Karthika Deepam ఆకలి అన్ని నేర్పిస్తుంది.. శౌర్య ఎమోషనల్.. హిమ పెళ్లి ఏర్పాట్లలో సౌందర్య
డాక్టర్ నిరుపమ్, డాక్టర్ హిమ ఇద్దరూ మామిడితోటకు వెళ్లడం, అక్కడ హిమ మామిడి కాయలు కోయలేకపోవడంతో తోటలో పిల్లలు ఓడిపోయావని గేలి చేశారు. ఒకేసారి ట్రై చేశాను. అంతా మాత్రాన ఓడిపోయానని అనకు అని హిమ చెప్పింది. ఆ తర్వాత మళ్లీ మామిడికాయను కోయడానికి హిమ ఎగిరిన సమయంలో నిరుపమ్ వచ్చి నడుముపై చేయి వేసి ఎత్తుకోవడంతో హిమ మామిడి కాయను కోయగలిగింది. అయితే తన నడుముపై చేయి వేసి ఎత్తుకోవడంతో హిమ ఒకరకమైన ఫీలింగ్‌కు గురైంది. థాంక్యూ బావా నేను గెలిచాను అని హిమ అంటే.. నిన్ను ఎప్పుడూ గెలిపిస్తూనే ఉంటాను అని నిరుపమ్ అన్నాడు.
దాంతో ఇప్పుడు చెప్పండి.. ఎవరు గెలిచారో అంటుండగా.. అక్కడికి నిరుపమ్ తల్లి స్వప్న వచ్చి చాటుగా చూస్తూ ఉండిపోయింది. మామిడి తోటలో నిరుపమ్, హిమను చూసి స్వప్న ఊగిపోయింది. ఇద్దరి వ్యవహారం హద్దులు దాటుతున్నది. నా కొడుకును హిమ వలలో వేసుకొన్నది. అర్జెంట్‌గా ఏదో ఒకటి చేయాల్సిందే అంటూ అక్కడి నుంచి స్వప్న వెళ్లిపోయింది. కార్తీకదీపం సీరియల్‌లో 1336 ఎపిసోడ్‌లో ఇంకా ఏమి జరిగిందంటే?

శౌర్య దొరికినట్టు కల రావడంతో
సౌందర్య కారులో వెళ్లుండగా.. ఆనందరావు తనకు రాత్రి వచ్చిన కలను షేర్ చేసుకొంటూ.. రాత్రి నా కలలో శౌర్య దొరికినట్టు కల వచ్చింది. తెల్లవారు జామున వచ్చే కలలు నిజమవుతాయని చెబుతారు. నా కల నిజమైతే బాగుండు. ఏళ్ల తరబడి నీవు శౌర్య కోసం వెతుకుతున్నావు అని ఆనందరావు అన్నాడు. దాంతో నేను ఇంటర్నెట్‌లో ఓ ఆర్టిస్టు గురించి ఓ ఆర్టికల్ చదివాను.
చిన్నప్పటి ఫోటో ఇస్తే.. పెద్దైన తర్వాత వాళ్లు ఎలా ఉంటారో ఫోటో గీసి ఇస్తారని తెలుసుకొన్నాను అని సౌందర్య చెప్పింది. అయితే సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి జ్వాలా అలియాస్ శౌర్య ఆటో వచ్చి కారును గుద్దేసింది. దాంతో ఏంటీ చూసుకొని నడపలేవా? అని కోపంతో అరిస్తే.. ఏం సీనియర్ సిటిజన్ ఇక్కడేంటి.. నీవు సడెన్ బ్రేక్ వేస్తావని నేను ఊహించలేదు అని జ్వాలా గట్టిగా సమాధానం ఇచ్చింది. డాష్ ఇచ్చి.. ఎక్కువ మాట్లాడుతున్నావు.. కారు డెంటింగ్ కోసం ఎంత కావాలో చెప్పు.. నేనిస్తా అని జ్వాలా అంటే.. నీవు అంత డబ్బు ఉన్నదానివా అంటూ సౌందర్య గట్టిగా అరిచింది.

