Don't Miss!
- News షర్మిల గురి మారిందా - వారి ఆశలపై నీళ్లు, ఫలితం తారుమారు..!!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్‌ను కూడా
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్‌లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
Karthika Deepam మద్యం మత్తులో నిరుపమ్.. శౌర్యతో అలా చేసి షాకిచ్చిన డాక్టర్ సాబ్
నిశ్చితార్థం పీటల మీద నుంచి నాకు పెళ్లి ఈ ఇష్టం లేదంటూ హిమ లేచిపోవడంతో అందరూ షాక్ గురయ్యారు. తనకు ఇష్టమైన హిమను నిరుపమ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని సౌందర్య నిర్ణయం తీసుకోవడంతో ప్రేమ్ తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురయ్యాడు. అయితే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదంటూ హిమ చెప్పడంతో ప్రేమ్ ఆనందపడిపోయాడు.
నా కోసమే హిమ ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందా? తనలో నాపై ప్రేమ ఉందా? తనను ప్రేమించినందుకు అలా చెప్పి ఉంటుందా? ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. అంతకు మించి వేరే కారణం లేదుగా. టైమ్ తీసుకొని ప్రేమ్ బావను పెళ్లి చేసుకొంటానని చెబుతుందేమో అని ప్రేమ్ మనసులో అనుకొన్నాడు. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1353లో ఇంకా ఏం జరిగిందంటే..
నాపై హిమకు ప్రేమ ఉందా
ప్రేమ్ ఇలా మనసులో అనేక రకాల ప్రశ్నలు వేసుకొంటుండటంతో తండ్రి సత్యం మద్యం సేవించి ఇంట్లోకి డీలాగా అడుగుపెట్టాడు. హిమ ఇలాంటి పనిచేసిందేమిటిరా అంటూ అని ప్రేమ్‌తో సత్య అంటే.. అప్పుడే మందు మొదలుపెట్టేశావా అంటే.. బాధలో ఉండి ఒక పెగ్ వేశాను రా, హిమ ఎందుకలా చేసింది రా అని సత్యం అంటే.. ఎవరి మనసులో ఏముందో.. దాని గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోకు. అంతా మన మంచికే జరిగింది. ఎలాగైనా హిమ మన ఇంటికే కోడలుగా వస్తుంది. నీకు త్వరలోనే తెలుస్తుంది అని ప్రేమ్ మనసులో అనుకొన్నాడు.
పెళ్లి ఇష్టం లేదంటూ ఓ అమ్మాయి అంటూ
ప్రేమ్, సత్యం అలా మాట్లాడుకొంటుండటంతో జ్వాలా క్యారేజ్ తీసుకొని వచ్చింది. జ్వాలాపై సెటైర్ వేయగా.. ఎందుకలా మాట్లాడుతావు అని అంటే.. అసలే జ్వాలా తింగరి. హిమ పెళ్లి క్యాన్సిల్ అయిన విషయాన్ని చెప్పకు అని ప్రేమ్ అన్నాడు. ఇక సత్యంతో మాట్లాడుతూ.. సార్.. ఉదయం వస్తే.. మీరు కనిపించలేదు.
ఇంటికి తాళం వేసి ఉందని అంటే.. మాకు తెలిసిన వారి ఇంట్లో ఎంగేజ్ మెంట్ ఫంక్షన్ ఉంటే వెళ్లివచ్చాం అని సత్యం చెప్పాడు. దాంతో ఉదయం నేను కూడా గుడికి వెళ్లాను. అక్కడ కూడా ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ అమ్మాయి తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పి వెళ్లిపోయిందట అని జ్వాలా చెప్పగానే ఇద్దరూ షాక్ అయ్యారు.
చెంపదెబ్బ కొట్టిన సౌందర్య
నాకు పెళ్లి ఇష్టం లేదని పీటలపై నుంచి బయటకు వచ్చిన హిమపై సౌందర్య మండిపడింది. చివరి నిమిషంలో నీకు ఏం జరిగింది? స్వప్న ఒప్పించడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? నీకు బావా అంటే ఇష్టమే కదా.. ఎందుకు పెళ్లి ఇష్టం లేదని చెప్పావు. నీ నెత్తి మీద ఏం కూర్చొన్నది? నీ మనసులో ఏమున్నదో నాకు తెలియాల్సిందే అని సౌందర్య అంటే.. నేను మీకు చెప్పానుగా అని హిమ సమాధానం చెబితే.. నిన్ను ఎవరైనా బెదిరించారా? స్వప్న ఏమైనా బెదిరించిదా? నిజం చెప్పు. దాని సంగతి నేను చూసుకోంటా అని సౌందర్య అంటే.. అదేం లేదు నానమ్మ... నన్నేమి అడుగవద్దు అంటూ హిమ అనగానే.. సౌందర్య కోపంతో ఆమెను చెంపదెబ్బ కొట్టింది.
