For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam మెడ పెట్టి బయటకు పంపిస్తా.. స్వప్నకు శౌర్య వార్నింగ్

    |

    హిమ వేసిన ప్లాన్ ప్రకారం ఇంట్లో శౌర్య, నిరుపమ్ ఇద్దరే ఉన్నారు. అయితే బయటకు వెళ్లడానికి ఆటో, కారు చెడిపోవడంతో నిరుపమ్ క్యాబ్ బుక్ చేశాడు. కొద్ది సేపట్లో క్యాబ్ వస్తుంది అని అంటే.. నేను నీ క్యాబ్‌లో నేను రాను అని శౌర్య జవాబిచ్చింది. అయితే కాఫీ తాగాలని ఉంది అని నిరుపమ్ అంటే.. కాఫీ పెట్టుకొని తాగు అని శౌర్య జవాబిచ్చింది. అయితే ట్రీట్‌మెంట్ చేయడం ముందు నుంచి రాదు కదా.. నేర్చుకొంటే కాఫీ చేయడం కూడా వస్తుంది అని చెప్పింది. దాంతో కిచెన్‌లోకి వెళ్లి కాఫీ చేయడానికి ప్రయత్నించిన నిరుపమ్ చేతులు కాల్చుకొన్నాడు. కాలిన గాయంతో గట్టిగా అరిస్తే వచ్చి చేయిపట్టుకొని శౌర్య బాధగా చూసింది. ఆ తర్వాత కాఫీ పెట్టివ్వ వచ్చు కదా అని నిరుపమ్ అడిగితే మౌనంగా ఉంది. కాఫీ తాగకుండా ఉండేంతగా శత్రుత్వం మన మధ్య లేదు కదా అని నిరుపమ్ అన్నాడు. దాంతో నేను కాఫీ చేస్తాను అంటూ శౌర్య చెప్పింది. కార్తీకదీపం సీరియల్‌ 1416 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    నిరుపమ్, శౌర్యను ఇంట్లో బంధించడం నీ పనేనా? ఆటో పెట్రోల్ ట్యాంకులో షుగర్ వేయడం, నిరుపమ్ కారు టైరులో గాలి తీసి.. మమ్మల్ని ఇక్కడికి పిలిపిస్తావా? అని హిమపై సౌందర్య మండిపడింది. దాంతో వారిద్దరిని ఇంట్లో బంధిస్తే.. వారి మధ్య స్నేహం పెరుగుతుందని అనుకొన్నాను అని హిమ జవాబు చెబితే.. నీకు, నిరుపమ్‌కు పెళ్లి కుదిరింది. ఆ విషయం గుర్తు పెట్టుకో. శుభలేఖలు పంచిన తర్వాత ఈ పిచ్చి పనులు ఏమిటి అని సౌందర్య ఘాటుగా స్పందించింది. అయితే చివరి వరకు నిరుపమ్, శౌర్యను కలిపేందుకు ప్రయత్నిస్తాను. అమ్మా, నాన్నకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొంటాను. వీలైతే మీరు కూడా సపోర్ట్ చేయండి అని హిమ చెప్పింది.

    Twist in Karthika Deepam todays episode from July 28th

    నిరుపమ్‌కు కాఫీ కలిపి ఇవ్వడంతో శౌర్యకు థ్యాంక్స్ చెప్పేందుకు ప్రయత్నించాడు. నీవు కూడా తాగవచ్చు కదా.. అంటే ఒకటే కప్ కాఫీ కలిపాను అని శౌర్య చెప్పింది. అయితే ఇద్దరం కాఫీ షేర్ చేసుకొందాం అంటే.. నాకు తాగడం ఇష్టం లేదని చెప్పింది. అయితే మా మీద నీకు ఇద్దరికి ఎలాంటి కోపం లేదు. ప్రేమ, పెళ్లి మీద అందరికి ఆశలు ఉంటాయి. కానీ అవి మన చేతుల్లో ఉండవు అని నిరుపమ్ అంటే.. నాకు నీతులు బోధించకు అని శౌర్య చెప్పింది. కాఫీ కప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటే.. నిరుపమ్ తల్లి స్వప్న వచ్చి కోపంతో ఊగిపోయింది. ఏంటీ నీవు కాఫీ కప్పు ఇవ్వడం ఏంటిరా అంటే.. కాఫీ తాగడంలో తప్పేమిటి అని నిరుపమ్ చెప్పాడు. దాంతో మమ్మీ, డాడీ అంటూ అరుస్తూ.. ఇద్దరు మనవరాళ్లను నా కొడుకుపై ఉసిగోల్పారు అని స్వప్న అంటే.. ఏయ్.. ఏం మాట్లాడుతున్నావు.. అని శౌర్య ఘాటుగా బదులు ఇవ్వగానే.. నిరుపమ్ షాక్‌లో ఉండిపోయాడు.

