Karthika Deepam ఇంటిలో దుర్గ.. మోనితను చూసి ఛీకొట్టిన కార్తీక్

తాళం వేసిన ఇంటిలో దుర్గ ఉండటం, మోనిత అతడితో గొడవ పడుతున్న సమయంలో కార్తీక్ అక్కడకు వచ్చాడు. ఇంటిలో రక్తపు మరకలు ఉండటం చూసి.. అవి ఎవరివి? నీకు కనీసం గాయం కాలేదు కదా.. ఆ రక్తం ఎవరిది? నీవు ఎవరైపైనా దాడి చేశావా? అని దుర్గ నిలదీస్తే.. మోనిత నాకు తెలియదు అంటూ సమాధానం ఇవ్వగానే.. అసలు నీకు ఏం తెలియదు అంటూ కార్తీక్ ప్రశ్నించగానే.. మోనిత షాక్ తిన్నది.. ఇక కార్తీకదీపం సీరియల్‌లో 1517 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

కార్తీక్ మాటలకు అడ్డుపడుతూ.. నన్ను ఇంటిలో పెట్టి తాళం వేసింది. కార్తీక్ చూస్తాడంటే.. పట్టించుకోలేదు. ఇంటికి తాళం వేసి నన్ను గదిలో బంధించి తాళం చేవుల గుత్తి ఇచ్చింది అని దుర్గ అనగానే.. వీడి మాటలు నమ్మకండి.. దుర్గ వంటలక్క మనిషి.. వాడిని ఇక్కడ వంటలక్కే పెట్టింది అని మోనిత అరిచింది. అయితే దుర్గ నా బంధువు అని చెప్పి ఇంట్లో పెట్టుకొన్నావు. ఇప్పుడేమో వంటలక్క మనిషి అంటున్నావా? ఓ వైపు వంటలక్క భర్త కోసం పాట్లు పడుతుంటే.. నీవేమో దుర్గతో వేషాలు వేస్తున్నావు అని కార్తీక్ ఘాటుగా క్లాస్ పీకాడు.

 Twist in November 23rd Episode number 1517 in Karthika Deepam serial.

అమ్మ, నాన్న ఎక్కడ ఉన్నా ఈ ఫోన్ నంబర్‌కు కాల్ చేయండి అంటూ ఊరి నిండా పోస్టర్లు అతికించి వచ్చిన జ్వాలాను భోజనం చేయమని ఇంద్రుడు దంపతులు అడిగితే.. ఆకలి లేదు.. తర్వాత తింటాను అని జవాబిచ్చింది. అయితే తొందరగా తయారైతే.. గుడికి వెళ్లాలి.. తొందరగా తయారవ్వు అని చంద్రమ్మ అంటే.. గుడికి ఎందుకు అని అడిగితే.. మాకు ఓ బిడ్డ పుట్టి చనిపోయింది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. బతికి ఉంటే.. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకొనేది అని చంద్రమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఆ బిడ్డ లేదని నిన్ను మాకు ఇచ్చి ఉంటాడు. నీవు ఒకసారి అమ్మా అని పిలువు అంటే.. లేదు.. నేను అమ్మా అని పిలువను అని జ్వాలా చెప్పేసి.. అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఇంద్రుడు, చంద్రమ్మ బాధపడ్డారు.

ఇక సౌందర్య బట్టలన్నీ సర్దేసి బ్యాగ్ రెడీ చేసుకొంటుంటే.. ఆనందరావు వచ్చి.. ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. దాంతో మోనిత వద్దకు వెళ్తున్నాను అని సమాధానం చెప్పింది. దాంతో డాక్టర్ వద్దని చెప్పాడుగా అని ఆనందరావు అంటే.. డాక్టర్ వెళ్లమని చెబితేనే.. వెళ్తాను అని అంది. మోనిత నన్ను ఎందుకు కొట్టింది? కార్తీక్ అక్కడే ఉన్నాడా? అని సౌందర్య అనుమానం వ్యక్తం చేసింది. అంతలోనే హిమ వచ్చి నేను కూడా వస్తానని అంటే.. నీవు ఎందుకు.. వద్దని చెప్పింది.

ఇక సంగారెడ్డికి వెళ్లి శౌర్య అలియాస్ జ్వాలా గురించి వెతుకుతాను అని బయలు దేరుతుంటే.. నేను కూడా వస్తానని కార్తీక్ అన్నాడు. దాంతో కార్తీక్‌ను వద్దని వారించింది. నీవు వస్తే.. మోనిత కుట్రలు చేస్తుంది. నీకు గతం గుర్తుకు వచ్చిన తర్వాత నీ కూతురును వెతుకు అని దీప చెప్పింది. దాంతో దీపకు కొంత డబ్బు ఇచ్చి.. ఖర్చులకు ఉంచుకోమని చెబితే.. తీసుకోవడానికి నిరాకరించింది. అయితే ఇంతకు ముందు ఏ హక్కు కోసమైతే తీసుకొన్నావో.. అదే హక్కు కోసం ఈ డబ్బు తీసుకో అని చెప్పారు. దాంతో డబ్బు తీసుకొని సంగారెడ్డికి బయలుదేరింది. అయితే కార్తీక్‌ను ఇక్కడే ఉండమని చెప్పగానే.. గోడ పక్కనే ఉన్న మోనిత ఆనంద పడింది. ఈ ఛాన్స్ ఛాలూ.. నిన్ను కార్తీక్ మరిచిపోవడానికి అని మోనిత మనసులో అనుకొన్నది.

ఇక సంగారెడ్డికి వెళ్లి.. ఓ ఇంటిలోకి వెళ్లగానే.. దీపకు షాక్ తగిలింది. తాను ఉండే ఇంటిలో కార్తీక్ ఫోటోకు దండవేసి.. పూలు వేయడం చూసి దీప గుండె పగిలినంత పనైంది. అయితే తనకు ఇంటి తాళాలు ఇచ్చిన వ్యక్తిని వెతికేందుకు బయటకు వెళితే.. కనిపించలేదు. దాంతో ఈ ఇంటిలో ఇంతకు ముందు ఎవరు ఉన్నారనే అనుమానంతో ఇళ్లంత చూసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X