twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Karthika Deepam ఆటోలో నిరుపమ్ ఫుల్ రొమాన్స్.. సౌందర్యకు అలాంటి స్వప్న సవాల్

    |

    హిమతో జ్వాలా అలియాస్ శౌర్య మాట్లాడుతూ.. అన్నింటిలో ధైర్యంగా దూసుకెళ్లే నాకు.. నా మనసులోని మాటను డాక్టర్ సాబ్‌కు చెప్పడానికి భయపడుతున్నాను. కానీ ఎప్పుడో ఒకప్పుడు చెప్పేస్తాను. తింగరి నాకు ఈ విషయంలో హెల్ప్ చేయి అని అంది. దాంతో తప్పకుండా నీకు హెల్ప్ చేస్తాను. అది నా బాధ్యత అని హిమ అంటే.. ఏయ్ ఏంటి? బాధ్యతనా? అంతపెద్ద మాట అనేశావు తింగరి.. అంటే.. నీవు నా గురువు కదా. అందుకే నా బాధ్యత అన్నాను. మీ ఇద్దరి పెళ్లి చేసే బాధ్యత నాది అనగానే.. హిమ గుండెలపై శౌర్య వాలిపోయింది. అయితే నేను చెప్పే వరకు నీవు డాక్టర్ నిరుపమ్‌కు ఐ లవ్ యూ చెప్పకూడదు అని హిమ చెప్పింది. కార్తీకదీపం సీరియల్‌ 1359 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

    శౌర్య ఫోన్ చేయడం ఆనందంగా ఉంది..

    శౌర్య ఫోన్ చేయడం ఆనందంగా ఉంది..

    ఊరెళ్లి వచ్చిన ఆనందరావు, సౌందర్య జరిగిన పరిణామాల గురించి తీవ్రంగా ఆలోచిస్తూ.. ఇంటికి వచ్చే సరికి శుభవార్త చెప్పావు. శౌర్య ఫోన్ చేసిందని చెప్పడం హ్యాపీగా ఉంది. ఇన్నాళ్లు ఎక్కడ ఉందో.. మన గురించి తెలిసి ఫోన్ చేసింది కానీ.. ఎందుకు ఇంటికి రాలేదు. ప్రస్తుతం ఎలా ఉందో.. శౌర్య పరిస్థితి ఎలా ఉందో.. మన గురించి శౌర్య ఏమనుకొంటుందో.. మనల్ని గమనిస్తుంటుందా? లేదా అనేది మనకు తెలియదు. అయితే నిశ్చితార్థం రోజున హిమ అలా చేసి ఉండాల్సింది కాదు. ఒకవేళ అలా చేస్తే స్వప్న చూస్తూ ఎలా ఊరుకొన్నది అని ఆనందరావు అంటుంటే.. అంతలోనే స్వప్న అక్కడకు వచ్చి హలో డాడీ, హలో మమ్మి అంటూ ప్రేమగా పలుకరించింది. స్వప్న అలా పలకరించడంతో సౌందర్య హ్యాపీగా ఫీలయ్యింది.

    నేను పిల్ల కాకిని కాదు.. అంటూ

    నేను పిల్ల కాకిని కాదు.. అంటూ


    నాన్న ఊరి నుంచి ఎప్పుడు వచ్చావు? మమ్మీ ఎలా ఉన్నావు? చీర బాగున్నది. మీ సెలక్షన్ బాగుంది అని అనగానే సౌందర్య, ఆనందరావు కంగారు పడిపోయారు. ఇంటికి వచ్చి మళ్లీ ఏం గొడవ చేస్తుందని అనుకొంటున్నారా? కానీ మీకు శుభవార్త చెప్పి స్వీట్లు తినిపించడానికి వచ్చాను అని స్వీట్లు ఇచ్చింది. అయితే స్వీట్లు ఏంటి? అంటే.. అంటే.. పిల్లకాకి ఏంటి నీ చేష్టలు అని సౌందర్య అడిగితే.. ఇన్నాళ్లు పిల్లకాకిని. కానీ ఈ రోజు నుంచి సరైన నిర్ణయమే తీసుకొంటున్నాను అంటూ డాక్టర్ శోభాదేవిని చప్పట్లు కొట్టి ఇంటిలోకి పిలిచింది. పెద్దల ఆశీర్వాదం తీసుకో .. వీళ్లు నీకు నానమ్మ, తాతయ్య అని చెప్పగానే.. శోభ కాళ్లను నమస్కరించింది.

