Karthika Deepam నువ్వే నా మొగుడివి.. నిరుపమ్‌పై పీకల్లోతూ ప్రేమలో శౌర్య

తన మనసులో ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి హిమను ప్రేమ్ బలవంతంగా హోటల్‌కు తీసుకెళ్లాడు. అయితే తను హాస్పిటల్‌కు వెళ్లాలి? త్వరగా నన్ను పంపించు అంటే.. స్పెషల్‌గా వచ్చాం కదా? అందుకోసమే నేను స్పెషల్‌గా కాఫీ తయారు చేపిస్తున్నా అని సమాధానం చెప్పాడు. అంతలోనే ప్యాసింజర్స్ తీసుకొని అదే హోటల్‌కు జ్వాలా అలియాస్ శౌర్య వచ్చింది.

అంతలోనే హిమ, ప్రేమ్ టేబుల్ ముందు కాఫీని సర్వర్ పెట్టగా.. ఒక్కసారి శౌర్య వచ్చి కాఫీ కప్పును లాగేసుకొని గడగడ తాగేసింది. అయితే లవ్ సింబల్‌తో స్పెషల్ కాఫీ ప్రిపేర్ చేయించడం, దానిని శౌర్య తాగేయడంతో ప్రేమ్‌ కోపం పెరిగిపోయింది. అయితే కాఫీ బాగుంది? మొన్న నేను పార్టీ ఇచ్చానుగా.. దానికి ఇది చెల్లు అంటూ శౌర్య అక్కడి నుంచి వెళ్లింది. కార్తీకదీపం సీరియల్ 1335 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

హిమ కోసం లవ్ సింబల్‌తో కాఫీ

హిమ కోసం లవ్ సింబల్‌తో కాఫీ

ఇక హిమతొ డాక్టర్ నిరుపమ్ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. సెల్‌ఫోన్‌లో శౌర్య ఫొటోను చూసుకొంటూ... మనం విషయం మమ్మీకి ఎలా చెప్పాలో తెలియడం లేదు. నీతొ నాకు ఎలాంటి ప్రాబ్లెం లేదు అని మనసులో నిరుపమ్ అనుకొంటుండగా.. హిమ అక్కడికి వచ్చింది. దాంతో నిరుపమ్ కంగారుపడిపోయి.. ఫోన్‌ను దాచేందుకు ప్రయత్నించాడు. అయితే ఏమిటి అలా అయిపోయావు అని హిమ అంటే.. అవును.. ఫోన్ చేజారి పోతుంటే.. కంగారుపడిపోయాను అని నిరుపమ్ అన్నాడు. దాంతో అవును బావ.. ఒక్కసారి ఏదైనా చేజారిపోయిందంటే.. అంతే అని హిమ వేదాంతం ప్రదర్శించింది.

మామిడి తోటకు హిమ, నిరుపమ్

మామిడి తోటకు హిమ, నిరుపమ్

హిమ, నిరుపమ్ మాట్లాడుకొంటుంటే.. ఇంజెక్షన్ తీసుకోవడానికి పెషెంట్ బయపడుతుంటే.. హిమ లేచి ధైర్యంగా ఆమెకు ఇంజెక్షన్ ఇవ్వడం చూసి.. నీవేనా ఇంజెక్షన్ ఇచ్చింది. నమ్మలేకపోతున్నాను అని అంటే.. గతంలో నాకు ఇంజెక్షన్ అంటే భయం.. కానీ నీవల్లే అదిపోయింది. నీవు శౌర్యతో ఇప్పించిన ట్రైనింగ్ కారణంగానే నాలో ధైర్యం పెరిగింది. ఇదంతా శౌర్య కారణంగానే అంటూ హిమ ఎమోషనల్ అయింది. అంతలోనే మనం మామిడి తోట వద్దకు వెళ్దామా అంటే.. సరే అని నిరుపమ్ కూడా అన్నాడు. అలా తోటకు వెళ్లి వస్తే.. హ్యాపీగా ఉంటుంది అంటే. నీలో మార్పుకు ఇది కూడా ఓ కారణం అని నిరుపమ్ అన్నాడు.

 హిమను వదలేదిలే అంటూ

హిమను వదలేదిలే అంటూ

ఇక సౌందర్య ఇంటి వద్దకు ఆటోలో శౌర్య వెళ్లింది. ఇంట్లో ఉండేవాళ్లను తాతయ్య పేరు చెప్పి అడ్రస్ అడుగుదాం అంటూ ఇంట్లో అడుగుపెట్టింది. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో.. నిరాశతోపాటు కోపంతో ఊగిపోయింది. హిమను తలచుకొని.. తప్పించుకొన్నావే.. అయినా నిన్ను వదిలేదేలే. ఎక్కడ ఉన్నా నేను పట్టుకొంటాను అని శౌర్య అక్కడి నుంచి వెళ్లిపోయింది.

