Karthika Deepam నువ్వు సీనియర్ సిటిజన్.. యూత్ కాదు.. సౌందర్యకు శౌర్య చురకలు
ముసలావిడ యాక్సిడెంట్‌కు గురైతే.. ఆమెను హాస్పిటల్‌కు తీసుకొచ్చి జ్వాలా అలియాస్ శౌర్య కంగారుపడిపోయింది. జ్వాలా భయపడుతున్న తీరును చూసి.. ఎందుకంత కంగారుపడుతున్నావని నిరుపమ్ అడిగితే.. నాకు యాక్సిడెంట్స్ అంటే నాకు భయం అంటూ తన తల్లిదండ్రులు కార్తీక్, దీప యాక్సిడెంట్‌ను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయింది. కుటుంబంలో ఒకరికి యాక్సిడెంట్ అయిందంటే.. ప్రాణం పోవడమే మాత్రం కాదు డాక్టర్ సాబ్.. కొన్ని జీవితాలు రోడ్డున పడుతాయి అంటూ భావోద్వేగానికి గురైంది. ముసలమ్మ కళ్లు తెరిచిందా? అని జ్వాలా అడిగితే. . కాసేపట్లో స్పృహలోకి వస్తుందని నిరుపమ్ చెప్పారు. దాంతో కొద్ది సేపట్లోనే స్పృహలోకి వస్తుందా అంటూ హిమ కంగారు పడింది. కార్తీకదీపం సీరియల్‌లో 1333 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే..

శౌర్యను కొట్టడంపై సౌందర్య పశ్చాత్తాపం
తనపై నీళ్లు పడటంతో సౌందర్య కొట్టడంతో జ్వాలా చెంప కమిలిపోయింది. అది చూసి.. ఏంటి నీ చెంపపై గాయం ఏమిటి అంటే.. దొమ కుడితే.. నేనే చెంపపై కొట్టుకొన్నాను. అందుకే బుగ్గ ఎర్రగా మారింది అంటూ నానమ్మ కొట్టిన విషయాన్ని గుర్తు చేసుకొన్నది. అయితే నాన్నమ్మను చూశాను. తను అప్పటి మాదిరిగానే ఉంది.. ఏమీ మారలేదు. నానమ్మ వెంట వెళ్లి వాళ్ల ఇల్లు చూసే దానిని. ఆ అవకాశం చేజారిపోయింది. నా శత్రువు హిమ అడ్రస్ తెలుసుకొనే ఛాన్స్ మిస్ అయింది. ఒసేయ్ హిమ.. ఎక్కడున్నావే.. అంటూ శౌర్య కోపంతో ఊగిపోయింది. అయితే ఆటో డ్రైవర్ జ్వాలాను అనవసరంగా కొట్టడంపై సౌందర్య ఆవేదన చెందింది. అనవసరంగా ఆమెపై చేయి చేసుకొన్నాను. ఒక ముసలావిడకు సాయం చేస్తుందని తెలుసుకోలేక కొట్టాను. నాలో ఎప్పుడూ లేని అపరాధ భావన నన్ను వెంటాడుతున్నది. మళ్లీ ఎప్పుడైనా కనిపిస్తే.. సారీ చెప్పాలి. అప్పుడు గానీ నా మనసులోని బాధ తగ్గదు అంటూ సౌందర్య ఎమోషనల్ అయ్యింది.

కార్తీక్, మోనిత ఫోటోలు చూస్తూ..
హోటల్‌లో పనిచేస్తూ డాక్టర్ కావాలని కలలు కంటున్న రవ్విడ్లీ తన తల్లి ఇంటికి వచ్చి కార్తీక్, మోనిత ఫోటో ముందు ఆవేదన చెందాడు. మీరు ఎవరు? మీ బంధువుల ఎవరు? తెలియదు. ప్రతీ ఒక్కరికి చుట్టాలు, బంధువులు ఉంటారు. కానీ నేను ఒక్కడినే. నేను ఎందుకు ఒంటరిని చేశారు. ఎవరిని అడిగినా చెప్పరు అని కన్నీరు పెట్టాడు. అంతలోనే పెద్దవ్వ వస్తే.. నా ఫ్యామిలీ గురించి ఒక్క విషయం చెప్పు అంటే ప్రాధేయపడ్డాడు. అమ్మ, నాన్న తరపున ఎవరో ఒకరు ఉంటారు.. వారి వివరాలు చెప్పు.. నేను వెతుక్కొంటాను అంటూ రవ్విడ్లి అంటే.. నీకు ఎవరు లేరు? ఉంటే వాళ్లే వచ్చే వారు కదా.. నీవు విసిరిపడేసిన విస్తరి లాంటి వాడివి. నిన్ను ఎవరు పట్టించుకొంటారు చెప్పు అంటూ పెద్దవ్వ చిరాకు పడింది. అయితే నేను విసిరిపడేసిన విస్తరాకు అయితే.. దానిని విసిరింది ఎవరో తెలుసుకొంటాను అని రవ్వడ్లి అన్నాడు.

