Don't Miss!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- News నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
- Travel వేసవిలో సందర్శించేందుకు దేశంలోని బెస్ట్ ఆఫ్‌బీట్ హిల్ స్టేషన్లు ఇవే..
- Automobiles కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
Liger మాదిరిగా వైఫ్, లవర్‌ను కలిపితే నేను వైవర్ను అంటూ మోనిత.. కాదు లోఫర్ అంటూ వంటలక్క ఝలక్
గతం మరిచిపోయిన వాళ్లు ఎలా బిహేవ్ చేస్తారో చెప్పడం కష్టం. డాక్టర్ బాబును మోనిత ఎత్తుకొచ్చిన విషయమే గుర్తుకు వస్తే.. ఆయనకు ఆమె భార్య అవుతుంది. నీవు ఎప్పటిలానే ఎదురు చూడాల్సి వస్తుంది అని చిక్ మంగళూరు డాక్టర్ ఫ్యామిలీ చెప్పారు. దాంతో డాక్టర్ బాబు దృష్టిలో మోనిత ఎప్పుడూ చెడ్డదానిలా ఉండేలా చూస్తున్నాను. అందుకే డాక్టర్ బాబును అక్కడే ఉంచాను అని దీప చెప్పింది. అయితే వినాయకచవితికి తమ ఇంట్లోనే ఉండమని డాక్టర్ ఫ్యామిలీ అంటే.. లేదు డాక్టర్ బాబుతో కలిసి పండుగ జరుపుకొంటాను అని దీప చెప్పి అక్కడి నుంచి వెళ్లింది.. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1454లో ఇంకా ఏం జరిగిందంటే?
దీపక్క అంటే చంపేస్తాను అంటూ
వంటలక్కను
ఇంటిలో
జరిగే
వినాయకచవితి
పూజకు
పిలవడంపై
మోనిత
కంగారుపడింది.
అంతలోనే
అసిస్టెంట్
శివ
వచ్చి..
దీపక్క
వచ్చిందంటే..
వాడిని
చెంపపై
లాగి
కొట్టింది.
వరుసలు
కలపడం
ఏమిటిరా?
దీపక్క
ఏమిటి
అంటూ
వార్నింగ్
ఇచ్చింది.
నా
దగ్గర
పనిచేస్తూ..
నా
దగ్గర
తింటూ..
దానిని
అక్క
అనిపిలుస్తావా?
ఇంకోసారి
దీపక్క
అంటే..
చంపేస్తాను
అని
మోనిత
ఆగ్రహం
వ్యక్తం
చేసింది.
నా
వద్ద
ఉంటూ
దానిని
అక్క
అని
వరుస
కలిపిస్తే
బాగుండదు
అని
చెప్పి
వార్నింగ్
ఇచ్చింది.
అయితే
ఇద్దరు
కలిసి
దీప
ఇంటికి
వెళ్లారు.
దీపను
ఉద్దేశించి
దీపక్క
అని
మోనిత
పిలువగానే
శివ
కంగారు
పడ్డాడు.
అయితే
నువ్వుక్కిడ
ఎందుకు..
కార్తీకపై
అందరి
కళ్లు
ఉన్నాయి.
జాగ్రత్తగా
చూసుకో
అంటూ
శివను
అక్కడి
నుంచి
పంపించింది.
దొంగే కాపలా గురించి చెబితే..
మోనిత కంగారు చూసి దీప నవ్వుల్లో మునిగిపోయింది. దాంతో దీప ఎందుకు నవ్వుతున్నావు అని మోనిత అడిగితే.. దొంగే కాపలా గురించి మాట్లాడిందంట.. అని దీప సెటైర్ వేసింది. దొంగ ఎవరు.. నేను దొరగారి భార్యను. నువ్వే దొంగలా వచ్చి దోచుకెళ్లేందుకు వచ్చావు అంటూ మోనిత అంది. దాంతో దొంగ ఎవరో, దొర ఎవరో కాలం నిర్ణయిస్తుంది అని దీప చెప్పింది. దాంతో నీవేంటి ఇలా వచ్చావు అంటే.. మా ఆయన నిన్ను వినాయకచవితి పండగకు రమ్మని చెప్పారు. అందుకే పిలువడానికి వచ్చాను అని మోనిత దీర్గాలు తీసింది.
