Karthika Deepam దీప గుండెల్లో దిగిన బుల్లెట్.. అసలేం జరిగిందంటే?
వంటలక్కతో డాక్టర్ బాబు మాట్లాడుతూ.. నీ భర్త గురించే కదా నీ బాధ. నాకు గతం గుర్తుకు లేకపోవచ్చు. కానీ నా వర్తమానం తెలుసు కదా. నేనే నీ భర్తను అనుకొంటున్నావు. నీ తపన, బాధ చూస్తే నేనే నీ భర్తను అనిపిస్తున్నది. కాబట్టి నేనే నీ భర్తను అనుకో అని కార్తీక్ అన్నాడు. దాంతో మీరు ఏమన్నారు? మీరు చెప్పేది నిజమేనా? ఎందుకో తెలియదు. నీతోనే ఉండాలనిపిస్తున్నది. నీ సమస్యలన్నీ నా సమస్యలుగా అనిపిస్తున్నాయి. ఏం చేసైనా నీతోనే ఉండాలని అనిపిస్తున్నది. నీ సంతోషం కోసం నేను భర్తగా ఉంటాను. ఈ క్షణం నుంచి నేనున్నాను. నీవు ధైర్యంగా ఉండు అని కార్తీక్ అనగానే.. ఎమోషనల్‌గా దీప డాక్టర్ బాబును కౌగిలించుకొన్నది. కార్తీకదీపం సీరియల్ 1520 ఎపిసోడ్‌లో ఇంకా ఏం జరిగిందంటే?

తప్పు ఒప్పుకొన్న ఇంద్రుడు
తన తల్లిదండ్రులు కోసం శౌర్య కోసం వెతుకడం, అలాగే శౌర్య కోసం సౌందర్య ఫ్యామిలీ వెతకడంతో వారిద్దరూ ఒకచోట ఎదురు పడ్డారు. అలాగే దీప, కార్తీక్ కూడా శౌర్యను వెతకుతూ వారున్న చోటుకు వచ్చారు. శౌర్యను ఇవ్వకుండా ఇంద్రుడు, చంద్రుడు పరారీ కావడంపై సౌందర్య భగ్గుమన్నది. దాంతో శౌర్య ఇంద్రుడు, చంద్రమ్మ ప్రశ్నిస్తే.. తప్పు ఒప్పుకొని సౌందర్య కాళ్లమీద పడ్డారు. శౌర్యను తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే.. అమ్మ, నాన్న లేకుండా నేను రాను అంది.. దాంతో వాళ్లు నా కొడుకు, కోడలు. నీకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందరం కలిసి వెతుకుదాం అని సౌందర్య గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

సౌందర్యను కలిసి శౌర్య
అయితే సౌందర్య, శౌర్య గొంతు విన్న దీప, కార్తీక్ అక్కడికి వచ్చి తమ కుటుంబ సభ్యులను కలిశారు. కార్తీక్, దీపం, సౌందర్య, పిల్లలు కలిసి ఆనందంలో మునిగిపోయారు. ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నారు? మీరు లేరని ఏడ్చాం. ఎక్కడున్నారు అని సౌందర్య ఏడ్చింది. దాంతో కొన్ని కారణాల వల్ల రాలేని పరిస్థితి. శౌర్య ఇక్కడే ఉందని తెలిసి వెతుక్కుంటూ ఉండిపోయాం అని కార్తీక్ జవాబిచ్చాడు. అమ్మ, నాన్న బతికే ఉన్నారని చెప్పిన విషయం నిజమైంది అని శౌర్య అంటే.. అవును.. నీవు చెప్పిందే నిజమైందని సౌందర్య అంది.

ఆనందరావుకు పీడకల రావడంతో
ఇక యాక్సడెంట్ తర్వాత చెట్టుకుపుట్టకు ఒకరం అయ్యాం. మనమందరం కలిశాం.. మనం విడిపోయేది లేదు. మనల్ని ఎవరు కూడా విడదీయలేరు అని సౌందర్య అంటే..దాంతో అవును.. ఇక ఆ పరిస్థితి దాటిపోయింది అని దీప అంటుంటే.. తుపాకి పేలిన శబ్దంతోపాటు దీప గుండెల్లో బుల్లెట్ దూసుకెళ్లింది. పక్కనే తుపాకితో షూట్ చేసిన మోనిత కనిపించింది. మీరు ఎలా సంతోషంగా ఉంటారు అంటూ మోనిత చెప్పింది. అయితే ఇదంతా ఆనందరావుకు వచ్చిన పీడకల కావడంతో సీరియల్‌లో ట్విస్టుగా మారింది.

కార్తీక, దీప బతికే ఉన్నారంటూ
శౌర్యను వెతుక్కొంటూ సౌందర్య గ్రామానికి వచ్చింది. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో నిరాశకు లోనైంది. అంతలోనే ఎవరో తాళం తీస్తుంటే.. శౌర్య, ఇంద్రుడు కుటుంబం గురించి ఆరా తీసింది. అయితే వాళ్లు ఊరు విడిచి వెళ్లిపోయారు. అమ్మాయి తల్లిదండ్రులు వస్తారని చెప్పి.. వాళ్లు ఊరి నుంచి చెప్పపెట్టకుండా వెళ్లిపోయారు అని చెప్పారు. దాంతో శౌర్య తల్లిదండ్రులు బతికే ఉన్నారా? అని సౌందర్య సంబరపడిపోయింది.

దీపకు నిజం చెప్పిన కార్తీక్
ఇదిలా ఉండగా, దీప ఆరోగ్యం రోజు రోజుకు క్షీణించడంతో కార్తీక్ ఆందోళన చెందాడు. దీపకు చెప్పి బ్లడ్ టెస్టులు, ఇతర పరీక్షలు చేయించాడు. అయితే గతంలో ఉన్న జబ్బు తిరగదోడటంతో కంగారు పడ్డారు. అలాగే గుండె కూడా వీక్‌గా ఉండటంతో స్టెంట్ వేసే విషయం గురించి ఆలోచించాడు. ఇక తాజా ప్రోమోలో తనకు గతం గుర్తుకు వచ్చిన విషయాన్ని దీపకు కార్తీక్ చెప్పేశాడు. మోనితకు తెలియకూడదనే నేను దాచిపెట్టాను. ఎందుకు సారీ అని దీపకు కార్తీక్ చెప్పాడు. దాంతో దీప ఆనందంలో మునిగిపోయింది.


Click it and Unblock the Notifications











