twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పరాయి భర్తపై మోజా? నా లైఫ్‌లో మోనితకు తప్ప మరో స్త్రీకి స్థానం లేదు. దీపకు కార్తీక్ వార్నింగ్

    |

    చలి జ్వరం అని నాటకం ఆడుతున్న విషయం తెలియక కార్తీక్ ఆందోళన పడుతూ మోనిత కోసం డాక్టర్‌ను తీసుకొచ్చారు. అయితే డాక్టర్‌ను చూడగానే తన నాటకం బయటపడుతుందనే విషయంతో మోనిత కంగారు పడింది. అయితే నాకు వైద్యం అవసరం లేదు అని మోనిత అంటే.. నేను చెక్ చేస్తాను అంటూ డాక్టర్ ప్రయత్నించాడు. అయితే కార్తీక్‌ను చూసి మీరు డాక్టర్ కదా అని చిక్ మంగళూరు డాక్టర్ అని అన్నాడు. దాంతో మోనిత ఉలిక్కిపడింది. కొంపదీసి దీప మనిషి కాదు కదా అనే అనుమానం వ్యక్తం చేసింది. అయితే మీరు ఇటు తిరగండి.. చెక్ చేస్తానని డాక్టర్ అనడంతో మోనిత పక్కకు తిరిగింది. మోనితను చూడగానే.. మీరు డాక్టరే కదా అని చిక్ మంగళూరు డాక్టర్ అనడంతో మోనిత గుండెల్లో రాయిపడింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1457‌లో ఏం జరిగిందంటే?

    డాక్టర్ కాలర్ పట్టుకొన్న మోనిత

    డాక్టర్ కాలర్ పట్టుకొన్న మోనిత

    డాక్టర్‌తో కార్తీక్ మాట్లాడుతూ.. మా వంటలక్క కూడా నన్ను డాక్టర్ బాబు అని.. మోనితను డాక్టరమ్మ అని పిలుస్తుంటుంది. ఇంతకు మీ పేరు ఏమిటి అని అడిగితే.. అందరూ నన్ను డాక్టర్ బాబు అంటారు అని అన్నారు. మోనితకు సీరియస్‌గా ఉంది. ఈ మందులు వాడండి అంటూ చీటి రాశాడు. ఆ చీటిని మోనితకు ఇవ్వగానే.. చూసి అదిరిపడింది. ఈ మందులు ఎందుకు ఇచ్చావు? ఇవి జ్వరానికి కావు కదా.. అని అంటే.. నీవేమైనా డాక్టర్‌వా అని డాక్టర్ నిలదీశాడు. దాంతో ఒక్క ఊదుటున లేచి డాక్టర్ కాలర్ పట్టుకొంది. నీవు దీప మనిషివే కదా.. నిన్ను దీప పంపించింది కదా అంటూ కాలర్ పట్టుకొని ఊపింది. అంతలోనే దీప కనిపించగానే.. అదిగో ఆమె పంపించింది అంటూ ఊగిపోయింది. మోనిత అసలు విషయం పసిగట్టడంతో చూసి.. దీప కంగారు పడింది.

    దీపను ఇంట్లో పనిమనిషిగా పెట్టుకోవడానికే

    దీపను ఇంట్లో పనిమనిషిగా పెట్టుకోవడానికే

    అంతలోనే డాక్టర్ కాలర్ పట్టుకొన్న మోనితను విదిలించి.. కాలర్ విడువు. అవును. వంటలక్క అన్నయ్యే. డాక్టర్ అంటే తీసుకొచ్చాను. ఇప్పుడేంటి? అని కార్తీక్ అన్నాడు. నేను దీప అన్నయ్యను. అయితే ఏంటి? అని డాక్టర్ అన్నాడు. అయితే డాక్టర్ క్షమించండి. ఒంట్లో బాగాలేదు అని కార్తీక్ అన్నాడు. దాంతో నీకు పిచ్చిపట్టిందా? నా మతి బాగానే ఉంది. ఇద్దరు వచ్చింది ట్రీట్ మెంట్ ఇవ్వడానికి కాదు. మన ఇంట్లో దీపను వంట మనిషిగా పెట్టడానికి అని మోనిత అంది. అయితే ఏం మాట్లాడుతున్నావు మోనిత.. వంట మనిషిగా చేర్పించడానికి ఈయన చేయాల్సిన అవసరం ఉంది. కావాలంటే వంటలక్క అడిగేది కదా అని కార్తీక్ అన్నాడు.

    డాక్టర్‌ను బయటకు పంపించు

    డాక్టర్‌ను బయటకు పంపించు

    అయితే నాకు లేని రోగం అంటగట్టాడు ఈ డాక్టర్. ఇదంతా వంటలక్కను మన ఇంట్లో పనిమనిషిగా పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అది ఇంట్లో చేరి నిన్న లోబరుచుకోవాలని చూస్తున్నది అని మోనిత ఆవేశంగా అంటే.. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. మీరు ఎక్కువగా ఆవేశ పడకండి. మీ ఆరోగ్యానికి మంచి కాదు అని డాక్టర్ అంటే.. స్టాపిట్ గెట్ లాస్ట్ అంటూ మోనిత అరిచింది. దాంతో మోనిత అంటూ కార్తీక్ కోపగించుకొన్నాడు. అయితే ముందు అతడిని ఇక్కడి నుంచి బయటకు పంపించు. ఇక్కడ ఉంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు. ఆయనను బయటకు పంపించు అని మరోసారి మోనిత అరిచింది. దాంతో సరే..నేను వెళ్తాను అంటూ డాక్టర్ బయటకు వెళ్లాడు. డోర్ వద్ద దీప ఉంటే.. పదమ్మ అంటూ ఆమెను తీసుకెళ్లాడు.

