For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Karthika Deepam దీప బతికే ఉంది.. వంటలక్క గురించి బాంబు పేల్చిన వారణాసి

  |

  డాక్టర్ శోభ మోసాన్ని శౌర్య బయటపెట్టిన తర్వాత స్వప్న మారిపోయింది. స్వప్నతో మాట్లాడుతూ.. నీకు ఏమీ ఇవ్వలేకపోయాను. గిఫ్టులు కొనివ్వలేకపోయాను అని సత్యం అంటే.. షాపింగ్‌కు తీసుకెళ్లి మొత్తం కొనిస్తారా ఏంటి అని స్వప్ప అడిగింది. అయితే ఏదో ఒకటి గిఫ్టుగా ఇవ్వాలని అనుకొంటున్నాను. అంటే. పెళ్లి అయిన తర్వాత అన్నీ చూసుకొందాం. నాకు కూడా మా అమ్మ, నాన్నలకు ఏదైనా ఇవ్వాలని అనుకొంటున్నాను అని స్వప్న చెప్పడంతో మంచి ఆలోచన అంటూ సత్యం అన్నాడు. అయితే ప్రేమ్ కంగారుగా కనిపించడంతో వాడు ఏదో విషయంలో ఆందోళనగా ఉన్నాడు అంటూ స్వప్నకు చెప్పాడు. అంతలోనే హిమను ప్రేమిస్తున్నాననే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడానికి ప్రేమ్ సిద్దమయ్యాడు. అయితే తనకు ఇప్పుడు ఏ సమస్య చెప్పకండి.. ఇప్పుడిప్పుడే రిలీఫ్ అవుతున్నాను అని స్వప్న అని అక్కడికి వెళ్లి నుంచి పోయింది. కార్తీకదీపం సీరియల్‌లో 1431 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

  సౌందర్య, ఆనందరావు తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి వెళ్లారు. అయితే శౌర్య దేవుడిని కోరుకో అంటూ సౌందర్య అంటే.. ఎందుకు దేవుడు నా వద్ద నుంచి తీసుకెళ్లడమే తప్ప.. ఇవ్వడం తెలియదు అని శౌర్య అంది. అయితే దేవుడిని మొక్కుకో అని చెప్పడంతో.. అంటే.. నా మనసులో ఏముందో తెలుసు. మా అమ్మ, నాన్నలు బతికి ఉంటే.. నా వద్దకు రప్పించండి అని శౌర్య మొక్కింది. శౌర్య దేవుడికి మొక్కిన వెంటనే హాస్పిటల్‌లో దీప సన్నివేశాలు కనిపించాయి.

  Twist in Karthika Deepam todays episode: Varanasi narates Deepas live existance story

  అయితే శౌర్యతో హిమ మాట్లాడుతూ.. నీకు ఒక మాట చెప్పాలి. కారు యాక్సిడెంట్ అయిన సమయంలో శౌర్యను నువ్వే చూసుకోవాలి అని చెప్పారు. అందుకే ఇంటి నుంచి నీవు పారిపోయి మళ్లీ కలిసిన తర్వాత నేను నీతోనే ఉన్నాను. డాక్టర్ సాబ్‌ను ప్రేమిస్తున్నావని తెలిసి.. నేను బావకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకొన్నాను అని శౌర్య అంటే.. ఇక నీ కట్టు కథలు ఆపు మహా నటి.. నీ మాటలు నమ్మాలంటే.. అమ్మ, నాన్నలు వచ్చి చెబితే నేను నమ్ముతాను అని శౌర్య అంది. అయితే శౌర్యను మాటలకు అడ్డు పడుతూ.. వాళ్లు వచ్చి ఎలా చెబుతారే అని సౌందర్య అంటే.. వాళ్లు రావడం ఎంత నిజమో.. హిమ చెప్పే మాటలు కూడా అంతే నిజమని నమ్ముతాను అని శౌర్య అంది. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు అని సౌందర్య అంటే.. వాళ్లు బతికే ఉన్నారని నమ్ముతున్నాను అంటూ శౌర్య అంది. అంతలోనే వారణాసి వచ్చి .. అవును వాళ్లు బతికే ఉన్నారు అంటూ బాంబు పేల్చాడు.

  దాంతో కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన యాక్సిడెంట్ తర్వాత చావు బతుకుల్లో ఉన్న దీపను సమీప హాస్పిటల్‌లో చేర్చారు. కొద్ది రోజుల తర్వాత అపస్మారక స్థితి నుంచి తేరుకొని స్పృహలోకి వచ్చిన డాక్టర్ బాబు.. డాక్టర్ బాబు అంటూ కోసం వెతకడం ప్రారంభించింది.

  Twist in Karthika Deepam todays episode: Varanasi narates Deepas live existance story

  తాజా ప్రోమోలో డాక్టర్ బాబు ఎవరు అంటూ హాస్పిటల్‌లో డాక్టర్ అడిగితే.. నా భర్త.. యాక్సిడెంట్ సమయంలో నాతోనే ఉన్నాడు అని దీప చెప్పింది. అయితే దీప బాధను చూడలేక.. మీరు యాక్సిడెంట్‌కు గురైన రోజే ఓ వ్యక్తిని తీసుకొచ్చారు. అతడు మార్చూరీలో ఉన్నాడు. మీరు చూసి గుర్తు పడితే అతడు ఎవరో తెలుస్తుందని డాక్టర్ చెప్పాడు. అయితే మార్చురీలోకి వెళ్లగానే డాక్టర్ బాబు ధరించిన షూస్ కనిపించాయి. దాంతో దీప షాక్ గురైంది. ముఖం మీద దుప్పటి తీయగా.. భోరున ఏడ్చింది.

  English summary
  Karthika Deepam 15th August Episode number 1431
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X