twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నిజంగా నీవు నా భార్యవేనా.. మోనితకు దడ పుట్టించిన కార్తీక్

    |

    వినాయకచవితి పూజ బాగా జరిగింది కదా అని కార్తీక్ అంటే.. మోనిత ఒంటికాలిపై లేచింది. వంటలక్కను ఎందుకు పిలిచావు? దాని ఇంటికి ఎప్పుడు వెళ్లావు అని మోనిత అరిచింది. దాంతో నేను రాత్రి అంటూ కార్తీక్ ఎప్పుడు వెళ్లింది చెబుతూ.. వంటలక్క ఇంటికి వెళ్లి కార్తీక్ పిలువగానే.. డాక్టర్ బాబు. మీరెందుకు వచ్చారు అంటూ దీప అడిగింది. కార్తీక్ కూర్చొని ఉంటే.. ఏమైంది అని దీప ప్రశ్నించింది. నాకు ఒకటి గుర్తుకు వచ్చింది. మీరు మొదటిసారి కలిసినప్పుడు నీవు నా భర్త అని చెప్పావు. నాకు ఏది గుర్తుకు రావడం లేదు. నా జీవితం తెల్ల కాగితమైంది. నేను నిజంలో బతుకుతున్నానో.. లేదా అబద్ధంలో బతుకుతున్నానో అర్ధం కావడం లేదు. నీవు పూజకు రావడం లేదని మోనిత చెప్పింది. మీరు మా ఇంట్లో జరిగే పూజకు రండి అని కార్తీక్ పిలిచాడు. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1456లో ఇంకా ఏం జరిగిందంటే..

    పేపర్‌పై రాసుకొన్న కార్తీక్

    పేపర్‌పై రాసుకొన్న కార్తీక్


    కార్తీక్ పిలుపు మేరకు దీప వినాయక చవితి పూజకు రావడానికి ఒప్పుకొన్నది. అయితే ఒక షరతు ఉంది. పూజలో ఒక్కడినే కూర్చోవాలి. ఈ పూజ ఫలితం మీకు మాత్రమే దక్కాలి. మీ భార్య పిల్లలతో కలిసి ఉండాలి. అందుకే ఒక్కరే పూజ చేయాలి అని దీప చెప్పింది. భార్య పిల్లల కోసమే కదా.. మోనిత కూడా హ్యాపీగా ఫీలవుతుంది. నేను మరిచిపోతానమో.. పేపర్‌పై రాసుకొంటాను అని కాగితంపై పూజలో నేను ఒక్కడినే కూర్చోవాలి అని రాసుకొన్నాడు. దానిని జేబులో పెట్టుకో.. ఒకవేళ మరిచిపోతే గుర్తు చేయండి అనే విషయాన్ని మోనితతో కార్తీక్ చెప్పాడు.

    నీ భార్య నీవు కలిసి ఉండాలని

    నీ భార్య నీవు కలిసి ఉండాలని


    కార్తీక్ చెప్పిన విషయాన్ని విన్న మోనిత గట్టిగా అరిచింది. నేను పిలిస్తే రానని చెప్పింది కదా.. మళ్లీ నీవు ఎందుకు వెళ్లి పిలిచావు. మనిద్దరం పూజ చేయాలని అనుకొన్నాం కదా. నువ్వొక్కడివి చేయాలని చెప్పిందంటే.. మనిద్దరిని విడదీయాలనే కదా అని మోనిత అంది. అయితే మనిద్దరని విడదీయాలనుకొంటే.. నీ భార్య నీవు కలిసి ఉండాలని పూజ చేయమని ఎందుకు అంటుంది? భార్య అంటే నీవే కాదా.. నీవు కాదా. దీపపై ఎందుకు అనుమానం. దారి తప్పిపోతే.. ఇంటికి తెచ్చింది. అందుకు ప్రతిఫలంగా ఆమె మాట విన్నాను అని కార్తీక్ అంటే.. అయితే దానిని ఇంటికి తెచ్చిపెట్టుకొంటావా? అని మోనిత అంది.

     నా బాధ అర్దం కావడం లేదు.

    నా బాధ అర్దం కావడం లేదు.


    మోనిత మాటలతో చిర్రెత్తుకొచ్చిన కార్తీక్ స్టాపిట్ మోనిత..అని అరిచాడు. ఇలా ప్రతీ దానికి చిరాకు పడితే.. ప్రేమ ఎలా పుట్టుకొస్తుంది అంటూ పూజకు ఉపయోగించిన ప్లేట్ విసిరికొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దాంతో నా బాధ అర్దం కావడం లేదు. నీ పక్కన కూర్చోకుండా చేసింది. వచ్చే వినాయక చవితికి నీ పక్కన కూర్చొనేలా ఉంది. నిన్ను ప్రేమించింది ఇందుకేనా? ఏదోకటి చేసి కార్తీక్‌తో నా ప్రేమ కలిగించేలా చేసుకొంటాను అని మోనిత శపథం చేసింది.

