Don't Miss!
- Technology
OnePlus నుండి కొత్త స్మార్ట్ ఫోన్ మరియు స్మార్ట్ టీవీ ! లాంచ్ తేదీ ,స్పెసిఫికేషన్లు!
- Automobiles
సీరియల్స్ చేస్తూ ఖరీదైన బెంజ్ కారు కొనేసి రూపాలి గంగూలీ.. ధర ఎంతో తెలుసా?
- News
BBC Documentary : ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ బ్యాన్-సుప్రీంకోర్టు కీలక నిర్ణయం !
- Sports
INDvsNZ : హార్దిక్ తెలివిగా ఆడాడు.. కెప్టెన్‌ను మెచ్చుకున్న మాజీ లెజెండ్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
- Finance
Adani Stocks: జాతీయవాదంతో మోసం కవర్ చేయటం కుదరదు.. అదానీకి స్ట్రాంగ్ వార్నింగ్..!
- Lifestyle
Chanakya Niti: జీవితంలో ఈ సుఖాలు అనుభవించాలంటే మంచి కర్మలు చేసుండాలి, అవేంటంటే..
Karthika Deepam చావు బతుకుల్లో దీప.. స్పృహ కోల్పోయి రోడ్డుపక్కన.. టెన్షన్‌లో కార్తీక్
దీప బ్లడ్ రిపోర్ట్స్‌లో ఇంతకు ముందు వచ్చిన జబ్బుతోపాటు గుండె స్పందన వీక్‌గా ఉంది. అవసరమైతే హార్ట్‌లో స్టంట్ కూడా కూడా వేయాల్సి రావొచ్చు. దీపను హాస్పిటల్‌లో చేర్చి ట్రీట్‌మెంట్ ఇప్పించాలి. దీపకు ఈ విషయాన్ని ఎలా చెప్పాలి అని కార్తీక్ కంగారు పడుతూ. ఇంట్లోకి అడుగుపెట్టాడు. కార్తీక్ చూసిన దీప.. వచ్చారా డాక్టర్ బాబు.. మీరు వెళ్లిన పని ఏమైంది? ఆ ఫోన్ నెంబర్ ఉన్న వ్యక్తి వద్దకు వెళ్లారా? ఇంద్రుడు ఆయనకు తెలుసా? అంటూ దీప ప్రశ్నలు కురిపించింది. అయితే అవన్నీ పక్కన పెట్టు.. నీవు కొన్ని రోజులు హాస్పిటల్‌లో ఉండాలి అని కార్తీక్ అంటే.. నాకు ఏమైంది? నీరసం ఎప్పుడూ ఉండేది.. శౌర్య దొరికేంత వరకు హాస్పిటల్‌లో చేరేది లేదు అని దీప అంది.. కార్తీకదీపం సీరియల్ 1521 ఎపిసోడ్స్‌లో ఏమైందంటే?

నాకు గతం గుర్తుకు వచ్చిందని దీపతో
అనారోగ్యంతో బాధపడుతున్న దీపను పొగ వద్దకు, కిచెన్‌లోకి వెళ్లవద్దు అని జాగ్రత్తలు చెప్పారు. పొగ నీ ఆరోగ్యానికి మంచి కాదు.. డాక్టర్లు అక్కడికి వెళ్లవద్దని చెప్పారు. అయితే నేను ఇలా చెప్పినందుకు నువ్వు ఎవరు అని ప్రశ్నించకు.. నాకు గతం గుర్తుకు వచ్చింది. కానీ నీకు చెబితే.. అది మోనితకు తెలిస్తే.. ఆమె నీపై ఏదైనా అఘాయిత్యానికి పాల్పడుతుందని నేను భయపడ్డాను.
అంతేకాకుండా శౌర్య ఆచూకీ మోనితకు తెలుసనే అనుమానం ఉంది. శౌర్య ఆచూకీ తెలిసే వరకు నాకు గతం గుర్తుకు వచ్చిందనే విషయాన్ని చెప్పకుండా దాచాలని అనుకొన్నాను అని కార్తీక్ చెప్పాడు.

దీప హార్ట్‌లో బ్లాకేజ్ అంటూ
అయితే దీప వింటుందని అనుకొని.. కార్తీక్ చెప్పుకొంటూ పోయాడు. తీరా చూస్తే.. స్పృహ కోల్పోయి వంటలక్క కిందపడిపోయి కనిపించింది. తీవ్ర అనారోగ్యానికి గురైన దీపను కార్తీక్ హాస్పిటల్‌లో చేర్పించాడు. హాస్పిటల్‌లో డాక్టర్‌తో మాట్లాడుతూ.. నేను హార్ట్ సర్జన్.. నా భార్యకు గుండెలో బ్లాకేజ్ ఉంది.. దాంతో కిందపడిపోయింది. అర్జంట్‌గా స్టంట్ వేయాలి అని కార్తీక్ అంటే.. మీరు డాక్టర్ అంటున్నారు. ఈ సర్జరీ మీరే చేయండి అంటూ కార్తీక్‌కు డాక్టర్ సూచించాడు.