నిన్ను చూస్తే మా మనవరాలు గుర్తుకు వస్తున్నది
అయితే జ్వాలాను చూస్తూ.. నిన్ను చూస్తే.. చిన్నప్పుడు తప్పిపోయిన నా మనవరాలు గుర్తుకు వస్తున్నది అని ఆనందరావు అన్నాడు. దాంతో తప్పిపోతే.. నన్ను వెతుకకుండా మాటలు చెబుతున్నారు అని జ్వాలా అలియాస్ శౌర్య మనసులో అనుకొన్నది. అయితే ఆనందరావు తన పాకెట్‌లో నుంచి డబ్బు తీసి.. అమ్మా.. నీవు ఇక ముందు కనిపిస్తే.. సీనియర్ సిటిజన్ అనో.. లేదా మరో పేరు పిలువకుండా తాతయ్య అని పిలువు.
నీ ఆటో బాగు చేయించుకోవడానికి ఈ డబ్బు తీసుకో అని ఆనందరావు అంటే.. డబ్బులు తీసుకోవడానికి జ్వాలా నిరాకరించింది. దాంతో కాదనకు.. మీ తాతయ్య ఇచ్చాడని అనుకో అని డబ్బులు చేతిలో పెట్టాడు. అయితే మీకు ఎవరిని చూసినా శౌర్యనే గుర్తుకు వస్తుంది పద.. పదా అంటూ కారు ఎక్కి.. సౌందర్య, ఆనందరావు ముందుకు కదిలారు. అయితే కారును ఫాలో అవుదామని జ్వాలా ప్రయత్నిస్తే.. ఆటో స్టార్ట్ కాలేదు. దాంతో వారు ఎక్కడికి వెళ్లున్నారో తెలుసుకొందామని అనుకొంటే.. ఆటో స్టార్ట్ కావడం లేదేంటి అని జ్వాలా కంగారుపడిపోయింది.

నా కొడుకు పెళ్లి ఎలా చేయాలో అంటూ
తన కొడుకు, హిమతో క్లోజ్‌గా ఉండటం చూసి స్వప్న తట్టుకోలేకపోయింది. ఇదంతా నా తల్లి సౌందర్య ప్లానే.. నా కొడుకుకు ఏమీ తెలియదు. హిమ అమెరికాలో ఉన్నప్పుడే నిరుపమ్ బాగుండేవాడు. ఒకవైపు హిమ, మరో వైపు ఆటో డ్రైవర్ దాపురించారు అని మనసులో అనుకొంటుండగా.. ఆనందరావు వచ్చాడు. నేను కోపంతో ఊగిపోతున్నా అంటూ హిమ, నిరుపమ్ మామిడితోటలో క్లోజ్‌గా ఉండటం గురించి చెప్పి అరిచింది. ఇదంతా అమ్మ ప్లాన్.. చూడు వారిద్దరి సంగతి చెబుతాను. నా కొడుకుకు ఎలా పెళ్లి చేయాలో నాకు తెలుసు అంటూ స్వప్న ఆవేశంగా ఇంట్లోకి వెళ్లింది.

జ్వాలాను చూసి గీత ఆశ్చర్యంగా
ఇక తన చేతిపై టాటూను చూసుకొంటూ.. హిమ ఎక్కడున్నావే అంటూ జ్వాలా మండిపోయింది. అయితే ఓ మోడరన్ యువతి అక్కడకు వచ్చి.. అమ్మాయి ఆటో డ్రైవరా? ధైర్యవంతురాలు అయి ఉంటుంది అనుకొంటూ జ్వాలాను పలకరించింది. నిన్ను చూస్తుంటే గర్వంగా అనిపిస్తున్నది. నువ్వు ఆటో నడుపుతున్నావు చూడు.. నిజంగా గ్రేట్ అని అంటే.. అన్నింటికన్నా.. ఆకలి ఒకటి ఉంటుంది.
ఆకలి అన్ని నేర్పిస్తుంది మేడమ్ అంటే.. నా పేరు గీత అని పరిచయం చేసుకొన్నది. దాంతో నా పేరు జ్వాలా తను పరిచయం చేసుకొన్నది. అలా ఆటోలో వెళ్తూ చాలా మాట్లాడుకొన్నారు. తన డెస్టినేషన్ రావడంతో గీత దిగింది. డబ్బులు ఇచ్చి.. నీవు ఏం చేస్తావంటే.. నేను ప్రొఫెషనల్ ఆర్టిస్టును అంటూ.. జ్వాలా చేతిలో ఓ ఫోటోను పెట్టింది. అయితే తన బొమ్మను ఆటోలో ఉండి గీయడంపై ఆశ్చర్యపోయింది.

