twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam ప్రాణాలను ఆడ్డు వేద్దామనుకొన్నా.. కానీ శౌర్య కోసం ప్రేమను త్యాగం చేశా.. హిమ ఎమోషనల్

    |

    హిమతో నిశ్చితార్థం జరుగుతుండటంతో డాక్టర్ నిరుపమ్ సంతోషంలో మునిగిపోయాడు. తనకు ఇష్టమైన హిమతో పెళ్లి జరుగుతుండటంతో ఆయన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కానీ హిమ ముఖంలో ఆనందం కనిపించకపోవడంతో నిరుపమ్ కంగారు పడ్డారు. హిమ నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఈ ప్రపంచాన్ని జయించినట్టు ఉంది. నువ్వెందుకు అంతగా డల్‌గా ఉన్నావు అని హిమను అడిగాడు. అదే గుడికి జ్వాలా అలియాస్ శౌర్య కూడా వచ్చింది. సత్యం జేబులో నుంచి ఉంగరాలు కొట్టేసిన స్వప్న అసలు విషయం బయటపెట్టింది. ఉంగరాలు తెచ్చుకొన్నంత మాత్రాన నిశ్చితార్థం జరిగిపోతుందా? తల్లి సౌందర్యపై ప్రయోగించడానికి మరో బ్రహ్మస్త్రం సిద్దంగా ఉంది అంటూ స్వప్న చెప్పింది. అయితే పీటల మీద నుంచి శౌర్యను చూసి హిమ షాక్ అయ్యింది. శౌర్య ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఇలాంటి పరిస్థితుల్లో నన్ను, నానమ్మను చూస్తే పరిస్థితి ఏమిటి అని హిమ కంగారుపడిపోయింది. కార్తీకదీపం సీరియల్‌ తాజా ఎపిసోడ్ 1352లో ఇంకా ఏం జరిగిందంటే?

    బాంబు పేల్చిన హిమ

    బాంబు పేల్చిన హిమ

    పెళ్లి నిశ్చితార్థానికి ముహుర్తం ఆసన్నమైంది. తాంబూళాలు మార్చుకోవాలి అని పూజారి అనగానే.. సౌందర్య, స్వప్న సిద్దమయ్యారు. అయితే ఇక నా తడాఖా చూపిస్తాను అని స్వప్న మనసులో తన ప్లాన్ గురించి అనుకొన్నది. అయితే అంతలోనే నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ హిమ బాంబు పేల్చింది. దాంతో నిరుపమ్‌తో సహా అందరూ షాక్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావు అని నిరుపమ్ అంటే.. సారీ బావ అని హిమ సమాధానం చెప్పింది. నిశ్చితార్థం పీటలపై నుంచి లేచిపోయింది. దాంతో హిమ ఏం చేసింది? తన మనసులో ఏముంది? తన మనసులో నేను ఉన్నానా? అని ప్రేమ అనుకొన్నాడు. హిమ పెళ్లి నిశ్చితార్థం ఆగిపోవడంతో బాధపడలా? సంతోషపడాలా అని ప్రేమ్ అనుకొన్నాడు. పెళ్లికూతురు వెళ్లిపోవడంతో అందరూ వెళ్లిపోయారు. నిరుపమ్, సౌందర్య కంటతడి పెట్టుకొన్నంత పనిచేశారు.

