twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నిరుపమ్‌తో శోభ పెళ్లి.. శౌర్య, స్వప్న మధ్య హైడ్రామా

    |

    హిమను చూపిస్తూ.. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకొన్నది ఆమె అంటూ డాక్టర్ శోభకు స్వప్న చెప్పింది. హిమను గద్దిస్తూ.. నిరుపమ్ ఎక్కడ అని ప్రశ్నిస్తే.. నిజం చెప్పాలా అని కంగారు పడింది. తాను ఆమె కోడలు కాదు కదా.. అని బావ బయటకు వెళ్లాడు అని హిమ సమాధానం చెప్పింది. అయితే కారు ఇక్కడే ఉంది కదా.. అని స్వప్న ప్రశ్నిస్తే.. ఆటోలో వెళ్లాడు అని గట్టిగా సమాధానం చెప్పింది. అది కూడా జ్వాలా ఆటోలో.. జ్వాలాతో కలిసి వెళ్లాడు అని హిమ చెప్పగానే.. స్వప్న, డాక్టర్ శోభ కంగారు పడిపోయారు. కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్ 1360లో ఏం జరిగిందంటే?

    జ్వాలాతో ఆటోలో నిరుపమ్

    జ్వాలాతో ఆటోలో నిరుపమ్

    జ్వాలాతో ఆటోలో నిరుపమ్ వెళ్లాడని హిమ చెప్పగానే.. వెంటనే కొడుకుకు ఫోన్ కలిపింది. ఫోన్ మోగడంతో ఎవరు అని జ్వాలా అడిగితే.. ఎవరు ఫోన్ చేసినా నేను ఎత్తను అని సమాధానం చెప్పాడు. అయితే తల్లి పదేపదే ఫోన్ చేయడంతో మమ్మి ఎందుకు ఫోన్ చేస్తుంది? అని ఫోన్ కట్ చేశాడు.

    నిరుపమ్‌ను ఓ ప్రదేశానికి తీసుకెళ్లడంతో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడిగాడు. మనసు ప్రశాంతంగా ఉండే ప్రదేశానికి తీసుకెళ్లమని చెప్పావుగా.. వీళ్లని ఓ బంధం కలుపుతుంది. వీళ్లంతా అనాధలు అని జ్వాలా ఎమోషనల్ అయింది. వీళ్లంతా అనాధ పిల్లలా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

    అనాథాశ్రమంలోకి జ్వాలా, నిరుపమ్

    అనాథాశ్రమంలోకి జ్వాలా, నిరుపమ్

    అనాథ పిల్లల గురించి మాట్లాడుకొంటూ అక్కడే కూర్చొన్నారు. అనాథశ్రయం అని బోర్టు లేదు ఎందుకని అంటే.. అలాంటి బోర్డు ఉంటే.. మేము అనాథలం అని వారికి గుర్తు వస్తుంది అని జ్వాలా అంటే.. గుడ్ ఐడియా అని జ్వాలా చెప్పింది. ఈ అనాథాశ్రమం నడిపే వ్యక్తి ఎవరో తెలియదు. కానీ పిల్లల కోసం బాగా సేవ చేస్తుంది.

    జీవితంలో సగభాగం నిద్రకు సరిపోతే.. మిగితా సగం టెన్షన్‌కే పోతుంది. జీవితాంతం బిందాస్‌గా ఉండాలి అని వేదాంతం చెప్పడంతో జ్వాలా చేతిని తన చేతిలోకి తీసుకొని.. జ్వాలా నువ్వు నిజంగా గ్రేట్ అని నిరుపమ్ ప్రశంసించారు. నువ్వు గొప్ప మాటలు చెబుతుంటే.. మా ఫ్యామిలీ కోసమే పుట్టావేమో అనిపిస్తుంది. మంచి ప్లేస్‌కు తీసుకొచ్చావు అని నిరుపమ్ అన్నాడు.

    టెన్షన్ ఎందుకు నిరుపమ్

    టెన్షన్ ఎందుకు నిరుపమ్

    నిరుపమ్ టెన్షన్‌లో ఉండటం గురించి జ్వాలా ఆరా తీస్తూ.. ఏంటి డాక్టర్ సాబ్.. మీరెందుకు అదోలా ఉంటున్నారు అని అడిగింది. ఈ మధ్య పరేషాన్ పరేషాన్‌లో కనిపిస్తున్నారు. హిమ విషయాన్ని చెప్పడం సరికాదు అని మనసులో అనుకొని.. సమయం వచ్చినప్పుడు మీకు చెబుతా. అవసరమైనప్పుడు మీ హెల్ప్ తీసుకొంటానని చెప్పాడు.

    అయితే అంతలోనే అక్కడి సిబ్బంది రావడంతో ఈ ఆఫీస్ వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని నిరుపమ్ అడిగాడు. అయితే లోపల ఉన్నారు పిలవమంటారా? అంటే.. లేదు నేనే వస్తాను అని చెప్పాడు. ఈ అనాథశ్రమం కోసం మంచి పనిచేద్దామనిపించింది అని నిరుపమ్ ఆఫీస్‌లోకి వెళ్లాడు.

