Karthika Deepam రొమాంటిక్‌గా మానస్.. మరదలి నడుము చుట్టు చేయివేసిన డాక్టర్ సాబ్

తన మనసుకు ఇష్టమైన శ్రీరామ్ నగర్ బస్తీలో డాక్టర్ నిరుపమ్, డాక్టర్ హిమ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తుండటంతో అక్కడికి శౌర్య అలియాస్ జ్వాలా మొదటిసారి చీర కట్టుకొని బయలుదేరింది. శౌర్యను చీరలో చూడగానే డాక్టర్ నిరుపమ్ ఆశ్చర్యపడిపోయాడు. తను పడిపోతుంటే నడుముపై చేయిపెట్టి పట్టుకొన్నాడు. దాంతో శౌర్య సిగ్గుపడిపోయింది. దాంతో అక్కడి నుంచి వెళ్లుతూ మీకు భోజనం తెచ్చాను.. వాటిని తీసుకొస్తాను అని వెళ్లిపోయింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1321లో ఇంకా ఏం జరిగిందంటే..

శౌర్య దొరికేంత వరకు..

శౌర్య దొరికేంత వరకు..

శౌర్య గురించి ఒకరకం ఫీలింగ్‌తో ఉన్న హిమతో డాక్టర్ నిరుపమ్ మాట్లాడుతూ.. శౌర్య గురించి ఎవరైనా కొత్త విషయం చెప్పారా? అని అడిగితే.. చిన్నప్పటి ఫోటో చూపించి అడిగితే ప్రయోజనం లేదు అని హిమ సమాధానం చెప్పింది. దాంతో ఒక ప్రయత్నం చేస్తున్నామని అనుకో అని నిరుపమ్ అంటే.. శౌర్య దొరికేంత వరకు నా ప్రయత్నం ఆపను అని హిమ చెప్పింది. తన వద్దకు వచ్చే పేషెంట్ల చేతిపై పుట్టుమచ్చ గురించి వెతుకుతూ కనిపించింది. ఇలా నిరుపమ్, హిమ మాట్లాడుకొంటుంటే ప్రేమ్ ఫోటోలు తీస్తుంటే అనుమానంగా చూసింది. ఆ తింగరిని ఫోటోలు తీస్తున్నావు కదా అంటే.. లేదు అంటూ కంగారు పడ్డాడు. అయితే శౌర్యను తప్పించుకోవడానికి అక్కడ రక్తదానం చేస్తున్నారు. మీరు వెళ్లి బ్లడ్ డొనేషన్ చేయి.. అక్కడ నీకు పండ్లు కూడా ఇస్తారని చెప్పగానే.. నాతోపాటు నువ్వు కూడా రా అంటూ ప్రేమ్‌ను లాక్కెళ్లింది.

శౌర్య, ప్రేమ్ బ్లడ్ డొనేషన్

శౌర్య, ప్రేమ్ బ్లడ్ డొనేషన్


డాక్టర్ నిరుపమ్, డాక్టర్ హిమ ఇద్దరు రక్తదాన శిబిరంలో ఉంటే.. ప్రేమ్‌ను లాక్కెల్లిన శౌర్య.. మేమిద్దరం రక్తదానం చేస్తామని చెప్పింది. దాంతో గ్రేట్ అంటూ నిరుపమ్ బ్లడ్ చేయమని చెప్పాడు. ఒక శిబిరంలో శౌర్య, మరో శిబిరంలో ప్రేమ్ రక్తదానం చేసేందుకు సిద్దమయ్యారు. ఇంతకు ముందు బ్లడ్ డొనేషన్ చేశావా? లేదా ఎప్పుడైనా మెడికల్ క్యాంప్‌కు వచ్చావా? అని నిరుపమ్ అడిగితే.. చిన్నప్పుడు తన నాన్న కార్తీక్‌ను కలుసుకొన్న విషయాన్ని గుర్తు చేసుకొన్నది. అప్పుడు నాన్నను కలిస్తే.. ఇప్పుడు నేను ఎవరిని కలుస్తానో అంటూ శౌర్య ఆవేదన చెందింది. అయితే ఏదో ఫీలింగ్‌తో ఉన్న శౌర్యను హలో జ్వాలా అంటూ పలకరించి.. ఇప్పుడే వస్తాను అంటూ వెళ్లిపోయాడు.

శౌర్య కోసం హిమ వెతుకలాట

శౌర్య కోసం హిమ వెతుకలాట

పక్క శిబిరంలో బ్లడ్ ఇస్తున్న ప్రేమ్‌ను గట్టిగా పిలుస్తూ.. ఏయ్ ఎక్స్‌ట్రా ఏదైనా మాట్లాడు.. అంటే.. నేను హిమతో కాస్త సమయం గడుపుదామని అనుకొంటే.. ఈమె ఏంటి నన్ను డిస్ట్రబ్ చేస్తుంది అనుకొంటూ ప్రేమ్ సమాధానం ఇచ్చాడు. అయితే నిజంగానే బత్తాయి పండ్లు ఇస్తారా అని అడిగితే.. బండ్ల కొద్ది ఇస్దారు. వెళ్లి మార్కెట్లో అమ్ముకో అని ప్రేమ్ కసురుకొన్నాడు. ఇదిలా ఉండగా.. శౌర్య చిన్నప్పటి ఫోటో తీసుకొని ఆ బస్తీ వాసులకు చూపించి.. ఎక్కడైనా చూశారా అని హిమ అడిగింది. అయితే శౌర్య గురించి కానీ, వారణాసి గురించి కానీ ఎవరు అడ్రస్ చెప్పకపోవడంతో నిరాశ చెందింది.