    నిశ్చితార్థం ఆగిపోవడంపై శౌర్య

    నిశ్చితార్థం ఆగిపోవడంపై శౌర్య

    అయితే నిశ్చితార్థం ఆగిపోవడంతో బయటకు వచ్చిన మహిళలు.. ఈ కాలం పిల్లలకు ఏం జరుగుతుందో అర్ధం కావడం లేదు. పీటల మీద నుంచి నాకు పెళ్లి ఇష్టం లేదంటూ అమ్మాయి లేచిపోయింది అని వాళ్లు అంటే.. అప్పటి వరకు అమ్మాయి తెలివి ఏమైపోయింది అంటూ జ్వాలా ప్రశ్నించింది. ఎవరి మనసులో ఏముందో ఏం చెప్పగలమని జ్వాలా అంటే.. తన మనసులో ఉన్న విషయాన్ని ముందే చెప్పాలి కదా? ఈ కాలం అమ్మాయిలను తలచుకొంటనే భయంగా ఉందని మహిళలు అన్నారు. దాంతో ఆ అమ్మాయి ఎవరో గానీ.. లాగి చెంపపై లాగిపెట్టాలని ఉందని జ్వాలా అన్నది.

    నష్టజాతకురాలిని ఇంట్లో పెట్టుకొంటే..

    నష్టజాతకురాలిని ఇంట్లో పెట్టుకొంటే..

    నిరుపమ్ పెళ్లి నిశ్చితార్థం ఎత్తిపోవడంతో సౌందర్యపై స్వప్న మండిపడింది. నా కొడుకును అమ్మాయి రిజెక్ట్ చేసిందనే మచ్చ పడింది. జీవితాంతం నా కొడుకు అలాంటి చెడు పేరు ఉంటుంది. నేను చెప్పినా మీరు ఎవరు వినలేదు. కార్తీక్, దీప చావుకు, శౌర్య ఇంటి నుంచి పోవడానికి కారణమైంది? అలాంటి అమ్మాయి కారణంగా నా ఇంటి పరువు, మా పరువు పోయింది. ఈ విషయంలో నీవు ఏం మాట్లాడటానికి హక్కే లేదు. నష్ట జాతకురాలిని ఇంట్లో పెట్టుకొంటే ఇలాంటి పరిస్థితే ఎదురు అవుతుంది. తలవంపులు మాకు తెచ్చి తలవంచుకొంటావేంటి అని స్వప్న మండిపడింది.

    అమ్మ, నాన్న నా మాట నిలబెట్టుకొన్నా

    అమ్మ, నాన్న నా మాట నిలబెట్టుకొన్నా

    ఇక నిశ్చితార్థం పీటలపై నుంచి లేచి వచ్చిన హిమ తన తల్లిదండ్రుల ఫోటో ముందు చేతులు జోడించి నిలబడింది. నేను తప్పు చేయలేదని నీకు తెలుసు. నాకు తెలుసు. సౌందర్యను జాగ్రత్తగా చూసుకోమని, ఇద్దరు కలిసి ఉండాలని మీరు చెప్పారు. చివరి నిమిషంలో కూడా శౌర్యను నాకు అప్పగించినట్టే మాట్లాడారు. ఆ మాటలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. కానీ నన్ను అసహ్యించుకొని శౌర్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. కానీ శౌర్యపై నా ప్రేమ తగ్గలేదు. కానీ శౌర్యకు నేను హిమ అని చెప్పే అవకాశం లేకుండా పోయింది. ఈ రోజు నాకు తృప్తిగా ఉంది నాన్న.. చాలా సంతోషంగా ఉంది అమ్మ.. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకొన్నాను అని హిమ బాధపడింది.

    నిరుపమ్‌ను శౌర్య ప్రేమిస్తుందా?

    నిరుపమ్‌ను శౌర్య ప్రేమిస్తుందా?

