Karthika Deepam డాడీ.. చేసిన తప్పుకు కుమిలిపోతున్నా.. శౌర్య క్షమిస్తుందా? హిమ కంటతడి..
కార్తీక్, దీప మరణాలను జీర్ణించుకోలేని ఆనందరావు ఎమోషనల్ అయ్యారు. ఏంటో దీప.. దేవుడు నాకు ఎక్కువ ఆయుషు ఇచ్చినట్టు ఉన్నాడు. అందులో కొంచెమైనా దీప, కార్తీక్‌కు ఇచ్చి ఉంటే బాగుండేది కదా అని ఆనందరావు అంటే.. ఇప్పుడు ఎందుకు అలా అంటున్నావు అని సౌందర్య ఊరడించేందుకు ప్రయత్నించింది. అయితే ప్రస్తుతం ఇంట్లో సంతోషాలు కావాలి. సందడితో ఇళ్లంతా కళకళలాడాలి. అందంతా హిమ పెళ్లితోనే సాధ్యమవుతుందని నా కోరిక అని ఆనందరావు అంటే.. చూడండి.. మనల్ని చూసి శౌర్య తప్పించుకు తిరుగుతుందేమో అనిపిస్తున్నది. శౌర్య దొరికితేనే హిమ పెళ్లి చేసుకొంటానని చెప్పింది. ఈ విషయంలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది అని సౌందర్య అంటే.. అటు హిమ, ప్రేమ్, శౌర్య, నిరుపమ్ జంటలుగా మారాలని వాళ్లు ఆశపడ్డారు కదా అని ఆనందరావు అన్నాడు. దాంతో ఆశపడితే నిజాలు కావు కదా. మీరు ఈ విషయంలో ఎక్కువగా ఆలోచించకండి అంటూ సౌందర్య ఊరడించింది. ఇంకా కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1315లో ఏం జరిగిందంటే?

అర్ధరాత్రి దాటినా హిమ రాకపోవడంపై
రాత్రి దాటినా హిమ ఇంటికి రాకపోవడంపై సౌందర్య ఆందోళన చెందింది. హిమ ఇంకా ఇంటికి రాలేదు. మీకు ఏమైనా ఫోన్ చేసిందా? అని సౌందర్య అంటే.. లేదు అని ఆనందరావు సమాధానం చెప్పింది. హాస్పిటల్‌కు ఫోన్ చేస్తే ఇంట్లో లేదని చెప్పారు. హాస్పిటల్‌లో లేక.. ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తున్నదో అర్ధం కావడం లేదు అని సౌందర్య కంగారు పడింది. దాంతో యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి హిమ అదోలా ఉంటున్నది. హిమలో చాలా మార్పులు వచ్చాయి. ఎప్పుడు బెరుకు బెరుకుగా ఉంటున్నది అని అనందరావు అన్నారు. అవును.. చిన్నప్పటి నుంచి అలానే ఉంటున్నది. డాక్టర్ అయినా వైద్యం చేయడానికి భయపడుతున్నది. మౌనంగా, ఆలస్యంగా వస్తున్నది అని సౌందర్య అంటే.. అవును ఈ విషయం తెలుసుకోవాలి. హిమ ఎక్కడికి వెళ్తుందో ఆలోచించాలి అంటూ సౌందర్య, ఆనందరావు కంగారుపడ్డారు.

