For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నా భార్య అందాల రాశి. నా సెలక్షన్ సూపర్..ఐలవ్యూ చెప్పిన నిరుపమ్

    |

    డాక్టర్ శోభ ఇంట్లోకి గెస్టుగా రావడం నచ్చక నిరుపమ్ తన తాత ఇంటికి వెళ్లిపోవడంపై స్వప్న అసహనం ప్రదర్శించింది. భర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిరుపమ్ ఇంటికి రావాల్సిందే. నీవు తీసుకురా. నీవు ఇంట్లో ఒక సభ్యుడిగా వ్యవహరిస్తున్నావా? తండ్రిగా మీకు బాధ్యత లేదా? అని స్వప్న అంటే.. నిరుపమ్ బయటకు నేను ఎలా బాధ్యత తీసుకోవాలి. చివరి నిమిషంలో బయటకు వెళ్లి అసలు విషయం చెప్పాడు. దానికి నేనే చేయాలి అని సత్యం అంటే.. తండ్రిగా వ్యవహరిస్తున్నావా? ఇంటి బాధ్యతలు తీసుకొన్నావా? అని స్వప్న అంటే.. నీవు ఎప్పుడైనా భర్తగా గౌరవించావా? ప్రేమగా ఎప్పుడైనా మాట్లాడావా అని సత్యం కౌంటర్ ఇచ్చాడు. ఏం చేస్తావో నాకు తెలియదు. నిరుపమ్‌ను ఇంటికి తీసుకురా? నిరుపమ్ రాకపోతే నేను అనుకొన్న పనులు జరుగవు అని స్వప్న ఆందోళన పడింది. వీరిద్దరి సంభాషణను వింటూ డాక్టర్ శోభ ముసిముసి నవ్వులు నవ్వుకొన్నది. కార్తీకదీపం సీరియల్ 1415 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

    ఈశ్వరా మాకు ఏమిటి ఈ పరీక్ష

    ఈశ్వరా మాకు ఏమిటి ఈ పరీక్ష

    నిరుపమ్ ఇంటికి రావడంపై ఆనందరావు, సౌందర్య కంగారు పడ్డారు. సడెన్‌గా ఇంటికి రావడం ఏమిటి? నిరుపమ్‌ను చూస్తే శౌర్యకు కోపం, హిమను పెళ్లి చేసుకొంటానని నిరుపమ్ వెంటపడుతున్నాడు. శౌర్యను, హిమను కలుపుదామని అనుకొంటే.. నిరుపమ్ రావడంతో ప్లాన్స్ అన్నీ తలకిందులయ్యాయి. ఒక సమస్య తీరిందనుకొంటే.. మరో సమస్య వస్తున్నది. ఈశ్వరా మాకు ఏమిటి ఈ పరీక్షలు అంటూ సౌందర్య తనలో తాను అనుకొన్నది.నిరుపమ్ గురించి హిమ కంగారుపడింది. నేను శౌర్యతో క్లోజ్‌గా ఉంటే.. శౌర్యకు కోపం వస్తుంది.ఏం చేయాలో అర్ధం కావడం లేదు. నిరుపమ్‌ను వెంటనే ఇంటి నుంచి పంపించాలి అని హిమ మనసులో అనుకొన్నది.

    నీవంటే నాకు ప్రేమ

    నీవంటే నాకు ప్రేమ

    హిమ ఆలోచనల్లో ఉండగానే.. నిరుపమ్ వచ్చి కళ్లు మూసాడు. నీ కోసం ఏం తెచ్చానో చూడు. నీ కోసం గిఫ్టు తెచ్చాను. ఈ గిఫ్టు ఏమిటో కనిపెట్టు అని నిరుపమ్ ఉత్సాహంగా అంటుంటే.. నాకు గిఫ్టు ఎందుకు బావ. నీవు ఇంటి నుంచి వెళ్లిపో అంటే.. అది కాదు నేను తెచ్చిన గిఫ్టు గుర్తు పట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపో అంటున్నావు. నీవు ఎప్పుడు ట్రెడిషనల్ డ్రస్‌లో ఉంటున్నావని.. నేను నీకు జీన్స్, టీషర్ట్ తెచ్చాను అని నిరుపమ్ అంటే.. నాకు అలాంటి డ్రస్‌లు నచ్చవు బావా అంటూ శౌర్య చూస్తుందేమో అనే భయంతో హిమ కంగారు పడింది. నువ్వు ఎన్ని అబద్దాలు చెప్పినా.. ఏమీ అనలేదు కదా.. క్యాన్సర్ అని పెద్ద అబద్దం చెప్పినా నాకు ఎందుకు కోపం రాలేదంటే.. నీవంటే నాకు ప్రేమ అని నిరుపమ్ అన్నాడు. క్లినిక్‌లో డాక్టర్‌ను మాత్రమే. ఇంటికి వస్తే లవర్‌ను అని చెప్పాడు. ఇలాంటి ఇడియట్ ఆలోచనలు ఎలా వస్తున్నాయి అంటే థ్యాంక్స్ అన్నాడు. నీవు ఒప్పుకోకపోతే.. శౌర్య వద్దకు వెళ్లి.. ఈ డ్రస్సును వేసుకోమని శౌర్యకు చెబుతా అని నిరుపమ్ అంటే. హిమ మరింత కంగారు పడి

