీక్‌ను నావాడిని చేసుకొంటాను. అందుకు నేనే ఏదో ఒకటి చేయాలి అంటూ కార్తీక్ మెడ చుట్టు చేతులు వేసింది. అయితే చేతికి కట్టు ఉండటం చూసి.. ఏం అయింది అంటూ మోనితను ప్రశ్నించాడు. అయితే వంట చేస్తుంటే కాలిందని చెప్పింది. అవునా అంటూ ఏమీ పట్టించుకొకుండా పుస్తకం చదువడంలో బిజీ అయిపోయాడు. దాంతో మోనిత ఓ రకమైన షాక్ గురైంది. కార్తీకదీపం సీరియల్‌ 1446 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

మనకు ఓ బిడ్డ కూడా ఉన్నాడు అంటూ

మనకు ఓ బిడ్డ కూడా ఉన్నాడు అంటూ

కార్తీక్ అంత క్యాజువల్‌గా తీసుకొన్నాడేంటి? ప్రేమ ఎలాగు లేకపోయింది.. కనీసం జాలీ, దయ ఉండాలి కదా.. ఎలాగైన బలవంతంగా ప్రేమించబడాలి. ఏ దీప వచ్చినా నిర్ధాక్షిణ్యంగా బయటకు పంపగలుగుతాడు అని మోనిత మనసులో అనుకొన్నది. చేయి కాలితే కనీసం అయ్యో అని జాలి చూపించాలి కద అని మోనిత అంటే.. నాకు అలాంటి ఫీలింగ్ కలుగలేదు అని కార్తీక్ సమాధానం చెప్పాడు. దాంతో నేను నీ భార్యను. ప్రేమించి పెళ్లి చేసుకొన్నాను. మనకు ఓ బిడ్డ కూడా ఉన్నాడు. కనీసం ప్రేమ చూపించావా అని మోనిత ఏడుస్తూ నటించింది.

మన బిడ్డ ఏమయ్యాడు అంటూ

మన బిడ్డ ఏమయ్యాడు అంటూ

మోనిత ఆవేదనకు రియాక్ట్ అవుతూ.. నాకు ఏది అనిపిస్తే అది చేస్తాను. లేని ప్రేమ, జాలి చూపించడం చాతకాదు అని కార్తీక్ అంటే.. నేను నీ కోసం ఏం కోల్పోయానో తెలుసా? నీకు నా మీద ఇంత ప్రేమ కూడా పుట్టడం లేదు. ఇదే నా తలరాత అని మోనిత అంటే.. నీవు ఏం కోల్పోయావు అని కార్తీక్ అడిగితే.. మనకు ఓ బిడ్డ ఉన్నాడు తెలుసా కార్తీక్ అని మోనిత అంటే.. ఏంటీ మనకు బిడ్డ ఉన్నాడా? ఏడి? మోనిత మాట్లాడవేంటి? మన బిడ్డ ఏడి అని కార్తీక్ నిలదీశాడు.

దాంతో నీకు యాక్సిడెంట్ అయిన రోజు మన బిడ్డకు ఫీవర్. వాడిని హాస్పిటల్‌లో చేర్పించి ట్రీట్‌మెంట్ ఇప్పించాను. కానీ నీ కోసం హాస్పిటల్‌లో ఉండి.. ఇంటికి వచ్చే సరికి.. మన బిడ్డ లేడు. ఎవరైనా తీసుకెళ్లారో ఏమో అని మోనిత చెప్పగానే కార్తీక్ ఎమోషనల్ అయ్యాడు.

