twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam అడుగు లోపల పడిందంటే.. ప్రాణాలు తీస్తా.. మోనితకు దీప వార్నింగ్

    |

    తన ఇంటిలో బెడ్‌పై నిద్రిస్తున్న కార్తీక్ తల నిమురుతూ మన ప్రేమకు ఇన్ని అడ్డంకులా? ఆ దీప మనల్ని వదలదా? యాక్సిండెట్‌లో అది పోయింది. మనం సంతోషంగా బతుకుదాం అనుకొంటే.. మళ్లీ వచ్చింది. ఫోటో పట్టుకొని కార్తీక్ కోసం తిరుగుతున్నది. ఒకవేళ కార్తీక్ నా వద్ద ఉన్నాడని తెలిస్తే.. దీప ఊరుకొంటుందా? ప్రస్తుతానికి కార్తీక్‌కు గతం గుర్తుకు రాకుండా ఉండటానికి మందులతో మ్యానేజ్ చేస్తున్నాను. ఒకవేళ కార్తీక్ గతం గుర్తుకు వస్తే.. నా పరిస్థితి ఏమిటి? ఏదో ఒకటి చేయాలి? ఇంతకు నా కొడుకు ఎలా ఉన్నాడో అంటూ మోనిత కంగారు పడింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసొడ్ 1444 ‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    మోనితపై సౌందర్య అనుమానం

    మోనితపై సౌందర్య అనుమానం

    రెస్టారెంట్‌లో మోనిత వ్యవహరించిన తీరుపై సౌందర్య అనుమానం వ్యక్తం చేసింది. ఆమె బిహేవియర్ చాలా అనుమానంగా ఉంది. గతంలో తెల్ల చీర కట్టుకొని.. వెళ్లిపోయింది. ఇప్పుడు రంగుల చీరలో కనిపించింది. కార్తీక్ చనిపోతే మరొకరిని పెళ్లి చేసుకోవాలి కాదా అని ఆనందరావు అంటే.. యాక్సిడెంట్ ప్రదేశానికి వచ్చిందంటే.. ఏదో కారణం ఉంది. కార్తీక్ యాక్సిడెంట్ తర్వాత మనం కనిపించాం. అలాంటి సమయంలో మన వద్దకు వచ్చి అలా ఎలా జరిగిపోయిందని బాధపడేది. కానీ ఇప్పుడు మాత్రం కార్తీక్ పేరు జపిస్తున్నది. అంటే మోనిత ఎప్పటిలానే ఏదో తప్పు చేసి ఉంటుందేమో అనే అనుమానం కలుగుతున్నది. కచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. దాని మీద ఒక కన్నేసి ఉంచుతాను. దాని గుట్టు బయటపెడుతాను అని సౌందర్య చెప్పింది.

    కార్తీక్ కనిపించాడంటూ ఫోన్

    కార్తీక్ కనిపించాడంటూ ఫోన్

    కారులో కార్తీక్ డ్రైవ్ చేసుకొంటూ వెళ్తుంటే.. పక్కనే ఉన్న డ్రైవర్‌ ఫోన్ చేయబోయాడు. దాంతో ఎవరికి ఫోన్ చేస్తున్నావు అని కార్తీక్ అడిగితే.. మేడమ్‌ చేస్తున్నాను అని డ్రైవర్ చెప్పాడు. అయితే ప్రశాంతంగా ఉంటే.. మళ్లీ ఫోన్ ఎందుకు అంటే.. మీరు డ్రైవింగ్ చేస్తున్నారని చెబుతాను అంటే.. అయితే నేను దిగిపోతాను అంటూ కార్తీక్ కారు దిగాడు. అంతలోనే దీప అక్కడికి వచ్చి డాక్టర్ బాబును చూసింది. డాక్టర్ బాబు అంటూ పిలుస్తుండగా.. కార్తీక్ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయాడు. దాంతో కారును ఆటోతో వెంబడించింది. చిక్ మంగళూరు డాక్టర్‌కు ఫోన్ చేసి కార్తీక్ కనిపించాడు. నేను అతడిని తీసుకు వస్తాను అని దీప చెప్పింది.

    ఇంట్లోకి వెళ్లాలంటే భయం

    ఇంట్లోకి వెళ్లాలంటే భయం

    కారులో కార్తీక్ బోటిక్ వద్దకు చేరుకొన్నాడు. మన ఇల్లు ఇదే అంటూ డ్రైవర్ చెబితే.. నాకు గుర్తుంది. మీరు ఇలా అంటే.. ఇల్లు గుర్తు లేదంటే బయటకు పంపించదు. లోపలికి వెళ్లాలంటే భయమేస్తున్నది. ఇంటికి వస్తే పెళ్లాం ఎదురు వస్తుంది. కానీ నాకు ప్రాబ్లంలు ఎదురు పడుతాయి అని కార్తీక్ చెప్పాడు. అయితే కార్తీక్ ఇంట్లోకి వెళ్తుంటే.. వచ్చారా? మేడమ్ కంగారు పడుతున్నది అంటే.. పెట్టారుగా ఓ బాడీ గార్డును.. నన్ను ఎవరు ఎత్తుకెళ్తారు అని కార్తీక్ అన్నాడు.