నీ మనసులో ఏముందో చెప్పు.. స్వప్న నన్ను ప్రశ్నించిన తీరుతో నా గుండె పగిలిపోయింది అని అంటే.. శౌర్య కూడా నిరుపమ్ బావను ప్రేమిస్తుందని నీకు ఎలా చెప్పను అంటూ హిమ కన్నీరుమున్నీరైంది. నిశ్చితార్తం క్యాన్సిల్ కావడంతో నిరుపమ్ ఎంత బాధపడుతున్నాడో తెలుసా? హిమకు ఏమైంది? ఇప్పుడు నిరుపమ్ పరిస్థితి ఏమైందో అని సౌందర్య ఆవేదన చెందింది.
శౌర్య ఐ లవ్ యూ అంటూ నిరుపమ్
రోడ్డుపై తప్పతాగి కారులో పడిపోయిన నిరుపమ్‌ను చూసి జ్వాలా పరేషాన్ అయింది. డాక్టర్ సాబ్ ఏమైంది.. ఇక్కడ ఎందుకు ఉన్నారు అంటే.. నేను, నా కారు.. నా ఇష్టం అని నిరుపమ్ అన్నాడు. దాంతో డాక్టర్ సాబ్ మీరు మందు తాగారా అని జ్వాలా అంటే.. తాగకూడదా? అని సమాధానం ఇచ్చాడు. హిమ తనను రిజెక్ట్ చేయడంతో నేనంటే నీకు ఇష్టమేనా.. ఐ లవ్ యూ.. ఐ లవ్ సో మచ్ అంటూ నిరుపమ్ గట్టిగా అరిచాడు.
నేను ఇంతగా ప్రేమించానో తెలుసా? నీవు ఎప్పుడైనా చెప్పావా? నా గుండెల్లోని ప్రేమను నీవు అర్ధం చేసుకోలేదు అని నిరుపమ్ అంటే.. జ్వాలా ఆనందపడిపోయింది. నేను ఒంటరిని అంటే.. మీరు ఒంటిరి వారు ఏమిటి అని జ్వాలా సమాధానం చెబుతూ నిరుపమ్‌ను ఆటోలో ఇంటికి తీసుకెళ్లింది.
పీడ వదిలించుకోవాల్సిందే..
మద్యం మత్తులో ఉన్న నిరుపమ్‌ను ఇంటికి తీసుకొచ్చిన జ్వాలాను చూసి స్వప్న హ్యాపీగా ఫీలైంది. భుజంపై నిరుపమ్‌ను తీసుకొస్తుండటంతో వదిలేయ్.. నేను తీసుకెళ్తాను. నీవు వెళ్లిపో అని స్వప్న అంటే.. నీ ఇంట్లోకి వస్తానా అంటూ ఆటో వద్దకు వెళ్లింది.
అయితే హిమ వెళ్లిపోయిందనుకొంటే.. ఆటో డ్రైవర్ పీడ పట్టుకొన్నది. ఆమెను కూడా వదిలించుకోవాలి అని స్వప్న మనసులో అనుకొన్నది. ఇక నిరుపమ్ ఐలవ్ యూ చెప్పడంతో జ్వాలా హ్యాపీగా ఫీలైంది. మందు తాగి.. మనసులో మాట చెప్పేశావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు గ్రేట్.. నేను కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నాను అంటూ జ్వాలా ఆనందపడిపోయింది.
హిమ ఇంటి నుంచి బయటకు
నిశ్చితార్తం క్యాన్సిల్ అయిన తర్వాత హిమ తన బ్యాగు సర్దుకొని బయటకు వెళ్తుంటే.. ఎక్కడికి వెళ్తున్నావు అంటూ సౌందర్య ప్రశ్నిస్తే.. హాస్టల్లో ఉంటాను అని హిమ సమాధానం చెప్పింది. దాంతో మన ఇల్లు పెద్దదని అందరూ అనుకొంటారు. ఇల్లు సౌకర్యంగా ఉంటుందని అందరూ అంటే నేను నమ్మాను. కానీ నీవు అది అబద్దమని నిరూపించావు. సండే, ఫెస్టివల్స్ ఉంటాయి. అప్పుడైనా వస్తావా. నీ కంటూ ప్లాన్స్ ఉంటాయి. నేను చెప్పిందంతా విని.. చివరి నిమిషంలో నీ నిర్ణయం నీవు తీసుకొన్నావు అని సౌందర్య అంది.
హిమ నష్టజాతకురాలు అంటూ
ఇక తాజా ప్రోమోలో హిమపై స్వప్న మండిపడింది. అదొక నష్ట జాతకురాలు. అలాంటి వ్యక్తి మన ఇంటికి కోడలుగా రాకపోవడం మంచి జరిగింది. నిన్ను పెళ్లి చేసుకొంటే నీకు ఎంత కీడు జరిగేదో.. అని స్వప్న అంది. ఇక నిరుపమ్‌ను కలిసిన జ్వాలా.. రాత్రి నీకు ఏమైంది? అని అడిగితే.. రాత్రి నేను ఏమైనా ఎక్కువ మాట్లాడానా? అని ప్రశ్నించాడు. అయితే డాక్టర్ సాబ్ మళ్లీ మీరు మళ్లీ ఎప్పుడు మద్యం తాగుతారో చెబుతారా అని జ్వాలా అంటే.. ఎందుకు అని నిరుపమ్ ప్రశ్నిస్తే..మళ్లీ ఐలవ్ యూ చెబుతారుగా అని జ్వాలా సిగ్గుపడిపోయింది.