twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam శత్రువు కోసం శౌర్య.. మనవరాలి కోసం సౌందర్య.. మధ్యలో హిమ ఫిక్స్

    |

    గతంలో తప్పిపోయిన మనవరాలి ఫోటోను గీయించేందుకు ఆర్టిస్ట్ గీత ఆఫీస్‌కు వచ్చిన సౌందర్యతో జ్వాలా అలియాస్ శౌర్య ఆసక్తికరమైన సంభాషణకు తెరలేపింది. పారిపోయిన మనవరాలేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? అని అడిగితే.. ఆటో నడుపుకొనేదానివి. ఈ వివరాలు నీకెందుకు? అని సౌందర్య విసుక్కొన్నది. ఊరోకోండి సీనియర్ సిటిజన్ మేడమ్.. ఆటో నడుపుతాను కదా.. రోజుకు వంద మందిని చూస్తాను? అందులో ఎవరైనా మీ మనవరాలు ఉందేమో చూస్తాను అని సౌందర్య అంటే.. అవును నిజమే అని సౌందర్య జవాబిచ్చింది. అయితే పారిపోయిన మనవరాలేనా..ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే.. ఇంకో మనవరాలు ఉంది అని సౌందర్య అంటే.. మీరందరూ బాగానే ఉన్నారు.. కానీ పారిపోయిన మనవరాలే ఎన్ని కష్టాలు పడుతున్నదో అని జ్వాలా బాధగా చెప్పింది. దాంతో ఎందుకు ఇలా నన్ను బాధపెట్టేలా మాట్లాడుతావు అంటే.. ఇన్నాళ్లు లేని ప్రేమ ఇప్పుడెందుకో అని జ్వాలా అంది. కార్తీకదీపం సీరియల్‌లో 1337 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

    సీనియర్ సిటిజన్ అంటూ జ్వాలా

    సీనియర్ సిటిజన్ అంటూ జ్వాలా

    జ్వాలా అలియాస్ శౌర్య అడిగిన ప్రశ్నకు.. శౌర్య దొరికితేనే పెళ్లి చేసుకొంటానని హిమ చెప్పిందనే విషయాన్ని ఆటో డ్రైవర్‌కు చెప్పాలా? అని మనసులో అనుకొంటే.. ఏం సీనియర్ సిటిజన్.. ఏం మాట్లాడటం లేదు అని జ్వాలా అంటే.. నీవు కాసేపు మాట్లాడకు ప్లీజ్.. ఇప్పుడు ఆమె అవసరం వచ్చింది అని సౌందర్య అంటే.. మీరు స్వార్ధపరులనిపిస్తున్నారు అని జ్వాలా అన్నారు. మీ తప్పిపోయిన మనవరాలు ఎక్కడో నా మాదిరిగా పనిచేస్తుంటారు అని అంటే.. నిన్ను ఎలా భరిస్తున్నారు అని సౌందర్య కోపంతో అరిచింది.

    నీకు పార్టీ ఇవ్వను అంటూ సౌందర్య

    నీకు పార్టీ ఇవ్వను అంటూ సౌందర్య

    ఒకవేళ నేనే మీ తప్పిపోయిన మనవరాలు అయితే.. అని జ్వాలా అంటే.. అయితే నేను అసలే తీసుకెళ్లను. నిన్ను ఈ ఐదు నిమిషాలే భరించలేకపోయాను అని సౌందర్య అనగానే శౌర్య బాధపడింది. ఆర్టిస్ గీత వద్ద సెలవు తీసుకొంటూ.. నీ మనవరాలు దొరికితే.. పార్టీ ఇవ్వు అంటే.. నీకు మాత్రం అసలే ఇవ్వను అని సౌందర్య అంది. అయితే నేను కూడా హిమ పోలీకలు చెప్పి.. పెద్దయ్యాక ఎలా ఉంటుందో బొమ్మ గీయించాలని అనుకొంటూ వెళ్లిపోయింది.

    నిన్ను చూడాలనిపించింది అంటూ

    నిన్ను చూడాలనిపించింది అంటూ


    జ్వాలాను కలువడానికి హిమ తన ఇంటికి వెళ్లింది. జ్వాలా పిన్నితో మాట్లాడుతుండగా.. అక్కడకు శౌర్య వచ్చింది. డాక్టరమ్మ వస్తే.. మర్యాదలు చేశారా? అని అంటే.. చేశామని బాబాయ్ పిన్ని చెప్పారు. ఆకలిగా ఉంది.. ఏమైనా చేశావా అంటే.. హిమతో మాట్లాడుతున్నాం. అందుకే చేయలేదు.. వెళ్లి ఇప్పుడే తయారుచేస్తాం అని అన్నారు. అయితే ఏంటి తింగరి.. నాకు ఫోన్ చేసి రావొచ్చుగా అంటే.. నిన్ను చూడాలనిపించింది. అందుకే వచ్చాను అంటూ హిమ సమాధానం ఇచ్చింది.