బస్తీకి వెళ్లి తండ్రి ఫోటో ముందు
చిన్నతనంలో బస్తీలో ఉన్న ఇంటికి హిమ వెళ్లింది. ఇంటి ముందు నిలబడి చాలా రోజులకు బస్తీలోని ఇంటికి వచ్చాను. నా బాల్యం గుర్తులన్నీ ఇక్కడే ఉన్నాయి. బస్తీవాసులు ఎలా ఉన్నారో.. మోనిత ఆంటీ ఇల్లు ఎలా ఉందో.. అంటూ ఆ ఇంటిలోకి అడుగుపెట్టింది. ఇంటిలోకి వెళ్లి చూడగానే తన తండ్రి ఫోటో కనిపించింది. తన తండ్రి ఫోటో ముందు నిలబడి కంటతడి పెట్టుకొన్నది. నా చేసిన పొరపాటు వల్లే మీరు నాకు దూరం అయ్యారు. శౌర్య నన్ను క్షమిస్తుందో లేదో కానీ.. మీరు నన్ను క్షమిస్తారని అనుకొంటున్నాను అని తండ్రి ఫోటోను చేతిలోకి తీసుకొని తుడిచింది. కన్నీరు పెడుతూనే తండ్రి ఫోటో వద్ద పూజ చేసింది. చేతులెత్తి మొక్కుతూ.. నేను చేసిన తప్పుకు.. చిన్నప్పటి నుంచి కుమిలిపోతూనే ఉన్నాను. నేను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలంటే.. శౌర్యను కలువాల్సిందే. శౌర్యకు నేనంటే ఇష్టం.. అదే విధంగా కోపం కూడా ఉంది. శౌర్య నన్ను క్షమిస్తుందో లేదో తెలియదు. నేను చేసిన పాపానికి ఏ శిక్ష వేసినా భరిస్తాను. డాడీ నన్ను క్షమించగలవా? నేను చేసిన పాపం నన్ను దహిస్తూనే ఉంది. మీరు లేని బాధ ఒకవైపు. శౌర్య లేదనే బాధ మరోవైపు. డాడీ శౌర్య కోసం వెతుకుతూనే ఉన్నాం అని హిమ వేడుకొన్నది.

హిమ.. అమ్మా, నాన్నలను నువ్వే చంపావు
ఇక హిమ గురించి శౌర్య ఆలోచిస్తూ ఉండిపోయింది. ముమ్మాటికి అమ్మా, నాన్నలను నువ్వే చంపావు అని గుర్తు చేసుకొన్నది. హిమ గురించి ఆలోచిస్తే.. డాక్టర్ తింగరి (హిమ) గుర్తుకు వస్తున్నదేమిటి? డాక్టర్ తింగరి అడిగే పిచ్చి ప్రశ్నలు వేస్తుంటే.. హిమను గుర్తు చేసుకొన్నది. హిమ మాదిరిగానే తింగరి కూడా టెన్షన్ పడుతున్నది. హిమ మీద కోపాన్ని తింగరి మీద చూపించడం ఎందుకు? తింగరిని బాధపెట్టడం ఎందుకు? తింగరి బాధపడితే డాక్టర్ సాబ్ బాధపడుతాడు. ఇక నుంచి నేను వారి వద్దకు వెళ్లను అని మనసులో అనుకొన్నది. అంతలోనే తన తల్లి దీప.. డాడీని డాక్టర్ బాబు అని పిలిచేది. ఇప్పుడు నేను కూడా నిరుపమ్‌ను డాక్టర్ సాబ్ అని పిలుస్తున్నాను అని శౌర్య మనసులో అనుకొన్నది. తింగరి, డాక్టర్ బాబును చూస్తే వాళ్లిద్దరూ నాకు చాలా కావాల్సిన వాళ్లు అనిపిస్తున్నది అని శౌర్య మనసులో అనుకొన్నది.

పెంపుడు తండ్రి వీపుపై వాతలు
హిమ, నిరుపమ్ గురించి ఆలోచిస్తుండగా.. ఇంట్లోకి ఇంద్రుడు, చంద్రుడు మెల్లగ ఇంట్లోకి అడుగుపెట్టారు. దాంతో ఏంటి .. ఇంత లేటుగా వస్తున్నారు? మళ్లీ చేతికి పనిచేబుతున్నారా? ప్రతీ ఇంట్లో పిల్లలు లేటుగా వస్తే తల్లిదండ్రులు తిడుతారు. కానీ తల్లిదండ్రులు లేటుగా వస్తే పిల్లలు తిట్టే పరిస్థితి ఇంట్లోనే ఉంది. ఇంట్లో ఆడపిల్ల ఉంది.. వంట చేసి పెట్టాలనే ఆలోచన లేదా? మీరు ఇక మారరా? మనోహర్ సార్ మీకు ఉద్యోగం ఇచ్చారు. అయినా మీరు మారరా? అని శౌర్య అంటే.. పాపం చెట్టుమీద కాయ లాంటింది. ఎప్పుడో ఒకసారి పండక తప్పుదు అని ఇంద్రుడు అంటే.. అర్ధం కావడం లేదు అంటూ శౌర్య అంటే.. మేము దొంగతనాలు మానే రోజు వచ్చింది. ఆ రోజే వచ్చింది చూడు.. అంటూ ఎవరో వీపుపై కొట్టిన దెబ్బలు చూపించాడు. దాంతో శౌర్య ఎమోషనల్ అయ్యారు. దాంతో మేము దొంగతనాలు మానుతాం అని అంటే.. రేపటి నుంచి రవ్వ ఇడ్లీ వద్ద పని చూసుకోండి అంటూ శౌర్య వెళ్లిపోయింది.