    నా భార్య అందాల రాశి

    నా భార్య అందాల రాశి

    తాను తెచ్చిన డ్రస్ వేసుకొని బయటకు వచ్చిన హిమను చూసి నిరుపమ్ థ్రిల్ అయ్యాడు. మై గాడ్.. సూపర్‌గా ఉన్నావు. అందాల పోటీలకు వెళితే.. అన్ని ప్రైజులు నీకే వస్తాయి అని నిరుపమ్ అంటే.. కాస్త ఎక్కువైంది అంటే.. నా భార్య అందాల రాశి. నా సెలక్షన్ సూపర్. హిమ ఐ లవ్ యూ అని నిరుపమ్ అనగానే.. శౌర్య విని బాధలో మునిగిపోయింది. శౌర్య చూసిందని గమనించిన హిమ మరింత కంగారుపడింది. హిమను చూసిన శౌర్య ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్దమైంది. అయితే శౌర్య ప్లాన్స్ గమనించిన ఆనందరావు, సౌందర్య కూడా బ్యాగ్ సర్దుకొన్నారు.

    నీవు కూడా మా మనవరాలివే

    నీవు కూడా మా మనవరాలివే

    తాత,నానమ్మ బ్యాగు సర్దుకోవడం చూసి.. ఏంటి? మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని శౌర్య అంటే.. నీవు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి మేము వస్తాం. పద అని ఆనందరావు అన్నారు. దాంతో మీరు ఎందుకు రావాలి? మీ మనవరాలితో మీరు ఉండాలి అని శౌర్య అంటే.. నీవు కూడా మా మనవరాలివే. నీవు లేకుండా ఉండలేదు. ఇన్నాళ్లు హిమతో కలిసి ఉన్నాం. ఇక నుంచి శౌర్యతో కలిసి ఉందాం. పద శౌర్య అంటే.. బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? అని శౌర్య అంటే.. బ్లాక్ మెయిల్ కాదు.. ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తున్నాం. అన్నీ సర్దుకొనేలా నేను చేస్తాను. కానీ ఇంటి నుంచి బయటకు వెళ్తానని చెప్పకు అని శౌర్యతో సౌందర్య ప్రాధేయపడింది.

    శౌర్య ప్లాన్ వేసి..నిరుపమ్, శౌర్యను

    శౌర్య ప్లాన్ వేసి..నిరుపమ్, శౌర్యను

    నిరుపమ్ ఇంట్లోకి వచ్చి తనపై ప్రేమను వ్యక్తం చేయడంపై హిమ ఆలోచనల్లో పడింది. వెంటనే తాత, నానమ్మను హాస్పిటల్‌కు రమ్మని చెప్పి ఫోన్ చేసింది. దాంతో ఇద్దరు ఒంటరిగా ఉంటారు. వారిద్దరి మధ్య ప్రైవసీ ఉంటుంది అని హిమ ప్లాన్ వేసింది. బయటకు వెళ్దామని అనుకొన్న శౌర్య ఆటో పాడవ్వడం, నిరుపమ్ కారు పంక్చర్ కావడంతో ఇద్దరు ఇంట్లోనే ఉండిపోయారు. ఆటోలో నన్ను డ్రాప్ చేస్తావా? అంటే..నా ఆటో పాడైంది అందుకే ఇంట్లోనే ఉన్నాను అని శౌర్య సమాధానం చెప్పింది. దాంతో ఇద్దరు ఇంట్లోని ఉండిపోయారు. ఆ తర్వాత క్యాబ్ బుక్ చేశాను అని నిరుపమ్ అంటే.. నీ క్యాబ్‌లో నేను రాను అంటూ శౌర్య సమాధానం చెప్పింది.

    ఇద్దర్ని కట్టబెట్టాలని చూస్తున్నారా?

    ఇద్దర్ని కట్టబెట్టాలని చూస్తున్నారా?

    తాజా ప్రోమోలో నిరుపమ్, శౌర్య ఇంట్లో ఉండటం కనిపించింది. శౌర్య కాఫీ చేసి నిరుపమ్‌కు ఇచ్చింది. అయితే కాఫీ షేర్ చేసుకొందామని నిరుపమ్ అంటే.. నాకు కాఫీ ఇష్టం లేదు అని శౌర్య చెప్పింది. ఇంతలోనే స్వప్న వచ్చి.. నిరుపమ్, శౌర్యను చూసింది. ఏం జరుగుతున్నది. ఇద్దర్ని నీకు కట్టబెట్టాలని చూస్తున్నారా అని స్వప్న అరిచింది. దాంతో నిరుపమ్, శౌర్య కంగారు పడ్డారు.

    English summary
    Karthika Deepam July 27th Episode number 1415.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X