    నా కొడుకుతో తాళి కట్టించుకొంటుంది

    నా కొడుకుతో తాళి కట్టించుకొంటుంది

    ఆ తర్వాత తల్లితో స్వప్న మాట్లాడుతూ.. ఎవరొచ్చినా రాఖీలు కట్టిస్తానని చెప్పవుగా.. సో నా కొడుకుతో డాక్టర్ శోభ తాళి కట్టించుకొని తీరుతుంది. నీ మనవరాలు ఎక్కడ? డాక్టర్ శోభ హోదా ఎక్కడా? నీ నిశ్చితార్థం ఎపిసోడ్ ఫ్లాప్ అయింది. ఇక నా కొడుకుతో శోభ పెళ్లి అవుతుంది అని స్వప్న అంటే.. సౌందర్య లేచి.. ఏంటి శోభ.. నీ పేరు బాగుంది. కానీ నీ చెంపపైన దెబ్బ ఏంటి? ఎవరైనా లేత అమ్మాయి చేయి దెబ్బ చెంపపై పడిందా? నా మనవరాలి లాంటి యువతి ఎవరైనా కొట్టారా? అని అంది. నీవు తక్కువ అంచనా వేసి ఉంటావు. నా గురించి ఏదో ఆలోచించి ఉంటావు. కానీ నిరుపమ్‌తో పెళ్లి నా మనవరాలితోనే అవుతుంది అని.. స్వీట్ బాక్స్ చేతిలో పెట్టి జాగ్రత్త అని చెప్పడంతో.. కోపంగా స్వప్న, శోభ వెళ్లిపోయారు.

    ఎప్పుడు నీ పక్కనే అంటూ

    ఎప్పుడు నీ పక్కనే అంటూ

    జ్వాలా ఆటోలో నిరాశ, నిస్పృహలతో కనిపించారు. అయితే నిరుపమ్‌తో మాట్లాడుతూ.. మీరు ఆటోలో ఉంటే.. నాకు ఆటో నడిపినట్టే ఉండదు. విమానం నడిపినట్టు ఉంటుంది. నీతో ఆటోలో వెళ్తుంటే హ్యాపీగా ఉంటుంది. ఇంతకు ఎక్కడికి వెళ్లాలో నాకు చెప్పలేదు అని జ్వాలా అంటే.. ఎక్కడికైనా తీసుకెళ్లు. మనసుకు ఆనందం కలిగే ప్రదేశానికి తీసుకెళ్లు అంటే.. ఆటో ఆపి.. డ్రైవర్ సీటులో నిరుపమ్‌ను కూర్చోపెట్టి.. పక్కనే కూర్చొని హ్యాపీగా ఫీలయ్యింది. అయితే వెనుక సీటులో కూర్చొ.. అంటే.. ఎప్పుడూ నీ పక్కనే ఉంటాను అని జ్వాలా అనడంతో నిరుపమ్ ముఖంలో ఆనందం కనిపించింది. ఇప్పుడే నీవంటే ఇష్టమని చెప్పదామా? కానీ హిమ ఏమో.. తను చెప్పినప్పుడే ప్రపోజ్ చేయమని చెప్పింది కదా అంటూ జ్వాలా మనసులో అనుకొన్నది.

