Karthika Deepam అమ్మా, నాన్నను చంపావు.. నిన్ను వదిలేదేలే.. హిమపై రగిలిపోతున్న శౌర్య
తన అమ్మా, నాన్న మరణానికి కారణమైన హిమపై శౌర్య పీకల్లోతు కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకొన్నది. ఏళ్లు గడిచినా ఆ కోపం రెట్టింపు అయిందే కానీ.. ఏ మాత్రం తగ్గలేదు. ఇంటి నుంచి పారిపోయిన శౌర్య ఆటో డ్రైవర్‌గా మారింది. అయితే తనను ఉద్దేశించి వస్తావా అని అడిగిన పోకిరికి దేహశుద్ది చేస్తుండగా.. ఫోన్ మోగింది. శౌర్య ఫోన్ రిసీవ్ చేసుకొని.. ఇక్కడ ఒకడు ఎక్స్‌ట్రా మాట్లాడుతుంటే మీటర్ బిగించి వస్తున్నా.. అయిపోగానే వస్తాను అంటూ ఫోన్ పెట్టేసింది. శౌర్య వెళ్లిపోతుంటే.. ఏమండి మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతాను అని పోకిరి అడిగితే.. ఊ అంటూ అడగమని సైగ చేసింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1306లో ఇంకా ఏమి జరిగిందంటే..

జ్వాలా మంచి పేరే.. పేరు నిలబెట్టుకొన్నావు అంటూ
శౌర్యతో పోకిరి మాట్లాడుతూ.. ఈ ఆటో మీద వదిలేదిలే అని రాశారు. నాలాంటి వాడిని వదలిపెట్టరా? అని అడిగితే.. తన తల్లిదండ్రులు మరణానికి కారణమైన హిమను గుర్తు చేసుకొని.. చేతిపై ఉన్న H అనే పచ్చబొట్టు చూసుకొని.. అమ్మా, నాన్నలను చంపేసిన హిమను వదిలేది లేదు అని మనసులో అనుకొన్నది.
ఆ తర్వాత రెండో ప్రశ్నగా మీ పేరు ఏమిటో తెలుసుకోవచ్చా అంటే.. జ్వాలా అని సమాధానం చెప్పింది. దాంతో మంచి పేరు.. పేరు నిలబెట్టుకొన్నావు అంటూ పోకిరి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆటోపై వదిలేదిలే అని రాసిన పదాలను చూస్తూ.. ఎక్కడ ఉన్నావు.. నిన్ను వదిలేది లేదు అంటూ శౌర్య (జ్వాలా) కోపంతో రగిలిపోయింది.

హిమ బర్త్ డేలో సౌందర్య ఎమోషనల్
ఇక హిమ బర్త్ డే సెలబ్రేషన్స్‌కు అంతా సిద్దమైంది. హిమ ముందు రెండు కేకులు పెట్టి సిద్దం చేశారు. అయితే హిమ ఎవరి కోసమో వేచి చూస్తుంటే.. ఇంకా ఎవరైనా రావాలా అంటే.. కారులో నుంచి ఒక యువకుడు దిగాడు. ఇంట్లోకి రాగానే.. అదిగో ప్రేమ్ వచ్చాడు అంటూ నిరుపమ్ అన్నాడు. దాంతో సీరియస్‌గా ఉన్న ఫ్యామిలీ సభ్యులను చూస్తూ బర్త్ డే రోజున కూడా లేటుగా రావాలా? సమయానికి రావడం తెలియదా? ఇదేనా పద్దతి అంటూ మీ ప్రశ్నలు కదా.. నా ఉద్యోగం అలాంటిది.
ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌ను. సమయం నా చేతిలో ఉండదు. నా టీమ్ వస్తున్నది. రెండు నిమిషాల్లో కేక్ కట్ చేద్దాం అంటూ ప్రేమ చెప్పగానే హిమ సరే అంది. తన సోదరుడు నిరుపమ్‌ను పలకరిస్తూ.. ఏంటిరా నువ్వు ఎప్పుడు వచ్చావు.. నీ పద్దతి, వాలకం చూస్తే కార్తీక్ మామయ్యలా ఉంటావని అంటుంటారు అని అన్నాడు.