    Twist in Karthika Deepam todays episode from July 28th

    శౌర్య గట్టిగా బదులు ఇవ్వడంతో.. ఏంటే నీవు ఎక్కువ మాట్లాడుతున్నావు. నిరుపమ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు. మమ్మీ, డాడీ ఎక్కడికి వెళ్లారు. ఇందంతా నీ ప్లానా? నీ నానమ్మ ప్లానా? అని స్వప్న అంటే.. నీవు నోటికి వచ్చినట్టు మాట్లాడకు అని శౌర్య వార్నింగ్ ఇచ్చింది. హిమతో పెళ్లి చేయడానికి ప్రయత్నిస్తూ.. దీన్ని ఇక్కడ పెట్టి వెళ్లారా? దీన్ని కూడా నీకే కట్టబెట్టాలని చూస్తున్నారా అని స్వప్న అంటే.. నీకు ఏం చెప్పినా లాభం లేదు. మొగుడిని, కొడుకును వదిలిపెట్టి ఉన్నావు కదా. నా చేతి వంటలు తింటుంటే.. చూసి ఓర్చుకోలేకపోయావు. నీ తల్లిదండ్రులను ఎప్పుడైనా గౌరవించావా? అని శౌర్య మళ్లీ అదే మొత్తంలో సమాధానం ఇచ్చింది. దాంతో శౌర్య ఏం మాట్లాడుతున్నావు అని నిరుపమ్ అంటే.. ఆగు బావా.. నీకు తెలియదు అంటూ శౌర్య సముదాయించింది. నీవు నీ నానమ్మ అంటున్నావు. తల్లిని గౌరవించవు. భర్తను ఏనాడైనా గౌరవించావా? అని శౌర్య క్లాస్ పీకుతుంటే.. సౌందర్య, ఆనందరావు ఎంట్రీ ఇచ్చారు. ఆ సమయంలో శౌర్య మాటలకు అడ్డుపడుతూ.. నీవు నాకు చెప్పడమేంటి అంటూ స్వప్న ఎదురు ప్రశ్న వేసింది.

    నీవు డాక్టర్ శోభను తలమీద పెట్టుకొంటున్నావు. నీవు ఇప్పుడు దానిని ఇంట్లో పెట్టుకొన్నావు. అది సహించలేక నిరుపమ్ ఇంటికి వస్తే.. నానమ్మ, తాతయ్యను తిడుతావా? అని శౌర్య అంటే.. ఆటో దానివి నీవు నాకు చెబుతావా అని స్వప్న అంటే.. నేను ఆటో దానినే. దానికంటే ముందు సౌందర్య, ఆనందరావు మనవరాలిని. ఆ తర్వాత డాక్టర్ కార్తీక్, దీప కూతురుని. ఆ తర్వాతే నేను ఆటోదానిని అని శౌర్య అంటే.. ఇంట్లోకి వచ్చానని ఫోజు కొడుతున్నావా? అంటే.. ఇంట్లోకి వచ్చానని కంట్రోల్‌లో ఉన్నాను. లేకపోతే ఆటో ఎక్కించే దానిని. ఇంకోసారి తాత, నానమ్మను ఏమైనా అంటే బయట నెట్టేసే దానిని అని అనగానే.. దూరంగా ఉండి గమనిస్తున్న సౌందర్య, ఆనందరావు చప్పట్లు కొట్టారు. దాంతో తల్లి పరిస్థితిని గమనించిన నిరుపమ్.. అమ్మా.. నీవు ఇంటికి వెళ్లిపో అంటూ పంపించే ప్రయత్నం చేశారు. దాంతో నువ్వు వెళ్లు అంటూ సౌందర్య అంటే.. శౌర్యను మీరు ఉసిగొల్పారా అని స్వప్న అంది. అయితే నీవే దానిని ఏదో అని ఉంటావు. అందుకే నీకు బుద్ది చెప్పింది అని ఆనందరావు అన్నారు. దాంతో ఏం చేసేది లేక కోపంగా చూస్తూ వెళ్లిపోయింది.

    స్వప్నతో శౌర్య మాట్లాడిన తీరుపై హిమతో చెబుతూ ప్రశంసించింది. అంతలోనే అక్కడకు వచ్చిన శౌర్యను చూసి.. రా అంటూ పిలిచి.. నీ గురించే చెబుతున్నాను అని సౌందర్య చెబితే.. నా గురించి చెప్పడానికి ఏముంటుంది. నేను చేతగాని దానిని. ఇంటి నుంచి పారిపోయింది. ఆటో నడుపుకొంటుంది. అది కాకుండా నమ్మిన వాళ్ల చేతిలో మోసపోయింది అని కూడా చెప్పండి అని శౌర్య అంటే.. నీవు ప్రతిదానికి ఇలా మాట్లాడవద్దు అని సౌందర్య చెప్పింది.

    అయితే ఇంటి నుంచి బయటకు పంపిస్తా అని శౌర్య ఇచ్చిన వార్నింగ్‌ను స్వప్న తట్టుకోలేకపోయింది. డాక్టర్ శోభతో మాట్లాడుతూ.. నా తల్లే నా ముందు మాట్లాడదు. అలాంటిది నాకు శౌర్య వార్నింగ్ ఇస్తుందా అని బాధపడింది.

    ఇదిలా ఉండగా, తాజా ప్రోమోలో శౌర్య సొమ్మసిల్లిపడిపోయింది. దాంతో కారు తీసుకురా అని హిమ అంటే.. ఎందుకు ఇల్లు పక్కనే కదా అని నిరుపమ్ చెప్పాడు. అయితే ఎలా తీసుకెళ్దామని అంటే.. చేతుల్లో శౌర్యను ఎత్తుకొని వెళుతూ కనిపించాడు. శౌర్య ఒక్కసారి కళ్లు తెరిస్తే బాగుండు అని అనుకొంటూ.. ఆటో.. ఆటో అని హిమ అరవడంతో శౌర్య మత్తులో నుంచి బయటకు వచ్చింది. లేచావా? అయితే లేచి నడువు అంటే.. గతంలో నిన్ను భుజంపై ఎత్తుకొని తీసుకెళ్లాను కదా.. దానికి చెల్లు అంటూ శౌర్య చెప్పింది.

    English summary
    Twist in Karthika Deepam today's episode from July 28th
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X