For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam ఏడ్చే రోజులు పోయాయి.. ఏడిపించే రోజులు వచ్చాయి.. మోనితకు దీప వార్నింగ్

  |

  ఒకప్పుడు బతకడం కోసం వంటలు చేశాను. ఇప్పుడు బతుకు కోసం వంటలు చేస్తున్నాను. వంటల వల్ల ఉపయోగం ఉంటుందా? వంట వాసన చూసి నా వద్దకు వచ్చాడు. గుర్తు లేకపోయినా బాగా అలవాటైన వ్యక్తితో ఉన్నట్టు నాతో చనువుగా ఉన్నారు. డాక్టర్ బాబుకు గతం గుర్తు చేయడం అంత కష్టం కాదేమో అనిపిస్తున్నది అని దీప మనసులో అనుకొన్నది. అయితే డాక్టర్ తల్లి మాట్లాడిన మాటలను దీప గుర్తు చేసుకొంటూ.. కార్తీక్‌కు గతం మరిచిపోయేలా చేసింది.. ఈ క్రమంలో డాక్టర్ సాబ్‌తో పిల్లలు కనే ప్రమాదం ఉందనే విషయంపై ఆందోళన పడింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1449లో ఇంకా ఏం జరిగిందంటే..

  విడగొట్టడం నా ఆయుధం అంటూ

  విడగొట్టడం నా ఆయుధం అంటూ

  దీప వంటల గురించి కంగారు పడుతూ.. బిర్యాని తినిపించి గతం గుర్తు చేయాలని అనుకొంటున్నావా? వంట నీ ఆయుధం అయితే విడగొట్టడం నా ఆయుధం. నీకెంత ధైర్యం. ఈ మోనితను ఎదిరించడానికి ఒక్కతే వచ్చావా? నీ డాక్టర్ సాబ్‌తోనే ఇంటి నుంచి వెళ్లగొట్టే ప్లాన్ నా వద్ద ఉంది అని మోనిత మనసులో అనుకొన్నది. కార్తీక్ గార్డెనింగ్ పనిచేస్తుంటే.. ఇంటిలోకి తీసుకెళ్లింది.

  డాక్డర్ బాబుపై నీడ పడుకుండా చూడాలి

  డాక్డర్ బాబుపై నీడ పడుకుండా చూడాలి

  దీప తన కుటుంబానికి ఎదురైన సమస్య గురించి ఆవేదన పడుతూ.. నా పిల్లలు ఒకచోట, అత్తమామలు మరోచోట, డాక్టర్ బాబు మోనిత వద్ద.. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. నేను పిల్లల కోసం వెళ్దామంటే.. డాక్టర్ బాబును మోనిత ఏమైనా చేస్తుందోనని భయం. ఎలాగైనా గతాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేయాలి. కార్తీక్‌ను తీసుకొని అమెరికాకు వెళ్లిపోవాలి. డాక్టర్ బాబుపై మోనిత నీడ పడుకుండా చూడాలి అని దీప మనసులో అనుకొన్నది.

  కార్తీక్ ముంబైకి వెళ్తున్నాం అంటూ

  కార్తీక్ ముంబైకి వెళ్తున్నాం అంటూ

  కార్తీక్‌తో మోనిత మాట్లాడుతూ.. మీ కుటుంబమంతా ముంబైలో ఉన్నారు. మనం అక్కడికి వెళ్తున్నాం. మీ ఫ్యామిలీ అందరిని కలిపిస్తాను అని అంటే.. మాది ముంబై అయితే.. నేను తెలుగు ఎలా మాట్లాడుతున్నాను అని కార్తీక్ ఎదురు ప్రశ్న వేశాడు. నీ గతం మర్చిపోయావు.. కానీ లాజిక్ మరిచిపోలేదు అని మోనిత మనసులో అనుకొంటూ.. నీ ఫ్యామిలీ అంతా తెలుగు వారు. మీ నాన్న, తాతలు తెలుగు పండితులు. కాబట్టి నీ గతం గుర్తు వచ్చేలా వారిని కలిపిస్తాను అని చెప్పింది. అయితే నేను హైదరాబాద్ అని అనుకొంటున్నాను. కానీ నీవు ముంబై అని చెబుతున్నావేంటి అంటూ అనుమానం వ్యక్తం చేశాడు.