మెడికల్ క్యాంప్‌తో మా కుటుంబానికి

మెడికల్ క్యాంప్‌తో మా కుటుంబానికి

నిరాశలో ఉన్న హిమతో నిరుపమ్ మాట్లాడుతూ కాస్త కంట్రోల్ చేసుకో అని నిరుపమ్ అంటే.. ఈ మెడికల్ క్యాంప్ నాకు చాలా ముఖ్యం. మెడికల్ క్యాంప్ ‌కు మా కుటుంబానికి చాలా అనుబంధం ఉంది. ఇలాంటి మెడికల్ క్యాంపులోనే మా అమ్మ, నాన్న కలిశారు. అందుకే ఇక్కడే శౌర్య కలుస్తుందనే ఆలోచన నాలో మెదులుతుంది అని హిమ చెప్పింది. అంతలోనే బ్లడ్ ప్యాకెట్ నిండిపోతున్నది. ఎవరైనా ఉన్నారా అంటే.. నీకు ఏమైనా తల తిరుగుతున్నదా? అంటే.. నీతో మాట్లాడితే అందరికి బుర్ర తిరుగుతుంది అని ప్రేమ్ సెటైర్ వేశాడు. దాంతో మీ ఇద్దరికి అసలే పడదు అంటూ నిరుపమ్ అన్నాడు. అంతలోనే శౌర్య చేతిపై హెచ్ అనే పచ్చబొట్టు కనిపించడంతో ఎవరిది అని అడిగితే.. మీకు చెప్పడం ఇష్టం లేదు అని తప్పించుకొనే ప్రయత్నం చేసింది. చేతిపై హెచ్ అని ఉందంటే.. అది ఎవరి పేరు అని ప్రేమ్ అడగడం.. హిమకు వినిపించింది. దాంతో హిమ చేతిపై పచ్చబొట్టు జ్వాలా చేతిపైనా.. దేవుడా నా కోరిక తీర్చావా అంటూ హిమ ఆవేదన చెందింది.

పచ్చబొట్టు నీ లవర్‌దా? అంటూ

పచ్చబొట్టు నీ లవర్‌దా? అంటూ

అయితే హెచ్ అనే పచ్చబొట్టు నీ లవర్‌దా అని ప్రేమ్ అడిగితే.. నేను చెప్పకపోతే నిరుపమ్ నిజమే అనుకొంటాడేమో అని శౌర్య మనసులో అనుకొన్నది. నా చేతిపై ఉన్న పచ్చ బొట్టు నా శత్రువుది అని శౌర్య చెబితే.. అవును.. ఈ పచ్చ బొట్టు నా జీవితంలో మాసిపోని ఓ మచ్చ. మానిపోని గాయం అని సమాధానం ఇచ్చింది. దాంతో ఏం తప్పు చేసిందని అడిగితే.. తప్పు కాదు.. ద్రోహం అని శౌర్య సమాధానం ఇస్తూ.. నా జీవితంలో నుంచి ఆనందాన్నితీసుకెళ్లిన దోషి అని శౌర్య సమాధానం చెప్పింది.

H అంటే నా శత్రువు పేరులోని మొదటి అక్షరం అంటూ

H అంటే నా శత్రువు పేరులోని మొదటి అక్షరం అంటూ

కోపంతో ఉన్న శౌర్యను చూస్తూ.. నీలో ఇంత బాధ ఉందా అని ప్రేమ్ అడిగితే.. బాధ కాదు ఆవేశం.. ప్రతీకారం. ఇప్పటికప్పుడు నాకు ఎదురుపడుతారా అని చూస్తున్నాను అని శౌర్య జవాబిస్తే.. మీకు ఆమె ఎలాంటి ద్రోహం చేసిందని ప్రేమ్ అడిగితే.. అందరితో పంచుకోలేను. నా కోపం ఏమిటో నాకు తెలుసు. నా శత్రువుకు తెలుసు అని శౌర్య అంటే.. ఎదురు పడితే ఏం చేస్తావని నిరుపమ్ అడిగితే.. అప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు. సంవత్సరాలుగా గూడుకట్టుకొన్న ప్రతీకారం ఎలా ఉంటుందో తెలియదు. ఆమెను ఎప్పటికి వదలేది లే అని శౌర్య అంటే.. హిమ మరింత ఆవేదనకు గురైంది. పచ్చబొట్టు గురించి అడగడంతో ఆవేశం ఊగిపోవడంతో.. ఏమిటి జ్వాలా లావాలా రగిలిపోతున్నావు అంటే.. సెకన్‌లో నా జీవితాన్ని తారుమారు చేసిన సంఘటనను మరిచిపోలేను అని నిరుపమ్‌కు శౌర్య సమాధానం చెప్పింది.

కార్తీకదీపం సీరియల్ రేటింగ్..

కార్తీకదీపం సీరియల్ రేటింగ్..

కార్తీకదీపం సీరియల్ విషయానికి వస్తే.. ప్రతీ ఎపిపోడ్ ఏదో ఒక ట్విస్టుతో కొనసాగుతున్నది. డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలు ముగిసిపోయిన.. యంగ్ ఆర్టిస్టులతో సీరియల్‌ను మరింత ఆసక్తిగా నడపడంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తున్నది. దాంతో కొన్నేళ్లుగా టాప్ రేటింగ్‌తో సాగుతున్న ఈ సిరియల్ అదే జోష్‌ కొనసాగిస్తున్నది. మార్చి చివరి వారంలో అంటే ఈ ఏడాది 12వ వారంలో అర్బన్ ప్రాంతంలో 14.28 రేటింగ్ నమోదు చేసుకోగా.. 13వ వారం 12.61 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. ఇక రూరల్‌లో 12వ వారం 12.24 కాగా, 13వ వారంలో 10.24 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X