Karthika Deepam నిరుపమ్ పెళ్లి నా మనవరాలితోనే.. తేల్చి చెప్పిన సౌందర్య

తాను ప్రేమించిన హిమకు నిరుపమ్‌తో నిశ్చితార్థం వ్యవహారం ప్రేమ్ బాధలో మునిగిపోయాడు. హిమ తనకు దక్కకుండా పోతుందనే బెంగతో ఆమె ఫోటోను ఫోన్‌లో చూస్తూ కాలం వెళ్లదీస్తున్నాడు. ఈ క్రమంలో సౌందర్య, ఆనందరావు వచ్చి... ఏంటి మనవడా ఎలా ఉన్నావు అంటూ పలకరించారు. అయినా ప్రేమ్ ముభావంగా ఉండటంతో కొద్ది రోజులుగా ఎలానో ఉంటున్నావు అని సౌందర్య అడిగింది. దాంతో నా ఆశల్ని నిరాశగా మార్చావు అంటూ ప్రేమ్ బదులిచ్చి.. అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. దాంతో నీతో మాట్లడానికి వచ్చాం అంటూ సౌందర్య, ఆనందరావు అన్నారు. కార్తీకదీపం సీరియల్‌లో తాజా ఎపిసోడ్‌ 1361 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

 జీవితంపై క్లారిటీ లేకుండా

జీవితంపై క్లారిటీ లేకుండా


ప్రేమ్‌తో సౌందర్య మాట్లాడుతూ.. ఇప్పుడెక్కడికి? నీకు జీవితం మీద క్లారిటి లేకుండా పోతున్నది అని ప్రశ్నల వర్షం కురిపించింది. దాంతో ఈ మధ్య కొందరికి జీవితంపై క్లారిటీ లేకుండా పోతున్నది అంటూ ప్రేమ్ సమాధానం ఇచ్చాడు. నిరుపమ్‌ను హిమ రిజెక్ట్ చేసినందుకు ప్రేమ్ కోపంతో ఉన్నట్టున్నాడు అని ఆనందరావు అన్నాడు. అవును.. జరిగిన దానికి కోపంతో ఉన్నాడు. అంత సర్దుకొంటుంది అంటూ సౌందర్య అంటుంటే.. అప్పుడు అల్లుడు సత్యం అక్కడికి వచ్చాడు. అయితే కోపంతో ప్రేమ్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

హిమ మనసులో ఏముందో..

హిమ మనసులో ఏముందో..


ఆనందరావు, సౌందర్యతో సత్యం మాట్లాడుతూ.. నిరుపమ్‌ను చూస్తే బాధగా ఉంది. హిమ చేసిన పనికి అదో రకంగా ఉన్నాడు. హిమ తన మనసులో ఏముందో తెలియడం లేదు. నిరుపమ్‌ గురించి అడిగితే మాట్లాడటం లేదు. అందుకే మేము ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకొన్నాం. హిమకు వేరే సంబంధం తెస్తే.. అప్పుడైనా మనసులో మాట చెబుతుందో అని సౌందర్య అంది. దాంతో మీ ఇష్టం. నిరుపమ్ కాదన్న మాటనే జీర్ణించుకోలేకపోతున్నాను. బయటి వాళ్లకు చెప్పలేకపోతున్నాను. హిమకు నిరుపమ్ ఎందుకు నచ్చలేదో అర్ధం కావడం లేదు అని సత్యం అన్నారు. దాంతో ఈ సమస్యను మనమే పరిష్కరిద్దాం అంటే.. ఇంకా దీనికి పరిష్కారం ఉందా అని సత్యం అనుమానం వ్యక్తం చేశాడు.

నిరుపమ్, శౌర్యను కలపాలి

నిరుపమ్, శౌర్యను కలపాలి


ఇదిలా ఉండగా, నిరుపమ్, శౌర్యను కలిపేందుకు ఆలోచనల్లో పడింది. ఎలాగైనా వారిద్దరిని కలపాలి. స్వప్న అత్త ఏదైనా అనుకొంటే.. సాధిస్తుంది. నానమ్మపై కోపంతో నిరుపమ్‌, శోభకు పెళ్లి చేస్తుంది అని అనుకొంటుండగా.. సౌందర్య, ఆనందరావు అక్కడికి వచ్చారు. నిరుపమ్‌ను పెళ్లి చేసుకోకపోవడంపై రకరకాలుగా అడిగాను. అయినా సమాధానం లేదు. అందుకే నిలదీస్తున్నా. మనపై హిమకు గౌరవం తగ్గిపోయింది. దాంతో నేను మాట్లాడుతాను అంటూ ఆనందరావు బుజ్జగించే ప్రయత్నం చేశారు. మనసులో దాచుకొకుండా అనేక సందేహాలను అడిగి తెలుసుకొనే దానివి. జీవితానికి సంబంధించిన సమస్య వస్తే ఎందుకు అడగడం లేదు అని అడిగాడు అయితే హిమ మౌనంగా ఉండటంతో దానితో మాట్లాడితే.. గోడతో మాట్లాడినట్టే అని సౌందర్య ఊగిపోయింది.