హిమ, ఆటో డ్రైవర్‌ దరిద్రం అంటూ

హిమ, ఆటో డ్రైవర్‌ దరిద్రం అంటూ

హిమ, నిరుపమ్ కారులో మామిడి తోటకు వెళ్తుంటే.. శౌర్య ఆ కారును చూసింది. అరే డాక్టర్ సాబ్ కారు అంటూ వెంబడించింది. అయితే నిరుపమ్ కారు వెంబడిస్తుంటే.. నిరుపమ్ తల్లి స్వప్న కూడా చూసింది. ఏమిటి ఆటో డ్రైవర్ కూడా ఇక్కడే తగలబడింది? హిమ ఒక దరిద్రం అనుకొంటే.. ఇది కూడా తయారైంది. వీళ్లద్దరిని వెంటనే నిరుపమ్‌తో కట్ చేయాలి. ఆటో తగలబెట్టినా బుద్ది రాలేదు అని కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి స్వప్న వెళ్లిపోయింది.

 నీవే నా మొగుడివి అని శౌర్య

నీవే నా మొగుడివి అని శౌర్య

అయితే జ్వాలాను చూస్తూ.. నీకు, నాకు ఏమీ తేడా లేదు. నీకు నాకు ఒక్కటే తేడా.. నీకు ఆటోకు మూడు టైర్లు, నా కారుకు నాలుగు టైర్లు.. ఇక నుంచి మనం దోస్త్ అంటూ చేతులు కలిపారు. దాంతో హిమ, శౌర్య హ్యాపీగా ఫీలయ్యాను. మన మధ్య థ్యాంక్స్, సారీలు ఉండకూడదు అని నిరుపమ్ అంటే.. నా లైఫ్‌కు నువ్వే అని ఫిక్సయ్యాను. నీవే నా జీవితం, నీవు సర్వస్వం. చివరకు నీవే నా మొగుడివి అంటూ శౌర్య మనసులో అనుకొన్నది. శౌర్యలో ఆనందం చూసి హిమ మరింత సంతోషపడింది. అలా అక్కడి నుంచి శౌర్యకు బైబై చెప్పి.. నిరుపమ్, హిమ వెళ్లిపోయారు.

హిమను ఎత్తుకొని నిరుపమ్ రొమాంటిక్‌గా

హిమను ఎత్తుకొని నిరుపమ్ రొమాంటిక్‌గా

మామిడి తోటలో హిమ అడుగుపెట్టగానే.. ముగ్గురు పిల్లలు మామిడి కాయను అందుకోవడానికి ప్రయత్నించి విఫలం కావడంతో.. నేను కోసి ఇస్తానని చెప్పింది. ఇప్పటికే మేము ప్రయత్నించాం. నీతో కాదు అంటే.. ఎందుకలా.. నేను కోసి ఇస్తాను అంటే.. మీకు మూడు సార్లు ఛాన్సులు ఇస్తాం. కోసి ఇవ్వాలి అని ముగ్గురు అబ్బాయిలు చాలెంజ్ విసిరారు. దాంతో మామిడి కాయను తెంచేందుకు ప్రయత్నించగా.. ఒకసారి మిస్ అయింది. మరోసారి ప్రయత్నించగా.. అమాంతం లేచి కాయను అందుకొన్నది. అయితే నిరుపమ్ హిను ఎత్తుకోవడంతో తేలిగ్గా కోయగలిగింది. అయితే తనను ఎత్తుకొన్న నిరుపమ్‌ను చూసి హిమ ఆనందపడిపోయింది.

సౌందర్య, శౌర్య అలాంటి ఎత్తుగడ

సౌందర్య, శౌర్య అలాంటి ఎత్తుగడ

ఇక తాజా ప్రోమోలో మరో ట్విస్టుకు తెరదించారు. చిన్నప్పటి ఫోటోలను చూపించి.. పెద్దయ్యాక ఎలా ఉంటారో అని ఆర్టిస్టుతో ఫోటోలు గీయించే పనిలో సౌందర్య, శౌర్య పడ్డారు. గీత అనే ఆర్టిస్టుతో ఇది నా మనవరాలి చిన్నప్పటి ఫోటో.. ఇప్పుడు ఇలా ఉంటుందో గీయించి చూపించండి అంటూ సౌందర్య అడిగింది. అంతలోనే అక్కడకు శౌర్య వచ్చి.. తన నానమ్మను చూసి.. సీనియర్ సిటీజన్ ఇక్కడికి ఎందుకు వచ్చిందో అని శౌర్య అంటే.. చిన్నప్పటి నా మనవరాలి ఇప్పుడు ఎలా ఉంటుందనే ఫోటోను గీయిస్తున్నాను అని చెప్పింది. అయితే హిమ వద్దకు వెళ్లి.. తన చేతిపై టాటూను చూపించి.. నా శత్రువు ఇప్పుడు ఎలా ఉంటుందో ఆర్టిస్టుతో ఫోటో గీయిస్తాను అని చెప్పడంతో హిమ షాక్ గురైంది. ఇలా టిస్టులతో తదుపరి ఎపిసోడ్‌పై ఆసక్తిని పెంచే ప్రయత్నం యూనిట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X