    ప్రేమ పుట్టేలా చేయాలి

    ప్రేమ పుట్టేలా చేయాలి


    కార్తీక్ పూజ చేసిన ప్లేట్‌ను కింద కేసి కొట్టిన సంఘటనను గుర్తు చేసుకొని.. కార్తీక్ నాపై అరిచాడంటే.. నా చేయి జారిపోతున్నటే.. కార్తీక్ గతం గుర్తుకు వచ్చేలా దీప తెచ్చేస్తుంది. కార్తీక్‌ను పూర్తిగా కంట్రోల్‌లోకి తెచ్చేస్తుంది. ఎక్కడో లోపం కలుగుతున్నది. తేడా కొడుతున్నది. ప్రేమ లేకపోవడమే ప్రాబ్లెమా? భార్యను అని చెప్పడమేనా? నేను భార్యను అని ఫీలయైన క్షణమే లేదు. ప్రేమ పుట్టేలా చేయాలి. నా ఆరోగ్యం బాగాలేకపోతే.. నన్ను చూసుకొంటాడు కదా.. నాతో బాగా ఉంటాడు కదా అని దుప్పటి కప్పుకొని బెడ్‌పై పడుకొంటే.. ఇంత త్వరగా పడుకున్నావేంటి? కార్తీక్ అడిగాడు. ఆరోగ్యం బాగాలేదు అని మోనిత చెబితే.. అవును.. ఇందాక నిన్ను తిట్టాను కదా..అందుకే జ్వరం వచ్చి ఉంటుంది. ఎందుకు చిరాకు తెప్పిస్తావు. అనవసరంగా తిట్టాను. డాక్టర్‌ను తీసుకొస్తాను అని కార్తీక్ అన్నాడు.

    ఒకవేళ డాక్టర్‌ను తీసుకొస్తే

    ఒకవేళ డాక్టర్‌ను తీసుకొస్తే


    కార్తీక్ వెళ్లబోతుంటే.. ఆపి.. నీవు నా ఆవేదనను అర్ధం చేసుకొంటాలేవు. నా బిడ్డను పోగొట్టుకొన్నాను. ఆ బిడ్డను నీలో చూసుకొంటున్నాను అని మోనిత అంటే. నీవు అపార్థం చేసుకోకు. వెళ్లి డాక్టర్‌ను తీసుకొస్తాను అని బయటకు వెళ్లాడు. దాంతో ఆవేశం వచ్చినా.. ఆవేదన వచ్చినా తట్టుకోలేను. ఒకవేళ డాక్టర్‌ను తీసుకొస్తే ఎలా అని కంగారుపడింది. డాక్టర్ కోసం కార్తీక్ వెళ్తుంటే.. దీప, చిక్ మంగళూరు డాక్టర్‌ కనిపించాడు. శివ కోసం వెతుకుతున్నాను. మోనితకు జ్వరం వచ్చింది. మా అన్నయ్య డాక్టర్. ఇతను చూసుకొంటాడు అని చెప్పింది.

     డాక్టర్ రావడంతో షాక్ తిన్న మోనిత

    డాక్టర్ రావడంతో షాక్ తిన్న మోనిత


    కార్తీక్ వెళ్తుంటే.. మా అన్నయ్య డాక్టర్. ఆయనను నేను పంపించానని చెప్పకు అని కార్తీక్‌కు చెప్పింది. అన్నయ్య డాక్టర్‌తో దానికి దొంగ జ్వరం అయి ఉంటుంది అని అంటే.. అది జ్వరమో.. దొంగ జ్వరమో నేను తేల్చేస్తాను. అవసరమైతే నిన్ను ఆ ఇంట్లోనే ఉండేలా ప్లాన్ చేస్తాను అని డాక్టర్ అన్నాడు. కార్తీక్ కంగారుగా డాక్టర్‌ను తీసుకు రావడంతో మోనిత
    షాక్ తిన్నది. నేను దొంగ జ్వరం నటిస్తే.. నిజంగానే డాక్టర్‌ను తీసుకొచ్చారు అని ముసుగు తన్నిపడుకొన్నాడు. కార్తీక్‌ను ఉద్దేశంచి మీరు కూడా డాక్టరే కదా అని చిక్ మంగళూరు డాక్టర్ అనడంతో మోనిత గుండెల్లో రాయిపడినట్టు అయింది.

    English summary
    Karthika Deepam 13th September Episode number 1456.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X