జన్మజన్మల బంధం అంటూ సౌందర్యతో జ్వాలా
ఆర్టిస్ట్ గీత తన ఆఫీస్‌లోకి వెళ్లడంతో.. అక్కడ సౌందర్య వెయిట్ చేస్తూ కూర్చున్నది. నేను మీ కోసం వచ్చాను. నా మనవరాలి బొమ్మను గీయాలి అంటూ ఫొటో ఇచ్చింది. అయితే అంతలోనే తన ఫోటొకు గీసినందుకు డబ్బులు ఇవ్వాలని లోపలికి వచ్చింది. అక్కడ సౌందర్యను చూసి.. ఓ సీనియర్ సిటిజన్ ఇక్కడ ఉన్నారంటి అంటే.. నన్ను అలా పిలువకని చెప్పాను కదా అని సౌందర్య కోపంగా అరిచింది.
అయితే జ్వాలా మీకు ఆమెతో ముందే పరిచయం ఉందా అంటే.. అవును ఆమెతో నాకు జన్మజన్మల బంధం ఉంది అని జ్వాలా అంటే. నీకు నాకు బంధమేమిటి అని సౌందర్య కోపగించుకొన్నది. అయితే సౌందర్యతో జ్వాల మాట్లాడుతూ.. ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే.. చిన్నప్పుడు నా మనవరాలు వెళ్లిపోయింది. ఆమె బొమ్మను గీయించడానికి వచ్చాను అంటే.. ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఇప్పుడు వెతకడం ఏమిటి? అంటూ సౌందర్యను విసిగించింది.

వెళ్లిపోయిందా? పారిపోయిందా? అంటూ జ్వాలా
సౌందర్యతో జ్వాలా తన మాటలను కొనసాగిస్తూ.. మీ మనవరాలు ఇంట్లో నుంచి వెళ్లిపోయిందా? లేక పారిపోయిందా అని జ్వాలా గుచ్చి గుచ్చి అడిగింది. దాంతో ఎందుకు విసిగిస్తున్నావు. నా శౌర్య కూడా ఇలానే విసిగించేది అని సౌందర్య అంటే.. శౌర్య ఎవరు అని జ్వాలా అడిగితే.. తప్పిపోయిన నా మనవరాలు అంటూ సౌందర్య సమాధానం చెబితే.. మీకు శౌర్యపై పెద్దగా అభిమానం, ప్రేమ లేదనుకొంటా అని శౌర్య మరింత విసిగించే ప్రయత్నం చేసింది.
దాంతో నోర్మూయ్.. అలా ఎలా అంటావు అని సౌందర్య అంటే.. నీ మనవరాలి వివరాలు చెప్పు అంటే.. నీకెందుకు.. ఆటో నడుపుకోనే దానివి. వివరాలు నీకెందుకు అంటే... ఆటో నడుపుకొంటాను. కాబట్టే చాలా మందిని కలుస్తాను అని శౌర్య చెప్పడంతో సౌందర్య కన్విన్స్ అయింది.

హిమ పెళ్లి ఫిక్స్ అంటూ సౌందర్య
ఇక తాజా ప్రోమోలో.. హిమ పెళ్లిని జరిపించేందుకు సౌందర్య సిద్దమైంది. ఈ పెళ్లిని తప్పకుండా జరిపిస్తాను. దాంతో శౌర్య దొరికేంత వరకు నా పెళ్లి టాపిక్ తీయవద్దు అని చెప్పానుగా అని హిమ అంటే.. శౌర్య దొరికింది కదా.. అని సౌందర్య చెప్పడంతో హిమ, ఆనందరావు షాక్ అయ్యారు. శౌర్య చిన్నప్పటి ఫోటో ఒకటి గొప్ప ఆర్టిస్టుకు ఇచ్చి వచ్చాను.
ఈ దెబ్బతో శౌర్య దొరికినట్టు అని సౌందర్య అంటే.. మరోవైపు అదే ఆర్టిస్టుతో హిమ బొమ్మను గీయించే పనిలో జ్వాలా రెడీ అయింది.దాంతో నానమ్మ.. శౌర్య ఒకేలా ఆలోచిస్తున్నారు అంటూ హిమ కంగారుపడిపోయింది. అయితే గీత గీసే బొమ్మలతో ఎలాంటి ట్విస్టు చోటుచేసుకొంటుందనే విషయం ఆసక్తిగా మారింది.

15వ వారంలో కార్తీకదీపం రేటింగ్ ఎలా అంటే..
ఐపీఎల్, రొటీన్ స్టోరీ, సన్నివేశాల కారణంగా కార్తీకదీపం సీరియల్ కొద్ది వారాలుగా రేటింగ్ పడిపోతున్నది. చాలా కాలం 13 రేటింగ్ పైనే ఉండే ఈ సీరియల్ గత రెండువారాలుగా 11 స్థాయికి పడిపోయింది. ప్రస్తుత ఏడాది 14వ వారంలో అర్బన్ ప్రాంతంలో 12.52 రేటింగ్ నమోదు చేసుకోగా.. 15వ వారంలో 11.89 రేటింగ్‌ను సాధించింది. ఇక గ్రామీణ ప్రాంతంలో 14వ వారంలో 12.52 రేటింగ్ నమోదు కాగా.. 15వ వారం 12.18 రేటింగ్‌ను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