    హిమకు శోభ కౌంటర్

    హిమకు శోభ కౌంటర్


    శౌర్య, నిరుపమ్ ఆటోలో బయటకు వెళ్లడంపై హిమ ఆలోచనల్లో పడింది. నాపై కోపంతోనే శౌర్యతో నిరుపమ్ బయటకు వెళ్లాడు. కొంపదీసి ఎంగేజ్‌మెంట్ ఆగిపోయిన విషయం గురించి శౌర్యకు చెబుతాడా? అని మనసులో అనుకొంటుంటే.. డాక్టర్ శోభ అక్కడికి వచ్చి.. హిమ ముందు ఉన్న పేషెంట్‌తో కుశలప్రశ్నల వేసి.. ప్రిస్కిప్షన్ రాసి ఇచ్చింది. అయితే నీవు చీటి రాసి ఇవ్వడం ఏమిటి అంటూ హిమ ప్రశ్నించింది. అయితే నేను రాసిన ప్రిస్కిప్షన్ బాగుందా? నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అని ఆలోచిస్తున్నావా? నేను డాక్టర్ శోభను. మా ఆంటీ వచ్చాక ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుస్తుంది అని డాక్టర్ శోభ చెప్పింది.

    నిరుపమ్ ఎక్కడ అంటూ

    నిరుపమ్ ఎక్కడ అంటూ

    అంతలోనే స్వప్న అక్కడికి రావడంతో.. కాసేపటి క్రితమే పరిచయాలు అయ్యాయి. ఒకరికొకరు చెప్పుకొన్నాం అని స్వప్నకు డాక్టర్ శోభ చెప్పింది. ఈమె ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకొన్నది అని స్వప్ప చెప్పింది. హిమను కోపంగా చూస్తూ.. నిరుపమ్ ఎక్కడ అని ప్రశ్నించింది. దాంతో శౌర్యతో నిరుపమ్ వెళ్లాడని చెబితే స్వప్న అత్త కోపం తెచ్చుకొంటుందేమో అనే సందేహంలో హిమ పడింది.

    నిరుపమ్‌ను కౌగిలించుకొన్న జ్వాలా

    నిరుపమ్‌ను కౌగిలించుకొన్న జ్వాలా


    తాజా ప్రోమో ప్రకారం.. పార్కులో జ్వాలా, నిరుపమ్ సన్నిహితంగా కనిపించారు. జ్వాలా చేతిని నిరుపమ్ తీసుకొని.. నీవు మా ఫ్యామిలీ కోసమే పుట్టావేమో అనిపిస్తుంది అని నిరుపమ్ అంటూ పక్కకు వెళ్లాడు. నిరుపమ్ మాటలతో సంతోషపడిన జ్వాలా.. నా మనసు దిల్ కుష్ అంటూ ఆనందపడిపోయింది. అంతలోనే అక్కడికి డాక్టర్ శోభ వచ్చింది. శోభను చూడగానే.. నిరుపమ్ వచ్చి కౌగిలించుకొన్నాడు. అప్పుడు ఇది నా రేంజ్ అంటూ డాక్టర్ శోభ సైగలు చేసింది. పక్కనే ఉన్న జ్వాలాను పరిచయం చేస్తూ.. ఈమె జ్వాలా.. చాలా తెలివైనది అని నిరుపమ్ పరిచయం చేస్తే.. ఆటో డ్రైవర్‌కు, డాక్టర్‌కు ఫ్రెండ్‌షిప్ ఏమిటో అని డాక్టర్ శోభ సెటైర్ వేసింది.

    కార్తీకదీపం రేటింగ్ వర్సెస్ గృహలక్ష్మి

    కార్తీకదీపం రేటింగ్ వర్సెస్ గృహలక్ష్మి


    కార్తీకదీపం సీరియల్ రేటింగ్ కొద్ది వారాలుగా పడిపోతూ వస్తున్నది. తాజా వారం అంటే.. 19వ వారంలో ఈ సీరియల్ రేటింగ్ 11.60 పాయింట్లుగా నమోదైంది. ఈ సిరియల్‌ రేటింగ్ అధిగమించేందుకు గృహలక్ష్మి సిద్దమవుతున్నది. అయితే గతంలో మాదిరిగా ఈ సీరియల్ మళ్లీ టాప్ రేటింగ్‌కు చేరుకొంటుందో లేదో వేచి చూడాల్సిందే.

    English summary
    Karthika Deepam May 23rd Episode number 1359. Nirupam romance with Shourya
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X