బస్తీలో అడుగుపెట్టిన శౌర్య
శౌర్య ఆటోలో కూర్చొని ఏదో ఆలోచిస్తుండగా.. ఓ ప్యాసింజర్ వచ్చి.. శ్రీరామ్ నగర్ బస్తీలో దించుతావా? అని అడిగాడు. శ్రీరామ్ నగర్ బస్తీ అనగానే.. చిన్ననాటి విషయాలు గుర్తుకు వచ్చాయి. వాటి గురించి ఆలోచిస్తుండగా.. ఇంతకు బస్తీకి వస్తావా అని ప్యాసింజర్ అడిగారు. కావాలంటే 20 రూపాయలు ఎక్కువగా ఇస్తాను అంటే లేదు.. లేదు.. మిమ్మల్ని బస్తీలో దించేస్తాను. కావాలంటే ఫ్రీగా తీసుకెళ్లి దిగబెడుతాను అని చెప్పింది. మీరు సూపర్ సార్ అంటూ బస్తీ అంటే నాకు చాలా ఇష్టం. మీరు బస్తీకి వెళ్తమనగానే నాకు చాలా ఉత్సాహం వచ్చింది అంటూ శౌర్య మనసులో అనుకొన్నది. ఆటోలో పెద్దాయనను దిగబెట్టి..ఇక వారణాసి..లక్ష్మణ్ ఉండాలి ఉన్నారా అంటే.. అలాంటి పేర్లు ఉన్న వ్యక్తుల లేరు అంటూ ప్యాసింజర్ సమాధానం చెప్పారు.

హిమ తన చెల్లెలు అని తెలిసి.. శౌర్య షాక్
బస్తీకి వెళ్లిన శౌర్య.. చిన్నతనంలో తన తల్లి దీప, చెల్లెలు హిమతో కలిసి ఉన్న ఇంటి ముందు ఆటోను ఆపింది. ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయంటే.. ఎవరో ఒకరు మేల్కొనే ఉన్నారనుకొంటా అని శౌర్య ఇంట్లోకి అడుగుపెట్టింది. ఇంటిలో అప్పటికే ఉన్న హిమ.. గోడపై ఉన్న ఫోటోలు చూసి.. ఈ లెక్కన ఆనంద్ నా తమ్ముడు అని అనుకొంటుండగా.. శౌర్య ఇంటిలోకి అడుగుపెట్టింది. తన తండ్రికి మొక్కుతున్న సీన్ చూసి శౌర్య షాక్ అయింది. తాజా ప్రోమోలో ఎమోషనల్ ట్విస్టు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.
Recommended Video


కార్తీకదీపం లేటేస్ట్ వీక్ రేటింగ్
ఇక కార్తీకదీపం సీరియల్ దాదాపు మూడు సంవత్సరాలకుపైగా అత్యధిక మంది ప్రేక్షకులను ఆకట్టుకొంటూనే ఉంది. కథ, కథనాల్లో వైవిధ్యం కారణంగా ఈ సీరియల్ మూడేళ్లుకుపైగానే టాప్ రేటింగ్‌తో దూసుకెళ్తున్నది. తాజా వారంలో కార్తీకదీపం సీరియల్ రేటింగ్ విషయానికి వస్తే... మిగితా సీరియల్స్ కంటే ముందుగానే ఉంది. ఈ వారం 13.38 రేటింగ్‌తో టాప్ స్థానంలో కొనసాగుతున్నది.


Click it and Unblock the Notifications