రెండు కేకుల గురించి ప్రశ్న
ప్రేమను పలకరిస్తూ.. డాడీ రాలేదా? అని నిరుపమ్ అడిగాడు. దాంతో మమ్మి రాలేదా అని నిరుపమ్‌ను ప్రేమ్ పలకరించాడు. అయితే మమ్మీ సంగతి నీకు తెలుసు కదా.. అంటే.. నీవు చాలా సాఫ్ట్.. నీవు చెప్పితే ఒప్పుకోదు అని ప్రేమ్ అన్నాడు. మీరందరూ కలిసి ఉండాలని నా కోరిక. మీ ఇద్దరైనా మీ అమ్మా, నాన్నను కలపవచ్చు కదా అంటే.. వారిని కలిపే క్రమంలో మా ఇద్దరి మధ్య ఏవైనా గొడవలు వస్తాయని అని వదిలేశాం అని ప్రేమ్ చెప్పడంతో.. సరే.. కేక్ కట్ చేద్దాం అంటూ ఆనందరావు ఆ టాపిక్‌ను కట్ చేశాడు.
అంతలోనే హిమ ముందు రెండు కేకులు ఉండటంతో ఓ అతిథి వాటి గురించి అడిగాడు. మా మనవరాళ్లు ఇద్దరు కవలలు. అందులో హిమ ఒకరు అని చెప్పారు. అంటే మా అక్క శౌర్య అంటూ హిమ చెప్పింది. దాంతో శౌర్య ఎక్కడుంది అని అడిగితే సౌందర్య మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత కేక్ కట్ చేసి సెలెబ్రేషన్స్ జరుపుకొన్నారు.

ఆటో డ్రైవర్ శౌర్య బర్త్ డే సెలబ్రేషన్స్
మరోచోట శౌర్య అలియాస్ జ్వాలా కోసం ఆటో డ్రైవర్లు అందరూ కేక్ పెట్టుకొని వెయిట్ చేస్తున్నారు. అంతలోనే జ్వాలా అక్కడికి రావడంతో కేక్ కట్ చేయమని అడిగారు. నాకు బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు నచ్చదు అంటే.. నీ పుట్టిన రోజు అంటే మాకు సంతోషం. ఓ పండుగ అని ఆటో డ్రైవర్లు.. అంటే.. హిమ పుట్టిన రోజున నేను సంతోషంగా ఉండటం ఇష్టం ఉండదు. అందుకే నేను కేక్ రేపు కట్ చేస్తా అంటే.. లేదు ఈ రోజే కట్ చేయమని బలవంతం చేస్తే సరేనని కేక్ కట్ చేసింది. దాంతో అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. నాకు వేరే పని ఉంది.. మళ్లీ వస్తానంటూ జ్వాలా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

హిమపై శౌర్య మరింత కోపంగా
ఇదిలా ఉండగా.. జైలు నుంచి విడుదలైన ఇంద్రుడు, చంద్రుడు ఏకంగా జైలర్ జేబు కొడుతుంటే.. జ్వాలా వచ్చి పట్టుకొన్నది. జేబు కొట్టిన వ్యక్తి కానిస్టేబుల్ కావడంతో షాక్ తిన్నారు. ఆ తర్వాత తనను పెంచిన ఇంద్రుడు, చంద్రమ్మను మందలించి.. ఓ ఇంట్లో వంటమనుషులుగా పనికి పెట్టింది. అయితే వందలు వేలు కొట్టేసే చేతులతో వంటా పని చేయాలా? అంటూ ఇంద్రుడు, చంద్రమ్మ అనుకొన్నారు.
అయితే మంచి మనిషిగా అనిపించుకొనే జ్వాలాను చూసి.. వీళ్ల కడుపులో ఎలా పుట్టావంటూ జైలర్ ప్రశ్నించాడు. అయితే తన తల్లిదండ్రులకు మంచి మనసుతో ఉద్యోగం ఇచ్చినందుకు జైలర్‌కు జ్వాలా థ్యాంక్స్ చెప్పింది. అయితే తన ఆటో మీద వదిలేదేలే అని రాసి ఉండటంపై జ్వాలా ప్రశ్నించడంతో మరోసారి గతాన్ని గుర్తు చేసుకొని సీరియస్ అయింది.


Click it and Unblock the Notifications