నా పిల్లలు ఎక్కడున్నారో అంటూ..
హాస్పిటల్‌లో చేరిన దీపకు సృహ రావడంతో కార్తీక్ ఊపిరి పీల్చుకొన్నాడు. నాకు ఏమైంది.. హాస్పిటల్‌లో చేర్పించారు అంటే.. హార్ట్‌లో చిన్న బ్లాకేజ్ ఉంది. దానికి చిన్న ఆపరేషన్ అవసరం అని కార్తీక్ అంటే.. నాకు ఏమైంది? నేను బతుకుతానా? నా బిడ్డలను చూస్తానా? అని దీప ఆందోళన చెందింది. అయితే నీకు ఏమీ కాలేదు.
నీవు నిశ్చంతగా ఉండూ అంటూ కార్తీక్ ధైర్యం చెప్పారు. నా జీవితం ఎప్పడూ సమస్యలే.. వాటితో పోరాడి పోరాడి అలసిపోయాను. ఇక ఓపిక లేదు. మీరు పక్కన ఉన్న భార్యగా గుర్తించలేదు. పిల్లలు ఎక్కడున్నారో తెలియదు. ఏం సాధించానని ప్రశాంతంగా ఉండాలి అని దీప అంది. అయితే నీవు ఒక్క క్షణం స్పృహ కోల్పోకోకుండా ఉంటే.. నీకు నిజం తెలిసేది. ఇప్పుడు చెబుదామంటే..నీ ఆరోగ్యం బాగాలేదు అని కార్తీక్ ఆవేదన చెందాడు.

భగవంతుడా నా పిల్లల్ని చూసే అవకాశం
అయితే నాకు ఏమీ కాలేదు. మనం ఇక్కడి నుంచి వెళ్లి శౌర్యను వెతుకుదాం అని దీప లేవబోయింది. అయితే నీరసంగా ఉండటంతో వెంటనే బెడ్‌పై పడిపోయింది. నీవు ప్రశాంతంగా ఉండు అని కార్తీక్ బయటకు వెళ్లాడు. దాంతో భగవంతుడా నా పిల్లల్ని చూసే అవకాశం కల్పించు అంటూ దీప దేవుడిని వేడుకొన్నది. అయితే కార్తీక్ కనిపించకపోవడంతో మోనిత కూడా కంగారుపడింది. ఫోన్ చేసినా కనెక్ట్ కావడం లేదు? సంగారెడ్డిలో శౌర్య దొరికిందా అని మనసులో అనుకొన్నది. సంగారెడ్డిలో ఉన్న శివకు మోనిత కాల్ చేసింది.

కార్తీక్, దీప భార్యభర్తలనే విషయం
సంగారెడ్డిలో శివకు ఫోన్ చేస్తే.. ఇంట్లోనే ఉండటంతో కోపంతో ఊగిపోయింది. సంగారెడ్డికి వెళ్లి దీప, కార్తీక్‌ను వెతకమంటే.. ఇక్కడున్నావేంటిరా? అని మోనిత అరిచింది. దాంతో నేను అక్కడి నుంచే వస్తున్నాను. సంగారెడ్డిలో దీప, కార్తీక్ లేరు అంటే.. ఒక్కరోజులోనే గడపగడప వెతికావా? నా చెవిలో పువ్వులు పెడుతున్నావా? అని ఫైర్ అయింది. దాంతో నేను ఒక్కడిని కాదు.. నా ఫ్రెండ్స్ పాతిక మందితో వెతికించాను అని శివ అంటే.. కార్తీక్, దీప అక్కడకు లేకపోతే ఎలా అని మోనిత అంది. అయితే కార్తీక్, దీప భార్యభర్తలనే విషయం తెలిసింది. వారిని విడకొట్టడం ఎందుకని నేను వెతక కుండా వచ్చేశాను అని శివ మనసులో అనుకొన్నాడు. అయితే సంగారెడ్డిలో లేకపోతే.. దీపను తీసుకొని ఎక్కడికి వెళ్లావు అని మోనిత కంగారుపడింది.

రోడ్డు పక్కన పడిఉన్న వంటలక్క
ఇదిలా ఉండగా, తాజా ప్రోమోలో ట్విస్టు ఆసక్తికరంగా కనిపించింది. కార్తీక్‌కు మరో షాక్ తగిలింది. హాస్పిటల్ బెడ్‌పై ఉండాల్సిన దీప..కనిపించకపోవడంతో ఆందోళన పడ్డాడు. అయితే.. ప్రోమోలో దీప.. రోడ్డు పక్కన సృహ లేకుండా పడి ఉంది. అయితే అప్పుడే అటువైపుగా శౌర్యతో వచ్చిన ఇంద్రుడు.. దీపను చూశాడు. రోడ్డు పక్కన ఉన్నది ఎవరు అంటూ శౌర్య అడిగింది. దీపను చూసి ఇంద్రుడు ఎమోషనల్ అయ్యాడు.