twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam సీరియల్‌లో మరో ట్విస్టు.. ఆ బంధం నచ్చదు.. హిమకు షాకిచ్చిన శౌర్య

    |

    తనను పెంచిన తల్లిదండ్రులను చిల్లరమల్లర దొంగతనం చేయడం లాంటి పనులను మాన్పించడం గురించి శౌర్య క్లాస్ పీకింది. అయితే దొంగతనం చేయడమంటే సులువైన పని కాదు. చాకచక్యంగా ఉండాలి. పరుగు తీసే సత్తా ఉండాలి. ఎవరైనా పట్టుకొంటే వారి నుంచి తప్పించుకోవడానికి యాక్టింగ్ చేయాలి. దొంగతనం చేయాలంటే చాలా నేర్పు ఉండాలి. ఆ పని చేయాలంటే అంత ఈజీ కాదు.

    అంత సులభం కాదు అని శౌర్య పిన్ని చంద్రమ్మ చెప్పింది. అయితే ఇక దొంగతనాలు మాని.. కష్టపడి పనిచేయండి అంటూ వారికి హితవు పలికింది. ఆ తర్వాత పదే పదే తనకు నిరుపమ్ గుర్తుకు రావడం గురించి మనసులో రకరకాలుగా ఆలోచించింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1313లో ఇంకా ఏం జరిగిందంటే..

    హాస్పిటల్‌లోకి ఆటో డ్రైవర్ అమ్మాయిగా శౌర్య ఎంట్రీ

    హాస్పిటల్‌లోకి ఆటో డ్రైవర్ అమ్మాయిగా శౌర్య ఎంట్రీ

    ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న శౌర్యను తలచుకొని హిమ ఎమోషనల్ అయింది. నేను ఎందుకు ఆటో డ్రైవర్‌ను పదే పదే గుర్తు చేసుకొంటున్నాను అని మనసులో అనుకొంటుండగా.. పక్కనే ఉన్న హిమతో మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్‌ను చూస్తుంటే.. మన శౌర్యలా అనిపిస్తున్నది కదా అని నిరుపమ్ అంటే.. అవును నాకు అలానే అనిపిస్తుందని హిమ చెప్పింది. అలా మాట్లాడుతుండగా.. డోర్ వద్ద శౌర్య కనిపించడంతో కంగారు పడిపోయింది.

    బావ.. నాకు డోర్ వద్ద ఆటో అమ్మాయి కోపంతో చూస్తున్నట్టు కనిపించింది అని హిమ అంటే.. డోర్ వద్ద ఎవరు లేరు అని నిరుపమ్ చెప్పడంతో నాకు కనిపించిందంటూ కంగారుపడిపోయింది. తన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదా.. అలా అనిపిస్తూ ఉండవచ్చు. నేను ఆటో డ్రైవర్‌ అమ్మాయిని రమ్మని చెప్పాను అంటుండగానే.. శౌర్య హాస్పిటల్‌లోకి అడుగుపెట్టింది.

    జ్వాలా నీ పేరుకు తగినట్టే.. అంటూ

    జ్వాలా నీ పేరుకు తగినట్టే.. అంటూ

    హాస్పిటల్ గదిలోకి వచ్చిన ఆటో డ్రైవర్ అమ్మాయిని చూసి.. నీ పేరు శౌర్యనా అని అడుగుతావా అని హిమ అంటే.. అలా అడగడం బాగుండదు అని నిరుపమ్ సమాధానం ఇచ్చాడు. అలా హిమ, నిరుపమ్ మాట్లాడుకొంటుంటే.. రావాలా? వెళ్లిపోవాలా అని ఆటో డ్రైవర్ అమ్మాయి అంటే.. రారా అని లోపలికి పిలిచాడు.

    అయితే ఆటో డ్రైవర్ అమ్మాయిని తదేకంగా చూస్తుంటే.. ఏయ్ తింగరి ఏమిటి అలా చూస్తున్నావు అని హిమను అడిగింది. దాంతో రౌడీ అని నిరుపమ్ పిలువడంతో.. ఎవరో నాకు తెలిసిన వాళ్లు పిలిచినట్టు అనిపించింది అని శౌర్య అనుకొన్నది. ఆ తర్వాత నా పేరు రౌడీ కాదు.. జ్వాలా అంటే.. నీ పేరుకు తగినట్టే ఉంది అని నిరుపమ్ మనసులో అనుకొన్నాడు.

    నన్ను తింగరి అని పిలువొద్దు అంటూ

    నన్ను తింగరి అని పిలువొద్దు అంటూ

    దాంతో తన పక్కనే ఉన్న హిమను చూస్తూ తింగరి అంటూ శౌర్య పిలిచింది. అయితే నీవు అలా పిలవొద్దు అంటే.. నేను అలానే పిలుస్తుంటాను అని చెప్పింది. దాంతో హిమ ఇబ్బంది పడింది. అది చూసి.. హిమ కూడా అలానే అలిగేది. కానీ నా తల్లిదండ్రులను పొట్టన పెట్టుకొన్న హిమ ఓ రాక్షసి అంటూ కామెంట్ చేసింది. ఆ విషయం నుంచి తేరుకొని.. ఇది నీ హాస్పిటల్.. ఎవరైనా ఏదైనా అంటే గట్టిగా బుద్ది చెప్పాలి. అంతేకాకుండా ఒక్కటి ఇచ్చుకోవాలి అని హిమతో శౌర్య అంది.

