Karthika Deepam శౌర్య ఆటోకు నిప్పుపెట్టిన స్వప్న.. అసలేం జరిగిందంటే?
ప్రేమ్ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌కు వచ్చిన జ్వాలా అలియాస్ శౌర్య అందరిని ఆటపట్టించింది. ఈ ఎగ్జిబిషన్‌లో తింగరి (శౌర్య) ఫోటో కూడా పెట్టించండి అంటే.. త్వరలోనే మన ఇద్దరి ఫోటోలను మరో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి పెట్టిద్దాం అని హిమ మనసులో అనుకొన్నది. అలాగే డాక్టర్ సాబ్ మీరు కూడా ఫోటోలు తీస్తారా? అంటే తీస్తాను కానీ వాటిని ఎక్స్‌రేలు అంటారు అని డాక్టర్ నిరుపమ్ జోక్ చేశాడు. దాంతో మీరు జోక్ కూడా చేస్తారా? అంటూ శౌర్య అంటుంటే.. ఈ ఫోటో ఎగ్జిబిషన్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన సినీ నటి జయలలిత ఓ ఫోటోను చూసి ఇంప్రెస్ అయింది. కార్తీకదీపం సీరియల్ తాజా ఎపిసోడ్ 1328 ఇంకా ఏం జరిగిందంటే?

ప్రేమ్ ఫోటోకు భారీ రేటు
ప్రేమ్ తీసిన ఫోటోను కొనుగోలు చేసేందుకు సినీ నటి జయలలిత సిద్దమైంది. దానిపై 130000 ఉంటే.. దానిని చూసి. కళకు, రేటుకు సంబంధం ఉండకూడదు అంటూ చెక్ బుక్ తీసి.. అందులో ఒక అమౌంట్ రాసింది. దానిని ప్రేమ్ తల్లి చూసి షాక్ తిన్నది. అందులో 3 లక్షలు ఉండటం చూసి అందరూ షాక్ తిన్నారు. అంతలోనే నీ ఫోటోగ్రఫిని ప్రోత్సహించింది మీ అమ్మేనా అంటే.. లేదు మేడం.. నన్ను ఎంకరేజ్ చేసింది మా నాన్న అంటూ చెప్పగానే.. ప్రేమ తల్లి స్వప్న అవమానంతో కుంగిపోయింది. తన తల్లిని చూస్తూ.. ఫోటోగ్రఫిని కించపరిచావు కదా.. చూశావా అమ్మ నా ఫోటోగ్రఫిని ఎంతమంది మెచ్చుకొంటున్నారో అని ప్రేమ్ అన్నారు.

శౌర్యపై స్వప్న కోపంగా
అయితే తన ఫోటోను 3 లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన జయలలితతో ప్రేమ్ ఫోటో దిగడానికి సిద్ధం కాగా.. పక్కనే ఉన్న శౌర్య.. తన కుటుంబ సభ్యులను పిలిచి పరిచయం చేసింది. మీ ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నా ఎందుకు చెప్పలేదు అంటూ ఫోటో దిగడానికి జయలలిత సిద్ధమయ్యారు. అయితే తన భర్తకు దూరంగా స్వప్న నిలుచోవడంతో ఆమెను తీసుకెళ్లి ఆమె భర్త పక్కనే నిలబెట్టింది. దాంతో కోపంగా శౌర్య వైపు చూసింది. అందర్ని ఆటపట్టిస్తున్న శౌర్య సంగతి చూస్తా అంటూ కోపంతో ఊగిపోయింది.

ప్రేమ్‌ను ఆటపట్టించిన శౌర్య
ఫ్యామిలీ ఫోటో దిగిన తర్వాత గెస్ట్ జయలలితను ప్రేమ్ సాగనంపారు. అయితే ప్రేమ్ చేతిలో ఉన్న ఫోటో ప్యాక్‌ను చూసి ఆ గిఫ్టు ఎవరికి అంటే.. నా ఫ్రెండ్‌కు అని చెప్పాడు. దాంతో జయలలిత బయలుదేరుతూ మంచి ఫోటోను తీసుకెళ్తున్నాననే తృప్తి నాకు ఉంది అని ప్రశంసించింది. అయితే తన చేతిలో ఉన్న గిఫ్టును చూసుకొంటూ.. హిమ ఒంటరిగా ఉన్నప్పుడు ఈ గిఫ్టు ఇస్తాను అని ప్రేమ్ మనసులో అనుకొన్నాడు. నా మనసులో మాటను తనకు చెప్పాలి అని అనుకొంటుండగా.. శౌర్య వచ్చి ఫోటోను లాగేసుకొన్నది. ఇది ఎవరికి అంటూ.. ఆట పట్టించింది. దాంతో నీకు వేరేది ఇస్తానంటూ అంటుండగా.. బిల్డింగ్ పైనుంచి స్వప్న కోపంగా చూసింది. అంతలోనే అక్కడికి వస్తుండగా హిమ కంగారు పడిపోయింది. అంతలోనే డాక్టర్ నిరుపమ్ వచ్చి శౌర్య చేతిలోని ఫోటోను లాగేసుకొన్నది.

