For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam ఇష్టంగా మోస్తే బరువు కాదు.. బాధ్యత అవుతుంది.. నిరుపమ్‌కు క్లాస్

  |

  ఇద్దరు మనవరాళ్లను నా కోడుకు నిరుపమ్‌కు కట్టబెట్టాలని చూస్తున్నారా అని స్వప్న అన్న మాటలకు శౌర్య ఘాటుగా సమాధానం ఇచ్చింది. తాత, నానమ్మలను మరో మాట అంటే.. ఇంటి బయటకు లాగేస్తాను అని శౌర్య హెచ్చరించింది. స్వప్న అత్తతో గొడవతో కొంత డిస్ట్రబ్ అయిన శౌర్య తలనొప్పితో బాధపడుతూ హిమకు కనిపించింది. అయితే శౌర్యకు తలనొప్పిగా ఉందని గ్రహించిన హిమ.. వెనుక నుంచి వచ్చి తలకు మసాజ్ చేస్తుంటే.. నానమ్మ నీతో సేవలు చేయించుకోవాల్సిన అవసరం ఉందా అంటూ ప్రశ్నించింది. వెంటనే చేతులు తడిమితే హిమ చేతులు అని గ్రహించింది.

  ఏంటి నీవు నాకు మసాజ్ చేయడం ఏమిటి? అంటూ తన గది నుంచి బయటకు పంపించే ప్రయత్నం చేసింది. నేను బయటకు వెళితే.. నీ డాక్టర్ సాబ్ వచ్చి వైద్యం చేస్తాడు. అప్పుడు చాలా తొందరగా నీ తలనొప్పి తగ్గుతుందేమో అని ముసి ముసి నవ్వులు నవ్వింది. దాంతో హిమను తన గది నుంచి బయటకు పంపించింది. ఏంటీ ఎప్పుడు బాధతో ముఖం పెట్టే హిమ నవ్వుతూ కనిపించింది అంటూ శౌర్య ఆలోచనల్లో పడింది. కార్తీకదీపం సీరియల్ 1417 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

  ఆనందరావు జాగింగ్‌కు వెళ్తూ ఎదురుగా కనిపించింది శౌర్యకు గుడ్ మార్నింగ్ చెప్పాడు. గుడ్ మార్నింగ్ నాకు చెప్పడం ఇష్టం ఉండదు అంటే.. ప్రతీ రోజు మంచి జరుగాలని గుడ్ మార్నింగ్ చెప్పుకొంటారు అని సమాధానం ఇచ్చాడు. అయితే నా జీవితంలో మంచి జరగాలనే కోరికలు లేవు. ఎక్కువ కోరికలు ఉండే ఎక్కువ కష్టాలు ఉంటాయి అని సమాధానం చెప్పడంతో వేదాంతం బాగానే చెబుతున్నావు.. నాతో జాగింగ్‌కు వస్తావా అని అడిగాడు. అయితే నాకు జాగింగ్ చేయడం ఇష్టం లేదు. నేను రాను. తిన్నది అరగక..పొట్ట తగ్గక జాగింగ్ చేయాలా అని శౌర్య అంటే.. కార్తీక్ ఉన్నప్పుడు నేను అడగ్గానే నాతో జాగింగ్‌కు వచ్చాడు. ఇప్పుడు నా కోడుకు లేడు కదా..అయినా జాగింగ్‌కు వెళ్తాను. నా పక్కనే కార్తీక్ ఉన్నట్టు ఫీలవుతాను అని అంటే.. సరే.. నేను కూడా వస్తాను అంటూ తన తండ్రి మాట ఎత్తగానే జాగింగ్‌కు శౌర్య సిద్దమైంది.

   Twist in Karthika Deepam todays episode: love track between Shourya and Nirupam

  తాతయ్యతో జాగింగ్ చేస్తూ శౌర్య ఇబ్బంది పడింది. కొన్ని విషయాలు చూసినంత ఈజీగా ఉండవు. కళ్ల ముందు కనిపించిన మంచి మంచి కాదు.. కళ్ల ముందు కనిపించే చెడు మంచి అవొచ్చు. కాబట్టి ఎదుటి వాళ్లను మంచిగా చూడటం నేర్చుకో అంటూ హిమ గురించి చెడుగా ఆలొచించవద్దు. కొన్ని కష్టంగా అనిపించినా.. మనసుతో గ్రహించాలి అని ఆనందరావు అంటే.. మీరు చెప్పేవి నాకు అర్ధం కావడం కష్టమే అంటూ జాగింగ్ చేస్తూ ముందుకెళ్లారు.

  ఆ తర్వాత నిరుపమ్, హిమ కూడా జాగింగ్‌కు వెళ్లారు. అయితే జాగింగ్ చేయలేని పరిస్థితిలో శౌర్య కష్టపడింది. ఈ వయసులో కూడా ఎనర్జీగా జాగింగ్ చేస్తున్నావు. నీవు నిజంగా యంగ్ మ్యాన్ అని అంటూ.. ఇంటికి ఆటోలో వెళ్దామా అంటే.. ఇంటికి పక్కనే ఉన్నాం.. ఆటో ఎందుకు అని శౌర్యను ముందుకు తీసుకెళ్లారు.

   Twist in Karthika Deepam todays episode: love track between Shourya and Nirupam

  ప్రేమ కూడా అమ్మమ్మ ఇంటికి వచ్చి సౌందర్యతో మాటలు కలిపారు. దేవుడు పటాల ముందు పూజా చేస్తున్న అమ్మమ్మను నా మనసులో ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీర్చేలా దేవుడిని కోరుకో అంటే.. నీ మనసులో ఏముంది అంటే.. కోరికలు బయటకు చెబితే నెరవేరవంటారు అని ప్రేమ్ అంటూ.. శౌర్య, నిరుపమ్ ఒక్కటైతే చాలూ.. నేను, హిమ పెళ్లి చేసుకొన్నట్టే అని ప్రేమ్ అన్నాడు.

  ఇక జాగింగ్ చేస్తూ శౌర్య సృహతప్పి పడిపోయింది. అది చూసిన హిమ, నిరుపమ్ వెంటనే అక్కడికి పరిగెత్తారు. గత రెండు రోజులుగా శౌర్య భోజనం చేయడం లేదు. అందుకే నిరసంగా పడిపోయి ఉంటుందేమో అని ఆనందరావు అన్నాడు. దాంతో శౌర్యను ఎత్తుకొని నిరుపమ్ ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మధ్యలో శౌర్య లేచింది. నాకు బరువు అవుతున్నదని నిరుపమ్ అంటే.. ఇష్టంతో మోస్తే బరువు కాదు.. బాధ్యత అవుతుంది అని హిమ చెప్పింది. హిమ మెలుకువ ఉండటం చూసి.. నడవ వచ్చు కదా అని నిరుపమ్ అన్నాడు. అయితే ఒక రోజు నీకు మందు ఎక్కువైతే.. నేనే తీసుకెళ్లాను. ఈ రోజు నీరసం ఎక్కువైతే నీవు తీసుకెళ్తున్నావు. పే బాకీ.. చెల్లుకు చెల్లు అని శౌర్య సమాధానం చెప్పింది.

  English summary
  Karthika Deepam July 29th Episode number 1417.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X