Karthika Deepam వంటలక్క బంపర్ ప్లాన్.. మోనితకు చెమటలు పట్టించిన దీప

కార్తీక్‌కు గతం గుర్తుకు రాకుండా మోనిత మందులు ఇచ్చిన విషయం తెలుసుకొన్న దీప.. తన భర్తను కాపాడుకొనేందుకు సిద్దమైంది. చిక్ మంగళూరు డాక్టర్ కుటుంబంతో ఉంటున్న దీప.. కార్తీక్ ఇంటికి చేరువగా ఉండేందుకు ప్లాన్ చేసింది. అయితే దీప తమ ఇంటి నుంచి బయటకు వెళ్లి వేరే చోట ఉంటున్నారనే విషయంతో డాక్టర్ ఫ్యామిలీ ఎమోషనల్ అయింది. తన భర్తను కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్న దీపకు బాధతో వీడ్కోలు చెప్పారు. కార్తీకదీపం సీరియల్ 1447 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

Karthika Deepam

వంట చేయలేక ఇబ్బంది పడుతున్న మోనిత కోసం కార్తీక్ వంట మనిషిని వెతికే ప్లాన్‌ను అసిస్టెంట్ శివతో ప్రారంభించాడు. మోనిత కోసం మంచి వంట మనిషిని సెట్ చేయాలని అనుకొంటున్న సమయంలోనే ఘుమఘుమలాడే వంట వాసన రావడంతో బయటకు వెళ్లి చూశారు. వంటలక్కను చూసిన కార్తీక్.. మీరా అంటూ ప్రశ్నించాడు. దీపను చూసి మోనిత షాక్ అయింది.

అయితే వంటలక్కకు కార్తీక్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన ఇంటిలో వంట మనిషిగా పనిచేయమని అడిగితే.. నేను బతుకు దెరువు కోసం వంట చేస్తాను. కానీ నేను ఒకరి ఇంటిలో పనిచేయను అని ఆఫర్‌ను తిరస్కరించింది. దాంతో మోనిత ఒక్కసారిగా కంగు తిన్నది. ఇంట్లోకి రమ్మంటే రాకుండా దీప.. ఏదో పెద్ద ప్లాన్‌లోనే ఉంది అని కంగారు పడింది.

అయితే కార్తీక్ ఆఫర్‌ను తిరస్కరించిన దీప.. ఎప్పుడైనా వంట కావాలంటే.. చేసి పెడుతాను డాక్టర్ బాబు అంటూ సమాధానం ఇచ్చింది. దాంతో డాక్టర్ బాబు అని పిలవడం ఎందుకు అంటూ మోనిత కోపగించుకొన్నది. అయితే ఇంతకు ఏం వండుతున్నావు అని కార్తీక్ అడిగితే.. బిర్యాని చేస్తున్నాను అంటూ మూత తీసి వాసనను చూపించింది. దాంతో ఈ రోజు నుంచే బిర్యాని పంపించండి అని కార్తీక్ అన్నాడు.

కార్తీక్ తనను అండీ అని పిలవడంతో..దీప.. నన్ను అండి అని పిలవకండి అని చెప్పింది. అయితే నీ పేరు ఏమిటి అంటే.. దీప అని చెప్పగానే.. ఆ పేరును ఐదు ఆరు సార్లు మనసులో అనుకొంటుండగా.. కార్తీక్‌కు దీప ఎక్కడ గుర్తుకు వస్తుందో అని మోనిత కంగారు పడింది. అంతలోనే నాకు చాలా పేర్లు ఉన్నాయి.. మా అత్త సౌందర్య గారు.. కోడలా అని పిలుస్తుంది. నా కూతురు శౌర్య అమ్మా అని పిలుస్తుంది అంటూ చెబుతుండగా.. మోనిత అడ్డు తగిలింది. నీ పేర్లు చెప్పడం అవసరమా అంటూ కోపగించుకొన్నది. అయితే దీప...ప్రశాంతంగా నవ్వుతూ.. మోనితకు ప్రెజర్ పెంచే ప్రయత్నం చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X