    నేను డాక్టర్ బాబు ఏంటి?

    నేను డాక్టర్ బాబు ఏంటి?


    అంతలోనే కార్తీక్‌ను చూసి డాక్టర్ బాబు అంటూ దీప పరుగున వెళ్లి పట్టేసుకొన్నది. దాంతో ఏంటి? ఎవరు నువ్వు? నేను డాక్టర్ బాబు ఏంటి? నేను సూది గుచ్చానా? మందు చీటి రాసానా అని కార్తీక్ అంటుంటే.. కార్తీక్ ఎవరితో మాట్లాడుతున్నావు అంటూ మోనిత బయటకు వచ్చింది. బయట దీప ఉండటం చూసి మోనిత కంగారు పడింది. దాంతో నాకు తెలుసే.. ఇదంతా చేసింది నువ్వే. డాక్టర్ బాబును నీవద్దే ఉంచుకొని.. అనుమానం రాకుండా ఫోటో పట్టుకొని తిరుగుతున్నావా? నాకు అప్పుడే అనుమానం వచ్చింది. నాకు దొరికేంత వరకు ఆగాను. డాక్టర్ బాబు.. దీని మాయలో ఎలా పడ్డావు అని దీప ఫైర్ అయింది. దీప, మోనిత మాటలు వింటూ కార్తీక్ అయోమయంలో పడ్డారు.

    నా భర్తపై మోజుపడి పిశాచిలా

    నా భర్తపై మోజుపడి పిశాచిలా

    అయితే దీపకు మోనిత కౌంటర్ ఇస్తూ.. ఎవతివే నీవు.. నా కార్తీక్ వెంటపడుతున్నావు. శివ.. దానిని బయటకు పంపించు. పద.. లోపలికి వెళ్దాం అంటూ కార్తీక్‌ను మోనిత లోపలికి తీసుకెళ్తుంటే.. మోనిత.. ఒక్క అడుగు లోపల పడిందంటే.. ప్రాణాలు తీస్తాను అని దీప వార్నింగ్ ఇచ్చింది. దాంతో ఆగు.. ఆమె నిన్ను ఏమని పిలిచింది. మోనిత పిలిచిందంటే.. నీ పేరు మోనితే కదా.. అని కార్తీక్ అంటే.. పిచ్చిదానితో నీకెందుకు అని మోనిత అంది. నీకు పిచ్చి... నా భర్తపై మోజుపడి పిశాచిలా పట్టిపీడిస్తున్నావు అని దీప అంటే.. ఆగు నీ పేరు మోనిత అని ఎలా తెలిసింది. నన్ను డాక్టర్ బాబు అని పిలుస్తున్నది. నిన్ను మోనిత అని పిలుస్తున్నది. ఇంతకు నీవెవరు? ఆమె ఎవరు? నేను ఎవరు అని కార్తీక్ అనుమానం వ్యక్తం చేశాడు. దాంతో మన పేర్లు తెలుసుకొని డబ్బుల కోసం వస్తుంటారు అని మోనిత ఏదో మాయమాటలు చెప్పేందుకు ప్రయత్నించింది. ఎవరే డబ్బు కోసం వచ్చింది? నేను నా భర్త కోసం వచ్చాను. నా మాంగల్యం కోసం వచ్చాను అని దీప గట్టిగా జవాబిచ్చింది.

    కార్తీకదీపం తాజా ప్రోమోలో ట్విస్టు

    కార్తీకదీపం తాజా ప్రోమోలో ట్విస్టు

    కార్తీకదీపం తాజా ప్రోమోలో దీప, మోనిత మధ్య ఛాలెంజ్‌లు కనిపించాయి. డాక్టర్ బాబు నా భర్త. డాక్టర్ బాబు నా కోసం వస్తాడు అని దీప అంటే.. మొన్న ప్రమాదంలో చచ్చి బతికావు. ఆ మరణంతో నీ డాక్టర్ బాబు శకం ముగిసింది. ఇప్పుడిది ఆయనకు మరో జన్మ. అంటే.. నాది. ఎప్పటికీ కార్తీక్ నీ సొంతం కాడు అని మోనిత అంటే.. అవుతాడు. మా మధ్య ఉన్న అనుబంధమే అన్నీ గుర్తుకు తెచ్చేలా చేస్తాయి. అంతవరకు నా డాక్టర్ బాబును నీవద్దే జాగ్రత్తగా పెట్టుకో అని దీప నవ్వుతూ మోనితను కంగారు పెట్టింది.

    English summary
    Karthika Deepam 30th August Episode number 1444.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X