    శత్రువును కనిపెట్టే ఆయుధం

    శత్రువును కనిపెట్టే ఆయుధం

    హిమ, జ్వాలా మాటల్లో పడిపోయారు. జ్వాలతో హిమ మాట్లాడుతూ.. మనం సరదాగా ఎక్కడికైనా వెళ్లి వద్దా అని అంటే.. ఎక్కడికి అని జ్వాలా అడిగింది. అయితే నువ్వు, నేను, మీ డాక్టర్ సాబ్ కలిసి నాగార్జున సాగర్‌కు వెళ్లి వద్దామా అంటే.. సరే.. నువ్వు ఎక్కడికంటే.. అక్కడికి వస్తాను అంటూ జ్వాలా చెప్పింది. అయితే జ్వాలా చేతిలో ఉన్న పేపర్లు చూసి.. ఏమిటవి అంటే.. నా శత్రువును కనిపెట్టేందుకు ఆయుధాలు అని జ్వాలా చెప్పింది. అంటే అని ప్రశ్నిస్తే.. నా ఆటోలో బొమ్మలు గీసే అమ్మాయి కూర్చున్నది. ఆటోలో వెళ్తుంటేనే నా బొమ్మను గీసేసింది అని తన బొమ్మను చూపించింది. అయితే పేపర్లను చూసి ఆయుధాలు అంటున్నావు అంటే... అవును.. నా శత్రువు పోలికలు చెప్పి.. హిమ ఫోటోను గీయిస్తాను. ఇక నా శత్రువు దొరికినట్టే.. నాగార్జున సాగర్ వెళ్లి వచ్చాక బొమ్మ గీయిస్తా.. అని జ్వాలా అంటే.. హిమ బాధపడింది.

    రాజీ పడే ప్రసక్తి లేదు అంటూ

    రాజీ పడే ప్రసక్తి లేదు అంటూ


    డాక్టర్ నిరుపమ్ కోసం పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టిన స్వప్న విషయం తెలుసుకొని సౌందర్య మండిపడింది. దానికి అంత పట్టుదల ఉంటే.. నేను ఆమె తల్లిని. నాకెంత పట్టుదల ఉండాలి. ఏదో నా మీద అలిగిందని, నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకొంటున్నాను. పెళ్లి విషయంలో రాజీ పడే ప్రస్తక్తి లేదు. కావాలంటే నిరుపమ్‌ను ఇల్లరికం తెచ్చుకొంటాను అని సౌందర్య ఆవేశంగా మాట్లాడితే.. నీవు అలా చేస్తే స్వప్న ఒంటరి అయిపోతుంది అని ఆనందరావు అన్నాడు. అప్పుడన్నా స్వప్నకు బంధాలు, అనుబంధాలు తెలిసి వస్తాయి అని సౌందర్య చెప్పింది.

    శౌర్య ఇంచుమించు దొరికింది అంటూ

    శౌర్య ఇంచుమించు దొరికింది అంటూ

    స్వప్న, ఆనందరావు వాదించుకొంటే.. ఏంటి పెళ్లి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి పెళ్లి గురించి అని అప్పుడే అక్కడకు వచ్చిన హిమ అడిగితే.. నీ పెళ్లి గురించే అని అంటే.. నేను శౌర్య దొరికే వరకు నేను పెళ్లి చేసుకొను అని హిమ చెప్పింది. దాంతో శౌర్య దొరికింది.. ఇంచుమించు దొరికింది. ఆర్టిస్టుకు బొమ్మ ఇచ్చాను. చిన్ననాటి బొమ్మను చూసి.. పెద్దయ్యాక ఎలా ఉంటుందో గీసేస్తుంది అని సౌందర్య చెప్పింది. దాంతో శౌర్య కూడా నానమ్మ మాదిరిగానే ఆలోచిస్తుంద.ి దాంతో నేను ఎవరో తెలిసిపోతే శౌర్య ఎలా రియాక్ట్ అవుతుందో అని హిమ బెంగపడింది.

    కార్తీకదీపం రేటింగ్‌పై ఐపీఎల్ దెబ్బ

    కార్తీకదీపం రేటింగ్‌పై ఐపీఎల్ దెబ్బ

    ఇదిలా ఉండగా, కార్తీకదీపం సీరియల్‌ సాగదీసినట్టు ఉండటం, ఐపీఎల్ టోర్ని కొనసాగుతుండటం కాస్త ప్రతికూల పరిస్థితులు కనిపించాయి. రేటింగ్ విషయంలో గత కొద్దివారాలుగా దిగజారుతూ వస్తున్నది. ప్రస్తుతం 15వ వారంలో కార్తీకదీపం రేటింగ్.. అర్బన్‌లో 15వ వారంలో 11.89 రేటింగ్‌ను, గ్రామీణ ప్రాంతంలో 15వ వారం 12.18 రేటింగ్‌ను నమోదు చేసింది.

    English summary
    Twist in Karthika Deepam today's episode:
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X