    శోభ నాకు కాబోయే కోడలు

    శోభ నాకు కాబోయే కోడలు

    నిరుపమ్ ఫోన్ కట్ చేయడంతో తల్లి స్వప్న టెన్షన్ పడిపోయింది. ఇక్కడ మనుకు పనిలేదు అంటూ వెళ్లబోతూ.. శోభతో నీకు పరిచయం అయింది కదా.. కానీ నేను ఆమెను మరొక విధంగా పరిచయం చేస్తాను. డాక్టర్ శోభ. నాకు కాబోయే కోడలు. డాక్టర్ నిరుపమ్‌కు కాబోయే భార్య.. నా సెలక్షన్ ఎలా ఉందంటూ స్వప్న షాకిచ్చింది.

    దాంతో హిమ కంగారు పడిపోయింది. నీ పెళ్లి చేయించే బాధ్యత నాదే అంటూ జ్వాలాకు మాటిచ్చాను. నిరుపమ్‌ను జ్వాలాను కలిపేందుకు ప్రయత్నిస్తుంటే.. స్వప్న ఇలాంటి షాక్ ఇచ్చిందేమిటి అని హిమ మనసులో అనుకొన్నది.

    నా చేతికి అందినావు కదా..

    నా చేతికి అందినావు కదా..

    నిరుపమ్ గురించి ఆలోచనల్లో జ్వాలా ఉంటే.. అక్కడికి డాక్టర్ శోభ వచ్చింది. ఏంటి నీవిక్కడ అంటే.. నేను ఎవరి అంచనాలకు అందను అంటే.. అవును.. నా చేతికి అందావు కదా.. అని చెంప దెబ్బ విషయాన్ని జ్వాలా గుర్తు చేసింది. అంతలోనే డాక్టర్ శోభను చూసి... హాయ్ అంటూ వచ్చి ఆమెను కౌగిలించుకొన్నాడు. నిరుపమ్ కౌగిలించుకోగానే.. ఇది నా రేంజ్ అంటూ జ్వాలాకు శోభ సైగలు చేసింది.

    అయితే శోభ నాకు మంచి ఫ్రెండ్. మా మధ్య దాపరికాలు ఉండవని నిరుపమ్ చెప్పాడు. అంతలోనే జ్వాలాను పిలిచి.. ఈమె నా ఫ్రెండ్. చాలా తెలివిగలది అని నిరుపమ్ పరిచయం చేస్తే.. ఏం చేస్తుంది అని అడిగింది.. ఆటో డ్రైవర్ అంటే.. డాక్టర్‌కు ఆటో డ్రైవర్‌కు ఫ్రెండ్‌షిపా అని అదోలా డాక్టర్ శోభ మాట్లాడింది.

    చెంపదెబ్బ విషయంపై జ్వాలా షాక్

    చెంపదెబ్బ విషయంపై జ్వాలా షాక్

    శోభ అక్కడికి రావడంతో ఏమిటి ఇలా వచ్చావు అని నిరుపమ్ అడిగితే.. స్వప్న ఆంటితో వచ్చాను అని చెప్పింది. అక్కడే కారులో కూర్చొన్న తల్లిని చూసి ప్రసన్నం చేసుకోవాలి అంటూ నిరుపమ్ పరిగెత్తాడు. అయితే తనను చెంపపై కొట్టినట్టు నిరుపమ్‌కు చెబుతానని భయపడ్డావా? అంటే.. చెప్పి పరువు తీసుకోవని నాకు తెలుసు అంటూ శోభకు జ్వాలా కౌంటర్ ఇచ్చింది. దాంతో అక్కడి నుంచి శోభ వెళ్తూ నిరుపమ్‌కు ఎదురు పడింది.

    రా వెళ్దామని శోభ అంటే.. నేను వస్తాను మీరు వెళ్లండి అని నిరుపమ్ చెప్పాడు. అయితే ఎలా వచ్చావు అంటే.. ఆటోలో వచ్చాను అని నిరుపమ్ అంటే.. లేదు కారులో వెళ్దామని బలవంతం చేయడంతో ఇప్పుడే వస్తాను అని జ్వాలా దగ్గరకు నిరుపమ్ వెళ్లాడు. సారీ జ్వాలా నేను వెళ్లకపోతే శోభ బాధపడుతుంది అంటూ నిరుపమ్ చెప్పడంతో జ్వాలా బాధపడింది.

     నిరుపమ్ ఇంట్లోకి జ్వాలా ఎంట్రీ

    నిరుపమ్ ఇంట్లోకి జ్వాలా ఎంట్రీ

    తాజాగా కార్తీకదీపం ప్రోమోలో.. మీ అత్త స్వప్న నిరుపమ్‌కు డాక్టర్ శోభతో పెళ్లి చేస్తుందట.. అని సౌందర్య కోపంతో ఊగిపోయింది. దాంతో అలా ఎలా చేస్తుందని హిమ అంటే.. తన కొడుకు.. ఎవరితోనైనా చేసుకొనే హక్కు దానికి ఉంది అని సౌందర్య సమాధానం చెప్పింది. ఇదిలా ఉంటే.. నేరుగా స్వప్న, నిరుపమ్ ఇంటికి జ్వాలా వెళ్లింది. ఇంటికే వచ్చేశావా అంటే.. నాకు పెద్దలంటే గౌరవం అంటూ స్వప్న కాళ్లకు జ్వాలా మొక్కి షాకిచ్చింది. దాంతో ఈ సీరియల్‌లో మరో ట్విస్టు కనిపించింది.

    English summary
    Karthika Deepam May 24th Episode number 1360. Nirupam taken to orphan school
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X