    పచ్చ బొట్టు సెంటిమెంట్

    పచ్చ బొట్టు సెంటిమెంట్

    హిమ అలాంటి కాదు. ఓ వారం రోజులు నీతో తిప్పుకో. అప్పుడు హిమ మారిపోతుంది అని నిరుపమ్ అంటే.. అవును.. భలే చెప్పావు. వారం రోజులు నాతో ఉంటే.. అంతా మారిపోతుంది. ఇక ఫసక్ అంటూ శౌర్య చెప్పింది. వారం రోజుల్లో ధైర్యంగా ఉంటుంది అని చెప్పింది. ఆ తర్వాత హిమను చేయి పట్టుకొని శౌర్య బయటకు తీసుకెళ్లింది. అలా వెళ్తుంటే.. హిమ చేతిపై S అక్షరం పచ్చబొట్టు.. శౌర్య చేతిపై H అనే పచ్చబొట్టు కనిపించడం ట్విస్టుగా మారింది.

    బయటకు తీసుకెల్లిన హిమను ఆటో ఎక్కించుకొని డ్రైవర్ సీటులో కూర్చోబెట్టి డ్రైవింగ్ నేర్పించింది. ఇప్పుడు ఆటో నడపటం అవసరమా అంటే అవసరమే అని శౌర్య చెప్పింది. మధ్యలో తింగరి అంటూ ఉంటే.. అలా అనకు అని చెప్పింది. నీవు ఆటో డ్రైవర్‌గా ఆటోను నడిపితే.. నేను పాసింజర్ మాదిరిగా వెనుక కూర్చుంటాను అని చెప్పింది. హిమను గైడ్ చేస్తూ శౌర్య ముందుకెళ్లింది.

    ఆటో డ్రైవర్‌గా హిమ..

    ఆటో డ్రైవర్‌గా హిమ..

    శౌర్య చెబుతుంటే.. హిమ ఆటోను స్టార్ట్ చేసింది. భయం భయంగా ఆటోను ముందుకు తీసుకెళ్లింది. స్లో నడపమంటూ చెబుతుంటే.. భయమేస్తుందంటూ హిమ కంగారుపడిపోయింది. డ్రైవింగ్ చేస్తుంటే.. మాట్లాడించకు.. నాకు భయం వేస్తుంది అని హిమ అంటే.. నీవు డ్రైవింగ్ చేస్తుంటే.. నేను భయపడాలి. కానీ నీవెందుకు భయపడిపోతావు. నేను భయపడుతుంటే.. నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు అని ట్రేడ్ మార్క్ డైలాగ్స్ చెప్పకు అనగానే.. చిక్‌మంగళూరులో నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డువేస్తానంటూ జరిగిన సంభాషణ గుర్తుకు వచ్చింది.

    సృహ తప్పిన హిమ..

    సృహ తప్పిన హిమ..

    చిక్ మంగళూరులోని ప్రమాదం గుర్తుకు రాగానే సడెన్‌గా ఆటోను ఆపేసి ఏడవడం మొదలుపెట్టింది. దాంతో తింగరి.. ఎందుకు ఏడుస్తున్నావంటూ శౌర్య అడిగింది. దాంతో నా చెల్లెలు హిమ కూడా ఇలానే కుమిలికుమిలి ఏడ్చేది అంటూ శౌర్య బయటకు లాగి... పక్కనే ఉన్న ఇడ్లీ బండి వద్దకు తీసుకెళ్లింది. ఇడ్లీ బండి కుర్రాడు జ్వాలా అంటూ పిలువడంతో.. ఏమిటి ఆ అబ్బాయి పేరు పెట్టి పిలుస్తున్నాడు అని అడిగితే.. నాకు అక్కా, చెల్లెలు లాంటి పదాలు నచ్చవు అని చెప్పింది.

    Recommended Video

    RRR Movie పై Babu Gogineni వివాదాస్పద రివ్యూ | Filmibeat Telugu
    తాజా ప్రోమోలో మరో ట్విస్టు

    తాజా ప్రోమోలో మరో ట్విస్టు

    ఇదిలా ఉండగా.. తాజా ప్రోమోలో సరికొత్త ట్విస్టుకు తెరలేపారు. ఆటోలో హిమ సృహ తప్పి పడిపోవడంతో శౌర్య కంగారు పడింది. దాంతో ఆమెను లేపేందుకు ప్రయత్నిస్తుంటే.. మరో పక్క సౌందర్య తన మనవరాలు శౌర్య చిన్నప్పటి ఫోటోను ఫోనులో చూసుకొంటే.. ఇక్కడే ఉండి.. మాకు ఎందుకు కనిపించకుండా పోయావు అని ఆవేదన చెందింది.

    English summary
    Karthika Deepam March 30th Episode number 1313.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X