    కార్తీక్ ట్రీట్‌మెంట్‌కు దీప ప్రయత్నం?

    కార్తీక్ ట్రీట్‌మెంట్‌కు దీప ప్రయత్నం?

    వంటలక్క, డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత .. మోనిత ఏంటిది? అని కార్తీక్ నిలదీస్తే.. మొదటి నుంచి అది నీపై కన్నేసింది. రకరకాలుగా నీకు దగ్గర కావాలని ట్రై చేస్తున్నది. నా మాటను ఎందుకు నీవు నమ్మడం లేదు. వంటలక్క నా వద్దే నీ తెలివి తేటలా. అయిపోయావు అంటూ కొత్త ప్లాన్ మోనిత ఆలోచించింది. ముఖంపై వికటంగా నవ్వు తెచ్చి పెట్టుకొన్నది. మీ భార్య, మీరు బాగుండాలనే పూజ అని నమ్మించింది. ట్రీట్‌మెంట్ పేరుతో డాక్టర్‌కు కార్తీక్‌ను పరిచయం చేసింది. రేపు కార్తీక్ ట్రీట్‌మెంట్‌కు దీప ప్రయత్నం చేస్తుంది. గతం గుర్తుకు వస్తుందని కార్తీక్‌ను నమ్మిస్తే.. ఆయన ఏమైనా చేస్తాడు. కాబట్టి.. దీపకు కార్తీక్‌ను దూరం పెట్టాలి అని మోనిత మనసులో అనుకొంటే.. అంతలోనే కార్తీక్ వచ్చి ఏం ఆలోచిస్తున్నావు.. బాబు గురించేనా అని కార్తీక్ అడిగాడు.

    మన కొడుకు చెన్నైలో అంటూ మోనిత

    మన కొడుకు చెన్నైలో అంటూ మోనిత

    అయితే సరిగా నా పేరే గుర్తుండదు. అలాంటిది కొడుకు గురించి గుర్తుపెట్టుకొన్నాడు అంటే.. గతం గుర్తుకు వస్తుందా అని అనుకొన్నది. అయితే అవును. మన బాబు గురించి తెలిసింది. చెన్నైలో ఉన్నాడట. అయితే మన బాబునా? కాదా అనేది తేల్చుకోవాలి అని మోనిత ఎందుకు ఇంత ఆలస్యం ఎందుకు? అని కార్తీక్ అన్నాడు. అయితే నేను వెళ్లి తీసుకొస్తాను అని మోనిత చెప్పింది. బాబు వస్తే.. నాతో కార్తీక్ నాతోనే ఉంటాడు అని మోనిత ప్లాన్ వేసింది. ఇదిలా ఉండగా, మోనిత చేసిన పనికి డాక్టర్, దీప ఆలోచనల్లో పడ్డారు. నీవు చెబితే ఏమో అనుకొన్నాను. కానీ నేను ఆమె విషయాన్ని బయటపెట్టడానికే జ్వరానికి మందులు కాకుండా వేరే మందులు రాసాను. నేను రాకుండా ఉండాల్సింది. కార్తీక్ వచ్చి నాపై కోపగించుకొంటాడేమో అని దీప అంటే... కార్తీక్ వచ్చి కోపగించుకొన్నా ఏం మాట్లాడకు. వారి మనసు సున్నితంగా ఉంటుంది అని డాక్టర్ నచ్చ చెప్పాడు. డాక్టర్ బాబు తప్పకుండా నీ వద్దకు వస్తాడు. మరో ప్రయత్నం చేద్దాం అని డాక్టర్ ధైర్యం నూరిపోసాడు. నీ భర్తను నీవు తెచ్చుకో. నీవు ఉన్న చోటికే నీవు వెళ్లు అంటూ డాక్టర్ చెప్పాడు.

    కార్తీక దీపం ప్రోమోలో మరో ట్విస్టు

    కార్తీక దీపం ప్రోమోలో మరో ట్విస్టు

    కార్తీకదీపం తాజా ప్రోమోలో మరో ట్విస్టుకు తెరలేపారు. వంటలక్క ఇంటికి వెళ్లిన కార్తీక్.. వంటలక్క బయటకు రా అని పిలిచాడు. డాక్టర్ బాబు మీరు లోపలకి రండి అంటే.. మీరే బయటకు రండి అంటూ కార్తీక్ అనడంతో దీప బయటకు వచ్చింది. మీ అన్నయ్య అని చెప్పి.. ఎవరినో తీసుకొచ్చి.. డాక్టర్ అని నాటకం ఆడుతావా? నీ ఆలోచనలు మంచివి కావని ఎప్పటికప్పుడు మోనిత చెబుతుంటే నమ్మలేదు. నీ తప్పేమీ లేదని వెనుకేసుకొచ్చాను. కానీ ఇప్పుడు నీవు టిఫిన్లో ఏదో కలిపి తెచ్చావని నమ్మాల్సి వస్తున్నది. నాకు పెళ్లైంది. మోనిత నా భార్య. పరాయి స్థ్రీ భర్తను ఎలా కోరుకొంటున్నావు. మోనితకు తప్ప జీవితంలో మరో స్త్రీకి చోటు లేదు అని దీపను కార్తీక్ నిలదీశాడు.

    English summary
    Karthika Deepam 14th September Episode number 1457.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X