నీవు పరిచయమవ్వడమే పెద్ద గిఫ్టు
శౌర్య ఆటపట్టించడంపై డాక్టర్ నిరుపమ్.. ఏంటి ఇది? అందరి ముందు ఇలా ఎందుకు అంటే.. నేను కష్టపడి.. ఒప్పించి సత్య సార్‌ను తీసుకొచ్చాను. అలాంటిది నాకు గిఫ్టు తర్వాత ఇస్తానని అంటున్నాడు అని శౌర్య అంటే.. మమ్మీ కోపంగా చూస్తున్నది.. అంటూ శౌర్య చేతిలోని గిఫ్టును ప్రేమ్‌కు ఇచ్చి ఆమెను లోపలికి తీసుకెళ్లాడు. మా నాన్నను తీసుకొచ్చినందుకు నీకు థ్యాంక్యూ చెప్పుకోవాలి అని నిరుపమ్ అంటే.. నీవే కదా ప్లాన్ చేశావు అంటూ.. ఏది ఏమైనా నీకే గిఫ్టు ఇవ్వాలి అంటే.. నీవు పరిచయం అవ్వడమే నాకు పెద్ద గిఫ్టు అని శౌర్య అనగానే.. నిరుపమ్ పొంగిపోయాడు.

నీవు నీతులు చెబుతావా అంటూ స్వప్న
అయితే శౌర్య, నిరుపమ్ మధ్య చనువు చూసి స్వప్న కోపంతో ఊగిపోయింది. వారిద్దరి మధ్య బంధాన్ని విడగొడుతాను. ఆటో పిల్ల సంగతి చూస్తాను అని ఫోన్ చేస్తూ కనిపించింది. అయితే సత్యంతో మాట్లాడుతూ.. చూడు మీ అబ్బాయిని ఎంత మంది పొగుడుతున్నాడో.. చూశారా అంటే.. నీవే కదా.. నన్ను తీసుకొచ్చావు అని సత్యం అంటే.. అప్పుడే అక్కడికి వచ్చిన స్వప్న.. ఇదంతా చేసింది నువ్వేనా అంటూ చప్పట్లు కొట్టింది. శౌర్య, స్వప్ప మధ్య వాగ్వాదం జరిగింది. అయితే ఆటో నడుపుకొనే దానివి నాకు నీతులు చెబుతావా? నీ స్థాయి ఎంత? అంటూ స్వప్న ప్రశ్నించింది.

కారులో తిరిగితే స్థాయి పెరుగుతుందా?
కారులో తిరిగినంత మాత్రాన స్థాయి పెరుగుతుందా? అంటూ కౌంటర్ ఇచ్చింది. మంచి ఎవరు చెప్పినా మంచే కదా అని శౌర్య అంది. దాంతో స్వప్న ఏంటీ గొడవ అంటూ సత్యం అంటే.. మీరు మాట్లాడే ఛాన్స్ కోల్పోయారు.. ఎవరో అనామకురాలు వంట చేస్తే తింటున్నారు అని స్వప్న అంటే.. నువ్వు వండిపెడితే. మేము వంట చేయాల్సిన అవసరం రాదు అని అంది.. దాంతో కోపంతో స్వప్న ఊగిపోతూ.. చెంపపై కొట్టబోయింది. అయితే మధ్యలో నిరుపమ్ వచ్చి అడ్డుకొన్నాడు.

శౌర్య ఆటోకు స్వప్న నిప్పు
తాజా ప్రోమోలో స్వప్న, శౌర్య మధ్య గట్టిగానే గొడవ జరిగింది. అయితే శౌర్య తీరును నచ్చకపోవడంతో కోపంతో ఊగిపోయింది. నిన్ను ఏం చేస్తానో చూడు అంటూ నేరుగా వెళ్లి శౌర్య ఆటోకు నిప్పంటించింది. దాంతో అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ ఎపిసోడ్ ఎమోషనల్‌గా సాగడంతో తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొన్నది.

2022లో టాప్ రేటింగుతో కార్తీకదీపం
కార్తీకదీపం సీరియల్ గత నాలుగేళ్లుగా టాప్ రేటింగ్‌తో కొనసాగుతున్నది. 2022 సంవత్సరంలో అదే జోష్‌ను కొనసాగుతున్నది. ప్రస్తుతం ఏడాది 14వ వారంలో ఈ సీరియల్ 12.52 రేటింగ్‌తో ముందుకెళ్తున్నది. మిగితా సీరియల్స్‌కు దూరంగా టాప్ రేటింగ్‌ను నమోదు చేసింది.


Click it and Unblock the Notifications