మనసులో భారం తగ్గించుకోవాలని..
ఇక తండ్రి ఆనందరావు వద్దకు స్వప్న వచ్చి... నా మనసులోని భారాన్ని తొలగించుకోవాలని అనుకొంటున్నాను డాడీ అంటే.. నీ తల్లిని క్షమిస్తున్నావా అని ఆనందరావు అడిగాడు. అది ఎప్పడూ జరగని పని.. నా పిల్లల మనసును మార్చేస్తున్నది. అందుకే వారికి పెళ్లి చేయాలని అనుకొంటున్నాను. నా ఫ్రెండ్ కలిసింది. వారి అమ్మాయికి నిరుపమ్‌ను ఇచ్చి పెళ్లి చేయాలనుకొంటున్నాను అని స్వప్న అంటే.. ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని.. బయట వాళ్లకు ఇవ్వడం ఏమిటి? నిరుపమ్ కోసం హిమ ఉంది కదా.. అని ఆనందరావు అంటే.. డాడీ అని గట్టిగా అరిచింది. హిమను ఇంట్లోకి అడుగుపెట్టడానికి ఇష్టపడను. అలాంటి దానిని కోడలుగా ఎలా తీసుకొస్తాను? హిమ నష్ట జాతకురాలు. పుట్టగానే.. తల్లికి దూరమైంది. పెరిగాక తల్లిదండ్రులను పైలోకానికి పంపించింది. అలాంటి హిమకు నిరుపమ్‌తో పెళ్లి ఎలా చేస్తాను.. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి అని వార్నింగ్ ఇచ్చింది.

జ్వాలానే మన శౌర్య అంటూ హిమ కంటతడి
హిమ, జ్వాలా ఒకే చోట మాట్లాడుకొంటుంటే.. సడెన్‌గా సౌందర్య, ఆనందరావు ఎంట్రీ ఇచ్చారు. వారిని చూసి ఇద్దరు షాక్ అయ్యారు. జ్వాలానే శౌర్య ని తెలిసిపోతుందా? శౌర్యకు నేనే హిమను తెలుస్తుందా అని హిమ కంగారు పడిపోయింది. అయితే సౌందర్య వచ్చి.. ఆ రోజు బైక్ మీద వెళ్లింది.. తనతోనే కదా హిమ అంటే.. సమాధానం రాకపోవడంతో.. జ్వాలాను ఉద్దేశించి.. నీవు ఎవరు? నీ గురించి అడిగితే ఏదేదో చెబుతున్నది. నేను నమ్మాను అనుకొన్నది. అసలు నిజం చెప్పండి అని సౌందర్య అంటే.. జ్వాలా చేతిపై ఉన్న H అనే పచ్చబొట్టు చూపిస్తూ.. జ్వాలానే మన శౌర్య నానమ్మ అంటూ హిమ కంటతడి పెట్టింది. దాంతో ఓ వైపు సంతోషం, బాధతో జ్వాలా వద్దకు వెళ్లి.. నువ్వేనా మా శౌర్యవు.. ఇన్నాళ్లు ఎక్కడున్నావు? మమ్మల్ని చూసి కూడా పలకరించలేదా? లేక మేము ఎప్పుడు కనిపించలేదా అంటూ సౌందర్య ఎమోషనల్ అయింది.