నేను కార్తీక్ పూజ చేస్తుంటే..
కార్తీక్ నీ ఇంటికి వస్తాడని అనుకొంటే.. నిన్ను మా ఇంటికి పిలవడం ఊహించలేదు కదా.. మా ఇంట్లో నేను, కార్తీక్ పక్క పక్కనే కూర్చొని పూజలు చేస్తుంటే నీవు చూసి ఏడువాలి. అది అసలైన పండగ. ఇలాంటి సిట్యుయేషన్ వస్తుందని ఊహించలేదు కదా అని మోనిత అంటే.. ఇలాంటి చిల్లర వేషాలు వేస్తావని ఊహించానే చిల్లర మోనిత.. నేను అడుగగానే డాక్టర్ బాబును పంపిస్తావని ఎలా ఊహిస్తాను. ఏదో పుల్లలు పెడుతావని అనుకొన్నాను అని దీప అంటే.. కార్తీక్‌తో బతకమని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. మేమిద్దరం కలిసి ఉంటే.. చూసి కుళ్లిపోవాలి అంటే.. నేను డాక్టర్ బాబు భార్యను. కాపురం చేయాల్సింది నేనే అని దీప అంది.
నేను వైవర్ను అంటూ మోనిత
దీప మాటలకు అడ్డుపడుతూ.. నీవు భార్యవు అయితే.. నేను వైవర్ను. లయన్, టైగర్ కలిస్తే లైగర్. నేను వైఫ్, లవర్ (Wife+Lover)ను.. ఆ రెండు కలిస్తే వైవర్ను అని మోనిత అంది. అయితే నీవు వైవర్ కాదు.. లోఫర్ దానివి అంటూ దీప మండిపడింది. అయితే నా నుంచి దోచుకోవడం నీ వల్ల కాదు అని మోనిత అంటే.. కార్తీక్‌ను తీసుకెళ్లడం ఒక్క నిమిషం పని. అత్తమ్మ, పిల్లలు, మామయ్మ ఫోటోలు చూపించి.. ఆయన ఏంటో గుర్తు చేయడం, ఆయన నీ నుంచి లాక్కోవడం సులభమైన పని. అత్తయ్య, మామయ్య వస్తే.. నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవా? లాక్కోవడం కాదు.. డాక్టర్ బాబు ఎలా నాకు దూరమయ్యారో.. అలానే దగ్గర కావాలి. డాక్టర్ బాబు మరోకరి దగ్గర ఉంటే ఎలా ఉండేవారో.. నీ దగ్గర ఉండటమే సేఫ్ అని దీప కౌంటర్ ఇచ్చింది.
గతం గుర్తుకు రాకుండా జాగ్రత్త పడాలి అంటూ మోనిత
ఇదిలా ఉండగా, రోడ్డుపై శౌర్య, వారణాసి వినాయక విగ్రహాలు అమ్ముతుంటే.. చిన్న పిల్ల రాత్రిపూట కష్టపడుతుందని జాలి పడ్డారు. కారు ఆపి అన్ని విగ్రహాలు బేరం ఆడకుండా కొనమని శివకు చెప్పాడు. దాంతో శివ వెళ్లి అన్ని విగ్రహాలను కొని తీసుకొచ్చాడు. అయితే తమను శౌర్య చూడకుండా మోనిత జాగ్రత్తపడింది. అయితే కారులోకి శివ ఎక్కిన తర్వాత వెంటనే కార్తీక్ లాగి చెంపపై ఒక్కటిచ్చాడు. ఆ చిన్నపిల్లలతో విగ్రహాలు ప్యాక్ చేయిస్తావా అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే శౌర్య ఎవరో తెలియకుండా ఇంత కోపం ప్రదర్శించాడు. ఇక గతం గుర్తుకు రాకుండా దీపను కార్తీక్ దూరంగా ఉంచాలని మోనిత మరో ప్లాన్ వేసింది.