నీ కోసం బిడ్డను త్యాగం చేశా

నీ కోసం బిడ్డను త్యాగం చేశా

అయితే కార్తీక్‌తో బిడ్డ లేడని అబద్దం చెబుతూ.. ఆనంద్ నీవు లేవని చెప్పాను. సారీ అంటూ మనసులో మోనిత అనుకొన్నది. నీ కోసం నా బిడ్డను త్యాగం చేయాల్సి వచ్చింది అంటూ ఏడుపు అందుకోవడంతో కార్తీక్ ఆమెను తన గుండెలకు హత్తుకొన్నాడు. నాపై ప్రేమ లేకపోయినా.. బిడ్డ పేరు చెప్పగానే ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రతీ విషయంలో నీకు డోస్ పెంచుతా.. దీపకు నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తా అని మోనిత మనసులో అనుకొన్నది.

 మోనిత నీకు సర్‌ప్రైజ్ అంటూ

మోనిత నీకు సర్‌ప్రైజ్ అంటూ

ఇక ఇంట్లో నుంచి బయటకు వస్తూ శివను రకరకాల పేర్లతో పిలుస్తుంటే.. ఏంటి.. శివ ఎందుకు అని అంటే.. బయటకు వెళ్లిరావడానికి అంటూ కార్తీక్ చెప్పాడు. బయటకు వెళ్లకు.. ఏదైనా కావాలంటే శివ తెస్తాడు అంటే.. ఏదో తేవడానికి కాదు.. నీకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి అని కార్తీక్ అంటే... ఏంటీ సర్‌ప్రైజ్ ఏంటి? అంటే.. నా కోసం బిడ్డను పోగొట్టుకొని బాధలో ఉంటూ నా కోసం బాధను అనుభవించావు. ఆ బాధలో మన అనుబంధం కనిపించింది. నా కోసం వంట చేస్తూ చేయి కాల్చుకొంటే.. నేను పట్టించుకొలేదు. నీ చేయి కాలితే .. నేను ఎలాంటి ఫీలింగ్ లేదని చెప్పడం గిల్టీగా ఉంది అని కార్తీక్ అంటే.. చాలూ.. ఈ ప్రేమ కురిపిస్తే చాలూ అంటూ మోనిత పొంగిపోయింది. ఒక్క అబద్దం ఇంతగా మనిషిని మార్చేస్తుందా అని ఆనందపడిపోయింది.

వంటలక్కను తీసుకొస్తాను.. అంటూ

వంటలక్కను తీసుకొస్తాను.. అంటూ

మోనిత ఆనందాన్ని చూస్తూ.. ఇక నుంచి నీవు వంట చేయనక్కర్లేదు అని కార్తీక్ అంటే.. నా కోసం పార్సిల్ తీసుకొస్తావా కార్తీక్ అంటే.. లేదు.. నీ కోసం ఏకంగా వంటలక్కనే తీసుకొస్తాను అని కార్తీక్ అనగానే.. మోనిత గుండెల్లో రాయిపడినట్టు అయింది. వంటలక్కనా..ఇప్పుడు అది ఎందుకు కార్తీక్ అంటే.. ఆమె డాక్టర్ బాబు అంటూ వెంటపడుతున్నది కదా.. ఆమెను తీసుకొచ్చి.. నీవు ఎవరిని చూసి ఎవరనుకొంటున్నావు.

మీరు మాకు వంట చేసి పెట్టు అని చెబుతా. అప్పుడు మన ఇద్దరిని చూసి భార్యాభర్తలు అనుకొంటుంది. అప్పుడు ఈ ప్రాబ్లెం సాల్వ్ అవుతుంది అని కార్తీక్ అన్నాడు. దాంతో దాన్ని తీసుకురావొద్దు.. అది వస్తే గొడవలవుతాయి. నేను వంట చేయొద్దు కదా.. నేను వేరే వంట మనిషిని పెడుతాను అని మోనిత చెప్పింది.

దాంతో అయితే ఒకే.. మేము అలా బయటకు వెళ్లి వస్తాను అంటూ కార్తీక్ వెళ్లిపోయాడు. కానీ వంటలక్క పేరు ఎత్తడంతో మోనితలో గుబులు పెరిగింది. ఇదిలా ఉండగా.. నేను వెళ్లొస్తాను అంటూ దీప బయటకు రావడం ఓ ట్విస్టుగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X