  తగ్గేదేలే అంటూ మోనిత

  తగ్గేదేలే అంటూ మోనిత

  దీప ఇంటి ముందు ఉన్న కుర్చీలో కూర్చొని మోనిత రాజసంగా కనిపించింది. మోనితను చూసి.. ఏమిటీ ఎక్కువ చేస్తున్నావు అని దీప అంటే.. ఎక్కడా తగ్గేది లేదు అని మోనిత సమాధానం ఇచ్చింది. నిన్న నన్ను చూసి భయపడినప్పుడే అనుకొన్నా.. నీవు ఎప్పటికీ తగ్గవని.. నీవంటే కార్తీక్ అసహ్యం అని దీప అంటే. అందుకే నీ గుర్తులు లేకుండా నేను కార్తీక్ మది నుంచి తుడిపేస్తున్నా అని మోనిత అంటే.. నీవు మందులు వాడి అతడి గతాన్ని మరిచిపోయేలా చేస్తున్నావు. కానీ ఒక చిన్న సంఘటన చాలూ... ఆయన గతం గుర్తుకు రావడానికి. ఆ క్షణం నేను అక్కడ.. నీవు ఎక్కడో అని దీప అంది. దాంతో ఏంటే నీ కాన్ఫిడెన్స్.. బిర్యానీ, వంటలు చూసి గతాన్ని గుర్తుచేసుకొంటాడా? అది నీ పిచ్చి నమ్మకం అని మోనిత అంది.

  నిన్ను ఏడ్చేలా చేస్తాను దీప అంటూ

  నిన్ను ఏడ్చేలా చేస్తాను దీప అంటూ

  మోనితతో వాగ్వాదానికి దిగిన దీప.. నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. నీవు నన్ను దూరం చేయలేవు.. నీవు దగ్గరకు కాలేవు అని అంది. అయితే నీవు దగ్గరయ్యే అవకాశమే లేదు. నేను ముంబైకి వెళ్లిపోతున్నాం. అప్పుడు కార్తీక్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు నీకు అని మోనిత మనసులో అనుకొంటే.. ఏం ఆలోచిస్తున్నావు. వంట రుచి చూసి డాక్టర్ బాబుకు గతం గుర్తుకు వస్తుందా అని భయపడుతున్నావా? అని దీప అంది. అయితే అలాంటిదేమీ లేదు. నీవు కార్తీక్ వద్దకు ఎందుకు వచ్చానా అని ఏడ్చేలా చేస్తా అని మోనిత అంటే.. ఏడ్చే రోజులు పోయాయి.. ఏడిపించే రోజులు వచ్చాయి అని దీప చెప్పింది. అయితే కార్తీక్ ఆకలిగా ఉందంటే.. టిఫిన్‌తోపాటు భోజనం కూడా తీసుకురా.. కానీ ఉప్మా చేసి తీసుకురాకు అని మోనిత చెప్పింది. అయితే నేను కార్తీక్‌కు ఉప్మా.. నీకు వేరేది తీసుకొస్తానని మోనిత మనసులో అనుకొన్నది.

  మోనితకు వాంతులు రావడంతో

  మోనితకు వాంతులు రావడంతో

  మోనిత ఇంటికి దీప టిఫిన్స్, లంచ్ బాక్స్ తీసుకొని వెళ్లి వడ్డించింది. టిఫిన్ చేస్తూ మోనిత వాంతులు చేసుకోవడంతో డాక్టర్ బాబు కంగారు పడ్డాడు. వెంటనే తీసుకెళ్లి బెడ్‌పై పడుకోబెట్టి శివన పిలిచాడు. శివ రాగానే డాక్టర్‌ను తీసుకు రమ్మని పంపించాడు. అయితే మోనిత నాటకం ఆడతుందని గ్రహించిన దీప.. ఇప్పటి వరకు బాగనే ఉంది. ఇప్పుడే ఏదో అయిపోందనే విధంగా నాటకం ఆడుతున్నది. నేను దేనికైనా సిద్దంగా ఉండాలి అని మనసులో అనుకొన్నది.

  నా భార్యకు విషం పెడుతావా అంటూ

  నా భార్యకు విషం పెడుతావా అంటూ


  కార్తీకదీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్‌లో మరో ట్విస్టు కనిపించింది. దీప ఇంటికి నేరుగా వచ్చిన కార్తీక్‌ను చూసి.. డాక్టర్ బాబు అంటూ పిలిచింది. నోర్మూయ్.. నా భార్యకు విషం పెడుతావా? నీకు ఏం కావాలి? డబ్బా? నాకు భార్య ఉంది. మాది జన్మజన్మల బంధం. ఇక ముందు పరాయి భర్తపై ఆశలు పెట్టుకోకు అని కార్తీక్ వార్నింగ్ ఇచ్చాడు. దాంతో ఈ సీరియల్‌లో మరో ట్విస్టు ఆసక్తిని పెంచింది.

  English summary
  Karthika Deepam 5th September Episode number 1449.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X