twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam నవ్వుతూ గొంతు కోశారు.. నాపై మీకు ప్రేమలేదు.. శౌర్య ఆగ్రహం

    |

    ధైర్య సాహసాలు ప్రదర్శించిన జ్వాలాకు హైదరాబాద్ క్లబ్ అవార్డు అందజేసేందుకు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ కార్యక్రమంలో సౌందర్య, ఆనందరావు, డాక్టర్ హిమ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో హిమ చేతుల మీదుగా అవార్డు అందించాలని నిర్ణయించిన నిర్వాహకులు.. డాక్టర్ హిమ అంటూ పేరు పిలువడతో అప్పటి వరకు తనకు తెలిసిన తింగరినే డాక్టర్ హిమ అని తెలియడంతో జ్వాలా షాక్ గురైంది. హిమపై అప్పటి వరకు ఉన్న కోపం మరోసారి కట్టలు తెంచుకొన్నది. అయితే తనను మోసం చేశారనే కోపంతో ఉన్న శౌర్య ఊరి నుంచి వెళ్లిపోయేందుకు సిద్దమైంది. ఈ క్రమంలో కార్తీకదీపం సీరియల్‌ 1398 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

     గుండె కోత పెట్టకు అంటూ..

    గుండె కోత పెట్టకు అంటూ..

    జ్వాలా అలియాస్ శౌర్య ఇంటికి వెళ్లే సరికి బయట ఆటో బోల్తా పడి ఉంది. ఆ సీన్ చూసి సౌందర్య, ఆనందరావు, హిమ కంగారు పడ్డారు. అయితే ఇంటి వరకు వచ్చాం. కానీ లోపల కాలు పెట్టాలంటే భయంగా ఉంది. ఆమెకు ముఖం ఎలా చూపిస్తాం అని సౌందర్య అంటే.. ఇప్పటికే చాలా తప్పులు చేశాం. ఇక ముందు ఇలాంటి తప్పులు చేయకూడదు అని ఆనందరావు అన్నారు. ఇంట్లో బ్యాగ్ సర్దుకొంటున్న శౌర్యను చూసి.. హిమ, సౌందర్య ఏదో అనబోతుండగా.. నా మనసు బాగాలేదు. నా ఆటో బాగాలేదు అంటూ శౌర్య చెప్పింది. దాంతో ఆటో కోసం వచ్చామని అనుకొంటున్నావా? అని సౌందర్య అంటే.. నాపేరు జ్వాలా అంటే.. ఇక చాలూ నాకు గుండె కోత పెట్టకు అని సౌందర్య అంటే.. గుండె కోతనా? గుండె ఉండే వాళ్లకు ఆ బాధ ఉంటుంది అని శౌర్య సెటైర్ వేసింది.

     నా జీవితం నాశనం అని శౌర్య

    నా జీవితం నాశనం అని శౌర్య


    నా జీవితం నాశనం అయింది. ఇక ఈ ఊర్లో ఉండనవసరం లేదు.మోసం, దగా, నవ్వుతూ గొంతు కోసేవాళ్లు లేని ప్రదేశానికి వెళ్తాను. నేను వెళ్లే చోటులో ఇలాంటి మోసం చేసేవారు ఉండరని అనుకొంటున్నా అని శౌర్య అంటే.. మేమంత ఇక్కడే ఉన్నాం కదా.. అని సౌందర్య అంటే.. మీరు ఉన్నారనే నేను వెళ్తున్నాను అని శౌర్య షాకిచ్చింది. శౌర్య.. నేనంటే నీకు ఇష్టం కద.. మా కోసం ఉండొచ్చు కదా అని ఆనందరావు అన్నారు.

     మీరు ఆపకండి.. వెళ్లిపోతాను అంటూ

    మీరు ఆపకండి.. వెళ్లిపోతాను అంటూ


    నేను ఆటో నడుపుతుంటే.. టిఫిన్ బాక్సులు తెస్తుంటే.. మీకు బాధ అనిపించలేదా? నేను శౌర్య అని తెలిసినా.. నన్ను పరాయిదానిగానే చూశారు. ముగ్గురు పోటీ పడి నటించారు. నానమ్మ గోరు ముద్దలు తినిపించారు. హిమ గ్రేట్ డాక్టర్.. యాక్టర్ అయింది. నా జీవితాన్ని కోలుకోలేని విధంగా దెబ్బ తీశారు అని శౌర్య అంటే.. నీకు తెలియకుండా.. ఇంకో విధంగా తెలిసాయి అని అంటే.. మీరు ఆపకండి.. నేను వెళ్లిపోతాను అని చెబితే... సౌందర్య, ఆనందరావు అడ్డు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మీరు నన్ను శౌర్య అని తెలిసినా.. మీరు గుర్తుపట్టినా నన్ను శౌర్య అని పిలువలేదు అని అంటే.. నువ్వు కూడా గుర్తు పట్టినా.. మమ్మల్ని ఎందుకు నానమ్మ అని పిలువలేదు అని సౌందర్య అంటే.. ఎందుకు పిలువలేందంటే.. అని హెచ్ అని పచ్చబొట్టు ఉన్న చేతిని చూపించింది.

