For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam అర్థరాత్రి తాగి.. జ్వాలాతో అలానా? నిరుపమ్‌కు తల్లి క్లాస్

  |

  డాక్టర్ నిరుపమ్‌తో పెళ్లి ఇష్టం లేదని నిశ్చితార్థం పీటల మీద నుంచి వచ్చిన హిమ ఇంటి నుంచి బయటకు వెళ్లి హాస్టల్‌లో ఉండేందుకు సిద్దమైంది. అయితే హిమ హాస్టల్‌లో ఉండాలని బ్యాగ్ సర్దుకోవడంతో.. నీకు ఈ ఇల్లు నచ్చలేదా? సరే హాస్టల్‌లో ఉంటావు. పండగలు, ఇతర హాలీడేస్ ఉంటాయి. అప్పుడైనా వస్తావా? లేదా.. ఏది చెప్పినా విన్నట్టే కనిపిస్తావు. కానీ చివరి నిమిషంలో మీ నిర్ణయం తీసుకోంటారు. ఇప్పుడు మీకు మా అవసరం ఏముంటుంది? మీ నిర్ణయాలు మీరే తీసుకొంటారు.

  నీ హాస్టల్ గది వరకు వచ్చి దిగబెట్టమంటావా? మా చిన్న ఇల్లు కాదని వేరే వద్దకు వెళ్తున్నావు కదా.. వెళ్లే ముందు ఒకే ఒక ప్రశ్నకు సమాధానం చెప్పు. నాకు కారణం చెప్పి వెళ్లు. ఈ ఒక్క సమాధానం చెప్పి వెళ్లుాా అని సౌందర్య ప్రశ్నల వర్షం కురిపించింది. కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1354లో ఇంకా ఏం జరిగిందంటే..

  కారణం చెప్పి ఇంటి నుంచి వెళ్లు

  కారణం చెప్పి ఇంటి నుంచి వెళ్లు

  తన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నేలచూపులు చూస్తుండటంతో సౌందర్య కోపంతో ఊగిపోయింది. పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేశావో అనే విషయానికి ఒక్క సమాధానం చెప్పి వెళ్లు. శౌర్య వచ్చిన తర్వాతే నీ పెళ్లి చేస్తానని చెప్పాను. కానీ నీవు స్వప్న ముందు నా పరువు తీశావు. చేసిందంతా చేసి.. మా పరువు తీసి.. నీ మట్టుకు నీవు హాస్టల్‌కు వెళ్లిపోతానంటే ఊరుకొంటానా? అందరి ముందు తలదించుకొనేలా చేశావు.

  కారణం ఏమిటో నీకు తెలుసు. ఆ కారణం చెప్పే ఇంటి నుంచి వెళ్లాలి. బావ బావ అంటూ ప్రేమను చూపించిన నీవు.. సడెన్‌గా పెళ్లి వద్దడానికి బలమైన కారణం ఉంది. ఆ కారణం చెప్పి వెళ్లాలి. నీవు సమాధానం చెప్పకుండా ఈ ఇంటిని వదలి వెళ్లనివ్వను అని సౌందర్య నిలదీసింది. సౌందర్య ప్రశ్నలకు ఎమోషనల్ అయిన హిమ వెళ్లి గట్టిగా కౌగిలించుకొన్నది.

  ఐ లవ్ యూ చెప్పడంతో

  ఐ లవ్ యూ చెప్పడంతో

  డాక్టర్ నిరుపమ్ ఐ లవ్ యూ చెప్పడంతో జ్వాలా అలియాస్ శౌర్య ఆనందంలో మునిగిపోయింది. చెవిలో ఈయర్ ఫోన్ పెట్టుకొని పిచ్చి పిచ్చిగా డ్యాన్స్ స్టెప్పులు వేసింది. జ్వాలా తీరు చూసిన తర్వాత పిన్ని, బాబాయ్ షాక్ తిన్నారు. ఏంటి ఇలా డ్యాన్సులు చేస్తున్నావు? అని అడిగితే.. చాలా హ్యాపీగా ఉన్నాను. చెప్పలేనంత సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషాన్నిమాటల్లో చెప్పలేను. ఈ రోజు వంటావార్పు పెట్టుకోకండి.. ఈ రోజు బయటకు వెళ్లి తిందాం అని జ్వాలా అంది. బయటకు వెళ్తే ఖర్చు. హోటల్‌లో ఎందుకు తినడం అని బాబాయ్ అన్నాడు.

   తాగి రావడం ఏమిటి?

  తాగి రావడం ఏమిటి?

  పెళ్లి ఇష్టం లేదని హిమ చెప్పడాన్ని డాక్టర్ నిరుపమ్ జీర్ణించుకోలేకపోయాడు. తప్పతాగి ఇంటికి రావడంతో తల్లి స్వప్న ఆందోళన చెందింది. నా పెంపకం గురించి నాకు ఎప్పుడు అనుమానం లేదు. నీవు తాగి ఇంటికి రావడం ఏమిటి? హిమ నిన్ను రిజెక్ట్ చేసింది. అది వద్దంటే నీవు బాధపడటం ఎందుకు? నష్టజాతకురాలు నీ జీవితంలోకి రాకపోవడం మంచిదే. మొదటి నుంచి దానితో స్నేహం వద్దని చెప్పాను.