నా మనవరాలి పెళ్లి నిరుపమ్‌తోనే

నా మనవరాలి పెళ్లి నిరుపమ్‌తోనే


నిరుపమ్, శోభ పెళ్లికి ఏర్పాట్లు చేస్తున్న స్వప్న అత్తకు ఏం చెప్పావు అంటే.. దాని కొడుకు పెళ్లి దాని ఇష్టం. స్వప్న ఎవరికి ఇచ్చి పెళ్లి చేసుకొంటుదో ఆమెకు సంబంధించిన విషయం. కానీ నా మనవరాలి పెళ్లి నిరుపమ్‌తోనే అవుతుందని ఛాలెంజ్ చేసి వచ్చాను అని సౌందర్య అంది. దాంతో అవును నిరుపమ్ పెళ్లి శౌర్యతో అవుతుంది అని మనసులో అనుకొంది. అయితే హిమ నోరు విప్పి మాట్లాడదు కదా అని సౌందర్య ఆవేశంగా అంది.

జ్వాలాను చూసి స్వప్న కోపంతో

జ్వాలాను చూసి స్వప్న కోపంతో


ఇక నిరుపమ్, జ్వాలా కలిసి తిరుగడంపై స్వప్న ఆందోళన పడింది. మంచంపై నీరసంగా పడుకుంటే.. లేపి బీపీ ట్యాబ్లెట్ వేసుకో అని అంటే.. నాకు ఆటో అమ్మాయితో తిరగడం నాకు నచ్చడం లేదు అంటే.. అవేమీ పట్టించుకోకు అని ట్యాబ్లెట్ వేశాడు. ప్రేమను చూపించిన కొడుకును చూస్తుంటే.. అలా ఎందుకు చూస్తున్నావు అంటే.. నీవు చూపించే ప్రేమకు నేను హ్యాపీగా ఉన్నాను అని స్వప్న అన్నాడు అయితే ఆరోగ్యం బాగలేకపోవడంతో వంట చేయలేదు అంటే.. నేను తెప్పిస్తున్నా. జ్వాలా వంట చేసి తీసుకొస్తుంది అని అనగానే ఆటో డ్రైవర్ చేసిన వంట తినాలా స్వప్న మళ్లీ కోపంతో ఊగిపోయింది. అయితే జ్వాలా మనకు వంట చేస్తున్నది. దానిని పట్టించుకోకు. జ్వాలా మనసుకు ఇష్టపడేలా చూసుకో అంటూ నిరుపమ్ సలహా ఇచ్చాడు.

శోభ చెంపదెబ్బను గుర్తు చేసుకొని

శోభ చెంపదెబ్బను గుర్తు చేసుకొని


అయితే నిరుపమ్ ఇంటికి లంచ్ బాక్స్ తీసుకొని జ్వాలా వచ్చింది. మీ అమ్మకు ఉప్పు లేకుండా.. నీకు ఉప్పు ఉండేలా తీసుకొచ్చాను అంటుంటే.. స్వప్న అక్కడికి వచ్చింది. ఏకంగా ఇంటికే వచ్చావా? అంటే.. డాక్టర్ సాబ్ రమ్మంటే రాకుండా ఉంటానా అని చెబుతుంటే.. డాక్టర్ శోభ అక్కడికి వచ్చింది. జ్వాలాను చూసి చెంపదెబ్బ గుర్తు చేసుకొంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని శోభ అంటే.. జ్వాలా అంటే స్వేఛ్చ.. ఎక్కడైనా ఉంటుంది అని అనుకొన్నది. ముగ్గురి మధ్య గొడవ జరుగుతుందని ఊహించిన నిరుపమ్ ... జ్వాలాను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశాడు.

శోభకు షాకిచ్చిన నిరుపమ్

శోభకు షాకిచ్చిన నిరుపమ్


కార్తీక దీపం తాజా ప్రోమోలో మరో ట్విస్టు కనిపించింది. హిమ ముందు మరో అమ్మాయితో క్లోజ్‌గా ఉంటే ఆమె మనసులో అసలు విషయం బయటపడుతుంది అని డాక్టర్ శోభ సలహా ఇచ్చింది. అయితే తనతో క్లోజ్‌గా ఉంటాడని భావించిన శోభకు నిరుపమ్ షాక్ ఇచ్చాడు. తనతో కాకుండా జ్వాలాతో నిరుపమ్ తిరగడాన్ని జీర్నించుకోలేకపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X