    శౌర్య కోసం నా ప్రాణం అడ్డేద్దామని అనుకొన్నా. కానీ ఈ రోజు నా ప్రేమను అడ్డేశాను. శౌర్య కోసం బావ మీద ఉన్న ప్రేమను త్యాగం చేశాను. బావ అంటే శౌర్యకు చెప్పలేనంత ప్రేమ ఉంది. ఫోన్‌లో నిరుపమ్ బావ నంబర్‌ను నా మొగుడు అని సేవ్ చేసుకొన్నది. నిరుపమ్ బావను శౌర్య ప్రేమిస్తుందా? దేవుడా? ఆ రోజు నాకు శౌర్య ప్రేమ తెలిసింది. శౌర్య ఆనందమే నా ఆనందం.. తన లోకమే నా లోకం. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. శౌర్య కోసం ఏమైనా చేయగలనా అని అనుకొన్నాను. కానీ ఇప్పుడు శౌర్య కోసం ఏదైనా చేయడానికి అవకాశం లభించింది. నిరుపమ్, శౌర్యకు పెళ్లి చేస్తాను. ఇన్నాళ్లు శౌర్య వస్తేనే పెళ్లి చేసుకొందామని అనుకొన్నా. కానీ ఇప్పుడు శౌర్య పెళ్లి చేయడమే నా లక్ష్యం. ఎన్ని కష్టాలు వచ్చినా వారిద్దరి పెళ్లి చేస్తాను అంటూ హిమ నిర్ణయించుకొన్నది.

    నిరుపమ్ ఎంత బాధపడ్డాడో తెలుసా?

    నిరుపమ్ ఎంత బాధపడ్డాడో తెలుసా?

    పెళ్లి ఇష్టం లేదని వచ్చేసిన హిమపై సౌందర్య కోపంతో రగిలిపోయింది. ఏమైందే నీకు. చివరి నిమిషంలో నచ్చలేదని చెప్పావు. స్వప్నను ఎంత కష్టపడి ఒప్పించానో తెలుసా? నిరుపమ్ ఎంత బాధపడ్డాడో తెలుసా? కాసేపు ఆగితే ఎంగేజ్‌మెంట్ అయిపోయేది తెలుసా? అని హిమపై సౌందర్య ఆగ్రహం వ్యక్తం చేసింది.

    హిమను కొట్టిన సౌందర్య

    హిమను కొట్టిన సౌందర్య

    కార్తీకదీపం తాజా ప్రోమోలో హిమ, సౌందర్య మధ్య ఎమోషనల్ అంశాలు చోటుచేసుకొన్నాయి. ఏంటే తమాషా చేస్తున్నావా? పెళ్లి అంటే ఏమనుకొన్నావు అని సౌందర్య అంటే.. నాకు పెళ్లి ఇష్టం లేదు అని హిమ బదులిచ్చింది. ఎందుకు ఇష్టం లేదో చెప్పు అంటూ సౌందర్య నిలదీస్తూ.. చెంపపై లాగి బలంగా ఒక్కటిచ్చింది. పెళ్లి నిశ్చితార్థం ఆగిపోవడంతో ఫుల్లుగా తాగి ఓ చోట ఉన్న నిరుపమ్‌ను శౌర్య చూసింది. డాక్టర్ సాబ్ ఎందుకిలా తాగావు అంటే.. నేనంటే నీకు ఇష్టమే కదా అని నిరుపమ్ అడగడంతో శౌర్య షాక్ తింది. అంతలోనే ఐలవ్ యూ అని నిరుపమ్ చెప్పడంతో.. నిరుపమ్‌ను చూసి ఆనందంలో డాక్టర్ సాబ్ అని ఆనందం వ్యక్తం చేసింది.

    ఊగిసలాటలో కార్తీకదీపం రేటింగ్

    ఊగిసలాటలో కార్తీకదీపం రేటింగ్

    ఇదిలా ఉండగా, కార్తీకదీపం సీరియల్ రేటింగ్ విషయంలో ఊగిసలాట కొనసాగుతున్నది. 17వ వారంలో 11.42 రేటింగ్ నమోదు చేసుకొన్నది. అలాగే తాజా వారం 18వ వారంలో 11.48 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. కంటెంట్ విషయంలో సాగదీత కొనసాగుతుండటం, ఐపీఎల్ టోర్నీ తదితర అంశాలు సీరియల్‌పై ప్రభావం చూపుతున్నాయని టెలివిజన్ ఇండస్ట్రీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    English summary
    Karthika Deepam May 13th Episode number 1352. Hima sacrifies her love for Shourya
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X