Karthika Deepam వంటలక్కకు తీవ్ర అనారోగ్యం.. ఆందోళనలో కార్తీక్

ఇంట్లో జ్వాలా అలియాస్ శౌర్య కనిపించకపోవడంతో కంగారు పడ్డారు. ఇంద్రుడు వచ్చి జ్వాలా ఎక్కడ అంటూ చంద్రమ్మను ప్రశ్నించడంతో బయటకు పోయిందని చెప్పారు. దాంతో చంద్రుడు ఆందోళనపడ్డాడు. అంతలోనే శౌర్య ఇంట్లోకి రావడంతో నీవు ఎక్కడికి వెళ్లావు అంటే.. చేతిలో ప్రింట్స్ చూపించింది. అందులో అమ్మ, నాన్న ఎక్కడ ఉన్నారు.. ఈ పోస్టర్ చూస్తే.. వెంటనే కింది నెంబర్‌కు కాల్ చేయండి అంటూ పోస్టర్‌ను ప్రింట్ చేసింది. ఆ పోస్టర్‌ను ఇంద్రుడు, చంద్రమ్మ మరింత కంగారు పడ్డారు. ఇంకా కార్తీకదీపం సీరియల్‌లో 1516 ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

మోనితను తప్పించుకొని స్థానికంగా ఓ పెషెంట్‌కు ఆపరేషన్‌ చేసేందుకు వెళ్లాడు. అయితే ఆపరేషన్ పూర్తి చేసుకొన్న కార్తీక్.. డాక్టర్‌తో మాట్లాడుతూ.. సర్జరీ పూర్తయింది. ఇక పేషెంట్ గురించి ఏ మాత్రం కంగారు పడకూడదు అని డబ్బులు తీసుకొన్నాడు. దాంతో మీరు ఇక్కడే ఉండండి.. మరో చోటు ఎందుకు.. మా గెస్ట్ హౌస్‌లో ఉండండి అంటూ డాక్టర్ అడిగాడు. దాంతో ప్రస్తుతం నేను ఇక్కడ ఉండలేను అని కార్తీక్ సర్దిచెప్పాడు. ఆ తర్వాత ఈ డబ్బు ఎక్కడిది అని అడిగితే.. ఉంగరం కుదవపెట్టి డబ్బు తీసుకొన్నానని చెబుతానని మనసులో అనుకొన్నాడు.

 Twist in November 22nd Episode number 1516 in Karthika Deepam serial. Mounitha caught red handedly to Karthik

కార్తీక్‌ను వెతుక్కొంటూ వంటలక్క ఇంటికి మోనిత చేరింది. ఇంట్లో ఆటోవాడి ఫ్యామిలీతో శౌర్య ఉన్న ఫోటో కనిపించడంతో కంగుతిన్నది. అయితే ఆటోవాడి వద్ద వద్ద శైర్య ఉందా? కార్తీక్‌కు గతం గుర్తుకు వచ్చిందా? అని మోనిత తన మనసులో అనుకొన్నది. అయితే అప్పుడే కార్తీక్ రావడంతో.. ఫోటోను చూపించి.. వంటలక్క కూతురు ఆటోవాడి వద్ద ఉందంటూ చెప్పింది. దాంతో వంటలక్క కూతురు నీకు ముందే తెలుసా అని ప్రశ్నించడంతో ఇబ్బందికి గురైంది. అక్కడ కార్తీక్ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేక వెంటనే ఇంటికి బయలుదేరబోయింది. అయితే కార్తీక్ వద్ద డబ్బు ఉండటంతో.. ఇంత డబ్బు ఎక్కడిది అంటే.. ఉంగరం తాకట్టు పెట్టి తెచ్చాను అంటూ కార్తీక్ చెప్పడంతో.. వెంటనే.. వంటలక్కకు ఇవ్వడానికేనా అని అక్కడి నుంచి మోనిత విసురుగా వెళ్లిపోయింది.

జ్వాలా తెచ్చిన ప్రింట్ అవుట్స్ గోడలకు అతికించి పనిలో ఇంద్రుడు పడ్డాడు. సంగారెడ్డిలోని గోడలకు, బస్టాండ్, ఇతర ప్రాంతాల్లో జ్వాలా, ఇంద్రుడు అతికించడం మొదలుపెట్టారు. అయితే జ్వాలా తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు చూసి చంద్రమ్మ ఆవేదన పడింది. జ్వాలా తెచ్చిన పోస్టర్లపై నలుపు పెయింట్ రాసి. కనపడకుండా చేసింది.

వంటలక్క అనారోగ్యం తీవ్రమైంది. కళ్లు తిరగడంతో దీప ఆందోళన చెందింది. ఎందుకు నాకు తల తిరుగుతున్నది. నాకు ఏదైనా అయిందా? అని అనుకొన్నది. అయితే కార్తీక్‌కు తన అనారోగ్యం గురించి చెప్పడంతో కార్తీక్ అనుమానం తలెత్తింది. మళ్లీ దీపకు జబ్బు తిరగదోడిందా అని మనసులో అనుకొన్నాడు. అయితే తాను సంగారెడ్డికి వెళ్లి.. శౌర్య గురించి వెతుకుతాను అని చెప్పింది. అయితే శౌర్య సంగారెడ్డిలో ఉందా అంటే.. ఇంతకు ముందు శౌర్య గురించి తెలిసేది కాదు.. కానీ ఇప్పుడు ఎవరి వద్ద ఉందో తెలుసు.. కానీ ఎక్కడ ఉందో తెలియదు అని చెప్పాడు.

ఇదిలా ఉండగా, తన ఇంటికి చేరిన మోనితకు తాళం వేసి కనిపించింది. ఇంటి నలువైపుల తిరగడంతో తాళం వేసి ఉండటంతో సౌందర్య వచ్చిందా అని అనుమాన పడింది. అంతలోనే కిటికిలోకి చూడటంతో దుర్గా తాళం చేవితో కనిపించాడు. నువ్వు ఇంటిలో ఎందుకు ఉన్నావంటే.. ఇంటి ముందు పడిన రక్తం ఎవరిదో చెప్పమంటూ ప్రశ్నించాడు. అయితే చివరకు నాకు తెలుసు అంటూ మోనిత అనగానే.. నీకు ఏం తెలుసు అంటూ వెనుక నుంచి కార్తీక్ అరిచాడు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X