Karthika Deepam కార్తీక్‌కు గతం గుర్తుకు రాదు.. దీపకు సవాల్ విసిరిన మోనిత

తనకు దీప పేరు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. మా అత్త సౌందర్య కోడలా అని.. నా కూతురు శౌర్య అమ్మా అని.. నా ఇంకో కూతురు హిమ వంటలక్క అని పిలుస్తారు అని దీప చెప్పడంతో కార్తీక్ ఆలోచనల్లో పడిపోయాడు. దీపను అలా పిలుస్తారా? అని అనుకొంటూ పదే పదే ఆమె మాటలను గుర్తు చేసుకొన్నాడు. అయితే కార్తీక్‌కు దీప దగ్గర కావడంతో మోనిత ఆందోళనలో పడింది. కార్తీకదీపం తాజా ఎపిసొడ్‌ 1448‌ లో ఇంకా ఏం జరిగిందంటే?

Karthika Deepam

ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్తీక్‌కు దగ్గర కాలేకపోతున్నాను. దీప పదే పదే అడ్డు తగులుతున్నది. దేవుడు నాకు ఎందుకు ఇలా పరీక్షలు పెడుతున్నాడు. నా ప్రేమకు ఎందుకు గుర్తింపు దక్కడం లేదు. దీప ఎలాంటి అడ్డంకులు కల్పించినా ఈసారి ఎలాగైనా కార్తీక్‌కు దగ్గరవుతాను. ఏదో ఒకటి చేయాలి అని మోనిత మనసులో కుమిలిపోయింది.

అయితే మోనిత ఇంటికి దీప భోజనం క్యారేజ్ తీసుకొని రావడం చూసి.. మీరా? ఏంటి ఇలా వచ్చారు అని కార్తీక్ అడిగితే.. ఈ రోజు బిర్యాని తెచ్చాను. అందుకే తీసుకొచ్చాను అని దీప సమాధానం చెప్పింది.అయితే మీ పేరు ఏమన్నారు అని కార్తీక్ అడిగితే.. దీప అని సమాధానం చెప్పి.. మా అత్తమ్మ కోడలా అంటుంది.శౌర్య అమ్మ అంటుందని దీప ఉత్సాహంగా చెప్పబోతుంటే.. నాకు గుర్తుంది అంటూ కార్తీక్ సమాధానం ఇచ్చాడు.

మోనిత చేయి కాలింది కదా.. రండి.. డాక్టర్ బాబు రండి భోజనం పెడుతాను. నేను వడ్డిస్తాను. మోనిత తర్వాత స్పూన్‌తో తింటుంది అని దీప చెప్పడంతో.. సరే అంటూ కార్తీక్ భోజనం చేశాడు. బిర్యాని చాలా బాగుంది అంటుంటే.. దీప ఆనందంతో కంటతడి పెట్టింది. మోనితను డాక్టరమ్మ అంటే.. ఆమె డాక్టర్ కాదు.. నేను కూడా డాక్టర్ కాదు అని అంటే.. మిమ్మల్ని చూస్తే డాకర్లని అనాలి అనిపిస్తున్నది అని దీప చెప్పింది.

అయితే నీవు ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను ఇచ్చే మందుల వల్ల గతాన్ని గుర్తు చేసుకోలేడు. కార్తీక్ నా భర్తగానే ఉంటాడు అని మోనిత సవాల్ విసిరింది. అయితే కార్తీక్‌కు గతం గుర్తు తెప్పిస్తాను అంటూ దీప ప్రతి సవాల్ విసిరింది.

వంటలు చేయడంపై దీప ఆలోచిస్తూ.. ఒకప్పుడు బతకడం కోసం వంటలు చేశాను. ఇప్పుడు బతుకు కోసం వంట చేస్తున్నాను. వంటల వల్ల ఉపయోగం ఉంటుందా అని దీప ఆలోచనల్లో పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X