twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam ప్రేమ లేని చోట నేను ఉండలేను.. హిమపై జ్వాలా ఆగ్రహం

    |

    హిమనే తింగరి అని తెలిసిన తర్వాత జ్వాలా అలియాస్ శౌర్య కోపంతో ఊగిపోయింది. తాను శౌర్య అని తెలిసినా నన్ను పట్టించుకోకుండా మోసం చేశారనే కోపంతో ఊగిపోయింది. తన ఇంట్లోకి వచ్చి వంట చేస్తున్న హిమను చూసి ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే మనమిద్దరం వంటలక్క కూతుళ్లమే కదా అని అంటే.. చేయిపట్టి బయటకు తోసి ఇంటి తలుపులు మూసేసింది. అయితే జ్వాలా పరిస్థితిని చూసి పిన్ని, బాబాయ్‌ ఆవేదన చెందారు. ఇప్పుడు నిన్ను జ్వాలా అని పిలువాలా? లేదా శౌర్య అని పిలువాలా అని బాబాయ్ అంటే.. నా జీవితం ఏం మారింది అని జ్వాలా చెప్పింది. కార్తీకదీపం సీరియల్ 1400 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

     రక్త సంబంధం లేదు..

    రక్త సంబంధం లేదు..


    బాబాయ్, పిన్నితో మాట్లాడుతూ.. నాకు ఉన్నది మీరిద్దరే. నేను ఇంటి నుంచి పారిపోయి వచ్చానో.. ఆ రోజే వాళ్లు నావాళ్లు కాకుండా పోయారు. జరిగిందంతా మోసం. బంధాలు లేవు.. బంధుత్వాలు లేవు. రక్త సంబంధం అంతకంటే లేదు. ఎవరి స్వార్ధం వారు చూసుకొంటున్నాను. నాకు నావాళ్లు ఉన్నారో లేదో తెలియకముందే..మీరు నన్ను ఆదరించారు. మీ బిడ్డలా ఆదరించారు. ఎప్పటికీ మీ వద్దనే ఉంటాను. మీరు వెళ్లమన్నా.. నేను ఎక్కడికి వెళ్లను అని జ్వాలా అంటే.. ఇన్నాళ్లు నీకు ఎవరు లేరని అనుకొన్నాం. ఇప్పుడు పెద్దింటి బిడ్డవు. ఇప్పుడైనా ఆ ఇంటికి వెళ్లి ఉండు అని పిన్ని అంటే.. వాళ్లకు పెద్ద ఇండ్లు ఉంటాయోమో. కానీ పెద్ద మనసులు ఉండవు. మన ఇళ్లు ఇరుకుగా ఉన్నా.. మన మనసులు విశాలంగా ఉంటాయి. ప్రేమ లేని చోట నేను ఉండలేను అని జ్వాలా చెప్పింది.

    జ్వాలా మనసు ఎప్పటికీ కరగదు

    జ్వాలా మనసు ఎప్పటికీ కరగదు


    ఇక జ్వాలా నిర్ణయంతో అమ్మమ్మ, తాతయ్య సౌందర్య, ఆనందరావు ఆవేదనకు గురయ్యారు. ఇలాంటి జీవితానికి మందులు వేసుకోవడం అవసరమా అంటూ ఆనందరావు నిర్వేదం చెందారు. జ్వాలాను తీసుకొస్తానని హిమ వెళ్లింది. కానీ జ్వాలా మనసు మారదు. మన ఇంటికి రాదు. తాతయ్యగా నేను వెళ్లి అడిగితే.. రానని చెప్పింది. జ్వాలా మనసు కరుగలేదు అని ఆనందరావు అంటే.. ఏదో ఒకరోజు కరిగిపోతుంది అని సౌందర్య అన్నారు. అయితే హిమ, శౌర్య చాలా ప్రేమగా ఉండేవారు. కానీ ఇప్పుడు హిమ అంటే.. జ్వాలాకు పీకల్లోతు కోపం ఉంది అని సౌందర్య చెప్పింది. అయితే జ్వాలా వస్తుందో లేదో అనే బాధతో మనసు బండలా మారింది అని ఆనందరావు అన్నారు.