  దాన్ని మరిచిపోరా. నన్ను అందరూ మొండిదానిని అంటారు. కానీ నేను మాట్లాడేవన్నీ నిజాలు. పుట్టుగానే తోడబుట్టినదాన్ని తరిమేసింది. ఆ తర్వాత తల్లిదండ్రులు పొట్టనపెట్టుకొన్నది. ఇప్పుడు శౌర్యను తరిమేసింది. అలాంటి హిమను పెళ్లి చేసుకొంటే.. నీకు ఎంత కీడు జరిగేదో. ఆ దరిద్రాన్ని మరిచిపో అని నిరుపమ్‌కు హితబోధ చేసే ప్రయత్నం చేసింది.

  జ్వాలాతో అర్ధరాత్రి రావడంపై

  జ్వాలాతో అర్ధరాత్రి రావడంపై


  ఇక అర్ధరాత్రి ఆటోలో జ్వాలాతో రావడాన్ని స్వప్న తప్పుపట్టింది. అలాంటి వారితో తిరగడం సరికాదు. నీకు మంచి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. నీవు అందర్ని మరిచిపో. నిన్ను రిజెక్ట్ చేసిన వాళ్ల గురించి ఆలోచించకు. నీకు తగ్గిన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పడంతో. .వెంటనే తింటున్న ప్లేట్‌లో నిరుపమ్ చేయి కడిగేసాడు. దాంతో ఏంటిది.. తినకుండానే చేయి కడిగేశావు అని తల్లి అంటే.. కడుపు నిండిపోయిందంటూ నిరుపమ్ సమాధానం చెప్పి బయటకు వెళ్లిపోయాడు.

  నీపై నాకు బాధ్యత ఉంది అంటూ

  నీపై నాకు బాధ్యత ఉంది అంటూ

  అర్ధరాత్రి వదిలేసిన కారు వద్ద నిరుపమ్ కనిపించడంతో అక్కడికి వచ్చిన జ్వాలా ఏంటి డాక్టర్ సాబ్.. రాత్రి అలా బిహేవ్ చేశావు అని అడిగింది. మీ కారు ఎలా ఉందో చూడటానికి వచ్చాను అని జ్వాలా అంటే.. కారు ఎక్కడికి వెళ్తుంది? జీవితమే ఎటో వెళ్లిపోతుంది. అయితే రాత్రి నేను ఎక్కువగా మాట్లాడానా అంటూ నిరుపమ్ అడిగితే.. నన్ను సంతోషపెట్టారు. మీరు ఏమన్నా పడుతాను అని జ్వాలా అంటే.. థ్యాంక్స్ అని నిరుపమ్ చెబితే.. థ్యాంక్స్ ఎందుకు? నాకు బాధ్యత ఉంది అంటూ జ్వాలా సమాధానం చెప్పింది.

  జ్వాలాను బలవంతంగా

  జ్వాలాను బలవంతంగా

  కార్తీకదీపం తాజా ఎపిసోడ్‌లో మరో ట్విస్టుకు తెరలేపారు. నిశ్చితార్థం బ్రేకప్ తర్వాత హాస్పిటల్‌లో నిరుపమ్ ఉన్న గదిలోకి వెళ్లింది. బావ అంటే ముఖం తిప్పేసుకోవడంతో నాతో మాట్లాడమంటూ ప్రాధేయపడింది. అయితే నిరుపమ్ మాట్లాడకపోవడంతో చేతిలో ఉన్న పేపర్‌ను లాగేసుకొన్నది. ఆ పేపర్లలో నుంచి ఫోటోలు కనిపించడంతో హిమ షాక్ తిన్నది.

  ఇక జ్వాలాను తన ఇంటిలో నుంచి లాక్కొచ్చి.. బలవంతంగా కారులో సౌందర్య కూర్చోపెట్టింది. ఏం చేస్తున్నారు అని జ్వాలా ప్రశ్నిస్తే.. మాట్లాడకుండా కూర్చో అంటూ గట్టిగా అరిచింది. ఇలాంటి ట్విస్టుతో ప్రేక్షకులకు మరింత ఆసక్తిని కలిగించారు.

  కార్తీకదీపం 18వ వారం రేటింగ్

  కార్తీకదీపం 18వ వారం రేటింగ్

  ఇక కార్తీకదీపం సీరియల్ రేటింగ్ భారీగానే తగ్గింది. కార్తీక్, దీప, మోనిత క్యారెక్టర్లకు ముగింపు పలకడంతో ప్రేక్షకులు కాస్త అసంతృప్తికి గురయ్యారు. కొత్త జనరేషన్ రావడంతో కనెక్ట్ కావడానికి కాస్త సమయం పడుతున్నట్టు కనిపిస్తున్నది. 17వ వారంలో 11.42 రేటింగ్ నమోదు కాగా, 18వ వారంలో 11.48 రేటింగ్‌తో సరిపెట్టుకొన్నది.

  English summary
  Karthika Deepam May 17th Episode number 1354. After engagement breakup, Soundarya serious on Hima
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X