    నా మీద ప్రేమ లేదు మీకు..

    నా మీద ప్రేమ లేదు మీకు..


    నేను శౌర్య అని చెబితే.. మీ ఇంటికి రావాలి. మీ ఇంటికి వస్తే.. హిమ ముఖం చూడాలి. అది నాకు ఇష్టం ఉండదు. ఇన్నాళ్లు నా కోసం ఏం చేశారు. నన్ను వెతికారా? నేను ఫోన్ చేస్తే అక్కడికి వెళ్లి వెతికారు. ఆర్టిస్టుతో ఫోటో గీయించే ప్రయత్నం చేశారు. అంతకంటే ఏం చేశారు. మీకు నా మీద ప్రేమ లేదు ఉంటే.. ఏదైనా సాధ్యమే కదా. మీకు ప్రేమలేదు. మీ మనవరాలికి నా మీద ప్రేమ కన్నా.. నేను కోరుకొనే డాక్టర్ సాబ్‌ను పెళ్లి చేసుకొంటున్నది అని శౌర్య నిలదీసింది. దాంతో నేను డాక్టర్ సాబ్‌ను పెళ్లి చేసుకొంటున్నావని చెప్పేది నిజం కాదు అని హిమ అంటే.. నాకు కథలు చెప్పకు. ఇక నుంచి మీకు నేను కనిపించను అని శౌర్య చెప్పింది. అయితే శౌర్య.. ఇంటికి వెళ్దాం పద.. నేను అన్నీ వివరంగా చెబుతాను అని సౌందర్య అంది.. అయితే నాకు ఇల్లు లేదు. నాకు ఎవరు లేరు. ఇలా రమ్మని ముందే చెబితే.. నేను వచ్చేదానిని. డాక్టర్ హిమ గురించి క్లబ్ చెబితే.. మీ గురించి.. నా గురించి తెలిసింది. లేకపోతే ఎన్నాళ్లు దాగుడు మూతలు ఆడేవారేమో అని శౌర్య నిలదీసింది.

     అమ్మ, నాన్న ఆత్మ ఘోషిస్తాయి

    అమ్మ, నాన్న ఆత్మ ఘోషిస్తాయి


    శౌర్య ఊరు వదిలి వెళ్లిపోతానంటే.. ఎక్కడికి వెళ్లిపోతావు అని సౌందర్య ప్రశ్నించింది. అయితే నాతో ఎలాంటి బంధం లేకున్నా.. నా పిన్ని, బాబాయ్ నన్ను బాగా చూసుకొన్నారు. ఏసీ రూమ్‌లో కూర్చోని నా గురించి పట్టించుకోలేదు. నేను వెళ్లిపోతాను అని బయలుదేరితే.. నీకు నీ అమ్మా, నాన్న మీద గౌరవం ఉంటే.. ఉండిపోతావు. నీవు వెళ్లిపోతే.. మీ అమ్మ, నాన్న ఆత్మలు కూడా ఘోషిస్తాయి. ప్లీజ్.. అంటూ సౌందర్య చేతులెత్తి దండం పెట్టింది. దాంతో సరే.. కానీ నేను ఇక్కడే ఉంటాను. కానీ మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. చచ్చిపోయిన అమ్మ, నాన్న ఆత్మలను అడ్డుపెట్టుకొని ఆపుతున్నారు. వెళ్లండి.. మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని శౌర్య ఘాటుగా స్పందించింది. వారి ముఖంపైనే డోర్ వేసి ఇంట్లోకి వెళ్లి కన్నీళ్లు పెట్టుకొన్నది.

    Recommended Video

    హ్యాపీ బర్త్ డే చెప్పి మత్తు వదిలించావ్ గా *Reviews | Telugu OneIndia
    డాక్టర్ సాబ్‌తో నీ పెళ్లి అంటూ

    డాక్టర్ సాబ్‌తో నీ పెళ్లి అంటూ


    ఇక తాజా ప్రోమోలో మరో ట్విస్టు కనిపించింది. శౌర్య ఇంటిలోకి వచ్చిన హిమ.. వంకాయ కూర వంట చేయడానికి సిద్దమవుతున్నది. అయితే నా ఇంట్లోకి వచ్చావేంటే.. అంటే.. ఎంతైనా మనం వంటలక్క పిల్లలం కద.. అని హిమ అంది. అయితే వంట పాత్రలను, సామాను విసిరికొట్టింది. చేయిపట్టి హిమను బయటకు నెట్టే ప్రయత్నం చేసింది. దాంతో శౌర్యతో హిమ మాట్లాడుతూ.. డాక్టర్ సాబ్‌తో పెళ్లి చేసే బాధ్యతను నాది అంటూ చెప్పడంతో సీరియల్ కొత్త మలుపు తిరిగే ఛాన్స్ కనిపించింది.

    English summary
    Karthika Deepam July 7th Episode number 1398.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X