అమ్మా, నాన్నను మింగేసిన రాక్షసి అంటూ
అయితే సౌందర్య, హిమ అలా మాట్లాడుతుంటే.. వారిపై శౌర్య భగ్గుమన్నది. ఆపండి అంటూ గట్టిగా అరిచి.. మీ కపట నాటకాలు ఆపండి అంటూ కోపంతో ఊగిపోయింది. దాంతో మేము నేను మీ తాతయ్యను.. మీ నానమ్మ. అది నీ హిమ.. అంటే.. నా హిమ కాదు.. మా అమ్మ, నాన్నలను మింగేసిన రాక్షసి. ఇన్నాళ్లు నా పక్కనే ఉంటూ.. నన్నే మోసం చేస్తావా? అంటూ శౌర్య ఆగ్రహం వ్యక్తం చేసింది. దాంతో అలా మాట్లాడుతున్నావేంటే రౌడీ అంటే.. అలా మాట్లాడే నన్ను రౌడీని చేసేశావు అంటూ శౌర్య మండిపడింది. మీరేమో కారులో తిరగాలి.. దర్జాగా బతకాలి. నేను ఇలా తిరగాలి అంటే.. నువ్వే కదా.. ఇంట్లో నుంచి పారిపోయావు అని సౌందర్య అంటే.. నా కోసం వెతకాలి కదా.. నా మీద ప్రేమ లేదు. నన్ను వెతుకలేదు. హిమ ఒక్కతే మీకు మనవరాలు అని శౌర్య ఆవేదన వ్యక్తం చేసింది. అలానే మాట్లాడుతావా? అని ఆనందరావు అంటే.. నాకు తాత, నానమ్మ, చెల్లె, బాబాయి ఎవరు లేరు? అని శౌర్య ఆగ్రహం వ్యక్తం చేసింది.

హిమకు అలాంటి కల రావడంతో
అయితే శౌర్య కోపంతో ఊగిపోతుంటే.. నన్ను క్షమించు అంటూ హిమ అంటూ వేడుకొన్నది. అయితే నువ్వు ఆనందంగా ఉంటే.. నేను కష్టపడాలా? నిన్ను వదిలేదిలే.. నువ్వు ఎలా మనశాంతితో ఉంటావో చూస్తాను అంటూ తోసి పడేసింది. అయితే ఇదంతా హిమ కంటున్న కల కావడం, ఈ కల నుంచి హిమ ఉలిక్కిపడి లేచింది. శౌర్యను తలుచుకొని నీ ప్రేమను గెలుచుకొనేందుకు ప్రయత్నిస్తాను అంటూ హిమ మనసులో అనుకొన్నది.

సీనియర్ సిటిజన్‌కు ఫ్రీ అంటూ
ఇదిలా ఉండగా, సౌందర్య, ఆనందరావు బయటకు వెళ్తూ.. శౌర్య ఆటో వద్దకు వచ్చారు. ఆటోలో శౌర్య ఉండటంతో.. సారీ అంటూ తాను కొట్టినందుకు సౌందర్య క్షమాపణ చెప్పింది. అయితే నాకు సారీ అవసరం లేదు అంటూ శౌర్య పొగరుగా సమాధానం చెప్పింది. దాంతో నీకు పొగరు ఎక్కువే అంటూ పక్క వీధిలోకి వెళ్లాలి.. మీటర్ మీద డబుల్ ఇస్తాను అంటూ సౌందర్య కామెంట్ చేసింది. దాంతో. హలో సీనియర్ సిటిజన్.. అంటే సౌందర్య కోపగించుకొన్నది. దాంతో నీవు సీనియర్ సిటిజన్ కాదా.. నువ్వేమైనా యూత్‌వా అని శౌర్య ఘాటుగా స్పందించింది. దాంతో ఆనందరావు నవ్వుల్లో మునిగిపోయాడు. ఏంటి మీరు నవ్వుతున్నారు అంటే.. నాకు నవ్వు వస్తుందంటూ ఆనందరావు చెప్పాడు. అయితే ఆటో దిగిన తర్వాత మీటర్ ఎంత అయిందని సౌందర్య అంటే.. సీనియర్ సిటిజన్లకు ఫ్రీ అంటూ శౌర్య అంటే.. మళ్లీ ఆ మాట అనకు అంటే.. ఉన్నమాటే అన్నాను అని శౌర్య సమాధానం ఇచ్చింది.

కార్తీకదీపం 15వ వారం రేటింగ్
ఇదిలా ఉండగా, గత కొద్దివారాలుగా కార్తీకదీపం సీరియల్ రేటింగ్ తగ్గుతూ కనిపిస్తున్నది. అందుకు కారణం హిమ, శౌర్య, నిరుపమ్, ప్రేమ్ మధ్య ఎపిసోడ్స్ కాస్త ఎక్కువ కావడంతో ప్రేక్షకులు బోర్‌గా ఫీలవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. అదే కాకుండా ఐపీఎల్ టోర్ని కూడా కొనసాగడంతో కూడా కార్తీకదీపంతోపాటు ఇతర సీరియల్స్‌పై కూడా ప్రభావం పడినట్టు తెలుస్తున్నది. 15వ వారంలో అర్బన్‌లో 11.89 రేటింగ్‌ను, రూరల్‌లో 12.18 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది.


Click it and Unblock the Notifications