    నీ వల్లే నా జీవితం నాశనం

    నీ వల్లే నా జీవితం నాశనం


    ఇక ఇంటి నుంచి బయటకు రాగానే హిమ వర్షంలో తడిచి వణుకుతూ కనిపించింది. హిమను చూసి.. ఇంకా వర్షంలో తడుస్తూ నిలచుంటే.. జాలి పడుతావని అనుకొంటున్నావా? ఇంటి ముందు నిలుచుకొని ఎవరిని సాధిద్దామని అనుకొంటున్నావు అని జ్వాలా అంటే.. చాలా చలిగా ఉంది.. ఇంట్లోకి వెళ్దాం అంటే.. వెళ్లి నీ కారులో కూర్చో అంటూ జ్వాలా కోపగించుకొంది. అయితే నా మాట ఒక్కసారి విను అంటే.. నీ వల్లే నా జీవితం నాశనం అయింది. నీ ఇల్లు ఎక్కడో చెప్పు.. అక్కడ దించి వస్తాను అని జ్వాలా అంటే.. మన ఇల్లు ఎక్కడ అని అడుగుతున్నావా? జీవితం ఎంత విచిత్రమో అని హిమ అంటే.. నా జీవితంలో చాలా విచిత్రాలు జరిగాయి. మీది ఏది నిజమో.. ఏది అబద్దమో అర్ధం కావడం లేదు అంటూ జ్వాలా కోపగించుకొన్నది.

    నీ మోసాలు గురించి ఎలా చెప్పాలి

    నీ మోసాలు గురించి ఎలా చెప్పాలి


    వర్షంలో తడిచి ముద్దైన హిమను కారులో ఎక్కించుకొని జ్వాలా ఇంటి వద్దకు చేర్చింది. ఈ ఇంటికి నేను ఎప్పుడో వచ్చాను అంటే.. రా ఇంటిలోపలికి రా.. పరాయిదానిగా మాట్లాడకు అని హిమ అంటే.. ఈ ఇంటికి నాకు సంబంధం తెగిపోయింది అని జ్వాలా అంటే.. బంధాలు గాలిపటాలు కావు తెంచుకోవడానికి.. నీవు లోపలికి వస్తే.. నానమ్మ, తాతయ్య ఆనందపడిపోతారు అని హిమ అంటే.. ఒకరి ఆనందం కోసం రావాలా? నా ఆనందం కోసం ఆలోచించడం లేదు. నీవు ఇంటి వద్ద తడిసి కనిపిస్తే.. చూసే వాళ్లు ఏమనుకొంటారు. వారి నేను ఏమని సమాధానం చెప్పాలి. నీవు చేసిన మోసాలు గురించి నేను ఎలా చెప్పాలి అని జ్వాలా అంది. హిమ వారిస్తున్నా చేయి వదిలేసుకొని జ్వాలా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

     కంగారులో శోభ, స్వప్న

    కంగారులో శోభ, స్వప్న


    హిమతో పెళ్లి విషయంపై నిరుపమ్ ఉత్సాహంగా ఉండటం తల్లి స్వప్న, శోభకు అర్ధం కాలేదు. క్యాన్సర్‌తో చనిపోయే హిమను చేసుకోవడానికే పట్టు బడుతున్నాడు. అదే నాకు అర్ధం కావడం లేదని స్వప్న అంటే.. అది చావదు. దానికి క్యాన్సర్ లేదు. ఆ విషయం నేను ఇప్పుడు నీతో చెప్పలేను. కానీ నిరుపమ్‌ను దక్కించుకోవాలంటే.. నేను గట్టి నిర్ణయం తీసుకోవాలి. నిరుపమ్ కోసం గట్టి ప్రయత్నం చేయాలి అంటూ శోభ ఆవేశం మాట్లాడింది. అయితే శోభను చూసి.. ఏంటీ ఈమె ప్రవర్తన. ఒక్కోసారి ఆమె తీరు అర్ధం కావడం లేదు అని స్వప్న మనసులో అనుకొన్నది.

    లేటేస్ట్ ప్రోమోలో అలాంటి ట్విస్టు

    లేటేస్ట్ ప్రోమోలో అలాంటి ట్విస్టు


    అయితే తాజా ప్రోమోలో జ్వాలాతో శోభ ఓ సీక్రెట్ రివీల్ చేసింది. నీవే శౌర్య అని బ్లడ్ డొనేషన్ క్యాంపులోనే తెలిసింది. నీవు డాక్టర్ సాబ్‌ను ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత తనకు క్యాన్సర్. రెండు నెలల కంటే ఎక్కువగా బతకనని చెప్పింది. అలా డాక్టర్ సాబ్‌ను ఒప్పించి పెళ్లిని సెట్ చేసుకొన్నది అని శోభ అంటే.. ఏం మాట్లాడుతున్నావు అని శోభను జ్వాలా చెంపదెబ్బ కొట్టింది.

    English summary
    Karthika Deepam July 11th Episode number 1400.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X