For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నా భర్తను చెరపెట్టిన మోనిత అంతం కావాలి.. వినాయకుడికి ముందు దీప ఎమోషనల్

  |

  వినాయక చవితి పండుగ సమయంలో కారులో వెళ్తుంటే.. శౌర్య వినాయకులను అమ్ముతూ కనిపించడం, ఆమె వద్ద నుంచి శివతో విగ్రహాలను కొనేశాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత రోడ్డు మీద అమ్మాయి ఎవరు? నాకు రోడ్డు మీద చాలా మంది అమ్మాయిలు కనిపించినా నేను ఆ అమ్మాయి మీదే ఎందుకు నా మనసు ఆగింది అని కార్తీక్ అంటే.. నాకేమీ తెలుస్తుంది అని కంగారుగా మోనిత సమాధానం చెప్పింది. అయితే ఏ అమ్మాయి గురించి ఆలోచినంతగా.. ఈ అమ్మాయి గురించే ఎందుకు ఆలోచిస్తున్నాను.

  నాకు సమాధానం దొరకని ప్రశ్నకు.. నీ నుంచి జవాబు ఆశించడం నా తప్పే అని కార్తీక్ అన్నాడు. వెంటనే వంటలక్కను పూజాకు పిలిచావా అని కార్తీక్ అడిగితే.. పిలిచాను.. కానీ తాను విగ్రహం తెచ్చుకొన్నదట.. అందుకే రానని చెప్పింది అంటూ అబద్దమాడింది. అయితే ఎవరి ఇంట్లో వారు పూజలు చేసుకోవడం మంచిదే కదా అంటూ కార్తీక్ వెళ్లిపోయాడు. దాంతో దీప రాకుండానే నేను, కార్తీక్ పూజ చేసుకోవచ్చు అంటూ మోనిత ఆనంద పడింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1455 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

  సీతను చెరపట్టిన రావణుడు అంతం

  సీతను చెరపట్టిన రావణుడు అంతం


  సీతను చెరపట్టిన రావణుడు అంతమైనప్పుడు.. నా భర్తను చెరపెట్టిన మోనిత అంతం కావడం కూడా జరగాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుంది. రావణుడిని అంతమొందించగానే.. రాముడితో సీత కలిసి పోయింది. ఇక్కడ నా రాముడు ఎదురు చూపుల మాట అలా ఉంచితే.. నన్ను ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు. నా భార్తకు గతం గుర్తుకు రావడమ కష్టం. ఆ కష్టాన్ని దాటించు. లేకపోతే.. మోనితపై నమ్మకం పోయేలా మార్గం చూపించు అని దీప కంటతడి పెట్టుకొన్నది.

  దీప కుళ్లుకొని చస్తుందంటే??

  దీప కుళ్లుకొని చస్తుందంటే??


  ఇదిలా ఉండగా.. వినాయకుడి ముందు మోనిత పూజ చేస్తూ.. ఇన్నాళ్లకు నా కార్తీక్‌తో కలిసి పూజ జరిపించే అవకాశం కల్పించాడు. కార్తీక్‌తోపాటు నేను కూర్చుని పూజ చేస్తుంటే.. దీప కుళ్లుకొని చస్తుందనుకొంటే.. అది రానంది. కార్తీక్‌కు శాశ్వతంగా గతం గుర్తుకు రాకుండా చేయి స్వామి అని మోనిత మొక్కుకొన్నది. అంతలోనే కార్తీక్‌కు ధోతి కట్టుకోవడం రాకపోవడంతో హెల్ప్ చేయమని అడిగాడు. దాంతో ఇబ్బంది పడుతూ పంచె కట్టుకోవడం ఎందుకు.. చక్కగా పాయింట్ వేసుకొవచ్చు కదా అని విసుక్కొన్నది. అయితే పంచె కట్టడం రాకపోతే అలా కాదు అంది. ఈ సంఘటనను చూసి వంటలక్క కన్నీరు పెట్టుకొన్నది. శివను పిలిచి సారుకు పంచెకట్టించు అని చెప్పింది. శివ వెళ్లి పంచె కట్టడంతో కార్తీక్‌ను చూసి మురిసిపోయింది.

  వంటలక్క నిన్ను చూస్తే జాలిగా ఉంది..

  వంటలక్క నిన్ను చూస్తే జాలిగా ఉంది..


  ఇంటి బయట దీప ఏడుస్తుంటే.. కార్తీక్ వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు. ఇప్పటి వరకు నన్ను నేను చూసుకొంటే జాలి ఉండేది. ఇప్పుడు నిన్ను చూస్తే జాలి కలుగుతుంది. నాలో కూడా ఏదో తెలియని బాధ ఉంది. ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావడం లేదు. కానీ నీ బాధేంటో నీకు తెలుసు కదా. నీ బాధ చెబితే సగం తగ్గిపోతుందేమో.. నీ బాధను నాకు చెప్పు అని కార్తీక్ అడిగితే.. నీ బాధ నా బాధ ఒకటే అని మనసులో అనుకొన్నది. అంతలోనే మోనిత వచ్చి.. రావేమో అని అనుకొన్నాను అని కంగారు పడింది. దీపను రా అంటూ ఇంటిలోనికి తీసుకెళ్లింది.

  డాక్టర్ బాబు మీరు నాకు మాటిచ్చారు అంటూ

  డాక్టర్ బాబు మీరు నాకు మాటిచ్చారు అంటూ


  పూజారి వచ్చి.. మోనిత, కార్తీక్‌ను వచ్చి పూజపై కూర్చోమని అడిగితే.. వారిద్దరూ రెడీ అయ్యారు. దాంతో డాక్టర్ బాబు.. మీరు నాకు ఒక మాట ఇచ్చారు. మీకు గుర్తు ఉండదని నేను చీటి రాసిచ్చాను అని అంటే.. చీటీ కోసం లోనికి వెళ్లాడు. దాంతో కార్తీక్ ఏం మాట ఇచ్చాడు. నిన్ను జుట్టు పట్టుకొని లాగేయాలనేంత కోపం ఉంది అని మోనిత ఊగిపోయింది. చీటీ ఓపెన్ చేస్తే..అందులో ఒక్కడే పూజ చేయాలని ఉంది అని రాసి ఉంది. దాంతో ఇద్దరం పూజపై కూర్చొందామని అనుకొన్నాం కదా..అని మోనిత అంటే.. నేను వంటలక్కకు మాట ఇచ్చాన. చీటిలో ఏం రాసి ఉన్నదంటే.. నా భార్య బాగుండాలి. సంతోషంగా ఉండాలి. ఇద్దరి మధ్య విభేదాలు ఉండకూడదు అని కార్తీక్ చెప్పాడు. దాంతో కార్తీక్ ఒక్కడే పూజపై కూర్చొన్నాడు.

   వినాయక చవితి రోజు ఇది నా విజయం

  వినాయక చవితి రోజు ఇది నా విజయం


  కార్తీక్ పూజ చేయడానికి సిద్దమవుతుండగా.. నీకు గతంలో పూజ చేసినట్టు గుర్తుందా? నీకు భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, తమ్ముడు, మరదలు ఉన్నారని గుర్తుందా అని అడిగింది. దీప మాటలతో గుర్తు తెచ్చుకొనేందుకు ప్రయత్నించగా.. పూజా టైమ్ అవుతుంది.. మొదలుపెట్టండి అని మోనిత హడావిడి చేసింది. కార్తీక్ పూజ చేస్తుండగా.. నీవు ఎంత గుర్తు చేయాలనుకొన్నా నీకు సాధ్యం కాదు అని మోనిత అంటే.. ఈ రోజు కార్తీక్‌ ఒక్కడినే పూజపై కూర్చొబెట్టాను. వినాయక చవితి రోజు ఇది నా విజయం. ఇక నుంచి కూడా నా విజయాలు కొనసాగుతూనే ఉంటాయి అని దీప కౌంటర్ ఇచ్చింది. అయితే దీపను కార్తీక్ కలువడంపై అనుమానం వ్యక్తం చేస్తూ.. వంటలక్కను ఎలా.. ఎప్పుడు కలిశావు అని మోనిత అడిగితే.. రాత్రి అంటూ ఏదో చెప్పబోయాడు.

  English summary
  Karthika Deepam 12th September Episode number 1455.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X